Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అమూల్ కు వేల కోట్ల ప్రజల సొమ్ము దోచిపెడుతున్నాడు

– తనకేసులు, కమీషన్లకోసమే ముఖ్యమంత్రి అమూల్ బేబీ అవతారమెత్తాడు
• చిత్తూరుజిల్లాలో అమూల్ సంస్థ రూ.328కోట్లతో ఏర్పాటుచేస్తానంటున్న డెయిరీ ఎప్పటిలోగా ప్రారంభమవుతుందో జగన్ రెడ్డి చెప్పగలడా?
• అమూల్ సంస్థను తీసుకొచ్చి చిత్తూరుడెయిరీని ఉద్ధరించానని జగన్ చెప్పడం కేవలం ఎన్నికల స్టంటే
• శివశక్తి డెయిరీ కార్యకలాపాలు సాగించే ప్రాంతంలో అమూల్ డెయిరీకి జగన్ రెడ్డి ఎందుకు అనుమతిఇవ్వలేదు?
• మంత్రి పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ దోపిడీ ముఖ్యమంత్రికి కనిపించడంలేదా?
• పాలసేకరణ అధికరమై, నిర్వహణ వ్యయంభారమయ్యే చిత్తూరు డెయిరీమూతపడిందని కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన హౌస్ కమిటీ అభిప్రాయపడితే, జగన్ రెడ్డి హెరిటేజ్ పై పడి ఏడవడం ఆయనలోని భయానికి నిదర్శనం
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

నాలుగేళ్లు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి, ఎన్నికలు సమీపిస్తు న్నవేళ కొత్తనాటకానికి తెరలేపాడని, చిత్తూరుజిల్లాలో అమూల్ డెయిరీకి శంఖుస్థాప నచేసిన జగన్, చిత్తూరుడెయిరీని ఉద్ధరించినట్టు మాట్లాడటం ఆయనలోని పచ్చిమోసకారీ ఆలోచనలకు నిదర్శమని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళి పాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే…

“ రాష్ట్రంలోని సహకారడెయిరీలు, పాడిరైతుల్ని నిలువునా ముంచేలా అమూల్ సంస్థ కు మేలుచేసేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చిత్తూరుడెయిరీ మూత పడటానికి కారణం ముమ్మాటికీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డే కారణం. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిత్తూరుడెయిరీని ఎందుకు తెరిపించలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014వరకు అధికారంలో ఉండి కూడా చిత్తూరుడెయిరీని ఎందుకు తెరిపించలేదు? చిత్తూరుడెయిరీ తెరిస్తే, తమకు, తమవా ళ్లకుచెందిన పాలడెయిరీల మనుగడ దెబ్బతింటుందనే రాజశేఖర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆపనిచేయలేదు. వారిబాటలోనే ఇప్పుడు జగన్ రెడ్డి నడుస్తున్నాడు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వద్దన్న అమూల్ డెయిరీ జగన్ రెడ్డికి ఎందుకు ముద్దు అయ్యింది?
అమూల్ డెయిరీ ఉత్తరాదిరాష్ట్రాల్లో కొనసాగుతోంది తప్ప, దక్షిణాదిరాష్ట్రాల్లో దాని కార్య కలాపాలులేవు. గతంలో తమిళనాడులో ఒకడెయిరీని ప్రారంభించికూడా మూసేశారు. అలాంటి డెయిరీని జగన్ రెడ్డి రాష్ట్రంలో ప్రోత్సహించడానికి కారణం తనపై ఉన్న అవి నీతి కేసులు, కమీషన్లకోసమే. స్వయానా కేంద్రహోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని నందిని డెయిరీని అమూల్ తో కలిసిపనిచేయాలని పిలుపునిస్తే, ఆరాష్ట్రప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు.

కర్ణాటకరాష్ట్రంలోని నందిని బ్రాండ్, ఆ రాష్ట్రవాసుల ఆత్మగౌరవాని కి ప్రతీక. అలానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కురియన్ గారి ఆశయాలు, ఆలోచనలకు భిన్నంగా అమూల్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు అమూల్ సంస్థ మాకువద్దు అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన రెడ్డి మాత్రం ఆ సంస్థకోసం ప్రజలసొమ్ముని అప్పనంగా దోచిపెడుతున్నా డు.

వేలకోట్ల ప్రజలసొమ్ముని అమూల్ కుదోచిపెడుతున్న జగన్ రెడ్డి, ఆ సొమ్ముతో రాష్ట్రంలోని సహాకార డెయిరీలను ఆదుకోవాలనే ఆలోచన ఎందుకు చేయడు?
రాష్ట్రంలోని పాడిపరిశ్రమల్ని, పాడిరైతుల్ని ముంచేసేలా వందలకోట్లవిలువైన ఆస్తుల్ని అమూల్ సంస్థకు ధారాధత్తంచేస్తున్నాడు. వేలకోట్ల ప్రజలసొమ్ముని అమూల్ కు దోచి పెడుతున్నాడు. రూ.1000కోట్లు ఎన్.సీ.డీ.సీ నుంచి అప్పుతెచ్చి, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ కింద వందలకోట్లతో బిల్డింగులు నిర్మించి, బల్క్ కూలర్లకోసం కోట్లుతగలేసిమరీ అమూ ల్ కోసం పాకులాడుతున్నాడు. ఎక్కడోనుంచి వచ్చిన అమూల్ సంస్థ జపంచేసి, దాని కివేలకోట్లు దోచిపెట్టేబదులు, ఆ సొమ్ముతో రాష్ట్రంలోని పాడిపరిశ్రమల్ని, పాడిరైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎందుకు పనిచేయడు?

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా లక్షమంది మహిళాసభ్యులతో ఏర్పడిన శ్రీజ డెయిరీ తిరుపతిలోఉంది. శ్రీజడెయిరీ వెయ్యికోట్ల టర్నోవర్ సాధించింది. చిత్తూరుడెయిరీ ఆస్తుల్ని అమూల్ కుక ట్టబెట్టిన జగన్ రెడ్డికి శ్రీజడెయిరీ నష్టాలు కనిపించడంలేదా? అదే శ్రీజడెయిరీకి చిత్తూ రుడెయిరీ ఆస్తుల్ని ఇచ్చి, ప్రభుత్వప్రోత్సాహం అందించిఉంటే, గొప్పపనితీరు సాధించే ది. ముఖ్యమంత్రికి పరులపై ఉన్నప్రేమ, పొరుగురాష్ట్ర సంస్థలపై ఉన్న అభిమానం రాష్ట్రంలోని వాటిపై ఉండదు.

హెరిటేజ్ పాడిరైతుల్ని దోచుకుంటోంది అని అబద్ధాలుచెబుతున్న జగన్ రెడ్డికి శివశక్తి డెయిరీ దోపిడీ కనిపించడంలేదా? మంత్రిపెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ కార్యకలాపాలు సాగించే ప్రాంతంలో జగన్ రెడ్డి అమూల్ కు ఎందుకు గేట్లు ఎత్తలేదు?
హెరిటేజ్ డెయిరీ పాడిరైతుల్ని దోచుకుంటోంది అని అబద్ధాలుచెబుతున్న ముఖ్యమం త్రికి, చిత్తూరుజిల్లాలో పాడిరైతుల్ని దారుణంగా దోచుకుంటున్న మంత్రిపెద్దిరెడ్డికి చెంది న శివశక్తి డెయిరీ బాగోతాలు కనిపించడంలేదా? పీలేరుకేంద్రంగా ఏర్పడిన శివశక్తి డెయిరీ, చిత్తూరులో మరేడెయిరీని ఎదగనీయకుండా చేసి, పాడిరైతుల్ని దోచేస్తున్నది నిజం. శ్రీజడెయిరీ పాలసేకరణ కేంద్రాలను శివశక్తిడెయిరీకోసం ఈ ప్రభుత్వమే మూసే సింది. శివశక్తి డెయిరీ ఒక్కటే ఈరాష్ట్రంలో పాడిరైతులకు లీటర్ కుతక్కువ ధర చెల్లిస్తోంది.

అదే శివశక్తి డెయిరీ కార్యకలాపాలు సాగించే ప్రాంతంలో ముఖ్యమంత్రి అమూల్ సంస్థకు ఎందుకు గేట్లుతెరవలేదు? శివశక్తి డెయిరీ మంత్రిపెద్దిరెడ్డి సంస్థ అని దాని జోలికెళ్లలేదా? అమూల్ సంస్థ చిత్తూరుజిల్లాలో రూ.328కోట్ల పెట్టుబడి పెడుతుందని గొప్పలుచెప్పాడు. ఆ మొత్తం పెట్టుబడి ఎప్పటిలోగా పెడతారో అమూల్ సంస్థగానీ, ముఖ్యమంత్రిగానీ ఎందుకు చెప్పడంలేదు?

కేవలం ఎన్నికలసమీపిస్తున్నవేళ ప్రజల్ని మభ్యపెట్టడానికే అమూల్ సంస్థ ముసుగులో ముఖ్యమంత్రి నాటకాలు మొదలెట్టాడు. నేషనల్ ప్రాజెక్ట్ ఫర్ డెయిరీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కింద కేంద్రప్రభుత్వం ఇచ్చే సొమ్ము ని కూడా ముఖ్యమంత్రి అమూల్ కు ధారాధత్తంచేయడంలోని ఆంతర్యం ఏమిటి?

అమూల్ సంస్థ వచ్చాకే పాడిరైతులకు ఇచ్చేధర పెరిగిందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్య లు పచ్చిఅబద్ధం. దేశవ్యాప్తంగా పాలసేకరణ ధరలుపెరిగాయని ఆయన అవినీతిపత్రిక లోనే రాశారు. ఉమ్మడిరాష్ట్రంలో కీలకబ్రాండ్ గా ఉన్న విజయడెయిరీని జగన్ రెడ్డి చంపేస్తే, తెలంగాణ ప్రభుత్వం దానికోసం రూ.250కోట్లతో 5లక్షలలీటర్ల డెయిరీ ఏర్పా టుకు సిద్ధమైంది.

అమూల్ సంస్థ రాష్ట్రంలోకి వచ్చాకే ఇతరపాలడెయిరీలు పాడిరైతులకు ఇచ్చే ధరను పెంచాయని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో పాలసేకర ణ ధరలు పెరిగాయని ఆయన అవినీతిపత్రికసాక్షిలోనే రాశారు. రాష్ట్రంలోని అనేక సహా కార డెయిరీలు అమూల్ కంటే ఎక్కువగా పాడిరైతులకు మేలుచేస్తున్నాయి. ఆ మేలు ఏదీ జగన్ రెడ్డికి కనిపించవు. ఎందుకంటే ఆయన ‘అమూల్ బేబీ’ కాబట్టి. ఏపీ ముఖ్య మంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఉమ్మడిరాష్ట్రంలోని విజయబ్రాండ్ ను చంపిసి, అమూల్ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు.

అదే విజయబ్రాండ్ ను నిలబెట్టడంకోసం తెలం గాణ ప్రభుత్వం, వందలకోట్లు ఖర్చుపెడుతోంది. తెలంగాణలో రూ.250కోట్లతో 5లక్షల లీటర్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఒకమెగా డెయిరీ ప్రారంభోత్సవానికి శంఖుస్థాపన చేసింది. తెలంగాణ ఫెడరేషన్లో భాగమైన పాలడెయిరీల్లో ఎక్కడా అమూల్ లేదు. కానీ అక్కడ పాలసేకరణధర రూ.810గాఉంది. చిత్తూరుజిల్లాలో కైరాయూనియన్ మొన్న జూన్ 11న పాలసేకరణ ధరను రూ.800నుంచి రూ.820కి పెంచింది. తెలంగాణ ఫెడరే షన్ ఎప్పటినుంచో రూ.800ఇస్తోంది.

అదికాక అక్కడి ముఖ్యమంత్రి ప్రతిలీటర్ కు రూ. 4లు అదనంగా పాడిరైతులకు ఇస్తున్నారు. అలానే ఇస్తానని గతంలో జగన్ రెడ్డి చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక మాటతప్పాడు. ముఖ్యమంత్రి ఈరోజు హెరి టేజ్ జపమే ఎక్కువచేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన హౌస్ కమిటీలో ఎక్కడైనా సరే హెరిటేజ్ సంస్థమూలాన రాష్ట్రంలోని సహకారడెయిరీలు దెబ్బతిన్నాయని ఉందా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. కేవలం కొన్నిసంవత్సరాలు పాలసేకరణ అధికంగ గా ఉండి, దానినిర్వహణ వ్యయంమూలాన చిత్తూరుడెయిరీ మూతపడిందని హౌస్ కమిటీ అభిప్రాయపడింది.

హెరిటేజ్ డెయిరీపై, చంద్రబాబుపై, ఆయనకుటుంబంపై పడి జగన్ రెడ్డి, వైసీపీవాళ్లు ఎన్నాళ్లు ఏడుస్తారు? రాష్ట్రంలో హెరిటేజ్ తో పాటు సమానంగా వైసీపీఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడి తిరుమలడెయిరీ కార్యకలాపాలు సాగిస్తోంది. పెద్దిరెడ్డి శివశక్తి డెయిరీ, దొడ్లడెయిరీ, జెర్సీ డెయిరీ లాంటివన్నీ బ్రహ్మండంగా మనుగ డ సాగిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రికి అవేవీకనిపించవు. ప్రజాచైతన్యంతో కూడిన పోరాటం తెలుగుదేశంపార్టీ, చంద్రబాబుచేస్తున్నారు కాబట్టే, జగన్ రెడ్డి మాపై పడి ఏడు స్తున్నాడు.” అని నరేంద్రకుమార్ ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE