Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి సిగ్గుమాలిన నాయకుడు

• ఓడిపోయిన జగన్ రెడ్డి జనాల మొఖం చూడటానికి భయం వేసి.. జైల్లో ఉన్న ఖైదీ మొఖం చూడటానికి వెళ్లాడు
• పిన్నెల్లి చేసిన విధ్వంసం ప్రపంచం అంతా చూసింది.
• ఐదేళ్ల వైసీపీ పాలనలో మాచర్లలో జరిగిన మారణ హోమం అంతా ఇంత కాదు
• ఎనిమిది మందిని చంపారు. దళితులు, మైనార్టీలపై దాడులు చేశారు. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించారు
• పిన్నెళ్లి విధ్వంసం చూసి దేశమే ఆశ్చర్యపోయింది
• పిన్నెల్లిపై చర్యలు తీసుకుంది ఎలక్షన్ కమిషన్
• ఓటమి ప్రెస్టేషన్ లో జగన్ రెడ్డి ఎమి మాట్లాడుతున్నాడో తనకే తెలియడంలేదు
• జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసింది అంతా అరాచకం, అన్యాయం, విధ్వంశమే
• అందుకే 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారు
• వైసీపీ ఇక బంగాళా ఖాతంలో కలవడమే… ప్రజలు జగన్ రెడ్డి మోసపు మాటలను ఇక నమ్మరు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి

ఓడిపోయిన జగన్ రెడ్డి జనాల మొఖం చూడటానికి భయం వేసి.. జైల్లో ఉన్న ఖైదీ మొఖం చూడటానికి వెళ్లాడని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ రెడ్డి, తన అనుచరులు గడిచిన ఐదేళ్లు చేసింది హత్యలు, అరాచకాలు, అన్యాయమేనని.. ప్రజలకు చేసిన మేలు ఏమి లేదన్నారు.. మాచర్లలో పిన్నెల్లి విధ్వంసం ప్రపంచం అంతా చూసిందని.. అల్లాంటి పిన్నెల్లిని సమర్థిస్తూ జగన్ రెడ్డి జైలుకు వెళ్లి మాట్లాడటం సిగ్గుచేటని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జగన్ రెడ్డికి అధికారం పోవడంతో ఫ్రెస్టేషన్ లో ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు. జగన్ రెడ్డి ఒక్కసారి కూడా జనాల్లోకి రాని జగన్ రెడ్డి హత్యారోపణ కేసుల్లో ఇరుక్కున్న పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లి విధ్వంసాన్ని కండిస్తూ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని పిన్నెల్లిపై కేసులు పెట్టారు.

దాన్ని వక్రీకరించి నేడు టీడీపీపై దాన్ని రుద్దేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్ని విమర్శలు చేయడం కంటే నీతి మాలిన రాజకీయం ఇంకోటి లేదు. రాజ్యాంగాన్ని పిన్నెల్లి ధ్వంసం చేశాడు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి పిన్నెల్లి బ్యాలెట్ బాక్సును నేలకేసి కొట్టింది ప్రపంచం మొత్తం చూసింది. అయినా మళ్లీ సిగ్గులేకుండా పిన్నెల్లి అమాయకుడు అంటూ మాట్లాడటానికి జగన్ రెడ్డికి సిగ్గుండాలి.

టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యంగాన్ని గౌరవించే వ్యక్తి. దాన్ని పరిరక్షించే వ్యక్తి. 42 సంవత్సరాల జీవిత చరిత్రలో ఏనాడు అరాచకం, అన్యాయాన్ని ప్రోత్సహించలేదు. రాయచోటి మంత్రి భార్య, కొలికపూడి శ్రీనివాసరావుల ఘటనలపై వెంటనే స్పందించి భవిష్యత్ లో ఇలాంటివి చేయవద్దని హెచ్చరించారు. ఇదే చెబుతుంది ప్రజా విలువలను పెంచే నాయకుడు ఎవరన్నది.

టీడీపీ పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవహరిస్తే ఉపేక్షించనని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మీలాగా దోచుకోని అరాచకం సృస్టించమని మా నాయకుడు చెప్పడు. ఐదేండ్లు సొంత రాజ్యంగం నడుపుకుని నేడు అంబేద్కర్ రాజ్యంగం నడుస్తుంటే మీ మనసు ఒప్పుకోవడంలేదు. మీ పాలన చూసి ప్రజలు విసిగి వేసారారు. అందుకే మీమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. పిన్నెల్లి నియోజకవర్గంలో ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు చేశారు. ఐదేండ్లలో 8 మందిని చంపారు 79 దాడులు చేశారు. బీసీ ఎస్సీ, మైనార్టీలపై దాడులు చేశారు.

జగన్ రెడ్డి పాలనలో ప్రజలు ఫియర్ సైకోసిస్ లో ఉన్నారు. అందుకే ఐదు సంవత్సరాలు మనసులో పెట్టుకుని ఎన్నికల్లో ఫియర్ ను బయటకు తీసి మిమ్మల్ని ఇంటికి పంపారు. 20 రోజులు కాకుండానే హామీలను అమలు చేయాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఊరూరా ఢంకా బజాయించి చెప్పుకున్నారు కదా.

ప్రజలు మిమ్మల్ని నమ్మి ఉంటే మళ్లీ మీకే ఓట్లు వేసేవారు. ప్రజలకు మీరు మంచి చేసి, సంక్షేమం అందించి న్యాయం చేసి ఉంటే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఉంటే ప్రజలు మిమ్మల్నే ఆదరించేవారు. అవి ఏమి చేయకుండా రాష్ట్రాన్ని అర్థికంగా ధ్వంసం చేశారు. అరాచకం సృష్టించారు. ప్రజలను భయ బ్రాంతులకు గురిచేశారు.

సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన 18 రోజుల్లోనే పేదలకు పింఛన్ పెంచి అందించిన సమర్థ నాయకుడు చంద్రబాబు. మిగిలిన హామీలన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. చంద్రబాబు హామీ ఇచ్చారంటే అవి ఖచ్చితంగా అమలు చేస్తారు. జగన్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. రాజధానిని ధ్వంసం చేశాడు, నీటిపారుదల వ్యవస్థను నాశనం చేశాడు.

జగన్ రెడ్డి చర్యలతో రైతులు, వ్యాపారస్తులు, పిల్లలు అందరికీ బాధలే. అన్ని వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు. వైసీపీ పాలనలో అన్ని రకాలుగా ప్రజలు నష్టపోయారు. అందుకే దీన్ని బాగుచేసేందుకు చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీని అందించారు ప్రజలు. రాష్ట్ర పునర్నిర్మాణంకు రాష్ట్ర ప్రజలు కంకంణ కట్టుకున్నారు.

నేడు సిగ్గులేకుండా జైలుకు పోయి పిన్నెల్లి ఒక గాంధీ అని, ఆయన ఏ నేరం చేయలేదని జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. పిన్నెల్లి అరెస్టు చంద్రబాబుకు సంబంధం లేదు. ఇకనైనా ప్రజలను తప్పుదారిపట్టించడం మానుకోవాలి. వైసీపీ ఇక బంగాళా ఖాతంలో కలిసిపోవాల్సిందే. జగన్ రెడ్డి పై తెలంగాణ హైకోర్టు రోజువారి విచారణకు ఆదేశించింది.

దానిపై నుండి ప్రజలను దారి మళ్లించడానికి హత్యానేరం చేసిన వ్యక్తిని, ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని పరామర్శించడానికి పోయి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నాడు. జగన్ రెడ్డికి ఎప్పటికి రాజకీయ అనుభవం రాదు, పరిపక్వత రాదు. రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని ఇక నమ్మరు. వైసీపీ నేతలను ప్రజలు ఛీ కొట్టారు. అందుకే ప్రతిపక్షం కూడా రాకుండా చేశారు.

LEAVE A RESPONSE