Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌రెడ్డి, ఆయన తాబేదారులకు జైలు తప్పదు

-తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.40 వేల కోట్లు
-డీఎమ్జీ, పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ

-ప్రత్యేక కమిటీలకు సుప్రీం చెప్పినా చర్యల్లేవ్‌
-ఎన్జీటీ ఆదేశించినా ఆగని ఇసుక తవ్వకాలు
-కూటమి వచ్చాక దోపిడీ సొమ్ము మొత్తం కక్కిస్తాం
-మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసి తవ్వకాలు నిలిపివేసేం దుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంకా తవ్వకాలు ఆగడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 2023లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా అక్రమ తవ్వకాలను అడ్డుకోలేదు. అక్రమ తవ్వకాలు జరగలేదంటూ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఒకే రకమైన నివేదికను ఇచ్చి కోర్టును మభ్యపెట్టారు.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు బేఖాతరు
ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తవ్వేశారు. జగన్‌ రెడ్డి కనుసన్నల్లో రూ.40 వేల కోట్లు ఇసుకను దోచేశారు. డీఎమ్జీ వెంకటరెడ్డి కీలక పాత్రధారిగా ఉండి దోచిపెట్టాడు. మైనింగ్‌, ఫారెస్ట్‌ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఏ విధంగా దోచుకుంటున్నాడో గతంలోనే నిరూపించాం. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా అక్రమం గా ఇసుక తవ్వకాలను సాగిస్తున్నారు. సుప్రీంకోర్టు అడిగితే కేసులు ఫైల్‌ చేశా మని చెబుతున్నారు. ఎవరి మీద కేసులు పెట్టారో డీఎమ్జీ చెప్పాలని ప్రశ్నించా రు. రాష్ట్రంలో భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యని ఎమ్‌ఓఎఫ్‌సీ రిపోర్ట్‌ ఇచ్చింది. దానిపై చర్యలు తీసుకోలేదు. దున్నపోతు మీద వర్షం పడినట్లు అధికారుల తీరు ఉందని మండిపడ్డారు.

వెంకటరెడ్డితో మొత్తం కక్కిస్తాం
ప్రభుత్వం మారబోతుంది. అక్రమ తవ్వకాలకు సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉచిత ఇసుక పాలసీతో ప్రజలకు మేలు చేస్తే సిగ్గులేకుండా చంద్రబాబుపై కేసులు పెట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుక అక్రమాలు జరుగుతున్నా ఎటువంటి అక్రమాలు జరగలేదని డీఎమ్జీ వెంకటరెడ్డి సుప్రీంకోర్టులో క్లీన్‌ చిట్‌ తీసుకువచ్చారు. అధికారం పోతే ఈ వెంకటరెడ్డి పారిపోవచ్చని అనుకుంటున్నాడేమో ఎక్కడికి పారిపోలేడు. నిలబెట్టి మొత్తం కక్కిస్తాం. మైనింగ్‌లో ఎటువంటి అనుభవం లేని జేపీ వెంచర్స్‌, జీసీకేసీ, ప్రతిమా వంటి బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారు.

దోపిడీలో వీరే పాత్రధారులు
జేసీ వెంచర్స్‌కు ఇవ్వడంతో రూ.1500 కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి మళ్లీ జగన్న కాలనీలు, నాడు నేడు స్కూల్స్‌ అని చెప్పి అదే కంపెనీకి కోట్లు కట్టబెట్టి దోచుకున్నారు. ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా దోపిడీ ఆగలేదు. ఈ దోపిడీపై సుప్రీం నేడు తీవ్ర ఆక్షేపణ చేసింది. వీటికి డీఎమ్జీ, పెద్దిరెడ్డి, సీఎస్‌ లే సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్న ధనుంజయ్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. వీరందరూ ఈ దోపిడీలో పాత్రధారులు. జగనరెడ్డికి ప్యాలెస్‌కు డబ్బులు చేరవేయడంలో వీరిదే కీలకపాత్ర.

కూటమి వచ్చాక జైలుకు ఖాయం
సుప్రీంకోర్టు ఒక వైపు మొట్టికాయలు వేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసినా దోపిడీ ఆగడం లేదు. ఇసుక తవ్వకాలకు అనుమతి లేని ప్రదేశంలో నేడు దవళేశ్వరం దగ్గర డ్రజ్జర్‌తో ఇసుకను దోచుకుంటున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. లెక్క లేకుండా మీనమేషాలు వేస్తున్నారు. దోపిడీపై పూర్తి ఆధారా లు ఉన్నాయి. జగన్‌రెడ్డితో పాటు అధికారులు అందరూ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా సుప్రీం ఆదేశాలను గౌరవించి వెంటనే కమిటీలు ఏర్పాటు చేసి ఎవరు దోపిడీ చేశారో వారిపై చర్యలు తీసుకో వాలి. లేదంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులు శిక్ష తప్పదు. కూటమి అధికా రంలోకి వచ్చిన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయం.

LEAVE A RESPONSE