-ఏడాదిలో 24 వేల ఇళ్లు కడతామంటున్నారు, గత 3 ఏళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారు ?
– సాక్షి పత్రికకు దోచిపెట్టడానికీ, వైసీపీ నేతల జేబులు నింపడానికే సెంటు పట్టా పధకం
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రచార్బాటం తప్ప చిత్తశుద్ది లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఈ ఏడాదిలో 24 వేల ఇళ్లు పూర్తిచేస్తామని మంత్రి జోగి రమేష్ ప్రగల్బాలు పలుకుతున్నారు.
కానీ గత 3 ఏళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలి ? వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 1.5 శాతం ఇళ్లు మాత్రమే నిర్మించారు. వాటిలో కూడా కనీసం మౌళిక సదుపాయాలు కల్పించలేదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రచార్బాటం తప్ప చిత్తశుద్ది లేదు. నేటి రోజుల్లో ఇళ్లు కట్టాలంటే రూ. 5 లక్షలవుతుంది, కానీ కేవలం కేంద్రం ఇచ్చే రూ. 1.80 లక్షలతో నిర్మాణం ఎలా సాధ్యం ? ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా.. ఇళ్లు కట్టుకోకపోతే పట్టా రద్దు చేస్తామని లబ్దిదారుల్ని బెదిరించటం ఎంతవరకు సమంజసం ?
మొదట కన్వెన్సన్ పట్టాలన్నారు, కానీ కేంద్రం ఒప్పుకోకపోయేసరికి డీకేడీ పట్టాలంటున్నారు. ఇళ్లు అమ్ముకోవచ్చని అంటున్నారు, ఇళ్లు కట్టుకునేందుకు కాపురం చేయడానికా, లేక అమ్ముకోవడానికా ? జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాల కోసం రూ. 32 వేల కోట్లు కావాలని కేంద్రానికి లేఖ రాసి చేయి దులుపుకున్నారు. ఇప్పటివరకు ఆ కాలనీల్లో ఏం సౌకర్యాలు కల్పించారో చెప్పాలి? పేదలకు చెరువులు, ఆవ భూములు, శ్మశానాల్లో ఇళ్లు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం 3 కోట్ల 10 లక్షల టన్నులు ఇసుక అవసరం అవుతుందని, అదంతా సరఫరా చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కనీసం 5 లక్షల టన్నుల ఇసుక కూడా సరఫరా చేయలేదు. 70 లక్షల టన్నులు సిమెంట్ అవసరం అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని టన్నుల సిమెంట్ సరఫరా చేశారు ? దీనిలో కూడా దానిలో కూడా భారతి సిమెంట్ ను అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ. 7 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. సెంటు పట్టా పధకం సాక్షి పత్రికకు ప్రకటన రూపంలో దోచిపెట్టడానికి, వైసీపీ నేతల జేబులు నింపడానికి తప్ప ప్రయోజలకు ఉపయోగం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రచారాలతో కాలం గడపటం తప్ప ఒక్క ఇళ్లు కూడా కట్టలేరు .
టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణం కోసం 3 సెంట్లు స్ధలం ఇచ్చి. రూ. 1.50 లక్షలు డబ్బులిచ్చాం. కానీ జగన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజల్ని మబ్యపెడుతున్నారు. టీడీపీ హయాంలో 3 లక్షల ఇళ్లు నిర్మించారని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పారు. చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లు లబ్డిదారులకు ఎందుకివ్వటం లేదు ? చంద్రబాబు కే పేరొస్తుందనే ఇవ్వటం లేదా? కట్టిన ఇళ్లు ఇవ్వకుండా 30 లక్షల ఇళ్లు కడతామని ప్రగల్బాలు సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు, పించన్లు ఇఛ్చే పరిస్థితిలేదు.
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్న వాస్తం చెబితే వైసీపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు. కేటీఆర్ ఏపీకి వస్తే అభివృద్ది చూపిస్తామని మంత్రి రోజా అంటోంది. ఆమె ఏం చూపిస్తుంది? రాష్ట్రంలో ఉన్న గతుకుల రోడ్లు చూపిస్తారా? లేక మద్యలో ఆగిపోయిన ఇళ్లు చూపిస్తారా? మందులు కొరతతో వెక్కిరిస్తున్న ఆస్పత్రులను చూపిస్తారా ? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయ వ్యవస్ధను ఆధర్శంగా తీసుకుంటామని చెప్పారని వైసీపీ నేతలు అంటున్నారు.
మహిళలపై వాలంటీర్లు లైంగిక వేధింపులు, మహిళా వాలంటీర్లపై వైసీపీ నేతల వేధింపులు ప్రతి రోజు పేపర్లలో వస్తున్నాయి. వీటిని చూసి తమిళనాడులో సచివాలయాలు పెడతామని స్ఠాలిన్ అన్నారా? పొరుగు రాష్ట్రాల కంటే ఏపీ పరిస్ధితి అన్నింటిలోనూ దిగజారిపోయింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రయ్యి ఉంటే ఈ పాటికి 30 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేది. జగన్ రెడ్డి చెప్పిన నవరత్నాలన్నీ ఒక్కొక్కటీ రాలిపోతున్నాయి.
ఇళ్ల నిర్మాణం ఆపేశారు. ఈ ఏడాది అమ్మఒడి ఎగ్గొట్టారు. ఎన్నికల నాటికి నవరత్నాలన్నీ గుళక రాళ్లుగా మారిపోతాయి. వైసీపీ ఎమ్మెల్యేలను ఎక్కడిక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ ని కూడా నిలదీస్తారు. 175 సీట్లు గెలవాలని జగన్ అంటున్నారు. కానీ 175 లో 15 సీట్లు కూడా వచ్చే పరిస్ధితి లేదు. ముఖ్యమంత్రి ఇకనైనా పేదలను మోసం చేయటం మాని పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సయ్యద్ రఫీ హితవు పలికారు.