– రైతుల ఆత్మహత్యల తోపాటు, రైతులఅప్పుల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలపడమేనా జగన్ రెడ్డి అమలుచేస్తున్న రైతుసంక్షేమం?
• దేశంలో ఎక్కువ సీబీఐకేసులున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డే
• రైతులఅప్పులు, ఆత్మహత్యలతో పాటు, అత్యాచారాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపడమేనా జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో సాధించిన ప్రగతి?
• పేదల సంక్షేమం అంటే, రేషన్ బియ్యం విదేశాలకు తరలిస్తూ, రేషన్ సరుకులధరలు పెంచి, రేషన్ వాహనాలపేరుతో ఏటా రూ.1600కోట్లు తగలేయడమా జగన్ రెడ్డి?
– మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి అనేకవిషయాల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలుపుతున్నాడని, తాజాగా రైతుల తలసరిఅప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో (ఏపీలోఒక్కోరైతుపై రూ.2,45,554 అప్పు) నంబర్ 1 స్థానంలో నిలిచిందని, తరువాత జాబితాలో కేరళ, పంజాబ్ లు నిలిచినట్టు, లోక్ సభ సాక్షిగా కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభసాక్షిగా స్పష్టంచేశారని, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“కేంద్ర వ్యవసాయశాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్, లోక్ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతను బట్టయలుచేశాడు. ఏపీలో ప్రతిరైతుపై రూ.2.45లక్షల రుణభారం ఉందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏంచెబుతాడు? రైతుల అప్పుల్లో జాతీయ సగటు(రూ.74,500) కంటే ఏపీరైతుకు ఉన్న అప్పుమూడింతలు అధికం. రూ.2లక్షలు, ఆపైన రైతుల తలసరిఅప్పులతో కేరళ, పంజాబ్ లతర్వాత ఏపీ మూడోస్థానంలో ఉంది. తెలంగాణలో రైతుల తలసరి అప్పు రూ.1,54000లుగాఉంటే, కర్ణాటకలో రూ.1,22,000, తమిళనాడులో రూ.1,06,000 లుగా ఉంది. అప్పుల్లోనేకాదు ఆత్మహత్యల పెరుగుదలలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. రైతులఆత్మహత్యల్లో నంబర్ 3గా, కౌలురైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2గా రాష్ట్రం ఉందనిఇటీవలే కేంద్ర వ్యవసాయమంత్రి ప్రకటించారు.
అలానే రైతులకు గిట్టుబాటు ధర లభించని రాష్ట్రాల జాబితాలో ఏపీ రివర్స్ లో (కిందినుంచి) నంబర్ -1. ఎం.ఎస్.పీ టన్నుకి రూ.2,500లకంటే తక్కువ ఏపీలోనే లభిస్తోందని సీ.ఏ.సీ.పీ వెల్లడించింది. జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులగురించి ఆలోచించకపోవడం, వ్యవసాయం బలోపేతానికి అమలు చేయాల్సిన పథకాలు ఆపేయడమే ఇందుకుకారణం. అదేవిధంగా మహిళలపై వేధింపులు, అత్యాచారాల్లో కూడా జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపాడు. అలానే ముఖ్యమంత్రిపై ఉన్న సీబీఐ కేసుల్లోకూడా రాష్ట్రమే నంబర్-1. ఆఖరికి కోర్టుధిక్కరణ కేసులు, ప్రతిపక్షాలపై దాడుల్లో కూడా రాష్ట్రమే దేశంలో నంబర్ -1గా ఉంది. ఈ విధంగా అన్నపూర్ణవంటి ఆంధ్రప్రదేశ్ ను అన్నివిధాలా జగన్ రెడ్డి ఎందుకింతలా నాశనంచేస్తున్నాడు?
పేదల బియ్యాన్ని బొక్కేస్తూ, రూ.4వేలకోట్లు దోచుకుంటున్న జగన్ రెడ్డి ముఖ్యనేతలు
జాతీయ ఆహారభద్రతా చట్టం కింద దేశంలో 80కోట్ల35లక్షల కుటుంబాలకు మరో ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం అమలుచేసే ఆహారధాన్యాల పంపిణీలో కూడా జగన్ ప్రభుత్వ దోపిడీ కొనసాగుతోంది. కేంద్రం సరఫరా చేసిన ఉచితబియ్యంలో ఏపీ ప్రభుత్వం రూ.2వేలకోట్ల విలువైన 5,66,000 మెట్రిక్ టన్నులబియ్యాన్ని పక్కదారి పట్టించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆగస్ట్ -03, 2022న పార్లమెంట్ లో చెప్పారు.
పేదలకు ఇస్తున్న బియ్యాన్ని వారివద్దనుంచి కిలో రూ. 8నుంచి, రూ.10కొంటున్న జగన్ ప్రభుత్వం, తిరిగి అదేబియ్యాన్ని కే.జీ.రూ.40చొప్పున కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టులద్వారా విదేశాలకు ఎగుమతిచేస్తోంది. రేషన్ బియ్యం ఎగుమతులద్వారా, వైసీపీపెద్దల అండదండలతో జగన్ రెడ్డికి చెందిన కొందరు ముఖ్యనేతలు రూ.4వేలకోట్లు దోచేస్తున్నారు. కాకినాడ పోర్టుని అరబిందోసంస్థకు కట్టబెట్టాకే, అక్కడ బియ్యం ఎగుమతులు పెరిగాయి.
పేదలకు ఇచ్చే రేషన్ సరుకులధరలు పెంచడం, పింఛన్లు తొలగించడమేనా జగన్ రెడ్డి అమలు చేస్తున్న పేదల సంక్షేమం?
చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రంలో 1కోటి47లక్షల రేషన్ కార్డులుంటే, 89 లక్షల కార్డులకే కేంద్రప్రభుత్వం ఆహారధాన్యాలు సరఫరాచేసేది. టీడీపీప్రభుత్వం 1కోటి47లక్షల రేషన్ కార్డులకు బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు పండుగల కానుకలు అందించింది. చంద్రబాబుగారు రేషన్ సరుకుల ధరలు పెంచలేదు. కానీ జగన్ అధికారంలోకి రాగానే కందిపప్పు, పంచదార ధరపెంచేశాడు. రేషన్ బియ్యం పంపిణీ నిమిత్తం సిబ్బంది, వాహనాలకోసం ఈప్రభుత్వం ఏటా రూ.1600కోట్లు దుర్విని యోగంచేస్తోంది. టీడీపీప్రభుత్వంలో రేషన్ బియ్యం కేజీరూపాయి, కిలోకందిపప్పు-రూ.40, అరకిలోపంచదార- రూ.10కి, కేజీ గోధుమపిండి రూ.16.50కి, కేజీ ఉప్పు రూ.12, కేజీ రూపాయిచొప్పున జొన్నలు, రాగులు, మహిళలకు సబ్సిడీపై శానిటరీ ప్యాడ్లు అందించాము.
పేదలసంక్షేమంలో తనప్రభుత్వమే నెంబర్-1 అంటున్న జగన్ రెడ్డి టీడీపీ హాయాంలో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు అందించిన వాటిని ఎందుకు ఆపేశాడు? చిరుధాన్యాలు, ఉప్పు గోధుమపిండి, శానిటరీ ప్యాడ్లు వంటివి ఆపేసిందికాక, కందిపప్పు, పంచదార ధర పెంచేశాడు. రేషన్ పంపిణీకి వాహనాలపేరుతో కోట్లాదిరూపాయలు ఎందుకు తగలేశారు? పింఛన్లు తొలగించడమేనా జగన్ రెడ్డి అమలుచేస్తున్న పేదలసంక్షేమం?
