• నా ఎస్సీలు అని రాగాలు తీయడం తప్ప జగన్ రెడ్డి దళితులకు చేసింది శూన్యం.
• నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో దళితులపై జరిగిన దారుణాలే అందుకు నిదర్శనం
• ఎన్.సీ.ఆర్.బీ నివేదిక ప్రకారం వైసీపీపాలనలో 188మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు
• 637 మంది దళితమహిళలు అత్యాచారానికి గురైతే, వేలసంఖ్యలో దాడులు జరిగాయి
• దాదాపు రూ.28వేలకోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి
• సామాజికంగా.. ఆర్థికంగానే కాక రాజకీయంగా కూడా దళితుల్ని జగన్ అణిచివేస్తున్నాడు
•నియోజకవర్గాలు మార్చిన 11 మంది ఎమ్మెల్యేల్లో దళితులే ఎక్కువ మంది. ఇతరుల్ని మార్చే ధైర్యం జగన్ రెడ్డికి లేదు
-టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ ప్రసాద్
నోరుతెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని రాగాలు తీసే జగన్ రెడ్డికి నిజంగా దళితులపై ఎంత ప్రేమ ఉందో ఎన్.సీ.ఆర్.బీ నివేదికతో బట్టబయలైందని, నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 188 మంది దళితులు ప్రాణాలు కోల్పోతే, 637 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 300 పై చిలుకు హత్యాయత్నాలు, వేలసంఖ్యలో దాడులు జరిగాయని టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ అంబేద్కర్ మహనీయుని పుణ్యమా అని దళితులు ఇప్పటికి తమ కాళ్లపై తాము నిలబడి ఎవరిపైనా ఆధారపడకుండా బతుకుతున్నారు. కానీ జగన్ రెడ్డి వల్ల దళితులు మరలా ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాదాపు రూ.28వేలకోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం దళితులకు అమలు చేస్తున్న పథకాల్ని రాష్ట్రంలో ఎక్కడా అమలు కాకుండా చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. చంద్రబాబునాయుడు దళితులకోసం ప్రత్యేకంగా తీసుకొ చ్చిన విదేశీవిద్య, పెళ్లికానుక, క్రిస్మస్ కానుక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, భూమి కొనుగోలు పథకం వంటి అనేక పథకాల్ని రద్దుచేసిన దళిత వ్యతిరేకి జగన్ రెడ్డి.
కళ్లుండి చూడనట్టుగా.. నోరుండి మాట్లాడనట్టుగా జగన్ రెడ్డి దళితులపై జరిగే దారుణాల్ని సమర్థిస్తున్నాడు
డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడే జగన్ రెడ్డి నోరుతెరిచి ఉంటే, నేడు రాష్ట్రంలో దళితులపై ఈ స్థాయిలో నేరాలు, దారుణాలు జరిగేవి కావు. వరప్రసాద్ కు శిరో ముండనం చేయించినప్పుడు, దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను పోలీస్ స్టేషన్ ఎదుట పడేసినప్పుడు జగన్ రెడ్డి పెదవి విప్పి ఉంటే, వేలసంఖ్యలో దళితులపై దారుణాలు జరిగేవికావు. కళ్లుండి చూడనట్టుగా, నోరుండి మాట్లాడ లేని మూగవాడిగా జగన్ రెడ్డి దళితులపై జరిగే దారుణాల్ని సమర్థిస్తున్నాడు.
దళితులు వాళ్ల కాళ్లపై వారు నిలబడి, స్వయంగా ఎదిగేలా చంద్రబాబు వారికి ఊతాన్ని అందిస్తే, నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి వారిని నమ్మించి నట్టేట ముంచా డు. దళితజాతిని నిర్వేదం, నిరాశానిస్పృహల్లో ముంచేశాడు. రాత్రి కాళ్లు నరికేసి, పగలు చేతికి ఊతకర్ర అందించినట్టుగా జగన్ రెడ్డి దళితులపై కపట ప్రేమ చూపుతున్నాడు.
దళితులు తలుచుకుంటే జగన్ రెడ్డి ఎక్కడినుంచి వచ్చాడో మరలా అక్కడికే పోతాడు
యర్రగొండపాలెంలో పోలీసుల చేతిలో అవమానింపబడిన దళిత యువకుడు మోజేశ్ నేడు ప్రాణాపాయస్థితిలో ఉండటానికి కారణం జగన్ రెడ్డి కాదా? నా ఎస్సీలు అని ఊరికే మాట అనడం కాదు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ రెడ్డి తక్షణమే దళితుల పక్షాన నోరెత్తాలి. దళితుల్ని సామాజికంగా, ఆర్థికంగా అణచివేసిన జగన్ రెడ్డి.. నేడు రాజకీయంగా కూడా తన పార్టీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఇతరస్థానాలకు మార్చేసి, వారికి అన్యాయం చేశాడు.
ఇతర వర్గాల ఎమ్మెల్యేల్ని మార్చే సాహసం జగన్ రెడ్డికి లేదు. ఎందుకంటే వారు తిరగబడతారని జగన్ కు భయం. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో రానున్నది టీడీపీప్రభుత్వమే. చంద్రబాబు అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేతిలో దగాపడిన దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులు తలుచుకుంటే జగన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికే వెళ్తాడు.” అని నరసింహప్రసాద్ హెచ్చరించారు.