Suryaa.co.in

Andhra Pradesh

దొంగఓట్లతో గెలవాలన్నదే జగన్ రెడ్డి, అతని ప్రభుత్వ దురాలోచన

– ప్రజాబలం లేదని తెలిసే, అధికారులసాయంతో మంత్రులు ప్రభుత్వపెద్దలు దొంగఓట్ల సృష్టి, టీడీపీ ఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టారు
• ఓటర్ల జాబితా సవరణ ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వైసీపీనేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు?
• ఫామ్ -7 దరఖాస్తులపై ఇంటింటి విచారణ జరిపించి, ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నాకే ఓట్లు తొలగించాలని టీడీపీ కోరితే, మంత్రులు ఎందుకు గంగవెర్రులెత్తుతున్నారు?
• 2014లో ఎన్నికలు పూర్తయితే, 2015లో జరిగిన ఓట్ల తొలగింపుతో టీడీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం?
• 2019 జనవరి నుంచి మార్చి నాటికి 25లక్షల దొంగఓట్లు ఎలా నమోదయ్యాయో, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీ, జగన్ రెడ్డికే తెలుసు.

– మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్

విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి జగన్ పాలెగాళ్లందరూ దొంగఓట్ల వ్యవహారంపై మాట్లాడటం సిగ్గుచేటని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లడంతో వైసీపీ ప్రధాన నేతలు, జగన్ రెడ్డి అనుంగు అనుచరులు గంగవెర్రులెత్తి పోతున్నారని టీడీపీనేత, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ దౌర్జన్యం, దోపిడీ, విధ్వంసాలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్ రెడ్డి, తన పరిపాల నపై నమ్మకం లేక వచ్చే ఎన్నికల్లో తనపార్టీకి ఓటమి తప్పదన్న భయంతో దొంగఓట్లు నమోదు చేయించడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలకు తెరలేపా డు. దానిలో భాగంగా ఇష్టానుసారం ఫామ్-7 దరఖాస్తులు చేసే పనిని తనపార్టీ వారికి అప్పగించాడు. ఓటరు జాబితాలో మార్పులు చేయడం, టీడీపీకి పడతాయి అనుకు న్న ఓట్లను పోలింగ్ బూత్ ల వారీగా విడగొట్టడం వంటి పనులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీప్రభుత్వం యథేచ్ఛగా ఓట్లు తొలగించడంపై టీడీపీ అధినేత చంద్ర బాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వైసీపీకి వచ్చిన ఇబ్బందేమిటి? ఆ పార్టీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు?

2014లో ఎన్నికలు పూర్తయితే, 2015లో జరిగిన ఓట్ల తొలగింపుతో టీడీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఓట్లు తొలగించాల్సిన అవసరం అప్పటి ప్రభుత్వానికి ఏముంది?

2015-16లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 50లక్షల ఓట్లు తొలగించింది అని విజయసా యి రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి సజ్జల వంటి వారు చెప్పడం కేవలం దుష్ప్రచారమే. కేవలం ప్రజల్ని తప్పుదోవపట్టించడానికే వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.

2014లో ఎన్నికలు పూర్తయి, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే, ఎన్నికలు పూర్తైన 6, 7నెలలకు 50 లక్షల ఓట్లు తొలగించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నాటి ప్రభుత్వానికి ఆ పని చేయాల్సిన అవసరం ఏమిటి? ఆ రోజున ఐ.ఏ.ఎస్ అధికారి భన్వర్ లాల్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కేంద్రప్రభుత్వం ఓటు గుర్తింపుకార్డుకి ఆధార్ ను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. దానిలో భాగంగా తెలంగాణలో ఉంటున్న ఏపీ ఓటర్ల ఓట్లకు, ఏపీలోని తెలంగాణ ఓటర్ల ఓట్లకు ఆధార్ ను అనుసం ధానించారు.

కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లను ఆధార్ తో అనుసంధానం చేయడం తప్పని నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒప్పుకున్నారు కూడా. ఈ వ్యవహారంపై స్వేచ్ఛా అనే ఎన్జీవోసంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో నేటికీ ఆ కేసు విచారణ పెండింగ్ లోనే ఉంది. ఇదంతా తెలిసి కూడా వైసీపీనేతలు ప్రజల్ని నమ్మించడానికి అబద్ధాలు చెబుతు న్నారు.

తెలంగాణ, ఏపీలో సరైన విచారణ జరపకుండా, ఆధార్ అనుసంధానం పేరుతో 2015లో ఇష్టానుసారం గంపగుత్తగా ఓట్లు తొలగించారని నాడు అభ్యంతరాలు వచ్చాయి. ఇంటింటికీ తిరిగి ఓటర్ వెరిఫికేషన్ చేయకుండానే ఓట్లు తొలగించారని కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో 30 లక్షలు, ఏపీలో 20 లక్షల ఓట్లు తొలగించారని చెప్పింది. ఈ వ్యవహారంలో నాటి టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదనేది వాస్తవం.

ఫామ్ – 7 దరఖాస్తులు తమపార్టీయే నమోదు చేయిస్తున్నదని జగన్ రెడ్డే స్వయంగా గవర్నర్ తో చెప్పలేదా?

ఓట్ల తొలగించడం వైసీపీకి అవసరంలేదని, అలాంటి అక్రమాలు తాము, తమప్రభుత్వం చేయదని వైసీపీనేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఫామ్ -7 దరఖాస్తుల్ని ఇష్టానుసారం హైదరాబాద్, బెంగులూరుల ఐపీ అడ్రస్ లతో నమోదుచేసింది వైసీపీ నేతలు కాదని విజయసాయి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి చెప్పగలరా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గవర్నర్ ను కలిసిన సందర్భంలో ఫామ్-7 దరఖాస్తులు తమ పార్టీవారే అందిస్తున్నట్టు చెప్పింది నిజంకాదా?
విచ్చలవిడిగా ఫామ్ -7 దరఖాస్తులు నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక సిట్ బృందంతో దర్యాప్తు జరిపిస్తే, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్ ఏజెన్సీల సాయంతో జగన్ రెడ్డి అండతో వైసీపీవారే ఫామ్ -7 దరఖాస్తులు నమోదుచేయించినట్టు రుజువైంది నిజంకాదా? ఫామ్ -7 దరఖాస్తుల నమోదుకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపకుండా నాడు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ గా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ వదిలేసింది నిజంకాదా?

ఎన్నికల కమిషనర్ గా ద్వివేదీ ఎలా పనిచేశాడో, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గా ఆయన ఎలా విధులు నిర్వర్తించాడో కూడా ప్రజలకు బాగా తెలుసు. పంచాయతీ, ప్రభుత్వ భవనాల కు వైసీపీ రంగులేయాలని ఆదేశించినప్పుడే ద్వివేది ఎలాంటి అధికారో అర్థమైంది. ద్వివేది తప్పులను దాచి, ఆయన్ని వైసీపీ ప్రభుత్వమే రక్షిస్తోందని కూడా ప్రజలకు బాగా తెలుసు.

వైసీపీ ఐటీ విభాగం నేత్రత్వం లోనే రాష్ట్రంలో లక్షలాదిగా ఫామ్ -7 దరఖాస్తులు నమోదైంది వాస్తవం. విశాఖ, విజయవాడ, ఉరవకొండ, పర్చూరు, కొండెపి నియోజకవర్గాల్లో ఇష్టానుసారం ఫామ్ -7 దరఖాస్తులు నమోదు చేసి, బీఎల్వోలను బెదిరిస్తూ, ప్రతి నియోజకవర్గంలో 7 నుంచి 10వేల ఓట్లు తొలగించే కుట్రకు వైసీపీ ప్రభుత్వం పథకరచన చేసిందనేది వాస్తవం. మొత్తంగా రాష్ట్రంలో 10లక్షలకు పైగా ఫామ్ -7 దరఖాస్తులు వైసీపీ ప్రభుత్వమే నమోదు చేయించడాన్ని గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

బూత్ లు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఇన్నిఓట్లు తొలగించాల్సిందేనని మంత్రులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నది నిజంకాదా?

