-ఇదేనా దళిత మంత్రులకు నువ్విచ్చే గౌరవం
-మంత్రి విశ్వరూప్ అవమానం బాధాకరం
-దీనిపై దళిత సమాజం స్పందించాలి
-వైసీపీ దళితులకు ఇచ్చే నిజమైన విలువ ఇదే
-దళితులను చంపేస్తుంటే సంఘాలు భయపడి మాట్లాడటం లేదు
-దళిత రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు
-దళిత రైతులకి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు
-ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు లో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్
గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి. జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు.
విదేశీ విద్య పథకం రద్దు చేయడం వలన దళిత విద్యార్థులు ఉన్నత విద్య కు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అములు కాక సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.
జగన్ పాలనలో కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు.
టిడిపి హయాంలో సబ్సిడీ లో జేసిబీలు, ఇన్నోవాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు లేక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి.
తన నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి మూడేళ్లు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేష్ ముందు కన్నీరు పెట్టుకున్న దళితుడు రమేష్.
ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర రాష్ట్రాల కి వెళ్లి పనులు చేసుకుంటున్నాం.
దళితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. చదువుకన్నా ఉద్యోగాలు రావడం లేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి.
జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దళిత ఉద్యోగులను వేధిస్తుంది జగన్ ప్రభుత్వం. ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూడా తొలగించారు.
దళితుల్ని జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుంది.
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పెదకూరపాడు ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులు
ఈ సందర్భంగా లోకేష్ వారితో ఏమన్నారంటే..
టిడిపి హయాంలో 40 వేల కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కోసం ఖర్చు చేశాం.దళిత వాడల్లో సిసి రోడ్లు వేసాం. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లు, డ్రైనేజ్, ఇలా అన్ని అభివృద్ది కార్యక్రమాలు దళిత కాలనీల నుండే ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నా. అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పథకం తీసుకొచ్చి దళిత యువత ఉన్నత విద్య చదువుకి సాయం అందించాం.
కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాం.2.70 లక్షల మంది దళితులకు స్వయం ఉపాధి కల్పించాం. ఇన్నోవాలు, జేసిబిలు, వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు అందించాం. అమరావతి దళిత రైతుల తరపున పోరాటం చేసినందుకు మొదటి సారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను.
దళిత యువత రమ్య ని హత్య చేసినప్పుడు నేను పోరాడినందుకు నేను రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. దళిత డ్రైవర్ సుబ్రమణ్యం ని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానాలు చేస్తున్నారు వైసిపి నేతలు.దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపేశారు.సీఐ ఆనందరావు గారిని వేధించి చంపేశారు వైసిపి నేతలు. పుంగనూరు లో పాపాల పెద్దిరెడ్డి దళితుడు ఓం ప్రతాప్ ని చంపేసాడు. దళితులను చంపేస్తుంటే సంఘాలు భయపడి మాట్లాడటం లేదు.దళిత రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. దళిత రైతులకి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు.
విశ్వరూప్ గారు మోకాళ్ళ పై సిఎం పక్కన కూర్చున్నారు. అది జగన్ దళితులకు ఇచ్చే గౌరవం. ఇంకో మంత్రి నారాయణ స్వామి గారిని కూడా జగన్ పక్కన నిలబెట్టి అవమానించారు.దళిత ద్రోహి జగన్ విదేశీ విద్య కి అంబేద్కర్ గారి పేరు తొలగించాడు.దళితులకు కనీస గౌరవం ఇచ్చే మనస్సు జగన్ కి లేదు.
జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది దళితులు.27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దళితులను చంపేసాడు.విదేశీ విద్య లాంటి పథకాలను రద్దు చేసాడు. లోకేష్ దళితులను అవమానించాడు అంటూ ఫేక్ వీడియో తయారు చేశారు. నేను సవాల్ చేస్తే పారిపోయాడు. జగన్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో, ఎస్సీ కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.ప్రతి గ్రామంలో కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య అమలు చేస్తాం.వసతి దీవెన, విద్యా దీవెన అనే రెండు పనికిమాలిన కార్యక్రమాలు జగన్ తీసుకొచ్చాడు. తరతరాలుగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసి కొత్త విధానం తెచ్చాడు.
కొత్త పథకం వలన తల్లిదండ్రులు, విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు.జగన్ ఫీజులు ఇవ్వకపోవడం వలన యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం.
ఒన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.శాండ్ శంకర్ కి సిగ్గుంటే రాజీనామా చెయ్యాలి. అమ్మ లాంటి అమరావతి ని చంపేస్తుంటే చప్పట్లు కొట్టాడు.టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500… జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000 వేలు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు తింటున్నారు.ఇసుక లో జగన్ కి రోజు ఆదాయం రూ.3 కోట్లు.టిడిపి హయాంలో సబ్సిడీలో రుణాలు ఇచ్చి జేసిబిలు, ఇన్నోవాలు ఇవ్వడమే కాకుండా పని కూడా కల్పించాం. ఇప్పుడు జగన్ వలన అన్ని ఆగిపోయాయి.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడమే కాకుండా పని కూడా కల్పిస్తాం.టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించడం కోసం మాత్రమే జగన్ ప్రభుత్వం వినియోగిస్తుంది. అందుకే రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయి. తప్పిపోయిన చిన్న పాప గురించి పట్టించుకునే వారు లేకపోవడం బాధాకరం. నేను నీ తరపున పోరాడతానని రమేష్ కి హామీ ఇచ్చిన లోకేష్.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం.ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని అమరావతి. అభివృద్ది వికేంద్రీకరణ మా నినాదం.5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా ప్రజారాజధాని అమరావతి నిర్మిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.టిడిపి హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ప్రకటించింది.
జగన్ ది ఫ్యాక్షన్ మెంటాలిటీ. అందుకే అభివృద్ది జరగకూడదు. అందరూ నా కింద బ్రతకాలి అని అనుకుంటాడు.కక్ష సాధింపు లో భాగంగా ఉపాధి హామీ పథకం లో కూడా జగన్ రాజకీయం చేస్తున్నాడు. తొలగించిన వారిని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలగించిన వారిని తిరిగి ఉద్యోగం లో చేర్చుకుంటాం.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దళితుల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజకీయాల కోసం దళిత యువకుల భవిష్యత్తు దెబ్బతీస్తున్నాడు.సొంత బాబాయ్ ని లేపేసిన వాడు దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నాడు. జగన్ అక్రమంగా పెట్టిన కేసులు అన్ని తొలగిస్తాం.ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు… రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.
కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. దళితులకు టిడిపి హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేసాం. అమరావతి రాజధాని అయితే ఇక్కడ ఎస్సీలు బాగుపడతారు అని అనేక కలలు కన్నాను.ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఇప్పుడు దళితులకు నరకం చూపిస్తున్నాడు.దళితులకు టిడిపి హయాంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేసాడు జగన్.సబ్ ప్లాన్ నిధులు జగన్ పక్క దారి పట్టించాడు. టిడిపి హయాంలో ఎస్సీ కాలనీలను అభివృద్ది చేసాం.
నారా లోకేష్ ను కలిసిన పెదకూరపాడు రైతులు
• కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందుల మాఫియా రైతులపై దాడి చేస్తోంది.
• కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నా మండలంలోని 20 గ్రామాల్లో 15 గ్రామాలకు సాగర్ కాల్వ చివరి భూములకు నీరందడం లేదు.
• వర్షం పడితే పొలాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా మారుతున్నాయి.
• గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సబ్సీడీలు పూర్తిగా తొలగించింది.
• యంత్రాలు, టార్ఫాలిన్ పట్ఠలు, మైక్రో ఇరిగేషన్ ను పూర్తిగా రద్దు చేయడంతో సొంత డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నాం.
• వాణిజ్య పంటలైన పత్తి, మిర్చికి ధరలు ఉండటం లేదు.
• మండలంలో కోల్డ్ స్టోరేజీ, సాధారణ గిడ్డంగి ఉంటే రైతులకు మేలు జరుగుతుంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే కల్తీవిత్తనాలు, ఎరువుల మాఫియా పేట్రేగిపోతోంది.
• లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా దెబ్బతింటున్నారు.
• జగన్ ప్రభుత్వ చర్యల కారణంగా దేశం మొత్తమ్మీద ఎపి రైతులు అప్పుల్లో మొదటిస్థానంలో ఉన్నారు.
• రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాలు మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.
• ఎపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరాచేస్తాం.
• గత ప్రభుత్వంలో రైతులకు అమలుచేసిన రాయితీలన్నీ పునరుద్దరిస్తాం.
• కోల్డ్ స్టోరేజిల నిర్మాణానికి సబ్సిడీలు అందజేసి ప్రోత్సహిస్తాం.