భూమిలేకపోయినా ఉన్నట్లు చూపుతూ, పిచ్చిపిచ్చి నిబంధనలతో ఇష్టానుసారం పింఛన్లు కట్ చేస్తున్నారు. ఎన్ని పథకాలకు రాజశేఖర్ రెడ్డి, జగన్ పేర్లు పెడతారు? ప్రజలకుచెందిన ఆస్తులతాలూకా పత్రాలపై జగన్, ఆయన తండ్రి బొమ్మలేంటి? పక్కాఇళ్లపై ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.లక్షా80వేలు (రూ.30వేల ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులుకలిపి) ఇస్తుంటే, వైసీపీప్రభుత్వం రూపాయి ఇవ్వడంలేదు. అలాంటప్పుడు జగనన్నకాలనీలు అని పేరు ఎలా పెడతారు? రాజశేఖర్ రెడ్డి బొమ్మలెలా వేస్తారు?
సొంతపార్టీనేతలే జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు…
మౌండూస్ తుపాన్ వల్ల జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఇంతవరకు అంచనా వేయలేకపోయింది. వైసీపీఎమ్మెల్యే, సీనియర్ నేత అయిన ఆనం రామనారాయణ రెడ్డే, ఈ ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేశాడు. ఉత్తుత్తిసమీక్షలు, సమావేశాలకు తమను పిలవొద్దని ఖరాకండిగా చెప్పేశాడు. మంత్రులుమారినా, కలెక్టర్లు మారినా తేడాఉండటం లేదన్నాడు. మహీధర్ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కాడు. వ్యవసాయమంత్రి సొంత జిల్లాలో నష్టపోయిన రైతుల్ని ఆదుకునే దిక్కులేదు. వరివిత్తనాల్ని రైతలు కేజీ రూ.40కి కొంటున్నారు.
సర్వంకోల్పోయిన రైతుల్ని ఆదుకోకపోతే, ఆత్మహత్యల్లో నెంబర్ 1 కాక, ఏమవుతుంది? రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీళ్లున్నా రైతులు ఎందుకు చనిపోతున్నారు? మూడున్నరేళ్లుగా రైతులకు గిట్టుబాటుధరలేదు, పెట్టుబడులు పెరిగాయి, ప్రభుత్వసాయం అందడంలేదు. టీడీపీహాయాంలో ఎకరావరిసాగుకి రూ.18వేలు ఖర్చైతే, ఇప్పుడు రూ.36వేలు ఖర్చు అవుతోంది. 266 రూపాయల యూరియా బస్తాని, రైతులు రూ.340 పెట్టి, బయటకొంటున్నారు. ఈప్రభుత్వం వేసిన దిక్కుమాలిన కమిటీలతో ఆక్వారైతులు రోడ్లపాలయ్యారు. టమాటోలు పండించి, రోడ్లపై పారబోస్తున్నారు.
మంత్రులు పేరుకే మంత్రులు… వారిశాఖలకు సంబంధించిన వ్యవహారా లన్నీ ముఖ్యమంత్రి, అధికారులే చూస్తున్నట్టున్నారు. కన్నబాబు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ రైతులవద్దకెళ్లి వారితో మాట్లాడింది లేదు. ఇప్పుడు కాకాణి గోవర్థన్ రెడ్డేమో వరదలతో సర్వంకోల్పోయిన సొంతజిల్లా రైతాంగాన్నే గాలికొదిలేశాడు. రైతులు అడిగేవాటికి సమాధానం చెప్పలేకనే ఈ ప్రభుత్వం వ్యవసాయశాఖను గాలికి వదిలేసింది. ఇన్నిఘోరవైఫల్యాలు మూటగట్టుకున్న ముఖ్యమంత్రిని దేశంలో ఇంతవరకు చూడలేదు. ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు.. జగన్ మాటలు నమ్మేస్థితిలో జనంలేరు” అని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.