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఒక కుటుంబంలోని ఓట్లను పోలింగ్ బూత్ ల వారీగా ఎందుకు విడగొడుతున్నారో వైసీపీప్రభుత్వం చెప్పాలి. ఒక ఇంట్లో ఉండే 4, 5 ఓట్లను వివిధ పోలింగ్ బూత్ లకు, ఒక వీధిలోనిఓట్లను పలురకాల పోలింగ్ స్టేషన్లకు మార్చింది నిజంకాదా? పోలింగ్ స్టేషన్ కు ఇన్నిఓట్ల చొప్పున తొల గించాల్సిందేనని మంత్రి సీదిరి అప్పలరాజు, వేమూరి నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బహిరంగంగానే ఆదేశాలు ఇచ్చింది నిజంకాదా?

ఈ విధంగా బరితెగించి రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీనేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంటింటికీ తిరిగి ఫామ్-7 దరఖాస్తుల్ని విచారించాలని, అర్హులైన ఓటర్లకు తెలియకుండా, వారి ఓట్లు తొలగించడానికి వీల్లేదని టీడీపీ చెబితే, దానికి వైసీపీనేతలు ఎందుకు కలవరపడుతున్నారు?

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం దొంగఓట్లను నమ్ముకొంది
రాష్ట్రప్రజలకు మేలు చేయడంలో వెనుకబడిన వైసీపీనేతలు, దుర్మార్గపు వైసీపీప్రభు త్వంపై విసుగుచెంది, ప్రతిపక్షాన్ని ఆదరిస్తున్నారు. చంద్రబాబుసభలకు,యువగళం యాత్రకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

దాంతో ఏంచేయాలో తెలియక వైసీపీ ప్రభుత్వం, అధికారయంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, దొంగఓట్ల నమోదు, టీడీపీఓట్ల తొలగిం పునకు కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితూ కచ్చితంగా వైసీపీకి ఓటమి తప్పదని అనేక సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జగన్ రెడ్డి అతని బృందం టీడీపీ ఓట్లు తొలగించి, దొంగఓట్ల సాయంతో వచ్చేఎన్నికల్లో గెలవడానికి సిద్ధమైంది.

2019 ఎన్నికలకు ముందు కేవలం రెండున్నర నెలల్లో 25లక్షల ఓట్లు ఎలా పెరిగాయో వైసీపీకి, అప్పటి ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీకే తెలియాలి

జనవరి 11, 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నమొత్తం 3,69,33,091 ఓట్లుంటే, ఎన్నిక లు జరిగే సమయానికి 2019 మార్చి 25 నాటికి ఆ సంఖ్య 3,93,51,040 ఓట్లు పెరిగాయి.

24,12,620కి పైగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా వచ్చాయో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అప్పటి ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేది చలవవల్లే ఇదంతా సాధ్యమైంది నిజంకాదా? కేవలం రెండున్నర నెలల్లో 25లక్షల ఓట్లు చేర్చడంలోని మతలబు గోపాల కృష్ణ ద్వివేది, జగన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికే తెలుసు.

ప్రజామోదంతో, ప్రజాబలంతో గెలవలేకే వైసీపీ, ఆ పార్టీ నేతలు దొంగఓట్లను నమ్ముకుంటున్నారు అనేది గతఎన్నికల సమయంలోనే స్పష్టమైంది.

2024 ఎన్నికలు చట్టబద్ధంగా జరగాలని, అర్హుడైన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలని, ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర ఎన్ని కల సంఘాన్ని కోరితే, వైసీపీ ప్రధాననేతలు, మంత్రులు ఎందుకు వెర్రెత్తిపోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు? వైసీపీ ప్రభుత్వ దొంగఓట్లపై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచిస్తున్నాం.

రాష్ట్రంలో గంపగుత్తగా నమోదైన ఫామ్-7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం లోతైన విచారణ జరిపి, అనర్హులు ఓట్లు తొలగించి, అర్హులైన వారు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో వైసీపీ పాల్పడిన అక్రమాలు నిగ్గుతేల్చి, తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించాలి” అని తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.

 

LEAVE A RESPONSE