• నేటితో జగన్ రెడ్డి బెయిల్ పొంది పది సంవత్సరాలు పూర్తి అవుతోంది
• టీడీపీ తరఫున జగన్ రెడ్డికి దశమ బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏపీ ముఖ్యమంత్రి సాధించిన ఘనతను గుర్తించి, ఆయన పేరును ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో నమోదు చేయాలని జగన్ రెడ్డి తరుపున దరఖాస్తు చేశాను
• ‘ఎక్కువ కాలం బెయిల్ పై జీవించిన వ్యక్తి’ గా జగన్ రెడ్డిని గుర్తించి, ఆయనకు ఒక రికార్డ్ ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టాను
• ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేసుకుంటున్నారు
• అలానే టీడీపీ శాసనసభాపక్షం ముఖ్యమంత్రి ప్రతిభను, గొప్పతనాన్ని అభినందిస్తూ వారి దశమ బెయిల్ వార్షికోత్సవంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటోంది
• టీడీపీ ఇచ్చే తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చర్చలో పాల్గొని వారి అభిమాన నాయకుడు జగన్ రెడ్డిని మననస్ఫూర్తిగా అభినందించాలి
• జగన్ రెడ్డి తన పదేళ్ల బెయిల్ కాలంలోని అనుభవాలను వివరిస్తూ కోర్టులను తప్పించుకొని ఎక్కువకాలం బెయిల్ పై ఉండటం ఎలాగో వివరిస్తూ ఒక పుస్తకం రాస్తే అది నేరసామ్రాజ్యానికి దిక్సూచిగా ఉంటుంది
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
నేడు జగన్ రెడ్డి జీవితంలో అత్యంత ముఖ్యమైన, సంతోషకరమైన రోజని, సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే రోజు (సెప్టెంబర్ 23, 2013) తనపై ఉన్న 11 సీబీఐ కేసులకు సంబంధించి న్యాయస్థానాల నుంచి బెయిల్ పొందారని, నేటితో (సెప్టెంబర్ 23, 2023) బెయిల్ పొంది పది సంవత్సరాలు పూర్తి అవుతోంది. అలాంటి ఈ రోజు ముఖ్యమంత్రికి ఎప్పటికీ గుర్తుంటుందని, కోర్టు బెయిల్ పై దర్జాగా జీవిస్తూ10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు పదవ బెయిల్ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
దేశంలోనే అత్యధిక కాలం కోర్టు బెయిల్ పై జీవిస్తున్న వ్యక్తిగా జగన్ రెడ్డి సరికొత్తి రికార్డు నెలకొల్పాడు.. అందుకు కచ్చితంగా ఆయన పేరుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేయాలి.
“దేశంలో మరే నేరస్తుడు ఇంతకాలం బెయిల్ పై ఉండి ఉండరు. ఆర్థికపరమైన నేరాలై నా, ఇతర నేరాలైనా వేటిలోనూ ఎవరూ పదేళ్లపాటుబెయిల్ పై బయట ఉన్నది లేదు. అంతటి ఘనత, గొప్ప అవకాశం ప్రముఖ ఆర్థిక నేరస్తుడైన జగన్ రెడ్డికి మాత్రమే దక్కింది. ఇంత చాకచక్యంగా అత్యంత నేర్పరితనంతో న్యాయస్థానాల నుంచి తప్పించు కుంటూ, పదేళ్లు బెయిల్ పై బయట ఉండి రాజభోగాలు అనుభవించిన జగన్ రెడ్డిని అభినందించడానికి మనసురాకపోయినా అభినందనలు తెలియచేస్తున్నాం. తమ నాయకుడు సాధించిన ఈ విజయానికి ఎంతో సంతోషంతో వైసీపీ శ్రేణులు ఉదయం నుంచే తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు మొదలెట్టారు.
మరోపక్క జగన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి మంచి జీడిపప్పు, కిస్ మిస్ దట్టించి రుచికరమైన పాయసం చేసి, వచ్చినవారందరికీ వడ్డిస్తున్నారని తెలిసింది. ఈరోజు సాయంత్రం ఈ సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఘనమైన విందు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. పదేళ్ల బెయిల్ పండగను ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ముందుచూపుతో 23వ తేదీ కలిసి వచ్చేలా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు జగన్ రెడ్డి ప్లాన్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారు కనక, వారితో తను సాధించిన ఈ ఘనకార్యాన్ని పంచుకుంటూ దశమ బెయిల్ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవ డానికి పక్కా ప్రణాళికలు వేశాడు జగన్న్ రెడ్డి.
ఇండియా బుక్ ఆఫ్ రికార్స్డ్ వారికి తాము పెట్టిన మెయిల్ లోని వివరాలు..
