Suryaa.co.in

Andhra Pradesh

కమీషన్ల కోసమే జగన్ రెడ్డి జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకొచ్చాడు

– రిజిస్ట్రేషన్ విధానం స్థానంలో తీసుకొచ్చిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం ఎందుకోసం..ఎవరికోసం?
• 24 ఏళ్లనుంచి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సేవలందిస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ని ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది?
• ఎలాంటి అనుభవం, డేటా రికవరీ సామర్థ్యం లేని క్రిటికల్ రివర్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ సంస్థకు రిజిస్ట్రేషన్ల బాధ్యత అప్పగించడం ప్రజల ఆస్తులతో చెలగాటమాడటం కాదా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్

ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం లోపభూయిష్టంగా, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టుగా ఉందని, కష్టపడి ఆస్తులు సంపాదించు కున్న సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా పాలకుల ఆలోచనలు, విధానాలు ఉండటం బాధాకరమని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

వైసీపీప్రభుత్వ అనాలోచిత విధానాల్లో భాగమే జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం
“ భారతదేశంలో ఏప్రభుత్వం అనుసరించని అనాలోచిత విధానాలు వైసీపీప్రభుత్వం అనుసరిస్తోంది. గత 24 సంవత్సరాల నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సాంకేతిక అంశాలపై సమర్థవంతంగా పనిచేస్తోంది. ఎక్కడా, ఏ ఇబ్బం ది లేకుండా, ఇన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది రిజిస్ట్రేషన్లు జరిగేలా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సమర్థవంతంగా కార్యకలాపాలు నిర్వహించింది.

అలాంటి సంస్థను పక్కనపెట్టి, ఏపీ ప్రభుత్వం క్రిటికల్ రివర్ ఇన్ఫర్మేషన్ అనే ప్రైవేట్ సంస్థకు రిజిస్ట్రేషన్ల తంతుని అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి అనుభవం లేని ప్రైవేట్ సంస్థకు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు అప్పగిస్తే, రికవరీ యాక్ట్ కింద సదరు సంస్థ డేటా రికవరీ చేసే అవకాశం ఉందా? దీనిపై ప్రభుత్వం ఎలాంటి పద్ధతిని అనురించబోతోందో స్పష్టం చేయాలి. జిరాక్స్ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానంలో కార్డ్ ప్రైమ్ మాడ్యూల్ – 2 అనే పద్ధతి పెట్టారు.

ఆన్ లైన్లో ఇరువర్గాలు ఫలానా ప్రాపర్టీని తాము రిజిస్టర్ చేసుకుంటున్నట్టు దరఖాస్తు చేయగానే, ఇంత రుసుము కట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటున్నారు. గతంలో రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయ దరఖాస్తులపై సంబంధిత కార్యాలయ రిజిస్ట్రార్ కూలంకషంగా పరిశీలించి, ఆస్తులు.. భూముల వివరాలను నిశితంగా గమనించి, ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవన్న తరువాతే రిజిస్ట్రేషన్ కు అనుమతించే వారు.

ఒక్కోసారి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కు ముందు క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా జరిగేది. అలానే క్రయ, విక్రయ దారుల ఆధార్ కార్డులు, వేలిముద్రలు, ఫోటోలతో కూడిన పూర్తి సమాచారం సేకరించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.

ఎలాంటి ఆధారాలతో పనిలేకుండా, ఆస్తులు..భూముల కొనుగోలు, అమ్మకందారుల ప్రత్యక్ష ప్రమేయంతో సంబంధం లేదన్నట్టు ప్రాపర్టీపేరు చెప్పి, ఆన్ లైన్లో నిర్ణీత రుసుముకడితే రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. వైసీపీప్రభుత్వం ఇప్పటికే ఈ విధానా న్ని ద్రాక్షారామంలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలుచేస్తోంది. తరువాత విజయవాడలో అమలుచేసి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసే దిశగా ఆలోచిస్తోంది.

కమీషన్ల కోసమే జగన్ రెడ్డి జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకొచ్చాడు
రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో తలెత్తే సున్నితమైన వివాదాలు..సమస్యల గురించి తెలిసి కూడా అధికారులు ఇలాంటి నిర్ణయాలను ఎలా సమర్థిస్తున్నారో తెలియడంలేదు. ప్రభుత్వం చెప్పినవెంటనే గుడ్డిగా ముందుకెళితే అంతిమంగా ప్రజలే ఇబ్బందిపడతార నే ఆలోచన అధికారయంత్రాంగం చేయకపోవడం విచారకరం. రిజిస్ట్రేషన్లను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం అనేది కేవలం తన కమీషన్ల కోసం జగన్ రెడ్డి ఏకపక్షంగా తీసు కున్న నిర్ణయమనే చెప్పాలి.

జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేక పోవడంతో, రిజిస్ట్రేషన్ సమయంలో డబ్బులు చెల్లించేందుకు వెనుకాడుతున్నారు. అలానే రిజిస్ట్రేషన్ తర్వాత లావాదేవీల్లో జరిగే తప్పులను సరిదిద్దుకునే అవకాశం లేదు. దాంతో కోర్టు వివాదాలు కూడా పరిష్కారం కావు. రిజిస్ట్రేషన్ల విధానంలో ఓటీపీ ఆధారిత వ్యవహారం ప్రజల్ని మోసగించేలా ఉంది. ప్రైమ్ కార్డ్ పేరుతో హడావుడి చేస్తున్న జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ప్రజల ఆస్తులు, వారి జీవితాలతో చెలగాట మాడేలా వ్యవహరిస్తోందని చెప్పకతప్పదు.

ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా జిరాక్స్ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానంపై పునరాలోచన చేయాలని సూచిస్తున్నాం. రిజిస్ట్రే షన్ చట్టంలోని సెక్షన్లు 23, 24, 28 లను తుంగలో తొక్కేలా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానం ఉంది. జిరాక్స్ ఆధారిత రిజిస్ట్రేషన్ విధానంలో ప్రజలకు చెందిన విలువైన పత్రాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ఎంతమాత్రం సరైంది కాదు. కార్డ్ ప్రైమ్ మాడ్యూల్ -2 విధానం ఎవిడెన్స్ యాక్ట్ ను నిర్వీర్యం చేసేలా ఉంది.

వివాదా లు, తనఖాలు, బ్యాంకులకు సమర్పించే ఆస్తుల పత్రాలన్నీ నేషనల్ పాలసీకి విరుద్ధం గా ఉన్నాయి. అలానే స్టాంప్ రైటర్లు (డాక్యుమెంట్ రైటర్ల) జీవోనపాధికి పెద్ద విఘాతం కలించేలా ప్రభుత్వ నిర్ణయం ఉంది. కాబట్టి జగన్ రెడ్డి తక్షణమే ఈ జిరాక్స్ రిజిస్ట్రేషన్ ఆధారిత విధానాన్ని పక్కన పెట్టి, పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి.” అని నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE