– నాలుగున్నరేళ్లలో రూ.40వేల కోట్ల ఇసుకదోపిడీకి పాల్పడినా ఇసుకాసురుడి ధనాశ చావలేదు
• గతంలో జేపీ సంస్థ మాదిరే.. ఇప్పుడు ఢిల్లీ కంపెనీని తెరముందు పెట్టి, వెనక మొత్తం తన తమ్ముడు అనిల్ రెడ్డి చక్రం తిప్పేలా జగన్ కొత్త ఇసుక పాలసీకి రూపకల్పన చేశాడు
• గతంలో ఉన్న మూడంచెల వ్యవస్థ (జేపీ సంస్థ, వైసీపీనేతలు, తాడేపల్లి ప్యాలెస్) ను కాదని, ఇప్పుడు సింగిల్ విండో పాలసీతో నేరుగా తాడేపల్లికే మొత్తం దోపిడీ సొమ్ము జమ అయ్యేలా కార్యాచరణ రూపొందించాడు
• ఇసుకాసురుడు జగన్ రెడ్డి చెబుతున్న కొత్త సింగిల్ విండో పాలసీ రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది
• తన ఇసుక దోపిడీని ఆధారాలతో చంద్రబాబు ప్రజల ముందు ఉంచాడన్న అక్కసుతోనే, జగన్ అన్యాయంగా టీడీపీ అధినేతను జైలుకు పంపాడు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో ఇసుక మాఫియా కొత్త అవతారం ఎత్తుతోందని, జగన్ రెడ్డి అతని ప్రభుత్వం 2021 వరకు ఎలాంటి పాలసీలు లేకుండా ఇసుక అమ్మకాలతో వేలకోట్లు దోచేసిందని, తర్వాత కొత్త పాలసీ పేరుతో ముఖ్యమంత్రి తనబినామీ సంస్థ జేపీ వెంచర్స్ కు ఏపీలోని ఇసుక రీచ్ లను గంపగుత్తగా అప్పగించాడని, జేపీ వెంచర్స్, స్థానిక వైసీపీ నేతలు, తాడేపల్లి ప్యాలెస్ అనే మూడంచెల వ్యవస్థ, ఇసుక రీచ్ ల రూపురేఖలు మారిపోయేలా అడ్డగోలుగా తవ్వకాలు సాగించిందని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“నాలుగున్నరేళ్లుగా వైసీపీనేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి సాగించిన విచ్చలవిడి ఇసుక తవ్వకాలు, అడ్డగోలు అమ్మకాలతో 40లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డునపడితే, దాదాపు 130 మందికి పైగా కార్మికులు పనిలేక ఆకలి భాదతో మరణించారు. ఏపీలో జరిగే ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని కొందరు పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో జరిగే ఇసుక తవ్వకాలు వెంటనే ఆపేయాలని ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదే శించింది. చిత్తూరు జిల్లాలోని అరణియార్ నదిలో జరిగే ఇసుక తవ్వకాలపై తొలుత కన్నెర్రచేసిన ఎన్జీటీ, తరువాత రాష్ట్రం మొత్తం ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిం ది. కేంద్రప్రభుత్వం కూడా ఎన్జీటీ ఆదేశాలను సమర్థించింది.
చంద్రబాబు తన ఇసుకదోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టాడన్న అక్కసుతోనే జగన్ కక్షకట్టి ఆయన్ని అక్రమంగా జైలుకు పంపాడు
కానీ నేటికీ ఇసుకాసురుడు జగన్ రెడ్డి, తన ఇసుక దోపిడీని ఆపలేదు. ముఖ్యమంత్రి వైసీపీనేతల ఇసుకదోపిడీని ఆధారాలతో సహా టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు వాస్తవాలు తెలియచేశారు. తన ఇసుకదోపిడీని చంద్రబాబు ప్రజలకు తెలియచేశాడన్న అక్కసుతోనే జగన్ రెడ్డి ఆయన్నిఆన్యాయంగా జైలుకు పంపాడు. ఇసుక సత్యాగ్రహం పేరుతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేసింది.
టీడీపీ ధర్నాలను జగన్ రెడ్డి పోలీసుల సాయంతో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చంద్రబాబునాయుడు ఇసుకదోపిడీపై ఆధారాలతో ప్రజలకు అర్థమయ్యేలా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం, టీడీపీ శ్రేణుల పోరాటంతో ఇసుకాసురుడు జగన్ రెడ్డి ఇసుకలో రూ.40వేలకోట్ల దోచేశాడని ప్రజలకు అర్థమైంది. సహజవనరు అయిన ఇసుకను తన దోపిడీవనరుగా ముఖ్యమం త్రి ఎలా మార్చుకున్నాడో, దానితో పాటు మట్టి, గ్రావెల్, ఇతర ప్రకృతి సంపదను ఎలా దోచేస్తున్నాడో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు తెలియచేసింది.
మే నెలలోనే జేపీ సంస్థ కాంట్రాక్ట్ ముగిస్తే నేటికీ రాష్ట్రంలోని ఇసుక రీచ్ లలో తవ్వకాలు ఎలా సాగుతున్నాయి?
జేపీ వెంచర్స్ కు ఏపీ ప్రభుత్వం అప్పగించిన ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ కాలపరిమితి 2023 మే 13తో ముగిసింది. ఆనాటినుంచి రీచ్ లలో ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తు న్నారు? ఆగస్ట్ నెలలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహంలో కూడా ఇదే విషయంపై ప్రశ్నించి స్థానిక వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు అధికారులు అందరినీ ప్రశ్నించాం. జేపీ సంస్థకు, ఇసుక తవ్వకాలకు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా నేటికీ ఆ సంస్థ బిల్లులనే చూపిస్తున్నారు.
జేపీ సంస్థ గతంలో టర్న్ కీ అనే సంస్థకు సబ్ లీజ్ ఇచ్చింది. టర్న్ కీ సంస్థ జీఎస్టీ చెల్లింపులు ఎగ్గొట్టడంతో, జేపీ సంస్థ జీఎస్టీ లైసెన్స్ రద్దు చేశారు. ఈ అంశంపై కూడా టీడీపీ అధికారుల్ని ప్రశ్నించింది. మైనింగ్ శాఖ ఎండీ టీడీపీనేతల్ని చూసి ఒక సందర్భంలో సమాధానం చెప్పలేక పారిపోయాడు. టీడీపీ నేతలు ప్రశ్నించడానికి వెళ్తే సిక్ లీవ్ లోఉన్నానని తప్పించుకున్న మైనింగ్ శాఖ ఎండీ వెంకటరెడ్డి, తరువాతి రోజు మంత్రిపెద్దిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశాని కి హాజరై టీడీపీనేతలు దుష్ప్రచారం చేస్తున్నారని నమ్మబలికాడు.
అధికారాంతంలో మరింత దోచేయాలనే రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను ఢిల్లీ కంపెనీ మాటున జగన్ రెడ్డి తన తమ్ముడికి అప్పగించడానికి సిద్ధమయ్యాడు
అధికారాంతానికి వచ్చాక ఇప్పటివరకు ఇసుకదోపిడీలో కొనసాగిన మూడంచెల వ్యవస్థ స్థానంలో జగన్ సర్కార్ సింగిల్ విండో పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రీచ్ లలో జరిగే తవ్వకాలద్వారా నేరుగా తాడేపల్లికే సొమ్ము చేరేలా జగన్ సింగిల్ విండో పాలసీకి శ్రీకారం చుట్టాడు. మధ్యలో ఎటువంటి కాంట్రాక్ట్ సంస్థలు, వైసీపీనేతలు – మంత్రుల ప్రమేయం లేకుండా నేరుగా తనకే రావాల్సిన సుంకం వచ్చేలా చేయడమే జగన్ రెడ్డి తీసుకురాబోతున్న కొత్త సింగిల్ విండో పాలసీ. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఇసుక తవ్వకాలకు గుట్టుగా టెండర్లు పిలిచిన జగన్ సర్కార్, నవంబర్ 15 నుంచి కొత్త సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలుచేపట్టారు.
గతంలో జేపీ కంపెనీ మాదిరే ఇప్పుడు ఢిల్లీ కంపెనీని తెరపైకి తెచ్చిన జగన్, పైకి ఢిల్లీ కంపెనీ పేరు చెబుతూ తన తమ్ముడైన అనిల్ రెడ్డి కనుసన్నల్లోనే మొత్తం ఇసుకవ్యాపారం జరిగేలా పథకరచన చేశాడు. తమ్ముడికే రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటినీ అప్పగిస్తే, ఇక మధ్యలో ఒక్కరూపాయికూడా ఎవరికీ పోకుండా మొత్తం తాడేపల్లి ఖజానాకే చేరుతుం దనేది జగన్ దుర్మార్గపు ఆలోచన. మే నెలలో జేపీ సంస్థ కాంట్రాక్ట్ ముగిసినా, అక్టోబర్ లో కూడా నేటికీ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని గుండిమెడ, కొల్లిపర రీచ్ లలో కొండల్ని తలపించేలా ఇసుక కుప్పలు కనిపిస్తున్నాయి. మాతో వస్తే ఆ కొండల్ని వైసీపీవాళ్లకు, ముఖ్యమంత్రికి చూపిస్తాం. కోర్టులు చీవాట్లు పెట్టినా, ఎన్జీటీతవ్వకాలు ఆపాలని హెచ్చరించినా ముఖ్యమం త్రి తన ఇసుకదోపిడీని ఆపలేదు. తన దోపిడీకోసం జగన్ రెడ్డి ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎన్జీటీ ఆదేశాలనే సమర్థించింది. ఇసుకాసురుడు జగన్ రెడ్డి దోపీడీకి కొందరు కలెక్టర్లే సహకరిస్తున్నారు.
వాటాలు తీసు కుంటూ, వారి పరిధిలోని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5వేల క్యూబిక్ మీటర్ల వరకు అనుమతిస్తున్నామంటూ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు సహాయ సహాకారాలందిస్తు న్నారు. వాస్తవంగా 5 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు అనేవి ప్రభుత్వ అవసరాలకోసం చేపట్టవచ్చనే నిబంధనల్లో భాగం. బుసకను కూడా ఇసుకగా తవ్వేస్తున్నా కలెక్టర్లు చోద్యం చూస్తున్నారు. సింగిల్ విండో పాలసీలో భాగంగా రీచ్ లలో ఇసుక ఎంతకు అమ్మాలి.. బయట ఎంతకు అమ్మాలి.. ఏ ఏ ప్రాంతాల్లో ఎంత అమ్మాలనే మార్గదర్శ కాలు కూడా జగన్ రెడ్డి ఇప్పటికే రూపొందించారు.
నవంబర్ నుంచి కొత్త ఇసుక పాలసీ అలియాస్ తమ్ముడు అనిల్ రెడ్డి పాలసీ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. చంద్రబాబు జైల్లో ఉన్నంత మాత్రాన టీడీపీ జగన్ రెడ్డి దోపిడీని, దుర్మార్గాలను ప్రశ్నించకుండా వదిలిపెట్టదు. జగన్ రెడ్డి సాగిస్తున్న ప్రతిదోపిడీని ఆధారాలతో సహా ప్రజలకు తెలియచేసి, వైసీపీప్రభుత్వాన్ని వారు తరిమికొట్టేలా వారిని చైత్యన్య వంతుల్ని చేస్తాం.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.