జగన్ రెడ్డి సాధించిన ఈ ఘనతను గుర్తించాలని కోరుతూ ఆయన తరుపున మేమే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి దరఖాస్తు కూడా చేశాం. నేనే స్వయంగా ఈరోజు ఉదయం జగన్ రెడ్డి తరుపున ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ఒక మెయిల్ ద్వారా దరఖాస్తు చేస్తూ, వారి పేరున ‘The longest period by any individual to live on court bail’ అను రికార్డ్ ను నమోదు చేయాలని కోరడం జరిగింది. తెలుగుదేశం వాళ్లు ఎప్పుడూ తాను చేస్తున్న అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతూ ప్రజలముందు తనను దోషిగా నిలబెడుతున్నారని బాధపడే జగన్ రెడ్డి నేడు మేం వారిపేరును ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో నమోదు చేయించడానికి చేస్తున్నఈ కృషి గురించి విని తప్పక సంతోషిస్తారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ముఖ్య మంత్రి జగన్ రెడ్డి సాధించిన ఘనకార్యాన్ని గుర్తించి, ఆయన పేరున తప్పక రికార్డ్ నమోదు చేసి, ప్రశంసాపత్రాన్ని అందచేస్తారన్న విశ్వాసం మాకుంది. మేము పంపిన దరఖాస్తుని ఆమోదించి అతి త్వరలోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు స్వయంగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చేసి, జగన్ రెడ్డి సాధించిన ఈ రికార్డ్ సర్టిఫికెట్ ను మంచి ఫ్రేము కట్టించి ప్రదానం చేయాలని కోరుకుంటున్నాను. జగన్ రెడ్డి తన జీవితంలో నేటివరకు ఎక్కడా ఎటువంటి సర్టిఫికెట్లు అందుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆయన విద్యార్హతలు ఏమిటో.. వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకున్నారో లేదో కూడా తెలియదు.
కానీ ఇప్పుడు మా ప్రయత్నం ఫలించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తనకు సర్టిఫికెట్ అందిం చాక, జగన్ రెడ్డి దాన్ని పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి, తన ప్యాలెస్ లు, కార్యాలయాల్లో, ఇంకా గొప్పగా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలని సూచిస్తున్నాం. అప్పుడే దేశంలోనే అత్యధిక కాలం బెయిల్ పై జీవిస్తున్న వ్యక్తిగా జగన్ రెడ్డి సాధించిన ఈ ఘనత ప్రపమంచమంతా తెలుస్తుంది. నేటివరకు నేను ఏ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోటో దిగిన సందర్భం లేదు.
కానీ జగన్ రెడ్డికి ఇండియా బుక్ రికార్డ్స్ వారు సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్న సందర్భంలో మాత్రం జగన్ రెడ్డి పక్కన నేను కూడా ఉండి ఫోటో దిగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారికి సర్టిఫికెట్ దక్కడంలో నాపాత్ర కూడా ఉంది కనుక, ఆయనే స్వయంగా నన్ను తాడేపల్లి ప్యాలెస్ కు ఆహ్వానించి, అటువంటి అవకాశం కల్పిస్తార ని భావిస్తున్నాను. మరుసటి రోజు ఆ ఫోటోతో కూడిన వార్త కచ్చితంగా సాక్షి దినపత్రిక లో బ్యానర్ ఐటమ్ గా మారి ప్రచురింపబడాలన్న కోరిక కూడా నాకు ఉంది.
జగన్ రెడ్డి సాధించిన ఘనత ఇదైతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్ లు సాధించిన పురస్కారాలు…. సర్టిఫికెట్లు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలి.
1. గతంలో చంద్రబాబునాయుడిని ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా గుర్తించారు.
2. టైమ్స్ ఏషియా గ్రూప్ వారు సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రశంసించారు.
3. వరల్డ్ ఎకనమిక్ ఫోరం తన డ్రీమ్ కేబినెట్లో చంద్రబాబుకి అవకాశం కల్పించింది.
4. లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ పొందారు. ఇలా చంద్రబాబు, లోకేశ్ లు ప్రపంచవ్యాప్తంగా అనేక ఘనతలు సాధిస్తే, అటువంటివి జగన్ రెడ్డికి ఏమీ లేకపోవడం వలన కనీసం ఈ బెయిల్ ఘనకార్యాన్ని అయినా, ఒక సర్టిఫికెట్ రూపంలో వారికి దక్కేలా చేయాలని మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దరఖాస్తు చేయడం జరిగింది.
