Suryaa.co.in

Andhra Pradesh

తప్పుడు జీవోలతో బ్యాంకులకు త్రీడీ సినిమా చూపించిన జగన్ మోసపు రెడ్డి సర్కార్

• జీవో నెం : 10 లాంటి తప్పుడు జీవోలతో బ్యాంకుల్ని బురిడీ కొట్టించిన వ్యవహారంలో ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీలక్ష్మి, వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్ లు ఎప్పటికైనా శిక్షార్హులే
• రాజధానిలో అధికారుల నివాస సముదాయాలకు రుణమిచ్చిన బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం-10, ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనం
• అసలు నిర్మాణమే పూర్తికాని, మనుషులే లేని భవనాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటున్నట్టు తప్పుడు జీవోలతో జగన్ మోసపు రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు త్రీడీ సినిమా చూపించింది
• ఆ త్రీడీ సినిమాకు నిర్మాత జగన్ మోసపు రెడ్డి అయితే, దర్శకత్యం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేశాడు.
• బ్యాంకుల్ని మోసగించే సినిమాకు కథ..స్క్రీన్ ప్లే మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి అందిస్తే, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ డైలాగ్ రైటర్ పాత్ర పోషించాడు
• పూర్తి కాని నివాస సముదాయాలకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) విభాగం ఏకంగా సీఆర్డీఏకి రూ.69,36,60,0000ల అద్దె చెల్లింపునకు రంగం సిద్ధం చేసింది
• రాజధాని నిర్మాణమంతా గ్రాఫిక్స్ అన్నవారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇలా నిర్మాణాలు పూర్తైనట్టు.. తప్పుడు జీవోలిచ్చి బ్యాంకుల్ని మోసగించారో సమాధానం చెప్పాలి
• బ్యాంకుల్ని మోసగించిన వ్యవహారంపై మంత్రి ఆదిమూలపు సురేశ్, ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీలక్ష్మి, వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలి
• చొక్కాలిప్పి తొడలు కొట్టిన మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తప్పుడు జీవోలతో రాష్ట్రప్రభుత్వ బట్టలు విప్పేశాడు
• గతంలో వై.ఎస్ కుటుంబాన్ని నమ్మి జైలుకు వెళ్లి వచ్చినా శ్రీలక్ష్మి బుద్ధి మారలేదు. జగన్ రెడ్డి అండతో ఆమె ఇదేవిధంగా తప్పుడు వ్యవహారులు నడిపితే మరోసారి జైలుపాలవడం ఖాయం
• టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్ మోసపు రెడ్డి, ఆయన ప్రభుత్వం ఏకంగా ఈసారి సాక్షాత్తూ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని జీవోలు విడుదలచేసి మరీ బురిడీ కొట్టించిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారి ఇలాంటి పనులుచేస్తాడా అని దేశమంతా ఆశ్చర్యపోతోందని, జగన్ రెడ్డి 420 సర్కార్ ఏ సందర్భంలో ఇంతగా బరితెగించిందో ప్రజలు తెలుసుకోవాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ఐ.ఏ.ఎస్. ఐ.పీ.ఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోల నివాస సముదాయాల నిర్మాణాన్ని టీడీపీప్రభుత్వం రూ.2,560కోట్లతో చేపట్టగా బ్యాంకులు రూ.2,060కోట్ల రుణం మంజూరు చేశాయి
“ రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గతంలో చంద్రబాబు నాయుడు అద్భుతమైన ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టా రు. 33వేల ఎకరాల భూమిని రైతులు నిస్వార్థంగా రాష్ట్ర భవిష్యత్ కోసం, మన బిడ్డల భవిష్య త్ కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని నిర్మాణానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదు. అలా రైతు ల నుంచి సేకరించిన భూమిలో త్వరితగతిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

దానిలో భాగంగా ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్ అధికారులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జీవోలు, వివిధ స్థాయిలలోని ప్రభుత్వాధికారుల నివాసంకోసం గృహసముదాయాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. దాని కోసం ఆనాడు రూ.2,560కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో దాదాపుగా 3,600 యూనిట్ల నిర్మాణం చేపట్టారు. అందులోభాగంగా విజయా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ లతో కూడిన మూడు బ్యాంకుల కన్సార్షియం ఆనాడు రూ.2,060 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.500 కోట్ల వ్యయం కేటాయించాలని నిర్ణయించారు. ఆ విధంగా మొదలైన నివాస సముదాయాల నిర్మాణం టీడీపీప్రభుత్వం దిగిపోయే నాటికి 75శాతం పూర్తిచేయడం జరిగింది. ఖర్చుచేసిన వ్యయంలో రూ.1862కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కూడా నాడు టీడీపీప్రభుత్వం సబ్మిట్ చేసింది.

నిర్మాణం పూర్తి కాని భవనాల్లో అధికారులు నివాసముంటున్నట్టు ఈ 420 ప్రభుత్వం జీవో-10 లాంటి తప్పుడు జీవోలతో బ్యాంకులకు త్రీడీ సినిమా చూపించింది
దురదృష్టవశాత్తూ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఈ జగన్ మోసపు రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు ఏంచెప్పి మోసగిస్తోందంటే.. ‘75 శాతం పూర్తైన నివాస సముదాయాల భవనాల నిర్మాణం పూర్తిగా పూర్తికాకుండానే అధికారులకు కేటాయించినట్టు.. వాటిలో బ్రహ్మండంగా అధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వాధికారులు కుటుంబాలతో సహా నివాసముంటున్నారు. జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) వారు ఏకంగా సీఆర్డీఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారు.’ అని కేవలం మాటలు చెప్పడమే కాకుండా, ఈ 420 ప్రభుత్వం ఏకంగా బరితెగించి జీవోలు కూడా ఇచ్చింది.

ఫిబ్రవరి :13, 2024న జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ విడుదల చేసిన జీవోనెం –10 అందుకు నిదర్శనం. ఆ జీవోలో జీఏడీ విభాగం రూ.69,36,60,0000ల అద్దె సీఆర్డీఏకు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నా రు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే బ్యాంకులు ఏవైనా నిర్మాణానికి నిధులు అందిస్తే, అవి చెప్పిన కాలపరిమితిలోగా ఆ నిర్మాణం పూర్తిచేయాలి. అలా పూర్తి చేసి నిర్మాణం పూర్తైనట్టు, మరియు దానిలో నివాసముంటున్నట్టు రుణం పొందినవారు ధృవీకరణపత్రాలు బ్యాంకులకు అందించి రీ పేమెంట్ మొదలు పెట్టాలి. అలా చేయకపోతే ఆ ఆస్తి మొత్తం ఎన్.పీ.ఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) కింద మారిపోతుంది.

అలాంటి ఇబ్బంది రావడంతో, జనవరి 2023లో గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన ఆస్తి ఎన్.పీ.ఏగా మారనుండటంతో, బ్యాంకులు తాము ఇచ్చిన రుణం చెల్లించాలని ఒత్తిడిచేయడంతో గతిలేక చివరకు ఇలా బ్యాంకులకు త్రీడీ సినిమా చూపించడానికి ఏకంగా తప్పుడు జీవోలు ఇచ్చే దుస్థితికి దిగజారింది. అంతేగాక ఎటువంటి ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్స్ లేకుండా డీ.సీ.సీ.వో (డేట్ ఆఫ్ కమెన్స్ మెంట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్) లేఖను కూడా నిస్సిగ్గుగా బ్యాంకులకు అందించారు.

చొక్కా విప్పి తొడలు కొట్టే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తప్పుడు జీవోలతో రాష్ట్రప్రభుత్వ బట్టలిప్పేశాడు
అధికారులు.. ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీల నివాసభవనాల నిర్మాణం పూర్తి కాకుం డానే మొత్తం పూర్తయినట్టు… ఆ భవనాలన్నీ కళకళలాడుతున్నట్టు ఇలా ఏకంగా బ్యాంకుల్ని మోసగించే స్థాయికి ఈ జగన్ మోసపు రెడ్డి సర్కార్ దిగజారిం ది. చొక్కాలిప్పి తొడలు కొట్టే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ జీవోలపై ఏం సమాధానం చెబుతాడు? తనకు చొక్కాలు విప్పుకోవడం అంత మోజైతే ఆయన విప్పుకుంటే సరిపోతుంది కానీ, ఇలా ప్రభుత్వం బట్టలిప్పి ప్రపంచం ముందు నిలబెట్టడమేంటి?

