Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి చెప్పే సుభాషితాలకు…ఆయన పనితీరుకి ఎక్కడా పొంతనలేదు

-మానవీయతతో పనిచేయండి.. ఎదిగినకొద్దీ ఒదగండి అంటూ ముఖ్యమంత్రి తనఆలోచనలు, చర్యలకు విరుద్ధంగా సుభాషితాలు, సూక్తులు చెప్పడం, తననటనా కౌశలంతో ఆస్కార్ కు పోటీపడటమే
• అధికారులు, మంత్రుల సమీక్షలో ముఖ్యమంత్రి తన ప్రవర్తనకు విరుద్ధంగా నిన్న సుభాషితాలు వల్లించాడు
• మానసిక దివ్యాంగురాలిపై ప్రభుత్వాసుపత్రిలో 30గంటలపాటు అత్యాచారం జరగడం.. ఒకతండ్రి తన కుమారుడి శవాన్ని మోటార్ సైకిల్ పై 90కిలోమీటర్లు తీసుకెళ్లడమేనా ముఖ్యమంత్రి చెబుతున్న మానవీయత?
• ముఖ్యమంత్రి చెప్పే సుభాషితాలకు…ఆయన పనితీరుకి ఎక్కడా పొంతనలేదు
• పన్నులు, ధరలు, ఛార్జీలపెంపు, ఇతరత్రాబాదుళ్లతో ప్రజలను పీక్కుతింటున్న ముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వం, అధికారయంత్రాంగం మానవీయత, మట్టిగడ్డలని మాట్లాడటం సిగ్గుచేటు
-మాజీమంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి

ప్రభుత్వాధికారులు, మంత్రులతోనిన్న సమీక్షనిర్వహించిన ముఖ్యమంత్రి, ఎదిగిన తరువాత ఒదిగిఉండాలని, మానవీయకోణంలో పనిచేయాలని వారితో సుభాషితాలు, సూక్తులు చెప్పడం విచిత్రంగా,ఏవగింపుగాఉందని విజయవాడలో మానసికదివ్యాంగురాలిపై ఆసుపత్రి లో పనిచేసేవారు 30గంటలపాటు అత్యాచారానికిపాల్పడితే దాన్నిగమనించలేనిస్థితిలో ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వయంత్రాంగంఉండటం ఏరకమైన మానవీయతో వారే సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అమర్ నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!

ముఖ్యమంత్రిగారి సొంతజిల్లాలోనిరిమ్స్ ఆసుపత్రిలో విద్యుత్ కోతలవల్ల అభంశుభంతెలియ ని చిన్నారులప్రాణాలు పోయాయి.. అదెలాంటి మానవీయతా కోణమో జగన్మోహన్ రెడ్డే చెప్పాలి. అలానే తిరుమలస్వామివారి దర్శనానికి వెళ్తున్నకుటుంబాన్ని నడిరోడ్డుపైనే వది లేసి, వారికారుని లాక్కెళ్లిన తనఅధికారయంత్రాంగం ఎలాంటి మానవీయతచూపిందని ప్రశ్ని స్తున్నాం. అదేరోజు మాజీమంత్రి ఒకాయన వందలాదికార్లతో తనకుసంబంధించిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కి కారులేదని లాక్కెళ్లిన అధికారు లు, మాజీమంత్రికి వందలాదికార్లు ఎక్కడినుంచి వచ్చాయో సమాధానంచెప్పాలి.

వీటన్నింటికంటే దారుణంగా కరోనాసమయంలో తల్లినికోల్పోయిన బాలికను చేరదీసినట్లు నటించి, ఆమెను నిర్బంధించి, వైసీపీనేత, అతనిఅనుచరులు గుంటూరులో రోజులతరబడి అత్యాచారం చేయడం ఎలాంటి మానవీయతో ముఖ్యమంత్రిచెప్పాలి. గురజాలనియోజకవర్గం లోని పిడుగురాళ్లలో ముగ్గురుచిన్నపిల్లలు ఆడుకుంటూ, పొరపాటున వైసీపీప్లెక్సీ చించితే దాన్ని పెద్దరాధ్ధాంతంచేసి, ఆ చిన్నపిల్లలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఎలాంటి మానవీ యతో చెప్పాలి. తనకు మంత్రిపదవి వచ్చిందన్న అహంకారంతో, తనమెహర్బానీకోసం ఉషశ్రీ చరణ్ గారు, ర్యాలీపేరుతో రోడ్లన్నీ బ్లాక్ చేస్తే, ఒకచిన్నారిప్రాణంపోయింది..అది ఎలాంటి మానవత్వమో ఆమే సమాధానంచెప్పాలి. తిరుపతిలోని రుయాఆసుపత్రిలో కరోనాసమ యంలో ఆక్సిజన్ అందక దాదాపు50మంది వరకు చనిపోయారు.. అలానే అదే ఆసుపత్రిలో విద్యుత్ కోతలతో సరైనపరికరాలు లేక రోజుమార్చిరోజు దాదాపు16మంది చిన్నారులు చని పోయారు..అదేనా ముఖ్యమంత్రి నిన్నచెప్పినమానవీయత? మరీదారుణంగా నిన్నటికి నిన్న ఒకతండ్రి తనకుమారుడి శవాన్ని 90కిలోమీటర్లు మోటార్ సైకిల్ పై తీసుకెళ్లడం ఎ లాంటి మానవీయతో ముఖ్యమంత్రి, అధికారయంత్రాంగం స్పష్టంచేయాలి.

ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి, ఆయనమంత్రులు, ప్రభుత్వయంత్రాంగం మొత్తం అమానవీయంగానే వ్యవహ రిస్తోందని జగన్మోహన్ రెడ్డి చెప్పిఉంటే బాగుండేది. ఆయన సుభాషితాలకు నిజంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి పైకిచెప్పేది ఒకటి… వాస్తవంలో జరిగేదిమరోటి. ప్రభుత్వాసు పత్రుల్లో ఎక్కడా సరైనవైద్యం అందడంలేదని, ఆఖరికి మందులుకూడా దొరకడంలేదనే వాస్తవం ముఖ్యమంత్రికి తెలియదా? ప్రజలపై పన్నులు, ధరలభారంమోపి, వారిని వేధించు కుతింటున్న ముఖ్యమంత్రి మానవీయత.. మట్టిగడ్డ అనిచెప్పడం విచిత్రంగా ఉంది. ఆయన తననటనాకౌశలంతో, సుభాషితాలతో ఎల్లకాలంప్రజలను మోసగించలేడని ఎంతత్వరగా తెలుసుకుంటే అంతమంచిదని సూచిస్తన్నాం.

LEAVE A RESPONSE