Suryaa.co.in

Andhra Pradesh

ఫిష్ ఆంధ్రా అని హడావిడి చేసి జగన్.. ఫినిష్ ఆంధ్రా చేశాడు

-జీఓ.217 ను టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తాం
-టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీస్తాం
-ఇతర రాష్ట్రాల వారు ఇటు వేటకి రాకుండా నియంత్రిస్తాం
-సబ్సిడీ రుణాలు, వలలు, బోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు
-ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్ వద్ద -మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్

జీఓ. 217 తీసుకొచ్చి మా పొట్ట కొట్టారు. ఎన్నో ఏళ్లుగా మాకు జీవనోపాధి గా ఉన్న మా చెరువులు లాక్కున్నారు.
పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తియ్యక పోవడం వలన చేపలు పట్టుకోవడానికి వీలు లేక ఇబ్బంది పడుతున్నాం.
తమిళనాడు జాలర్లు మాపై దాడులు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదు.
పులికాట్ సరస్సు నుండి గ్రామాలకు చేరుకునే కాలువల్లో పూడిక తియ్యక ఇబ్బంది పడుతున్నాం.
టిడిపి ప్రభుత్వం హయాంలో బోట్లు, వలలు ఇచ్చే వారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు.
డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు లేక ఇబ్బంది పడుతున్నాం.
జగన్ పాలనలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేయక ఇబ్బంది పడుతున్నాం.
టిడిపి హయాంలో మత్స్యకారులు చనిపోతే 5 లక్షల ఆర్ధిక సాయం అందేది. జగన్ పాలనలో మత్స్యకారులు చనిపోతే భీమా అందడం లేదు. – టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో గూడూరు నియోజకవర్గం మత్స్యకారులు.

అందుకు స్పందించిన లోకేష్ ఏమన్నారంటే…
జగన్ పాలనలో మ్యాటర్ వీక్…పబ్లిసిటీ పీక్. ఫిష్ ఆంధ్రా అని హడావిడి చేసి ఫినిష్ ఆంధ్రా చేసాడు. మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీఓ.217 ను టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తాం.పులికాట్ సరస్సు సమస్య పై నాకు పూర్తి అవగాహన ఉంది.

తమిళనాడు జాలర్లు దాడులు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే మత్స్యకారులను కుక్కలతో పోల్చి తిడితే జగన్ కనీసం ఎమ్మెల్యే ని పిలిచి మందలించే పరిస్థితి లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీస్తాం. ఛానల్ కాలువల్లో పూడిక తీసి బొట్ ద్వారా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తమిళనాడు సిఎం తో చర్చలు జరిపి జాలర్ల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల వారు ఇటు వేటకి రాకుండా నియంత్రిస్తాం. తమిళనాడు స్టిమర్లు ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటాం.

16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏపి ప్రయాణం మొదలు అయ్యింది. అయినా ఏ వర్గానికి లోటు లేకుండా అందరికీ న్యాయం చేశారు చంద్రబాబు. టిడిపి హయాంలో ఏపి ని మత్స్యకారప్రదేశ్ గా మార్చాం. ఆక్వా ఎగుమతుల్లో చంద్రబాబు ఏపి ని నంబర్ 1 గా చేశారు. జగన్ పాలనలో ఫిష్ ఆంధ్రా అని తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్రా చేశాడు.

చేపల వ్యాపారం ఎలా చెయ్యాలో మీకు మేము నేర్పించాల్సిన అవసరం లేదు. అది మీకు తెలిసిన విద్య. ప్రభుత్వం మత్స్యకారులకు సహాయం అందించాలి. అది మానేసి ఫిష్ ఆంధ్రా అంటూ హడావిడి చేసాడు. ఇప్పుడు ఏకంగా పులివెందుల లో కూడా ఫిష్ ఆంధ్రా ఫినిష్ అయ్యింది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మత్స్యకారులను ఆదుకున్నాం.

ఐదేళ్లలో రూ.800 కోట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చాం. మత్స్యకార పిల్లలు చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ లో బోట్లు, వలలు, డీజిల్, టీవీఎస్ బల్లు అందజేసాం.

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వేట విరామ సమయంలో భృతి ఇచ్చి ఆదుకున్నాం. పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు. టిడిపి హయాంలో మత్స్యకారులకు ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్. రద్దు చేశాడు. జీఓ.30 తీసుకొచ్చి మత్స్యకారులకి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు.జగన్ పాలనలో జీఓ.217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టారు.

చెరువులు, రిజర్వాయర్లు అన్ని వైసిపి నాయకులు లాక్కున్నారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల జీవనోపాధి గా ఉన్న చెరువులు లాక్కొని వారికి జగన్ తీరని అన్యాయం చేశాడు. సబ్సిడీ రుణాలు, వలలు, బోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు.ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు బెట్టే లెక్కలు కూడా మత్స్యకారుల ఖాతా లో రాస్తున్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ ద్వారా దామాషా ప్రకారం నిధులు కేటాయించి మత్స్యకారులను ఆదుకుంటాం. టిడిపి హయాంలో ఆక్వా రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టిడిపి హయాంలో మత్స్య సంపద పెంచడానికి ప్రతి ఏడాది చేప పిల్లలు పెద్ద ఎత్తున చెరువుల్లో, రిజర్వాయర్లలో వదిలిపెట్టాం. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేస్తాం.టిడిపి హయంలోనే చంద్రన్న భీమా పథకం తీసుకొచ్చాం. జగన్ వైఎస్సార్ భీమా అని పేరు మార్చి ఆయనకి చెడ్డ పేరు తెచ్చాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న భీమా మరింత పటిష్ఠంగా అమలు చేస్తాం.బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులకు అవసరం అయిన అన్ని పనిముట్లు అందజేస్తాం.

పాశిం సునీల్ ఏమన్నారంటే…
మత్స్యకారులు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారు.టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆదుకున్నాం.తుఫాను షెల్టర్లు కట్టాం. పెన్షన్లు ఇచ్చాం.

LEAVE A RESPONSE