– నారా లోకేష్
రేణిగుంట: జోహో కంపెనీ లో పనిచేస్తున్న నా చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చూడు జగన్ రెడ్డి.ఇక్కడ వంద మంది యువతీ, యువకులు పని చేస్తున్నారు.నీ హయాంలో ఒక్క కంపెనీ వచ్చిందా?ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేసి, ఉద్యోగాలు లేకుండా చేసే జగన్ రెడ్డికి ఉద్యోగం వస్తే యువతీ,
యువకులు పడే ఆనందం గురించి తెలియాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. నా సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతుంది. టిడిపి హయాంలో వచ్చిన కంపెనీల ముందు నేను సెల్ఫీ దిగుతాను. జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీలు తప్ప ఏమైనా ఉంటే సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని కోరుతున్నాను.