పదేళ్ల బెయిల్ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా జగన్ రెడ్డిని అభినందిస్తూ అసెంబ్లీ, మండలిలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలి
జగన్ రెడ్డి తన బెయిల్ జీవితాన్ని 10ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో శాసన సభలో, మండలిలో ఆయన్ని అభినందిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ పక్షాన మేం కోరుకుంటున్నాం. మేము చేయుచున్న ఈప్రతిపాదనకు వైసీపీ వారు కూడా స్వాగతించి మద్ధతిస్తారని ఆశిస్తున్నాం. నిజంగా ఆ పనిచేస్తే నేడు శాసనసభ, మండలి సమావేశాలు బాయ్ కాట్ చేసిన టీడీపీ సభ్యులు కూడా ఉభయ సభలకు హాజరై ముఖ్యమంత్రిని అభినందించి, ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింప చేయడానికి సహకరిస్తారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉభయసభలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అభినందించాలని కోరుతున్నాం.
స్సీకర్ తమ్మినేని ఇప్పటికైనా మేం యూజ్ లెస్ ఫెలోస్ కామని గుర్తించాలి
మమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇప్పటికైనా మా మంచితనం గుర్తించాలి. ఏ వైసీపీ నేత, కార్యకర్త చేయని గొప్ప ఆలోచన మా పార్టీ తరుపున మేం చేశామని ఇప్పటికైనా స్పీకర్ తెలుసుకోవాలి. మేం చెప్పినట్టు జగన్ రెడ్డి పదేళ్ల బెయిల్ వార్షికోత్సవంపై స్పీకర్ తక్షణమే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడానికి సహకరించాలని కోరుతున్నాం. ఆయన చేతుల మీదుగా ఇంతటి చారిత్రాత్మక తీర్మానం, రాష్ట్రచరిత్రలో మరే వ్యక్తి గతంలో కానీ, భవిష్యత్ లో కానీ దక్కించుకోనటువంటి ఒక అరుదైన తీర్మానాన్ని ఆమోదింపచేయాలని అభిలషి స్తున్నాం.
అత్యంత అధికకాలం కోర్టు బెయిల్ పై ఎలా జీవించవచ్చో జగన్ రెడ్డి ఒక పుస్తకం రాస్తే అది నేరసామ్రాజ్యానికి దిక్సూచిలా ఉంటుంది
జగన్ రెడ్డి తన దశమ బెయిల్ వార్షికోత్సవం సందర్భంగా గత పదేళ్లుగా తాను న్యాయస్థానాలను, ఇతర వ్యవస్థలను ఏ రకంగా ఏమార్చి బెయిల్ పై జీవించగలి గాడో దానికి తాను ఉపయోగించిన కిటుకులేంటో నేరప్రపంచానికి తెలియచేస్తూ కచ్చితంగా ఒక పుస్తకం రాయాలి. ఎందుకంటే మనదేశంలో నేటివరకు మరే నేర స్తుడు కూడా ఇంత చాకచక్యంతో కోర్టుల్ని తప్పించుకుంటూ ఇంతకాలం బెయిల్ పై బయట జీవించలేదు.
జగన్ రెడ్డి సాధించిన ఈ ఘనకార్యం దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తుల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇది జగన్ రెడ్డికి ఎలా సాధ్యమైందని నేర సామ్రాజ్యం మొత్తం ముక్కన వేలేసుకుంటుంది. ఈ ఘనకార్యం సాధించడం వెనక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కావున జగన్ రెడ్డి తన తోటి ఖైదీ మిత్రబృందానికి ఎంతగానో ఉపయోగపడే ఈ పుస్తకం తప్పనిసరిగా రాయాలి.
చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించి, పైశాచిక ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలి
కొన్నివేలకోట్ల అవినీతికి పాల్పడి, అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి పది సంవత్సరాలుగా, కోర్టుల్ని తప్పించుకుంటూ బెయిల్ పై బ్రతుకుతూ, గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక కుంభకోణాలకు పాల్పడి వేలకోట్లు మింగి ప్రజల్ని వేధిస్తూ, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి, తనకు ఏం అర్హత ఉందని నేడు చంద్రబాబునాయుడి లాంటి మచ్చలేని నాయకుడిపై అవినీతి నిందారోపణలు చేసి ప్రపంచానికి నీతి పాఠాలు వల్లెవేస్తున్న జగన్ రెడ్డి ఈ రోజైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
కోర్టుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న తనకు చంద్రబాబు గురించి, అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన తెలుసుకుంటే మంచిది. ఈ రోజైనా ఒక్కసారి ఆయన అద్దం ముందు నిలబడి, ఆయన్ని ఆయన ప్రశ్నించుకుంటే మళ్లీ ఎప్పుడూ భవిష్యత్ లో అవినీతిపై ఇతరులకు పాఠాలు చెప్పే సాహసం చేయరు” అని పట్టాభిరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.