– భూకుంభకోణంలో శ్రీలక్ష్మి భాగస్వామి
– రూ.1500కోట్ల విలువైన 97.30ఎకరాల భూమిని రూ.200కోట్లకు కాజేసిందికాక, సిగ్గులేకుండా చంద్రబాబుప్రభుత్వంలోనే జీవోలు ఇచ్చారంటూ బొత్స సత్తిబాబు పచ్చిఅబద్ధాలుచెబుతున్నాడు
– ప్రపంచం నోరెళ్లబెట్టేలా విశాఖలో గజంభూమి యొక్క అత్యధిక మార్కెట్ విలువ రూ.4వేలు మాత్రమేనని నిర్ధారించిన ఘనత జగన్ రెడ్డి సర్కారుదే
– తప్పుడు వాల్యూయేషన్ నివేదికల ఆధారంగా హీనపక్షంగా ఎకరా రూ.15కోట్లు విలువైన భూమిని కేవలం రూ.2కోట్లకే కాజేసింది మీప్రభుత్వం కాదా సత్తిబాబుగారు?
• ఎవరు ఎన్ సీసీ నుంచి భూమిని కొట్టేయడానికి ఎలాంటి కుట్రలు పన్నారో, ఏవిధమైన పథకాలురచించారో ఆధారాలతో సహా బయటపెట్టడానికి తాము సిద్ధం
• జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలతో పాటు,చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను కూడా ప్రజలముందు ఉంచుదాం. ఎవరు భూకబ్జాదారులో.. ఎవరు భూసంరక్షకులో వారేతేలుస్తారు.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అక్రమ భూదందాలు, భూకబ్జాలకు, ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ గా విశాఖపట్టణాన్ని మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి, ఏ2 విజయసాయిరెడ్డికే దక్కుతుందని, రాజధాని పేరుతో సాగరనగరంలో ఎక్కడభూమికనిపించినాదాన్నిలాక్కోవడం, పేదలభూముల్ని కబ్జాచేయడంవంటివి ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వంలోయథేచ్ఛగా జరిగాయని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్ రెడ్డికి పంపాల్సిన వాటాలను ఠంఛన్ గా పంపుతూ, విశాఖకేంద్రంగా విజయసాయి రెడ్డి ఈ మూడేళ్లలో భూకబ్జాలపర్వాన్ని యథేచ్ఛగా సాగించాడు. ఆకోవలో జరిగిందే ఎన్ సీసీ ల్యాండ్ స్కామ్. విశాఖనగరంలోని 97ఎకరాల30 సెంట్ల ప్రభుత్వభూమిని గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎన్ సీసీ కంపెనీకి అప్పగించి, డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. సదరుభూమికేంద్రంగా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పుత్రరత్నమైన జగన్ రెడ్డి ఎన్నివందలకోట్ల కుంభకోణానికి తెరలేపాడో తెలియచేస్తూ, ఇప్పటికేమాపార్టీనేతలు పల్లా శ్రీనివాసరావుగారు, వెలగపూడిరామకృష్ణగారు, బండారు సత్యనారాయణమూర్తి ఆధారాలతో సహా అనేక వాస్తవాలు బయటపెట్టారు.
మాపార్టీనేతలుబట్టబయలు చేసిన భూకుంభకోణంపై రాష్ట్రమున్సిపల్ శాఖామంత్రి బొత్ససత్తిబాబు, తనలోనుంచి పొంగుకొస్తున్న ఫ్రస్టేషన్ తో సదరుభూమిని మొత్తం చంద్రబాబుగారే ఎన్ సీసీ కంపెనీకి దోచి పెట్టారంటూ, ఉన్నవి, లేనివన్నీ మీడియాముందు కక్కాడు. ఊరికేమాట్లాడకుండా తెలుగుదేశంనాయకులు ఎవరువస్తారో రావాలంటూ మీడియాముందే సవాల్ కూడా చేశాడు.
సత్తిబాబు రెండుకాగితాలు చేతిలోపెట్టుకొని ఊపుకుంటూ, చంద్రబాబుపై నిందలేస్తే ఊరుకునేది లేదనిచెబుతూ, ఆయనచెప్పిన పచ్చిఅబద్ధాలను, విశాఖకేంద్రంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రిసాగించిన దాదాపు రూ.1500కోట్ల భూకుంభకోణాన్ని బట్ట బయలు చేయడానికే నేడు నేను మీడియా ముందుకు వచ్చాను. తామునేడు విడుదల చేస్తున్న ఆధారాలు చూశాక బొత్స సత్తిబాబు ఏంచేస్తాడో, తనమాటలను ఎలాసమర్థించుకుంటాడో, గతంలో ఈ ప్రభుత్వమిచ్చిన జీవోపై ఏం సమాధానంచెబుతాడో చూస్తాం.
విశాఖపట్టణంలోని 97.30ఎకరాలకు సంబంధించి, గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్ సీసీ వారు సంప్రదించినప్పుడు డిసెంబర్ 31, 2005న ఏపీహెచ్ బీ (ఏపీ హౌసింగ్ బోర్డ్ ) వారు లెటర్ ఆఫ్ అవార్డ్ ఇవ్వడంజరిగింది. తర్వాత ఎన్ సీసీ వారు ఏపీ హెచ్ బీతో కలిసి, వైజాగ్ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు మార్చి16, 2007న ఒక డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.
డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాక 04-02-2010న అప్పటికాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ సీసీ వారి పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడంజరిగింది. 19-12-2007న సదరు 97.30ఎకరాల భూమిని వారి పొజిషన్ లోకి అప్పగించడంకూడా జరిగింది. తరువాత వివిధకారణాలతో సదరుభూమి ఆశించిన విధంగా డెవలప్ అవ్వకపోవడంతో 16-12-2013న ఎన్ సీసీతో చేసుకున్న డెవలప్ మెంట్ అగ్రిమెంట్ ను టెర్మినేట్ చేయడం జరిగింది. ఇవేవీ బొత్స కి తెలియవన్నట్లు నిన్నమీడియా ముందు తప్పంతా టీడీపీదే అన్నట్లు బుకాయించాడు.
బొత్స మాట్లాడేది అసలే ఎవరికీ అర్థంకాదు.. దానికితోడు ఆయన హాఫ్ నాలెడ్జ్ చూశాక మన “బిత్తిరిసత్తే” నయంరా బాబూ అని ప్రజలంతా తలలుగోక్కుంటున్నారు.
16-12-2013న ఎన్ సీసీ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ టెర్మినేట్ అయ్యాక, ఎన్ సీసీవారు హైకోర్ట్ ని ఆశ్రయించగా, 03-01-2014న హైకోర్ట్ స్టేమంజూరు చేస్తూ ఇంటెరిమ్ ఆర్డర్ ఇచ్చింది. ఇంటెరిమ్ ఆర్డర్ వచ్చాక, ఎన్ సీసీ వారికి కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతున్న సమయంలోనే అప్పుడున్న తెలుగుదేశంప్రభుత్వాన్ని వారుసంప్రదించారు. కోర్టుబయట తాము ఇరువురికీ ఆమోదయోగ్యంగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని 19-12-2016న ఎన్ సీసీవారు అప్పుడు ఒక ప్రపోజల్ పెట్టారు.
ఆ తర్వాత 12-02-2019న నాటి టీడీపీ ప్రభుత్వం జీవోనెం-64 విడుదలచేసింది. చంద్రబాబుగారు విడుదలచేసిన జీవోనెం-64 గురించి నిన్నసత్తిబాబు గారుపెదవి విప్పలేదు. ఎందుకంటే ఆ జీవోనెం-64లో టీడీపీప్రభుత్వం పొందుపరిచిన అనేకఅంశాలు వెలుగులోకి వస్తే, తమఅసలు రంగు బయటపడుతుందనే దురుద్దేశంతోనే ఆజీవో గురించి సత్తిబాబు పెదవి విప్పలేదు.
సదరు భూమికి సంబంధించి 12-02-2019న ఇచ్చిన జీవోనెం-64 గురించి మాట్లాడకుండా బొత్స సత్తిబాబు అంతా టీడీపీప్రభుత్వమేచేసిందని ఎలాచెబుతారు? సదరుభూమికి సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువప్రకారం అత్యధికధరఎంతో ఇద్దరు వ్యాల్యూయేటర్లతో నిర్ధారించండని జీవోనెం-64ఇస్తే, భూమినిఅప్పనంగా ఎన్ సీసీవారికి అప్పగించారని సత్తిబాబు పచ్చి అబద్ధం చెప్పాడు.
చంద్రబాబు ప్రభుత్వమిచ్చిన జీవోనెం-64లోని అంశాలపై తమసమ్మతిని తెలియచేస్తూ ఎన్ సీసీవారు తమకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు కావాలనిమాత్రమే లేఖద్వారాటీడీపీప్రభుత్వాన్నికోరగా, దానిపైమరలా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవోనెం-121 ఇవ్వడం జరిగింది. సదరు జీవోలో జీవోనెం-64లోని అంశాలనుపాటిస్తూ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) మార్గాన్ని ఉపయోగించి, భూలావాదేవీని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొనడంజరిగింది.
అంతేగానీ అప్పటికప్పుడు జీవోనెం-64లో పేర్కొన్నవిధంగా, వ్యాల్యూయేషన్ పూర్తిచేసి, అత్యధిక మార్కెట్ ధర నిర్ధారించి, దానిని ఎన్ సీసీవారివద్దనుంచి వసూలుచేయకుండా, అప్పనంగా భూమిదోచిపెట్టమని, జీవోనెం-121లో ఎక్కడాపేర్కొనలేదు. జీవోనెం-64లోని అంశాలు చెప్పకుండా, జీవోనెం 121లోని అంశాలనే ప్రస్తావిస్తూ, విశాఖపట్టణంలోని భూమిని ఎన్ సీసీ వారికి దోచిపెట్టినట్టు బొత్స పచ్చిఅబద్ధాలుచెప్పాడు.
అదంతా ఒకెత్తు అయితే సదరుభూమికి సంబంధించి, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 20-12-2020న జీవోనెం-600 విడుదలచేశారు. దానిలో చాలాస్పష్టంగా సదరుభూమికి నలుగురు సభ్యులతోకూడిన వ్యాల్యూయేషన్ కమిటీని జగన్ రెడ్డి సర్కారు నియమించడం జరిగింది. తర్వాత ఇదే జగన్ రెడ్డి ప్రభుత్వం జీవోనెం-67విడుదలచేస్తూ, జీవోనెం-600 ఆధారంగా ఏర్పాటైన వ్యాల్యూయేషన్ కమిటీ నివేదికఆధారంగా సదరుభూమి విలువను గతంలో చెల్లించిన రూ.90కోట్లకు అదనంగా, రూ.97కోట్ల29లక్షలుచెల్లిస్తే సరిపోతుందని నిర్ధారించారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం, మంత్రి సత్తిబాబు కలిసి 97.30ఎకరాల భూమివిలువను గతంలో ఎప్పుడో 2007లో ఎన్ సీసీవారుకట్టిన రూ.90కోట్లుకాకుండా రూ.97కోట్ల20లక్షలు కడితే సరిపోతుందని నిర్ధారిస్తూ జీవోనెం-67ఎలాఇచ్చారో చెప్పండి? విశాఖలో ఉండే 97.30ఎకరాల విలువైనభూమిని కేవలం రూ.187కోట్లకే ఎలాఅప్పగిస్తారు? చంద్రబాబు నాయుడుగారు అప్పడు ఇచ్చినజీవో-64లో, అనాడుఉన్న అత్యధికమార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంగాచెబితే, నేడు జగన్ రెడ్డి సర్కారు విశాఖపట్ణణంలో ఎకరంభూమి యొక్క అత్యధికమార్కెట్ విలువ కేవలం రూ.2కోట్లని ఎలా నిర్ధారిస్తారు?
విశాఖపట్టణంలోని మధురవాడలో ఇప్పుడు గజంభూమియొక్క అత్యధిక మార్కెట్ విలువ కేవలం రూ.4వేలేనా? ఏలెక్కప్రకారం అక్కడ ఆధర నిర్ణయించారో ముఖ్యమంత్రి, బొత్ససత్తి బాబుచెప్పాలి. హీనపక్షంగా ఎకరంరూ.15కోట్లు విలువఉన్నభూమిని, ఎకరం రూ.2కోట్లుగా నిర్ణయించింది విజయసాయిరెడ్డి బినామీకి కట్టబెట్టడంకోసం కాదా?
ఎన్ సీసీవారు సదరు భూమిని విజయసాయిరెడ్డి బినామీ కంపెనీ అయిన బెంగుళూరుకు చెందిన జీఆర్ పీఎల్ హౌసింగ్ వారికి రూ.200కోట్లకు కొద్దిరోజుల క్రితం అమ్మింది వాస్తవంకాదా? ఎన్ సీసీ వైజాగ్ అర్బన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రూ.187కోట్లకు, ఈ భూమిని బదలాయించి, దానిని తిరిగి కేవలం రూ.200కోట్లకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి తమ బినామీలపేర్లతో ఎలాకొట్టేశారో కూడా బొత్ససత్తిబాబు ప్రజలకు చెప్పాలి.
ఈ విషయం మాత్రం నిన్నవిలేకరులు అడిగినాకూడా ఆయన ఎందుకు వారికి సమాధానం చెప్పలేదు? పైగా2007లోనే ఎన్ సీసీ వారు సదరుభూమికి రూ.90కోట్లు కట్టారని దానికివడ్డీ ఎంతవుతుందంటూ చెప్పుకొచ్చాడు. 2007లోనే 97.30ఎకరాలపై రూ.90కోట్లుపెట్టుబడి పెట్టినవారు, 15 సంవత్సరాలు వెయిట్ చేసికూడా, ఎవరికి భయపడి ఇప్పుడు రూ.200కోట్లకు ఆభూమిని ఇచ్చారో ఇప్పుడు సత్తిబాబు చెప్పాలి కదా..!
జీవోనెం-67 ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రూ.97కోట్లను ఎన్ సీసీ సంస్థ 26-10-2021న చెల్లిస్తే, ఆమరుసటిరోజే సేల్ డీడ్ చేయాలని ఏపీ హౌసింగ్ బోర్డ్ వారు ఆర్డర్ పాస్ చేశారు. అదేరోజు అక్టోబర్ 27-2021నే ఆఘమేఘాలమీద సేల్ డీడ్ అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇక్కడే అర్థమవుతోంది… జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వంకుట్రేమిట. 97.30ఎకరాలభూమిని కాజేయడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చూపిన ప్రత్యేకశ్రద్ద అంతా ఇంతాకాదు…! జగన్ రెడ్డి ఎలాగైనా విశాఖపట్టణంలోని ఈవిలువైనభూమిని కొట్టేయాలని తొలినుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఆ క్రమంలోనే దానిపైకన్నేసి, తక్కువలోతక్కువగా రూ.200కోట్లకే తనపరం చేసుకున్నాడు. నిన్న బొత్ససత్తిబాబు విలేకరులతో మాట్లాడుతూఎకరం ఎంతతక్కువ వేసుకున్నా రూ.6కోట్లవరకు ఉంటుందన్నారు. ఆప్రకారమైనా రూ.600కోట్ల భూమిని రూ.187కోట్లకు ఎలా నిర్ధారించారో ఆయనెందుకు ప్రజలకు చెప్పడంలేదు? ఎన్ సీసీ వారికి 187కోట్లకు97.30ఎకరాలను కట్టబెట్టినట్టే చూపించి, అదేభూమిని విజయసాయిరెడ్డి బినామీకంపెనీ రూ.200కోట్లకు కాజేసింది.
విశాఖపట్నంలోని మధురవాడకు సంబంధించిన 97.30ఎకరాలభూమికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వమిచ్చిన జీవోనెం 64పై బొత్స సత్తిబాబు సమాధానంచెప్పాలి. సదరుభూమివ్యవహారంలో టీడీపీప్రభుత్వం తప్పుచేసిం దనడం, కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా చంద్రబాబుగారు నిర్ణయం తీసుకున్నారనడం పచ్చిఅబద్ధం. గతప్రభుత్వహయాంలో తీసుకున్న ప్రతినిర్ణయాన్ని తిరగతోడి, రద్దుచేసే జగన్ రెడ్డి సర్కార్ ఈభూవ్యవహారంలో మాత్రం రివర్స్ గేర్ వేయకుండా, తమకు అనకూలంగా జీవోలు విడుదలచేసుకొని విలువైన భూమిని కారుచౌకగా కాజేసింది.
టీడీపీప్రభుత్వమిచ్చిన జీవోనెం-64ప్రకారమే జగన్ రెడ్డిప్రభుత్వం విశాఖపట్నం మధురవాడ లోఉన్న 97.30ఎకరాల వాస్తవవిలువను (మార్కెట్ హయ్యెస్ట్ వ్యాల్యూ) నిర్ధారించడకోసం నలుగురుసభ్యులతో కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టే ధైర్యం బొత్స సత్తి బాబుకు ఉందా?సదరు కమిటీ చెప్పిందంటూ విశాఖపట్నంలోని మధురవాడలో గజంభూమి అత్యధికధరను రూ.4వేలుగా నిర్ధారిస్తారా? ఎలా ఆధర నిర్ణయిం చారో ఏ ప్రాతిపదికన నిర్ణయించారో దానికి సంబంధించిన నివేదికలు బయటపెట్టకుండా బొత్స సత్తిబాబు ప్రజలకు అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా?
విశాఖపట్నంలోని 97.30ఎకరాలభూమికి సంబంధించి ఎన్ సీసీవారు గతంలోకట్టిన రూ.90 కోట్లకు అదనంగా రూ.97 కోట్లుకడితే సరిపోతుదంటూ జీవోనెం-67 విడుదలచేసింది మనరాష్ట్రంలోనే “మోస్ట్ సిన్సియర్” ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిగారే. మొన్ననే ఆమె హైకోర్ట్ న్యాయమూర్తులతో “మోస్ట్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి” అనే ప్రత్యేక బిరుదు పొందారు. ఇలాంటి గొప్ప గొప్ప అధికారులను ఈ ముఖ్యమంత్రి తన తప్పుడు పనుల కోసం వాడుకుంటున్నాడు. గతంలో చేసిన తప్పులు చాలవన్నట్లు ఇప్పుడు జరిగిన భూకుంభకోణంలో శ్రీలక్ష్మి భాగస్వామి కావడం దురదృష్టకరం.
విశాఖ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం సాగించిన రూ.1500కోట్ల భూకుంభకోణంపై సత్తిబాబు స్పందించాల్సిందే. తమవద్ద ఉన్నఆధారాలను ప్రజలముందు పెట్టి, విశాఖకేంద్రంగా జరిగిన భూకుంభకోణంపై బహిరంగంగా చర్చించడానికి తాముసిద్ధం. తమతో చర్చకురావడానికి బొత్ససిద్ధమా అని ప్రశ్నిస్తున్నా. అవసరమైతే విశాఖపట్నంలోనే ఈ భూ కుంభకోణంపై చర్చించడానికి, చంద్రబాబు ప్రభుత్వమిచ్చిన జీవోనెం-64లో ఏముందో, పనికిమాలిన జగన్ రెడ్డి భూమిని కాజేయడానికి ఇచ్చిన జీవోనెం-67లో ఏముందో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాము.