Suryaa.co.in

Andhra Pradesh

3,30,500 కోట్ల ప్రజాసంపదను దిగమింగిన ధన పిశాచి జగన్ రెడ్డి

16 నెలల జైలు జీవితం… 38 క్రిమినల్ కేసులు.. 54 డిశ్చార్జ్ పిటిషన్లు…158 స్టేలు…లెక్కకుమిక్కిలి ఐపీసీ సెక్షన్లు…మొన్ననే పూర్తైన పదేళ్ల బెయిల్ కాలం.. ఇదీ జగన్ రెడ్డి సచ్ఛీలత
తన అవినీతి, దోపిడీని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ దుర్మార్గాలను ఎదిరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడన్న అక్కసుతో.. కుట్రలు..కుతంత్రాలతోనే జగన్ రెడ్డి ఏ తప్పూ చేయని చంద్రబాబుని అన్యాయంగా కటకటాల పాలుచేశాడు
ప్రజలారా వాస్తవం తెలుసుకోండి.. జగన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించే ప్రజా నాయకుడిని ఆదరించండి
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించిన టీడీపీ ఈ సందర్భంగా ‘ఆర్థిక ఉగ్రవాది @ ధన పిశాచి’ అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యులు
మాక్ అసెంబ్లీలో జగన్ రెడ్డి అవినీతి, దోపిడీని సుస్పష్టంగా ఆధారాలతో సహా టీడీపీసభ్యులకు, విలేకరులకు వివరించిన టీడీపీ శాసనసభ్యులు, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు

ఉమ్మడి రాష్ట్రానికి క్విడ్ ప్రోకో, షెల్ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి పదాలను… వాటి తీరుతెన్నుల్ని పరిచయం చేసిన వ్యక్తి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డని, వాటి ద్వారా నాడు తండ్రి అధికారంతో వేలకోట్లు కొట్టేసింది చాలక, ఈ నాలుగేళ్ల లో ప్రజల్ని పీడిస్తూ, రాష్ట్రాన్ని లూఠీచేసి లక్షలకోట్లు సంపాదించాడని నిమ్మల రామానాయుడు తెలిపారు. అలాంటి వ్యక్తి ఈ రోజు అవినీతిపై సుభాషితాలు చెప్పడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. రామానాయుడు మాక్ అసెంబ్లీలో వివరించిన అంశాలు.. ఆయన మాటల్లోనే…

“ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ చరిత్ర మొత్తం తెరిచిన పుస్తకం. అలాంటి వ్యక్తిపై జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 హౌస్ కమిటీలు వేసి ఏమీ తేల్చలేకపోయారు. వాటన్నింటి విచారణలో కడిగిన ముత్యంలా చంద్రబాబు ఆనాడు బయటపడ్డారు. తరువాత జగన్ రెడ్డి తల్లిగారైన శ్రీమతి విజయ మ్మ చంద్రబాబునాయుడు అవినీతి చేశాడని న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి, ఆధారా లు, సాక్ష్యాలు లేకపోవడంతో చివరకు తన పిటిషన్లు తానే వెనక్కు తీసుకుంది. అదీ చంద్రబాబునాయుడి నీతి..నిజాయితీ…నిబద్ధతలకు నిదర్శనాలు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి వ్యక్తిత్వం అలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవినీతి, దోపిడీ ఎలా మొదలై.. ఎలా కొనసాగి.. నేడు ఎలా పతాకస్థాయికి చేరిందో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మీ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జగన్ రెడ్డి, అతని కుటుంబం అపరకుబేరులుగా ఎదిగిన తీరు… ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి ధనపిశాచిగా మారిన వైనం
2000 సంవత్సరంలో జగన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి మొత్తంగా వారి కుటుం బం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారనేది వాస్తవం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంజారా హిల్స్ రోడ్ నెం-2 లో తమకున్న 2075గజాల చిన్నఇల్లు అమ్ముకోవడానికి అనుమతివ్వాలని 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వాన్ని కోరారు. అప్పుడు అంతదీనస్థితిలో ఉన్న ఆకుటుంబం 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నేటివరకు రూ3.30లక్షలకోట్ల ఆస్తులు సంపాదించింది.

అంతపెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించడం వెనకున్న ప్రధాన కారణం రాజశేఖర్ రెడ్డి అధికారం..దానికి తోడైన జగన్ రెడ్డి అవినీతి దాహమే. 2004 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి ఒకకోటి 65లక్షలని స్వయంగా జగన్ చెప్పడం జరిగింది. అలానే అదే సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి తన ఆస్తులు రూ.1.74కోట్లని ఆదాయపు పన్ను శాఖకు తెలియచేశారు. 2000 సంవత్సరంలో ఇల్లు అమ్ముకుంటామన్న కుటుంబం.. 2004 నుంచి నేటివరకు రూ.3.30 లక్షలకోట్ల ఆస్తులు సంపాదించడంలోని లోగుట్టు ప్రజలందరికీ తెలుసు.

వై.ఎస్.కుటుంబం 2004-2009 మధ్యన లక్షా3వేలకోట్లు అర్జించినట్లు తేలింది. రూ.43 వేలకోట్ల ఆస్తుల్ని సీబీఐ ఛార్జ్ షీట్ల ద్వారా ఈడీ నిగ్గుతేల్చింది. ఇంకా విచారణలో తేల్చాల్సింది రూ.60,000కోట్లుగా ఉంది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్న టెలికమ్ కంపెనీ ట్యాగ్ లైన్ జగన్ రెడ్డికి బాగా సూటైంది. తండ్రి అధికారంతో లక్షా 03 వేలకోట్లు లూఠీచేసిన జగన్ రెడ్డి, 2019-23 మధ్యన కేవలం నాలుగేళ్లలోనే 2లక్షల 27,500కోట్లు కాజేశాడు.

మొత్తం కలిపి రూ.3లక్షల30వేల500కోట్ల ప్రజాసంపదను జగన్ దిగమింగాడు. 2004-09లో మార్కెట్ విలువ ప్రకారం లెక్కలేసిన జగన్ కుటుంబం ఆస్తి లక్షా03వేలకోట్లు… నేడు లక్షలకోట్లతో సమానం. తన బతుకంతా అవినీతిలో.. ప్రజాసంపద లూఠీ మయంగా మార్చుకున్న జగన్ రెడ్డి.. ఏనాడూ ఏ తప్పుచేయని చంద్రబాబుని అవినీతిపరుడు అంటుంటే ప్రజలు ఏమిటీ వైపరీత్యమని నోళ్లు వెళ్లబెడుతున్నారు.
అవినీతిలోనే కాదు… నేరచరిత్రలోనూ జగన్ దే అగ్రస్థానం..

తనపై 38 క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా జగన్ రెడ్డే 2019లో వేసిన తన ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు. ఆ కేసులు నిమిత్తం 54 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. సదరు కేసుల్లో ఇప్పటివరకు న్యాయస్థానాల నుంచి ఆయన తెచ్చుకున్న స్టే లు 158. ఇక జగన్ రెడ్డిపై నమోదైన ఐపీసీ సెక్షన్ల జాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుం ది. ఇండియన్ పీనల్ కోడ్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో… అన్నీ ఆయనపై ఉన్నాయి. మొన్ననే ఆయన తన పార్టీ శ్రేణులతో కలిసి పదవ బెయిల్ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. న్యాయస్థానాల కళ్లుగప్పి పదేళ్లుగా బెయిల్ పై ఉంటున్న వ్యక్తి జగన్ రెడ్డి దేశనేరచరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడని చెప్పక తప్పదు.

జగన్ రెడ్డి నేరచరిత్ర.. క్రిమినల్ మనస్తత్వంపై ప్రముఖులు.. న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు
“ఇంత తక్కువ సమయంలో రూ.43వేలకోట్లు ఎలా సంపాదించారు” : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అల్తాఫ్.
“జగన్ లాంటి ఆర్థిక నేరస్తులను శిక్షించకపోతే మొత్తం సమాజమే నష్టపోతుంది. టెర్రరిస్టుల కంటే ఆర్థిక ఉగ్రవాదులు దేశానికి అత్యంత ప్రమాదకరం” : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సదాశివమ్
“జగన్ విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బకొట్టారు” : మోహన్ దాస్ పాయ్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్. ఇలా చెప్పుకుంటూపోతే ఈ వ్యాఖ్యలు… అభిప్రాయాలు కూడా చాలానే ఉన్నాయి.

అవినీతి పుట్టలు.. ఛార్జ్ షీట్ల కట్టలు
జగన్ రెడ్డికి చెందిన రూ.43వేలకోట్లు ఈడీ జప్తుచేసినప్పుడు, దానికి సంబంధించి సీబీఐ ఆయనపై 11 ఛార్జ్ షీట్లు నమోదు చేసింది. ఆ ఛార్జ్ షీట్లు అన్నింటిలో జగన్ ఏ1 గా ఉన్నాడు. అవన్నీ పరిశీలిస్తే ఆయన అవినీతి పుట్టలు.. వాటిలో నుంచి బయ టికొచ్చిన వేలకోట్ల కట్టల పాములు కనిపిస్తాయి.
ఛార్జ్ షీట్ –1 లో: (CC 8/2012, 31.03.2012) మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో, హెటిరో అరబిందో సంస్థలకు 250 ఎకరాల కేటాయింపుకు సంబంధించింది. ఆ వ్యవహారంలో జగన్ రెడ్డి సంస్థ అయిన జగతి పబ్లికేషన్స్ లోకి రూ.29.50కోట్లు వచ్చాయి.
ఛార్జ్ షీట్ -2 లో : (CC 9/2012, 23.04.2012) పోలేపల్లి సెజ్ లో అరబిందో, హెటిరో కంపెనీలకు 60 ఎకరాలు కేటాయించడం. దానివల్ల జగన్ కంపెనీలకు రూ. 30.66 కోట్ల పెట్టుబడి రావడం.
ఛార్జ్ షీట్ – 3 లో : (CC10/2012, 07.05.2012) విశాఖలో రాంకీ సంస్థకు అక్రమంగా భూముల కేటాయించడం. గ్రీన్ బెల్ట్ కుదింపుతో రాంకీకి రూ.74.133కోట్ల మేర లబ్ధి చేకూర్చడం. జగతి పబ్లికేషన్స్ లోకి 99.9కోట్ల పెట్టుబడులు రావడం.
ఛార్జ్ షీట్ – 4 లో : (CC14/2012, 13.08.2012) వాన్ పిక్ సంస్థకు 4వేల ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా 28వేల ఎకరాలు కేటాయించ డంపై. నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా జగన్ సంస్థల్లోకి భారీమొత్తంలో 854.40 కోట్ల పెట్టుబడులురావడం. అసలైన క్విడ్ ప్రోకో కు సిసలైన నిదర్శనం ఈ వ్యవహారమే.
ఛార్జ్ షీట్ – 5 లో (దాల్మియా సిమెంట్స్, 08.04.2013) కడపజిల్లాలో దాల్మియా సిమెంట్స్ సంస్థకు 1005 ఎకరాల సున్నపురాయి గనుల కేటాయింపు. దానికి ప్రతిగా జగన్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం. రూ.10విలువైన షేరుని రూ.1440కి దాల్మియా సంస్థ కొనుగోలు చేసింది. తద్వారా ఆ సంస్థ జగన్ కంపెనీల్లో రూ.205కోట్ల పెట్టుబడులు అక్రమంగా పెట్టింది.
ఛార్జ్ షీట్ – 6 లో : (ఇండియా సిమెంట్స్, 10.09.2013) రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్ సంస్థకు 10లక్షల గ్యాలన్ల అక్రమ నీటి కేటాయిం పులు. దానికి ఫలితంగా ఇండియాసిమెంట్స్ జగన్ సంస్థ అయిన భారతి సిమెంట్స్ షేర్లు కొనుగోలు చేయడం.
ఛార్జ్ షీట్ – 7 లో : (భారతి సిమెంట్స్, 10.09.2013) కడపజిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో 2037 ఎకరాల సున్నపురాయి గనుల్ని భారతిసిమెంట్స్ సంస్థ కు కేటాయించడం.
ఛార్జ్ షీట్ – 8 లో: (భారతి సిమెంట్స్, 10.09.2013) బంజారాహిల్స్ లోని పయనీర్ హోటల్స్ నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం. అనంతపురం జిల్లాలో పెన్నాసిమెంట్స్ కు 231 ఎకరాలు కేటాయించడం, కర్నూలులో 821 ఎకరాల మైనింగ్ లీజుల అనుమతులు అక్రమంగా పునరుద్ధరించడం. ఈ వ్యవహారంలో భారతి సిమెంట్స్ ద్వారా జగన్ కంపెనీల్లోకి రూ.68కోట్ల పెట్టుబడులు రావడం.
ఛార్జ్ షీట్ – 9 లో : (ఇందూ గ్రూప్, 17.09.2013) శంషాబాద్ లో 250 ఎకరాల విలువైన భూమిని ఇందూటెక్ జోన్ సంస్థకు కేటాయించడం. తద్వారా జగన్ కంపెనీల కు రూ.15కోట్ల నిధులు రావడం జరిగిందని.
ఛార్జ్ షీట్ – 10 లో : (ఇందూ గ్రూప్, 17.09.2013) ఇందూ గ్రూప్ కు హౌసింగ్ స్కీములు కేటాయించి, తమ కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడం. తద్వారా జగన్ కంపెనీల్లోకి రూ.70కోట్ల పెట్టుబడి రావడంపై.
ఛార్జ్ షీట్ – 11 లో : (ఇందూ గ్రూప్ 09.09.2014) అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల భూమి నాలెడ్జ్ హబ్ కు అక్రమంగా కేటాయించడం. ఆ భూమిని తాకట్టు పెట్టి ఇందూసంస్థ బ్యాంకుల్లో రూ.790కోట్ల రుణం తీసుకోవడం. ప్రతిఫలంగా జగన్ కంపెనీ కి రూ.70కోట్ల పెట్టుబడి అక్రమమార్గంలో రావడం.
ఈ విధంగా జగన్ రెడ్డిని ఏ1 గా చేర్చి, సీబీఐ వేసిన 11 ఛార్జ్ షీట్లలో అతనిఅవినీతి సామ్రాజ్య విస్తరణకు సంబంధించిన వాస్తవాలు ఆధారాలతో సహా వివరంగా చెప్పడం జరిగింది.

తనకు పత్రిక లేదు..టీవీలు లేవంటున్న జగన్ రెడ్డి సాక్షి పత్రిక పుట్టుకపై ఏం సమాధానం చెబుతాడు?
సాక్షి దినపత్రిక జగన్ రెడ్డి క్విడ్ ప్రోకో నుంచే పుట్టింది. 2006 నవంబర్ 14న నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సంపాదించిన ఆస్తి ఈ సాక్షి దినపత్రిక. తొలుత సాక్షి దినపత్రికలో జగన్ పెట్టిన పెట్టుబడి రూ.8లక్షలు. వాస్తవంగా ఆ పత్రిక మొత్తం ఆస్తుల విలువ రూ.4వేలకోట్లు. రూ.10లు విలువచేసే సాక్షి పత్రిక షేర్లను రూ.360కు అమ్మడమే ఆస్తుల విలువ పెరగడం వెనకున్న రహస్యం.

సెజ్ లు…గనులు… భూములు.. కాంట్రాక్టులు తమకు నచ్చినవారికి కట్టబెట్టి, తద్వారా పొందిన ప్రతిఫలం జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక) లోకి పెట్టుబడుల రూపంలో వచ్చింది. ఆ విధంగా రూ.1246కోట్లు జగతి పబ్లికేషన్స్ లోకి వచ్చాయి. సాక్షి దినపత్రికలోకి అక్రమంగా నిధులు వచ్చాయని ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి మారిషస్ నుంచి నిధులు వచ్చాయని సీబీఐ చెప్పడం జరిగింది.

భారతి సిమెంట్స్ బాగోతం
2006 మే లో భారతి సిమెంట్స్ సంస్థ ఛైర్మన్, ఎండీగా జగన్ రెడ్డి ఉన్నాడు. రూపాయి కూడా దానిలో తన పెట్టుబడి లేకుండానే ఆయన ఆ సంస్థకు యజమానిగా కొనసాగ డం విశేషం. దాల్మియా సిమెంట్స్..ఇండియా సిమెంట్స్…పెన్నా సిమెంట్స్ సంస్థలు భారతి సిమెంట్స్ లో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టాయి. (సిమెంట్ కంపెనీలు మరో సిమెంట్ కంపెనీలోపెట్టుబడులు పెట్టడం దేశంలో ఇక్కడే చూస్తున్నాం) ఆ విధంగా ఇతర మార్గాల్లో కూడా భారతి సిమెంట్స్ కు పెట్టుబడులు వచ్చాయి. రూ.10ల విలువ చేసే భారతి సిమెంట్స్ షేర్లను జగన్ రెడ్డి తన అధికారబలంతో రూ.1440కు (ఒక్కోషేర్) విక్రయించడం కొసమెరుపు.

గాలి జనార్థన్ రెడ్డితో కలిసి జగన్ రెడ్డి సాగించిన దోపిడీ
ఓబుళాపురం గనుల తవ్వకంలో గాలి జనార్థన్ రెడ్డి పాత్రధారి అయితే… తెరవెనుక సూత్రధారి జగన్ రెడ్డి. ఇద్దరు సొంతఅన్నదమ్ముల కంటే ఆప్యాయంగా మెలిగి, లక్షల కోట్ల ఖనిజ సంపదను కొల్లగొట్టారు. జగన్ రెడ్డి అవినీతికి ఈ దోపిడీ అతిపెద్ద పరాకాష్ట అనే చెప్పాలి. 2006-2009 మధ్యన రూ.5,194కోట్ల విలువైన ఇనుపఖనిజాన్ని గాలి జనార్థన్ రెడ్డితో కలిసి జగన్ దోపిడీ చేయడం జరిగింది. ఈ దోపిడీలో ఎవరివాటా ఎంతనేది కూడా సీబీఐ నిగ్గుతేల్చింది.

యెడుగూరి సందింటి వారి ‘సండూర్ పవర్’ బాగోతం
సండూర్ పవర్ సంస్థలో 2001 జూన్ 16న జగన్ రెడ్డి డైరెక్టర్ గా చేరాడు. 2004 లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సండూర్ పవర్ దశ తిరిగింది. 2006లో నిమ్మగడ్డ కంపెనీల నుంచి సండూర్ పవర్ లోకి రూ.140కోట్లు మళ్లించబడ్డాయి. మారిషస్ నుంచి 2 ఐ క్యాపిటల్ ఫ్యూరి ఎమర్జింగ్ సంస్థ నుంచి రూ.124కోట్లు సండూర్ పవర్ లోకి వచ్చాయి. అలానే 2007లో రూ.553కోట్లు పెట్టుబడి వచ్చింది. ఆ భారీ పెట్టుబడి పెట్టిన 3 కంపెనీలు (ZM INFRA, NELCOST, SIGMA సంస్థలు) తరువాత జగన్ రెడ్డికి చెందిన కీలాన్ కంపెనీలో విలీనం అయ్యాయి. తనకు కావాల్సిన కార్యం పూర్తయ్యాక జగన్ రెడ్డి తాను సృష్టించిన షెల్ కంపెనీలను తనలోనే ఐక్యం చేసుకున్నాడన్న మాట. ఇతని అవినీతి తెలివితేటలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ ముసుగులో జగన్ రెడ్డి అవినీతి లీలలు
లేపాక్షి నాలెడ్జ్ హబ్ 2008లో ప్రారంభమైంది. 22.12.2008న నాటి రాష్ట్రప్రభుత్వంతో (రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో) ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 8,844ఎకరాలు లేపాక్షి సంస్థకు నాటి ప్రభుత్వం కేటాయించింది. అందుకు కృతజ్ఞతగా మిక్కిలి సంతోషంతో లబ్దిపొందిన ఇందూసంస్థ జగతి పబ్లికేషన్ సంస్థలో రూ.70కోట్ల పెట్టుబడి పెట్టింది. (సీబీఐ జగన్ రెడ్డిపై వేసిన ఛార్జ్ షీట్ -11లో పూర్తి సమాచారం ఉంది) లేపాక్షి సంస్థకు నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 8,844ఎకరాలు కేటాయిస్తే అందులో 4,397 ఎకరాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.790కోట్ల రుణం తీసుకుంది.
ఏ ఉద్దేశంతో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారో ఆ పనిచేయకపోగా, భూముల్ని తాకట్టుపెట్టేసి తీసుకున్న రుణాన్ని వారి స్వప్రయోజ నాలకోసం వినియోగించుకున్నారు. రూ.790 కోట్ల రుణంలో రూ.562 కోట్లు వారి అవసరాలకోసం దుర్వినియోగం చేశారు.

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరుతో రైతుల భూములు స్వాహా
జగన్ రెడ్డి….ఆయన సతీమణి భారతిరెడ్డి.. తల్లి విజయమ్మలు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థలో డైరెక్టర్లు. ఈ సంస్థను 31.03.1999న ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.3,257కోట్లు. ఈ మొత్తంలో జగన్ రెడ్డి కుటుంబం పెట్టిన పెట్టుబడి కేవలం రూ24 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాచేపల్లి మండలంలో రైతు ల్ని బెదిరించి సరస్వతి సంస్థకోసం భూములు లాక్కున్నారు. కేవలం కోటిరూపాయల ఇన్వెస్ట్ మెంట్ తో ప్రారంభమైన సరస్వతి సంస్థ పేరుతో 2002లో కారు కొనుగోలు చేయడానికి బ్యాంకులో రూ.5లక్షల రుణం తీసుకున్నారు.

అలాంటి సంస్థ ఎవరి భాగస్వామ్యం లేకుండానే 2010 నాటికి రూ.3,257కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ పెడతా మనే స్థాయికి వచ్చింది. రైతుల్ని బెదిరించి ఆఖరికి గ్రామాలపై బాంబులేసి, ఇళ్లు నేల మట్టం చేసి తమకు నచ్చిన ధర చెల్లించి, రైతుల భూములు లాక్కున్నారు. ఆ భూములతో పాటు కాజేసిన 1500ఎకరాల ప్రభుత్వభూమి తమస్వాధీనంలో ఉన్నా లేదని హైకోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారు. ఆనాడే హైకోర్టుకు తప్పుడు సమాచా రమిచ్చిన వ్యక్తి నేడు ప్రజలకు నిజాలు చెబుతాడా?

2019-23 మధ్యన జగన్ రెడ్డి కుటుంబం అడ్డగోలుగా సాగించిన అవినీతి..దోపిడీ
తండ్రి అధికారంతో వేలకోట్లుకొట్టేసిన అవినీతి అనకొండ.. తానే అధికారంలోకి వస్తే ఊరుకుంటుందా? తన అవినీతికోరల్ని రాష్ట్రంపై చాపి, ప్రజల ప్రభుత్వఆస్తుల్ని అప్పనంగా మింగేసింది. దోపిడీకోరల్ని రాష్ట్రంపై చాపి, ప్రజల ప్రభుత్వఆస్తుల్ని అప్పనంగా మింగేసింది. ప్రజల ఆస్తులు..ప్రభుత్వ భూములు… ప్రకృతి వనరులు ఇలా కనిపించిన దానినల్లా గుటకేసింది.

ల్యాండ్ (భూముల) మాఫియాతో రూ.40వేలకోట్లు… లిక్కర్ (మద్యం) మాఫియాతో రూ.41వేలకోట్లు… మైనింగ్ మాఫియాతో రూ. 35వేలకోట్లు.. ఇసుక దోపిడీతో రూ. 40వేలకోట్లు…. ఎర్రచందనం మాఫియాతో రూ.25వేలకోట్లు.. లేపాక్షి, కూకట్ పల్లి భూ కుంభకోణంతో రూ.15వేలకోట్లు …విద్యుత్ కొనుగోళ్ల కమీషన్లతో రూ.12వేలకోట్లు … సిలికా, బీచ్ శాండ్ దోపిడీతో రూ.10వేలకోట్లు… భారతి సిమెంట్స్ చేసిన దోపిడీ రూ.12వేలకోట్లు… సాగునీటి ప్రాజెక్టుల కమీషన్ల రూపంలో రూ.2,500కోట్లు… పోర్టుల్లో అవినీతి ద్వారా రూ.4వేలకోట్లు… ప్రభుత్వంద్వారా జరిగిన కొనుగోళ్లలో (అంబు లెన్సులు.. చెత్తసేకరణ…బియ్యం వాహనాలు… మందుల కొనుగోళ్లు) రూ.10 వేల కోట్లు..గంజాయి, డ్రగ్స్ వాటాల ద్వారా రూ.10వేలకోట్లు… గుజరాత్ సంస్థ అమూల్ ద్వారా కొట్టేసిన కమీషన్ రూ.1000కోట్లు. ఈ విధంగా నాలుగేళ్లలో జగన్ రెడ్డికి వచ్చిన సొమ్ము రూ.2,27,500కోట్లు. ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని ఉప యోగించి జగన్ సాగించిన దోపిడీ మొత్తం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.

రూ.40వేలకోట్ల జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో రాష్ట్రవ్యాప్తంగా మాయమైన ఇసుక
ఏడాదికి కేవలం 2కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు మాత్రమే అనుమతులు ఉంటే, అధికారికంగా 110, అనధికారికంగా 500కు పైగా రీచ్ లలో వైసీపీనేతలు, జగన్ రెడ్డి తాబేదార్లు భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకతవ్వకాలు జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుకరీచ్ లనుంచి దాదాపు 40కోట్ల టన్నులకు పైగా ఇసుకను అమ్మేసి రూ.40వేలకోట్లు జగన్ రెడ్డి దోచేశాడు. పేదలకడుపుకొట్టి రూ.40వేలకోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి వారి జేగ్యాంగ్ ను ఏం చేయాలో ప్రజలే నిర్ణ యించుకోవాలి.
ఇసుక దోపిడీకోసం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ఒక్కో జోన్ ను తనకు నమ్మిన బంట్లు అయిన ఒక్కొక్కరికి అప్పగించాడు. జోన్ల ఇన్ ఛార్జులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ విధంగా నాలుగేళ్లలో తాను సాగించిన ఇసుక దోపిడీపై జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి.

ప్రజలకు చీకట్లు.. జగన్ కు వేలకోట్లు అంతిమంగా అధోగతిపాలైన రాష్ట్ర విద్యుత్ రంగం
నాలుగేళ్లలో జగన్ రెడ్డి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ట్రూఅప్ ఛార్జీలు.. సర్వీస్ ఛార్జీలు అంటూ వివిధసాకులతో ప్రజల నడ్డివిరుస్తున్నాడు. టీడీపీహాయాంలో రూ.60 వేలు ఉండే ట్రాన్స్ ఫారమ్ ధర నేడు జగన్ రెడ్డి హాయాంలో రూ.లక్షా30వేలు అయ్యిం ది. హైదరాబాద్ లోని హిందుజా సంస్థకు చెందిన 11 ఎకరాల భూమిని కొట్టేసిన జగన్ రెడ్డి అందుకు ప్రతిఫలంగా ఆసంస్థకు రూ.1000కోట్ల విద్యుత్ సంస్థల నిధులు ధారాధత్తం చేశాడు. వ్యవసాయ మోటార్లకు బిగించే స్మార్ట్ మీటర్ విలువ రూ.15వేలు అయితే, జగన్ రెడ్డి తన కమీషన్లకోసం దాని ధరను రూ.36వేలుగా నిర్ణయించాడు. మార్కెట్లో లభించే ధరకాదని, కేవలం కమీషన్లకోసం తన బినామీకంపెనీల నుంచి నాసిరకం మీటర్లు కొనడానికి సిద్ధమయ్యాడు.
దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసిచెబితే, కేవలం అప్పులు తెచ్చుకోవడం కోసం మీటర్లు పెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడు. జగన్ రెడ్డి బినామీకంపెనీల పరిక రాల వినియోగం వల్లే తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని స్వయంగా విద్యుత్ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం తరుపున విద్యుత్ ఉత్పత్తి చేసి, తక్కువ ధరకు విద్యుత్ అందించే సంస్థల్ని కాదని, కేవలం కమీషన్ల కోసమే జగన్ రెడ్డి తన బినామీలకు చెందిన సంస్థలనుంచి అధికధరకు విద్యుత్ కొంటున్నా డు. ఈ విధమైన నిర్వాకాలతో జగన్ రెడ్డికి వేలకోట్ల లబ్ధికలిగితే… ప్రజలకు చిమ్మచీకట్లు మిగిలాయి.

మద్యపాన నిషేధం ముసుగులో మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతూ మనీ అర్జిస్తున్న జగన్ రెడ్డి
అధికారంలోకి రావడానికి మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని, ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తానని 2019ఎన్నికలకు ముందు జగన్ ప్రగల్భాలు పలికాడు. ఆయనకు వంతపాడిన కొందరు వైసీపీ మహిళా నేతలు నిస్సిగ్గుగా మద్యా న్ని రాష్ట్రంలో పూర్తిగా నిషేధించాకే మానాయకుడు మరలా ప్రజల్ని ఓట్లు అడుగుతా డు అని ఊదరగొట్టారు. ఆనాడు అలాచెప్పిన జగన్ రెడ్డి…నేడు ఆ మద్యం అమ్మకాల తో వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపే దుస్థితిలో ఉన్నాడు. దీనికి తోడు కల్తీ మద్యాన్ని అధికధరకు విక్రయిస్తూ మద్యానికి అలవాటుపడిన వారి జీవితాలతో చెలగా టమాడుతూ, లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు.

తన పార్టీ వాళ్లకు చెందిన మద్యం తయారీ కంపెనీల నాసిరకం మద్యం అమ్ముతూ నాలుగేళ్లలో రూ.40 వేలకోట్లు కొట్టేశాడు. మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులు జరపడం కూడా జగన్ రెడ్డి దోపిడీలో భాగమే. ఆన్ లైన్ చెల్లింపుల ద్వారా వచ్చే సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజానా కు పోతుందని తెలిసే.. జగన్ రెడ్డి నగదు చెల్లింపులు పెట్టాడు. ఒక్కో మద్యం దుకాణా నికి రోజుకి రూ.లక్షవస్తే దానిలో రూ.30వేలు ప్రభుత్వఖజానాకి జమచేస్తూ.. రూ.70 వేలు తన తాడేపల్లి ప్యాలెస్ కు తరలిస్తున్నాడు.

నాలుగేళ్లలో రూ.1,22,000కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే, ప్రభుత్వ లెక్కల్లో చూపింది మాత్రం రూ.94వేలకోట్లే. మిగిలిన సొమ్ము రూ.28వేలకోట్లు జగన్ రెడ్డి ఖజానాకే చేరింది. నాసిరకం మద్యం అధికధరకు అమ్ముతూ, డిస్టిలరీలు మద్యం రవాణా అంతా తనపార్టీ వారి ద్వారానే నిర్వహిస్తూ అదనంగా రూ.13,500కోట్లు కొట్టేశాడు. ఆఖరికి మద్యం అమ్మకాల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేసి, దానిపరిధిలోకి అమ్మఒడి, సామాజిక పింఛన్లను చేర్చాడు.

మద్యం అమ్మకాలతో వచ్చే సొమ్మునే ఆయాపథకాల కింద చెల్లిస్తున్నాడు. అంతటితో ఆగకుండా మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఏకంగా 15 ఏళ్లకు తాకట్టు పెట్టి రూ.25వేలకోట్లు అప్పు తెచ్చాడు. ఇదీ ఈ ముఖ్యమంత్రి ‘మద్య’వర్తిగా మారి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన వైనం. ఇలాంటి వ్యక్తికి మహిళల భద్రత, వారి సంక్షేమంపై మాట్లాడే అర్హత ఉందా అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

భూ బకాసురుడి భూ మాఫియా
విశాఖపట్నం సహా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.40వేలకోట్ల విలువైన భూముల దోపిడీ. పేదలకు ఇళ్లపట్టాల పేరుతో ఎందుకూ పనికిరాని సెంటుపట్టాలు ఇచ్చి రూ. 7వేలకోట్ల దోపిడీ. 22ఏ పేరుతో జరిగిన అక్రమాలు… అసైన్డ్ భూముల అన్యాక్రాంతం.. విలువైన ప్రభుత్వభూముల్ని తక్కువ ధరకు లీజులకు ఇవ్వడం ద్వారా దోచేసింది కానీ కలిపితే నాలుగేళ్లలో భూమాఫియా ద్వారా జగన్ రెడ్డి మింగేసింది రూ.40వేలకోట్లు. విశాఖపట్నంలో ప్రభుత్వఆస్తి అయిన కలెక్టరేట్ భవనం తాకట్టు పెట్టడం.. విజయవా డలో బేపార్క్ తాకట్టు.. గుంటూరులో రైతు బజార్లు, వాటి పరిధిలోని భూముల్ని తాకట్టు పెట్టడం..వైసీపీవాళ్లకు నామమాత్రపుధరకు లీజుకివ్వడం చేశారు.

జగన్ రెడ్డి మైనింగ్ మాఫియా
మైనింగ్ మాఫియాలో దేశంలో జగన్ రెడ్డిని మించిన వారు లేరు. బమిడికలొద్దిలో 121 హెక్టార్లలో రూ.15వేలకోట్ల విలువైన ఖనిజసంపద దోపిడీ. రూ.12వేలకోట్ల విలు వైన బీచ్ శాండ్ దోపిడీ. భీమునిపట్నంలో 90 హెక్టార్లలో, మచిలీపట్నంలో 1970 హెక్టార్లలో బీచ్ శాండ్ దోపిడీతో రూ.12వేలకోట్లు కాజేశాడు. కొండలు, గుట్టల తవ్వకాలతో రూ.20వేలకోట్లు. రుషికొండను ఎలా బోడిగుండుగా మార్చాడో చూశాం.

తన అవినీతి పత్రిక సాక్షికి మేలు చేయడానికి ప్రజల సొమ్ము దోచిపెట్టిన వైనం
గ్రామ, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక మాత్రమే చదవాలంటూ దాన్ని మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారాప్రజల సొమ్ముని ఆ పత్రికకు కట్టబెట్టి … కలిగించిన లబ్ధి రూ.300కోట్లు. ఆ పత్రికకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇప్పించడంద్వారా రూ.500 కోట్లు దోచిపెట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మొదల కిందిస్థాయిలో ఉండే సాక్షి సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్.. కాంట్రాక్ట్ సిబ్బందిగా నియమించి, అధికార దుర్వినియోగానికి పాల్పడటం.

తండ్ర అధికారంతో 200-2009 మధ్యన జగన్ రెడ్డి సాగించిన అవినీతి ఒకెత్తు అయితే, ఈ నాలుగేళ్లలో 2019-2023 మధ్య విచ్చలవిడిగా పాల్పడిన దోపిడీ మరోఎత్తు. చాప్టర్ -1లో రూ.లక్షా03వేలకోట్లు..చాఫ్టర్ -2లో రూ.2,27,500కోట్లు కాజేసిన జగన్ రెడ్డి అవినీతి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం.. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం నిజంగా యావత్ దేశమే సిగ్గుపడాల్సిన విషయం.

తాను సఛ్చీలుడు… చంద్రబాబు అవినీతిపరుడని జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఈర్ష్యాద్వేషాలతో చేస్తున్నదే. తాను 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు కాబట్టి.. తనను, తన అవినీతి, దోపిడీని ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న చంద్రబాబు కూడా జైల్లో ఉండాలన్న కుట్రతో, దుర్మార్గంతోనే జగన్ రెడ్డి ఏ తప్పూ చేయని చంద్రబాబుని అన్యాయంగా కటకటాల పాలుచేశాడు.

తాము చెప్పిన అంశాలు పరిశీలించాక అయినా జగన్ రెడ్డి తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకొని చంద్రబాబుని తక్షణమేవిడుదల చేయించి ఆయనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీడీఎల్పీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి అవినీతిపరుడు ముఖ్య మంత్రులు అయితే నీతిమంతులు జైళ్లపాలవుతారనే వాస్తవాన్ని ప్రజలంతా గ్రహించా లి.” అని రామానాయడు సూచించారు.

LEAVE A RESPONSE