Suryaa.co.in

Andhra Pradesh

దళితుల సంక్షేమం,అభివృద్దికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న ఏకైక సీఎం జ‌గ‌న్

-ద‌ళితుల కోసం మూడు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ దే
– ఎస్సీలను విడగొట్టేందుకు చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు పన్నాడు
– మోసకారి చంద్రబాబును నమ్మొద్దు
– ప్రతి దళితుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు మద్ద‌తుగా నిలవాలి
– నవరత్న సంక్షేమ పధకాల అవగాహన సభలో పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి

ఏదో ఒక నెపంతో ఎస్సీలలో విభేదాలు సృష్టించి విభజన తీసుకురావాలనే కుట్రతో చంద్రబాబు పనిచేస్తున్నారని, ఎస్సీలంతా అప్రమత్తంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు.

తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నవరత్న సంక్షేమ పథ‌కాల అవగాహన సభ జరిగింది. ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటి వ్యవస్ధాపకులు, నవరత్నాల పథ‌కాలను గురించి ప్రచారం నిర్వహించే పెద్దిపోగు కోటేశ్వరరావు సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏమ‌న్నారంటే..
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు నమ్మవద్దని తెలిపారు. దళితులకు న్యాయం చేసేది, చేయగలిగేది ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఎస్సీలలో మూడు కులాలకు సంబంధించి మూడు కార్పోరేషన్ లను ఏర్పాటు చేసి రూ.18వేల కోట్లకు పైగా ఆ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేశారన్నారు. చరిత్రను చూస్తే గతంలో ఎవ్వరూ చేయనంతగా చేస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ దళితులకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దళితుల సంక్షేమమే తన బాధ్యతగా గుర్తించి వైయస్ జగన్ పనిచేస్తున్నారు. ఎస్సీలంతా సమైక్యంగా ఉండాలి. ఎస్సీలకు ఏ సమస్య వచ్చినా కూడా వైయస్ జగన్ అండగా ఉంటారు. సమస్యలను పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకువస్తే అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని వివరించారు. ఎస్సీలంతా ఐకమత్యంగా ఉండాలి. మీరంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. ఆ సపోర్ట్ ను కంటిన్యూ చేయాలి. దళితులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్లకుండా సమైక్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్ద‌తుగా నిలవాలని కోరారు.

సభలో పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎంఎల్ ఏ మేరుగు నాగార్జున మాట్లాడుతూ..
చంద్రబాబు హయాంలో దళితులపై విప‌రీతంగా దాడులు జరిగాయన్నారు. అనేక విధాలుగా దళితులను అణగదొక్కారని అన్నారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అని దళితుల పట్ల అవమానంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. దళితులకు సంబంధించి అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. అధికారంలోకి రాగానే అంబేద్కర్ భావజాలంతో దళితులను అభివృద్దిపధంలో నిలుపుతున్నారన్నారు. మాదిగ, మాల, రెల్లి కులస్ధులకు మూడు కార్పోరేషన్లను ఏర్పాటుచేసి రూ.18 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారని తెలియచేశారు. దళితులలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు తగిన బుధ్ది చెప్పాలన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్ర‌ తొలి మ‌హిళా హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడమే గాక మొత్తం 25 మంది మంత్రుల్లో ఒక డిప్యూటీ సీఎంతో సహా నలుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చి దళితుల పట్ల తన ప్రాధాన్యతను వైయస్ జగన్ చాటుకున్నారని అన్నారు. అదే విధంగా శాసనమండలి ఛైర్మన్‌గా గతంలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారి ద‌ళిత వ‌ర్గానికి చెందిన‌ కొయ్యే మోషేన్ రాజు ని నియమించారన్నారు. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ పదవుల్లోను, డిప్యూటీ మేయర్‌ పదవుల్లో ప్రాధాన్యత కల్పించారన్నారు. దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో పేదలకు 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీ చేస్తే అందులో 6,36,732 మంది ఎస్సీలకు కేటాయించారని వివరించారు. అదే విధంగా అన్ని సంక్షేమ పథ‌కాలలో దళితుల అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తూ, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న‌ ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందని అన్నారు. సభలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE