• పేదలకు ఇళ్లప ట్టాలపేరుతో కుట్ర రాజకీయాలకు తెరలేపాడు. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజధానిలో 5శాతం భూమిని పేదల నివాసానికి కేటాయించిన ఘనుడు చంద్రబాబు మాత్రమే
• తాడేపల్లిలో తనపార్టీ కార్యాలయ నిర్మాణానికి క్లియర్ పట్టా ఉన్న కోట్లవిలువైన 2ఎకరాలభూమిని కేటాయించిన జగన్ రెడ్డి, పేదల ఇళ్లకోసం ఎందుకూ పనికిరాని పట్టాలను కేటాయించడం వారిని వంచించడం కాదా?
• ఇళ్లస్థలాలపేరుతో చిత్తుకాగితంతో సమానమైన పట్టాలను జగన్ రెడ్డి పేదలకు ఇస్తున్నాడని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేలిపోయింది
• ప్రభుత్వమిచ్చే ఇళ్లపట్టాలు అమ్మకానికి, రుణం పొందడానికి పనికిరావని దేశఅత్యున్నత న్యాయస్థానం చెప్పలేదా?
• నిజమైన పేదలపక్షపాతి చంద్రబాబే. కాబట్టే సీఆర్డీఏ చట్టంలోనే రాజధానిప్రాంతంలో 5శాతంభూమిని పేదలఇళ్లకు కేటాయించారు
• జగన్ రెడ్డికి పేదలపై వల్లమాలిన ప్రేమాభిమానాలే ఉంటే చంద్రబాబు గతంలో కట్టించిన 5వేలఇళ్లను 4ఏళ్లుగా వారికెందుకు ఇవ్వలేదు?
• దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు ఒక్కరే ప్రజారాజధాని అమరావతిలో 5శాతంభూమిని పేదలకుకేటాయిస్తూ 2014 డిసెంబర్లోనే చట్టంచేశారు.
• పేదలకు న్యాయంచేయాలన్న తాపత్రయమే జగన్ రెడ్డికి ఉంటే, తాడేపల్లి నివాసంపక్కనున్న వెయ్యిపేదలఇళ్లను రాత్రికిరాత్రి ఎందుకు నేలమట్టం చేయించాడు?
• అమరావతి రాజధానే కాదన్న జగన్ రెడ్డి, నేడు తాను రాజధానిప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తాననడం వారిని వంచించడమే
• తాడేపల్లి ప్యాలెస్ పక్కన తనపార్టీ కేంద్రకార్యాలయంకోసం క్లియర్ పట్టాతోఉన్న కోట్లవిలువైన 2ఎకరాలను జగన్ కేటాయించలేదా? ఇప్పటికే అమరావతిలో తనపార్టీకి ఒకకార్యాలయం ఉంటే మరోకార్యాలయం అవసరమా?
• పార్టీ కార్యాలయానికి కేటాయించిన 2ఎకరాల భూమి పేదల ఇళ్లనిర్మాణానికి పనికిరాదా?
• గతంలో అమరావతిని శ్మశానమని, ఎడారని, నిర్మాణాలకు పనికిరాదని దుష్ప్రచారంచేయించిన జగన్ ఇప్పుడు అక్కడే పేదలకు ఇళ్లపట్టాలివ్వడం అతని ద్వందవైఖరికి నిదర్శనం.
• జగన్ పేదలకు న్యాయం చేసేవాడయితే PMAY గ్రామీణ్ పథకం కింద 2019 నుంచి 2023 మధ్యవారికోసం కేవలం 823 ఇళ్లుమాత్రమే ఎందుకు కట్టాడు?
• కేంద్రమంత్రి పార్లమెంట్లో చెప్పిన లెక్కలప్రకారం అతిచిన్న రాష్ట్రమైన అస్సాంకూడా పేదలకోసం 2.15లక్షలఇళ్లుకడితే, పేదల ఉద్ధారకుడినని చెప్పుకునే జగన్ 823ఇళ్లే కట్టడమేంటి?
• ఇళ్లపట్టాల ముసుగులో జగన్ కుట్రల్ని నమ్మిమోసపోవద్దని పేదలకు విజ్ఞప్తిచేస్తున్నాం.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న జగన్ రెడ్డి రాజకీయకుట్రను బయటపెట్టిందని, రాజధానిలో పేదలకు ప్రభుత్వంఇచ్చే ఇళ్లపట్టాల చెల్లుబాటు, గౌరవన్యాయస్థానం తుది తీర్పుకి మాత్రమే లోబడి ఉంటుందని చాలాస్పష్టంగా చెప్పిందని, ప్రభుత్వమిచ్చే ఇళ్లపట్టాల తాలూకా స్థలాన్ని తాకట్టుపెట్టడానికి, రుణంపొందడానికి, అమ్ముకోవడానికి కూడా ఎలాంటి హక్కులు ఉండవని సుప్రీంకోర్టుచెప్పిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఇళ్లస్థలాలపేరుతో జగన్ రెడ్డి ఎలాంటి ఉపయోగం లేని చిత్తుకాగితంతో సమానమైన పట్టాలను పేదలకు ఇస్తున్నాడని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేలిపోయింది
ప్రజారాజధాని అమరావతి అందరిదీ అన్న ఉద్దేశంతో చంద్రబాబు సీఆర్డీఏ చట్టంలోనే 2014 డిసెంబర్లో 5శాతం భూమిని పేదలనివాసానికి కేటాయిస్తూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పని చేశారు. “ఇళ్లస్థలాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఉపయోగంలేని, చిత్తుకాగితంతో సమానమైన పట్టాలను పేదలకు ఇచ్చేప్రయత్నం చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేలిపో యింది. వైసీపీనేతలు, మంత్రులు చాలామంది జగన్ రెడ్డికి మాత్రమే పేదలపై అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు, ఆయనేపేదలకు న్యాయంచేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని, జగన్ రెడ్డిని ఒకటేసూటిగా అడుగుతున్నాం. డిసెంబర్30, 2014న తీసుకొ చ్చిన సీఆర్డీఏ చట్టంలో అప్పటిముఖ్యమంత్రి చంద్రబాబుగారు చాలాస్పష్టంగా సెక్షన్ 53 (డీ)లో రాజధాని నిర్మాణానికి సమీకరించిన మొత్తంభూమిలో 5శాతంభూమిని పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని పొందుపరిచారు.
దేశచరిత్రలో ఏరాష్ట్రరాజధానికి సంబంధించి లేని గొప్పసౌకర్యాన్ని పేదలకు కల్పిస్తూ చట్టంలోపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మాత్రమే. దేశంలో ఏ రాష్ట్రరాజధానిలో అయినా, ఏప్రభుత్వమై నా, ఏముఖ్యమంత్రి అయినా పేదలనివాసానికి ఇంతశాతంభూమి కేటాయించారా? దాని కోసం ప్రత్యేకంగా చట్టంచేశారా? ఎవరూచేయలేదు. అలాచేసిన ఏకైకముఖ్యమంత్రి దేశంలో చంద్ర బాబు ఒక్కరే. ఎందుకంటే ఆయన కలలుగన్న ప్రజారాజధాని అమరావతి అందరిదై ఉండాలి. అందరూ దానిలో సంతోషంగా ఉండాలని భావించే, 2014 డిసెంబర్లోనే పేదల ఇళ్ల కోసం 5శాతం భూమిని కేటాయించారు. దటీజ్ చంద్రబాబు.
అలాంటి వ్యక్తి ఆలోచనల్ని సర్వ నాశనంచేయడం తప్ప జగన్ రెడ్డి ఈనాలుగేళ్లలో చేసింది శూన్యం. పేదలకు ఇళ్లపట్టాల పేరు తో వారిని వంచిస్తూ, రాజధానిలో చిచ్చురాజేయడానికే జగన్ కొత్తనాటకాలు మొదలెట్టాడు. సీఆర్డీఏ చట్టంలో పేదలకు ఇంతభూమి ఉండాలని చెప్పడమేకాకుండా, 2014-19 మధ్యన 5వేల ఇళ్లు అమరావతిలోనే నిర్మించిన ఘనత చంద్రబాబుగారిది. ఆఇళ్లను కూడా జగన్ పేదలకు ఇవ్వకుండా వారిని వేధిస్తున్నాడు. ఎటువంటి లిటిగేషన్ లేని ఆస్తిని పేదలకు ఇళ్ల రూపంలో చంద్రబాబుగారు అందిస్తే, దాన్ని ఎందుకుకొరగాకుండా చేసిన జగన్ రెడ్డి, పేదలకు ఇళ్లస్థలాలపేరుతో పేదలకు అక్కరకురాని పట్టాలను రాజధానిలో ఇస్తూ వారిని వంచిస్తున్నాడు.
పేదవాడికి ఏదో ఒరగబెడుతున్నానంటూ ప్రజలముందు మొసలికన్నీరు కారుస్తున్నాడు. పేదల్ని మోసగించాలనిచూస్తున్న జగన్ రెడ్డి నిర్వాకాన్ని మోసాన్ని వారంతా నిలదీ యాలి. పనికిరాని పట్టాలుగా నిన్నటికోర్టుతీర్పుతో తేలిపోయి, తమకు ఉపయోగపడని ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తున్నారని ముఖ్యమంత్రిని కడిగిపారేయండి. జగన్ రెడ్డి ఇప్పుడు పేదల కు కేటాయిస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి భవిష్యత్ లో న్యాయస్థానాల తీర్పులు, ఆయన నిర్ణయానికి విరుద్ధంగావస్తే, ఇళ్ల పట్టాలు తీసుకున్న పేదలపరిస్థితి ఏమిటి? ఆ స్థలాల్లో తమ కష్టార్జితంతో ఇళ్లుకట్టుకున్నవారు ఎటుపోవాలి? ఆ నష్టాన్ని ఎవరుభరిస్తారు?
జగన్ రెడ్డికి పేదలపై వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే తన తాడేపల్లి ప్యాలెస్ పక్క నుండే వెయ్యి పేదకుటుంబాల్ని రాత్రికి రాత్రి ఎందుకు నేలమట్టం చేయించాడు?
జగన్ రెడ్డికి పేదలపై వల్లమాలిన ప్రేమ ఉందా? జగన్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న తాడేపల్లి భవనం చుట్టుపక్కలే కాలువగట్లపై దాదాపు వెయ్యిపేదకుటుంబాలు నివాసం ఉండేవి. అమ రారెడ్డి కాలనీపేరుతో పేదలు నివాసముంటున్న ప్రాంతం ఏమైంది? ఎటుపోయింది? పేదలు తనకంటికి కనుచూపుమేరలో కనిపించకూడదన్న అక్కసుతో ఏకంగా వెయ్యికుటుంబాల్ని రాత్రికిరాత్రి తరమేసిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి కాదా?
2019లో అక్కడ వెయ్యి పేద కుటుంబాలు ఉండేవి అనడానికి శాటిలైట్ చిత్రాలేరుజువులు. తాము చెమటోడ్చి సంపాదించుకున్నసొమ్ముతో నివాసాలుఏర్పాటుచేసుకొని అమరారెడ్డికాలనీగా ఏర్పడి నివాసముంటున్న పేదకుటుంబాలఇళ్లను కూల్చేసి, ఆ ప్రదేశాన్ని మొత్తంచదునుచేసి, ఉన్నరోడ్డు చాలదని తనప్యాలెస్ కు మరో రాజమార్గాన్ని నిర్మించుకున్నాడు. అందుకోసం అమాయక పేదలఇళ్లను జేసీబీలో కూల్చేయించాడు.
ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో చూస్తే పేదలఇళ్లస్థానంలో రోడ్డుకనిపిస్తోంది. (2019నాటి మరియు 2023నాటి గూగుల్ మ్యాప్ లను పట్టాభిగారు ఈసందర్భంగా విలేకరులకు చూపించారు) 1000పేదకుటుంబాల్ని అత్యంతకిరాతకంగా, అమానుషంగా రాత్రికిరాత్రి మాయంచేసిన జగన్ రెడ్డికి పేదలంటే అమితమైన ప్రేమ..అభిమానమా? నిజంగా జగన్ కు పేదలపై ప్రేమ, అభిమానం ఉంటే 1000కుటుంబా లను ఎందుకు తరిమేశారో ఆయనే సమాధానంచెప్పాలి.
అదే 2ఎకరాల్ని జగన్ రెడ్డి పేదల ఇళ్ల కోసం ఎందుకు కేటాయించడు?
తాడేపల్లిలో వైసీపీకేంద్ర కార్యాలయం నిర్మాణానికి 2ఎకరాల భూమి కావాలా? చట్టబద్ధంగా క్లియర్ టైటిల్ తో ఉన్నభూమిని ముఖ్యమంత్రి ఇంటిపక్కనే సేకరించారు. సర్వేనెంబర్ 202/A1లో ని కోట్లాదిరూపాయల విలువైన భూమిని కేంద్రకార్యాలయానికి కేటాయించారు. ఇప్పటికే ఒక కేంద్రకార్యాలయం ఉంటే, మరోకార్యాలయం కోసం 2ఎకరాలభూమి కావాలా? పేదలు శాశ్వతంగా నివాసముండేందుకు మాత్రం చిత్తుకాగితంతో సమానమైన పట్టాలను కేటాయిస్తారా?
పార్టీ కార్యాలయం నిర్మాణానికి మాత్రం కోట్లువిలువైన క్లియర్ టైటిల్ ల్యాండ్ ఎంపికచేసుకుంటారా? ఇదే నా జగన్ రెడ్డి నీకు పేదలపై ఉన్న ప్రేమ, అభిమానం? పార్టీ కేంద్ర కార్యాలయం అనేది రాజధానిలో ఉంటుంది. అమరావతి జగన్ రెడ్డి దృష్టిలో రాజధాని కానప్పుడు అక్కడే రెండు కార్యాలయాలు ఎందుకు? జగన్ రెడ్డి దృష్టిలో నిజమైన రాజధాని విశాఖపట్నంకదా.. అక్కడ తానుపోగేసుకున్న అవినీతిసొమ్ముతో కొంతభూమిని కొని. అక్కడే వైసీపీ కేంద్రకార్యాలయం నిర్మించుకోవచ్చుకదా? అమరావతిప్రాంతంలో విలువైన 2 ఎకరాలు ఎందుకుతీసుకున్నారు? ఆ భూమినే జగన్ పేదలకు ఎందుకు ఇవ్వడు?
గతంలో అమరావతిని శ్మశానమని, ఎడారని, నిర్మాణాలకు పనికిరాని ముంపుప్రాంతమని దుష్ప్రచారం చేయించిన జగన్ ఇప్పుడు అక్కడే పేదలకు ఇళ్లపట్టాలివ్వడం అతని ద్వందవైఖరికి నిదర్శనం
అమరావతిని శ్మశానమని, ఎడారని, పశువులు తిరిగేప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాని ముంపుప్రాంతమని చెప్పిన్ జగన్ రెడ్డి, అతనిపరివారం ఇప్పుడు అక్కడేపేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకుఇస్తోంది? గతంలో రాజధానిపై చేసిన విషప్రచారం జగన్ రెడ్డికి గుర్తులేదా? నేడుకేవలం పేదల్ని వంచించే తన కపటనాటకానికి మాత్రం అమరావతి రాజధానిప్రాంతం జగన్ రెడ్డికి ఒక అద్భుతమైన నివాసప్రాంతంగా మారిపోయింది. జగన్ లా చంద్రబాబుగారు పేదల్ని వంచించేపనులు చేయలేదు. పేదలు శాంతంగా, సంతోషంగా రాజధానిప్రాంతంలో నివాస ముండాలని అన్నిహంగులతో అధునాతనశైలిలో 5వేలఇళ్లు నిర్మించారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్నిలక్షలఇళ్లు నిర్మించడం జరిగింది. ఆ ఇళ్లప్రాంగణంలో ఇటీవలే చంద్రబాబుగారు సెల్ఫీదిగారు. నారాలోకేశ్ గారు యువగళంయాత్రలో భాగంగా టీడీపీప్రభు త్వం పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్ల సముదాయంవద్ద సెల్ఫీలు దిగి, జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. వారిమాదిరే జగన్ రెడ్డి ఇదిగోపేదలకోసం తాను ఇదినిర్మించానని చెప్పి అక్కడ సెల్ఫీ దిగగలడా? సెంటుపట్టాలపేరుతో పేదలకు ఇచ్చిన పనికిరానిస్థలాల్లో సెల్ఫీ దిగు జగన్ రెడ్డి. శ్మశానాలపక్కన, వాగులు, వంకల్లో, కొండలుగుట్టలపై పేదలకు ఇచ్చినపనికిరాని సెంటుపట్టాభూముల్లో సెల్ఫీదిగి, ఆ ఫోటోల్ని తనసాక్షిపత్రికలో ప్రచురించే దమ్ము, ధైర్యం జగ న్ రెడ్డికి ఉన్నాయా?
జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం చేపట్టిన సెంటుపట్టాల పంపిణీ మొత్తం జేబులునింపుకోవడానికి చేపట్టిందేగానీ, పేదలకు మంచిచేయడానికి కాదు. ఇళ్లస్థలాలకో సం కొన్నభూముల్లో అవినీతి, ఆభూముల్ని చదునుచేయడంలో అవినీతి, ఎందుకూ పనికి రాని సెంటు పట్టాల్నిపేదలకు కేటాయించడంలో అవినీతి. ఇదే జగన్ చేసింది.
జగన్ పేదలకు న్యాయం చేసేవాడయితే PMAY గ్రామీణ్ పథకం కింద 2019 నుంచి 2023 మధ్యవారికోసం కేవలం 823 ఇళ్లు మాత్రమే ఎందుకు కట్టాడు?
పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రే ఇళ్లపట్టాలు, ఇళ్లనిర్మాణంపేరుతో జగన్ ఆడుతున్న నాటకాల్ని బయటపెట్టారు. ఫిబ్రవరి 8, 2023న కేంద్రమంత్రి పార్లమెంట్ కు ఇచ్చిన సమాధానంలో PMAY (ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన్ పథకం) కింద 2019 నుంచి 2023 ఫిబ్రవరి2వరకు జగన్ ప్రభుత్వం పేదలకు కట్టినఇళ్లు కేవలం 823మాత్రమే అని స్పష్టంగాచెప్పారు. ఏపీప్రభుత్వం మాత్రమే పేదలఇళ్లనిర్మాణంలో వెనుకబడిందని స్వయంగా కేంద్రమంత్రే చెప్పారు. అదే మంత్రి ఇతరరాష్ట్రాలు పేదలకోసం ఎన్ని ఇళ్లుకట్టాయో కూడా చెప్పారు.
తమిళనాడు ప్రభుత్వం 2019 నుంచి 2023 మధ్యన పేదలకోసం 3లక్షలఇళ్లు నిర్మించింది. రాజస్థాన్ ప్రభుత్వం 2022-23మధ్య ఒక్కసంవత్సరంలోనే 2.54లక్షలఇళ్లు కట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసంవత్సరంలోనే 7.62లక్షలఇళ్లు కట్టింది. ఈశాన్యరాష్ట్రాల్లో చిన్న రాష్ట్రమైన అస్సాంకూడా 2.15లక్షల ఇళ్లుకట్టింది. బీహార్ ప్రభుత్వం 9.59లక్షలఇళ్లుకట్టింది. కానీ జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం మాత్రం 4ఏళ్లలో ముక్కిమూలిగీ PMAYG కింద కేవలం 823ఇళ్లు మాత్రమేకట్టింది. ఇదేనా జగన్ కు పేదలపై ఉన్న ప్రేమ..అభిమానం? పేదలకోసం ఇళ్లుకట్టకపోగా తన తాడేపల్లి ప్యాలెస్ పక్కనఉన్నఇళ్లను నేలమట్టంచేయించిన పేదలద్రోహి జగన్ రెడ్డి.
తనకు ఇష్టమైనప్పుడు, డ్రామాలు ఆడాలనుకున్నప్పుడే అమరావతి జగన్ రెడ్డికి రాజధానిగా కనిపిస్తుంది.
తనకు ఇష్టమైనప్పుడు, డ్రామాలు ఆడాలని అనుకున్నప్పుడు మాత్రమే జగన్ రెడ్డికి అమరావతిప్రాంతం రాజధానిగా కనిపిస్తుంది. లేనిపక్షంలో తనకు విశాఖమాత్రమే రాజధాని అని, రేపోమాపో అక్కడే కాపురం పెడతానని జగన్ చిలుకపలుకులు పలుకుతుంటాడు. తనకు నచ్చనప్పుడుమాత్రం అమరావతి ఎందుకు పనికిరాదని, అక్కడ ఎవరూ నివాసం ఉండరని చెబుతాడు. రాజధానిప్రాంతంలో పేదలఇళ్లుసహా, ఏ విషయంలో అయినా ఒక విజన్ తో, మంచిఆలోచనతో ముందుకెళ్లింది చంద్రబాబుగారు ఒక్కరే.
పేదల ఇళ్లకోసం రాజధానిప్రాంతంలో 5శాతంభూమి కేటాయించడంతో పాటు, అక్కడే 5వేల ఇళ్లు పూర్తి చేసిన ఘనుడు చంద్రబాబు. 2014 -2019మధ్య రాష్ట్రవ్యా ప్తంగా పేదలకోసం దాదాపు 8లక్షలఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టి, దాదాపు3.50లక్షల ఇళ్లను పూర్తిచేసిన పేదలపక్షపాతి చంద్ర బాబు. ఆయన ఆలోచనలకు విరుద్ధంగా జగన్ రెడ్డి కేవలం చిత్తుకాగితంతో సమానమైన ఇళ్లపట్టాలను పేదలకు కేటాయిస్తూ రాజకీయకుట్రలో భాగంగా వారిజీవితాలతో ఆడుకుంటున్నాడు. పేదవాడి ఇల్లు అనేది తెలుగుదేశంపార్టీ గుర్తులోనే ఉంది. కూడు, గుడ్డ, నీడ అనే సిద్ధాంతంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన చూపిన బాటలో చంద్రబాబుగారు 2014-19మధ్య లక్షల ఇళ్లను పేదలకోసం నిర్మిస్తే, వాటిని జగన్ రెడ్డి దయ్యాలకొంపలుగా మార్చాడు.
తనపార్టీ కేంద్రకార్యాలయ నిర్మాణానికి కేటాయించుకున్న జగన్ అదే భూమిని పేదల ఇళ్ల కోసం ఎందుకు ఇవ్వడో సమాధానం చెప్పాలి
తాడేపల్లి ప్యాలెస్ పక్కన పేదలు ఉండకూడదన్న సంకుచితమనస్తత్వంతో 1000ఇళ్లను ఎందుకు నేలమట్టం చేయించాడో జగన్ రెడ్డి సమాధానంచెప్పాలి. ఓటీఎస్ స్కీమ పేరుతో గతప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లమీద ఒక్కోఇంటికి రూ.10వేలచొప్పున వసూలుచేసిన సొమ్ము ఏంచేశారో జగన్ రెడ్డి ప్రజ లకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డిప్రభుత్వం నాలుగేళ్లలో పేదలకోసం కేవలం 823ఇళ్లు మాత్రమేకట్టిందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏంసమాధానం చెబుతారో చెప్పండి. భవిష్యత్ లో టీడీపీప్రభుత్వం వచ్చినవెంటనే చంద్రబాబుగారు రాజధానిప్రాంతంసహా, రాష్ట్రవ్యాప్తంగా సకలసౌకర్యాలతో పేదలకోసం అధునాతన గేటెడ్ కమ్యూనిటీఇళ్లను, నిర్మాణయోగ్యమైన స్థలాలను కేటాయిస్తారు.” అని పట్టాభిరామ్ స్పష్టంచేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన నివాసముండే అమరారెడ్డి కాలనీలోని 1000పేదకుటుంబాల్ని నేలమట్టంచేయించిన జగన్ రెడ్డి దాష్టీకానికి ప్రబల నిదర్శనాలుగా నిలిచిన గూగుల్ ఫోటోలను పట్టాభిగారు మేటర్ కు జతపరిచారు.