Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి…మీ అహంకారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

-దేశంలోని 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులిస్తే మన రాష్ట్రంలో ఎందుకివ్వరు?
-ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ , మంత్రులు ఇల్లు దాటి బయటకు రారు, కానీ విద్యార్థులు పాఠశాలలకు రావాలా?
– మంతెన సత్యనారాయణరాజు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన అనాలోచిత, అహంకారపూరిత ధోరణితో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.దేశంలో 12కు పైగా రాష్ట్రాల్లో స్కూళ్ల సెలవులు ప్రకటిస్తే మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి మూర్ఖoగా వ్యహరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్లు నడపడం దుర్మార్గం.

రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో వాక్సి నేషన్ పూర్తి కాలేదు. వచ్చే 3 వారాల్లో కరోన విజృంభన అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పాఠశాలలు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ , మంత్రులు ఇల్లు దాటి బయటకు రారు, కానీ విద్యార్థులు కొన్ని కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ఆటోలు, బస్సులు మారుకుంటూ పాఠశాలలకు రావాలా? మీ అహంకారంతో విద్యార్థుల ప్రాణాలు తీస్తారా?

వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, అసమర్థత వల్ల కరోనా మొదటి వేవ్ లో వేలాది ప్రాణాలు బలితీసుకున్నారు.ఇప్పుడు ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు? రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలోనూ కరోన రోగులకు సరిపడా మందులు, బెడ్లు, ఆక్సిజన్ లేదు. మరో వైపు కరోనా బారినపడ్డ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. మరి విద్యార్థులకు కరోనా సోకితే ఎక్కడ చికిత్స తీసుకోవాలి? దేశంలోని 12 రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులిస్తే మన రాష్ట్రంలో సెలవులివ్వడానికి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి వచ్చిన ఇబ్బందేoటి ? పాఠశాలలకు సెలవులిస్తే విద్యాశాఖ మంత్రి సొంత విద్యా సంస్థలకు నష్టం వస్తుందని సెలవులివ్వడం లేదా? మీకు విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా? మీ విద్యా వ్యాపారాలు ముఖ్యమా ? ప్రజలకు సమాధానం చెప్పాలి.ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎందుకంత అహంకారం? విద్యార్థుల ప్రాణాలంటే లెక్క లేదా? వైసీపీ ప్రభుత్వం ఇకనైనా అహం వీడితక్షణమే స్కూళ్లకు సెలవులు ప్రకటించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలి.

LEAVE A RESPONSE