అద్దెల చెల్లింపుకోసం జీఏడీ విభాగం సీఆర్డీఏకు రూ.69 కోట్లు విడుదలచేసినట్టు ఇలా తప్పుడు జీవోలు ఇస్తారా? ఈ 420 ప్రభుత్వం ఇలా బరితెగించి తప్పుడు జీవోలు ఇస్తోందనే వాస్తవాన్ని బ్యాంకులు కూడా గ్రహించాలి. ఈ విధంగా తప్పుడు జీవోలతో బ్యాంకుల్ని మోస గించడానికి బరితెగించి ప్రభుత్వమే జీవోలు విడుదల చేస్తే, భవిష్యత్ లో మరే ఇతర బ్యాంక్ అయినా అభివృద్ధి కార్యక్రమాలకు పైసా కూడా రుణమిచ్చే పరిస్థితి ఉండదు.

సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ప్రవీణ్ కుమార్, మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి లు జగన్ మోసపు రెడ్డికి తమవంతు సహాయసహకారాలు అందించి, తప్పుడు లేఖలతో బ్యాంకుల్ని మోసగించారు
ఐ.ఏ.ఎస్ అధికారి వివేక్ యాదవ్ జగన్ పర్సనల్ సర్వీస్ (జే.పీ.ఎస్) అధికారిగా మారిపోయారు. వివేక్ యాదవ్ 29-01-2024న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ద గ్రేట్ శ్రీలక్ష్మికి లేఖరాశారు. ఆ లేఖలో వివేక్ యాదవ్ ఏమని పేర్కొన్నారంటే… ‘ఫిబ్రవరి-10, 2023న ఏపీ సీఆర్డీఏకి జీఏడీ విభాగాలకు మధ్య నివాస సముదాయాలకు సంబంధించి లీజు ఒప్పందం జరిగినట్టు, దానిప్రకారం మేం పూర్తిచేసిన అధికారుల నివాస సముదాయాల్లో అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేసి, అధికారులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, వివిధ స్థాయిలలోని ప్రభుత్వ అధికారులకు అందించినట్టు.. దానికి సంబంధించి జీఏడీ నుంచి తమకు ప్రతినెలా 10వతేదీ లోపు రూ.6,30, 60,000 (6కోట్ల 30లక్షల 60వేల రూపాయలు) అద్దెరూపంలో చెల్లించాల్సి ఉందని, కానీ ఆ అద్దె బకాయిలు తమకు చెల్లించడం లేదని, ఆ బకాయిల చెల్లింపునకు సహకరించాలి’ అని.

ఆ లేఖ అందుకున్న వెంటనే శ్రీలక్ష్మి జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కు బకాయిల విడుదల కోరుతూ సిపార్సు చేయడం చకచకా జరిగిపోయింది. శ్రీలక్ష్మికి వివేక్ యాదవ్ రాసిన లేఖ నిజమైతే.. అధికారులందరూ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన నివాస సముదాయా ల్లోనే ఉంటున్నారన్నమాట. అదే నిజమైతే మేంస్వయంగా ఆ భవనాల వద్దకు వెళ్లి సదరుఅధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుందామనుకుంటున్నాం. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ అధికారికంగా చెబుతున్న దాని ప్రకారం సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా నేడు ఇవే నివాస సముదా యాలలో నివాసముంటున్నారా?

ఆమె నిజంగా అక్కడే ఉంటే, ఆమెను ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి వారు నివసిస్తున్న ఆ అద్భుతమైన ప్లాట్ ను చూడాలనుకుంటున్నాం. గతంలో జగన్ రెడ్డి తండ్రి హాయాంలో వారి ప్రోద్భలంతో అనేక అవినీతి కార్యక్రమాలకు సహకరించి, కొన్ని సంవత్సరాలపాటు జైలు పాలైన వ్యక్తి ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఎవరైనా ఒకసారి తప్పుచేసి, జైలు పాలయ్యాక తమ పద్ధతులు మార్చుకొని పరివర్తన చెందడానికి ప్రయత్నిస్తారు. కానీ దురదృష్టవశాత్తూ నేడు అటువంటి సత్ర్పవర్తన లక్షణాలు ఏవీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీలో కనిపించడంలేదు. అన్నీతెలిసి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిణి ఇంత దిగజారి ప్రవర్తించడం దురదృష్టకరం. కచ్చితంగా త్వరలో ఏర్పడబోయే టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై కఠినచర్యలు తీసుకోవడం ఖాయం.

మళ్లీ శ్రీలక్ష్మి స్థాయి లాంటి అవినీతి అధికారులు జైలుకెళ్లడమూ ఖాయమే. ఈ వ్యవహారమంతా మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఐ.ఏ.ఎస్ అధికారులు వివేక్ యాదవ్, శ్రీలక్ష్మిల కనుసన్నల్లో జరిగింది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇలా బరితెగించి తప్పుడు జీవోలు, తప్పుడు లేఖలతో బ్యాంకుల్ని మోసగించడానికి సిద్ధపడతారా? ఇంకా వివేక్ యాదవ్ రాసిన లేఖలో ఆయనేం చెప్పారంటే… ‘నాలుగైదు సార్లు సీఆర్డీఏకు రావాల్సిన అద్దె బకాయిలు ఇవ్వాలని జీఏడీ వారికి లేఖలు రాసినట్టు, ఏప్రియల్ 29-2023న, 17-06-2023న, డిసెంబర్:19 2023న, ఈ సంవత్సరం జనవరి 17న తమ బకాయిలను గుర్తుచేస్తూ మొత్తంగా 4లేఖలు ప్రభుత్వానికి రాసినట్టు చెప్పారు.

ఇది మరీ విడ్డూరం. ఎవరు నివాసం లేని భవనాలకు లీజు అగ్రిమెంట్ రాయడమే కాకుండా, అద్దె బకాయిలకోసం పదేపదే లేఖలు కూడా రాశారట!. బ్యాంకుల్ని మోసగించడం కోసం ఎంత నమ్మశక్యమైన స్ర్రిప్ట్ ను తయారు చేశారో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈ విధంగా లేఖలు రాయడం.. తప్పుడు జీవోలు ఇవ్వడంపై ఆదిమూలపు సురేశ్, ఐ.ఏ.ఎస్ అధికారులు వివేక్ యాదవ్, శ్రీలక్ష్మి లు ఏం సమాధానం చెబుతారు?

 బ్యాంకు అధికారులు వాస్తవాలు గ్రహించి తప్పుడు జీవోలు ఇచ్చిన అధికారులు.. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి
జగన్ మోసపు రెడ్డి ప్రభుత్వం తప్పుడు జీవోలు, ఉత్తుత్తి లేఖలతో బ్యాంకులకు త్రీడీ సినిమా చూపిస్తోంది. ఆ త్రీడీ సినిమాకు నిర్మాత జగన్ మోసపు రెడ్డి అయితే, దర్శకత్వం ఆదిమూలపు సురేశ్. కథ, స్క్రీన్ ప్లే శ్రీలక్ష్మి, యాక్షన్ డైరెక్ట ర్ వివేక్ యాదవ్. ఇదీ కథ. ఎవరూ నివాసముండని, అసలు నిర్మాణమే పూర్తి కాని భవనాలకు రూ.6కోట్ల30లక్షల చొప్పున చెల్లిస్తున్నారా? ఇదంతా రాష్ట్ర ప్రజలు నమ్మాలా? వివేక్ యాదవ్ లేఖరాయడం.. శ్రీలక్ష్మి జీఏడీ వారికి డబ్బులు ఇవ్వమని చెప్పడం.. ఏమిటి ఇదంతా?

వీళ్ల వ్యవహారం ఇలాఉంటే చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి పల్లంరాజు మరో లేఖ ఇస్తారు. ఈ మోసాన్ని గ్రహించి బ్యాంకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని కోరుతు న్నాం. సంబంధిత మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, శ్రీలక్ష్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. ఈ వ్యవహారంలో ఆర్ & బీ వారిని ఇరికించడానికి వారికి కూడా లేఖ రాశారు. కానీ ఆర్ & బీ నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు. ఈ విధంగా బరి తెగించి జగన్ సర్కార్ బ్యాంకుల్ని మోసగిస్తే భవిష్యత్ లో ఏ బ్యాంక్అయినా రుణం ఇస్తుందా? ఏ ప్రాజెక్ట్ కు అయినా పైసా సాయం చేస్తుందా?

చంద్రబాబు ఎంతో శ్రమించి ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి, తనకున్న విశ్వసనీయతతో నిధులు తీసుకొచ్చి 70, 80శాతం పూర్తిచేస్తే, మిగిలిన పనులు పూర్తిచేయకుండా ఇలా తప్పుడుజీవోలు ..దొంగ లేఖలతో బ్యాంకుల్ని మోసగిస్తారా? ఇలాంటి తప్పుడు పనులు చేసే మనిషికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేనేలేదు. ఈ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ భవిష్యత్ అనేది లేకుండా చేస్తున్నాడు ఈ 420 ముఖ్యమంత్రి. ఇలాంటి 420 సీఎం మాకొద్దు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు కాబట్టే.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను అమితంగా అదరిస్తున్నారు. ” అని పట్టాభిరామ్ స్పష్టం చేశారు

LEAVE A RESPONSE