Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా తీర్పును జగన్ రెడ్డి ఒప్పుకో లేకపోతున్నాడు

• ఆధారాలేవు, అనుమానాలు ఉన్నాయంటూ ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
• ఐప్యాక్, ఆరా మస్తాన్ లాంటి వారితో సర్వేలు చేస్తే ప్రజానాడి జగన్ రెడ్డికి ఎలా తెలుస్తుంది
• బటన్ లు నొక్కి నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేశాననడం జగన్ రెడ్డి అధికార బ్రాంతికి నిదర్శనం
• జగన్ రెడ్డి ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూసి ప్రతిపక్ష నేతలను జైలుకు పంపాడు
• ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి జగన్ రెడ్డికి జనం తగిన గుణపాఠం చెప్పారు
– మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్

ప్రతిపక్ష నాయకుడిపై కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని జగన్ రెడ్డి కుట్ర పన్నితే జనం జగన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్యాలెస్ వదలని జగన్ రెడ్డి అధికార బ్రాంతిలో ఉన్నాడని.. అన్ని చేసినా ఓడి పోయామని.. ఓటమిపై అనుమానాలు ఉన్నాయని.. కాని ఆధారాలు లేవంటూ జగన్ రెడ్డి బేలగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బటన్ లు నొక్కినంత మాత్రానా ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేసినట్లు కాదన్నారు. మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా పాదయాత్ర చేస్తాననడం… ప్రత్యేకహోదాపై నోరు తెరవడం జగన్ రెడ్డి నీచరాజకీయానికి నిదర్శనం అన్నారు.

మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలో 150 సీట్లకుపైనా వస్తాయి.. జూన్ 4 తరువాత ఉద్యోగులపై ఎటువంటి ఒత్తిడి ఉండదని నేను ఎన్నికలకు ముందే స్పష్టం చేశా. సజ్జల మాత్రం ప్రజా తీర్పు వైసీపీకే ఉంటుందని బల్లగుద్ది చెప్పాడు. రిజల్ట్ వచ్చాక నోరు ఎల్లబెట్టారు. ప్రజా తీర్పును ఆమోదించడానికి జగన్ రెడ్డికి మనసు ఒప్పుకోవడంలేదు.

ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయని.. ఆధారాలు లేవంటూ ఎంతో బెలగా మాట్లాడాడుతున్నాడు. 2019 లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్నప్పుడు.. ఓటు ఎవరికి వేసేది స్పష్టంగా కనబడుతుంది కదా.. అందులో అనుమానం ఏముందని జగన్ రెడ్డి ఆనాడు అన్నాడు. ఇప్పుడెందుకు మరి అనుమానాలు.

ఎన్ని శాంపిల్స్ తీసినా.. ఐప్యాక్, ఆరా మస్తాన్ లాంటి వారితో సర్వేలు చేస్తే ప్రజానాడి జగన్ రెడ్డికి ఎలా తెలుస్తుంది. ? మళ్లీ సిగ్గులేకుండా ఈవీఎంల మీదా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరా మస్తాన్ లాగే బీజేపీకి 300 దాటుతాయని చాలా సర్వేలు చెప్పాయి. కానీ బీజేపీకి 240 కే పరిమితం అయ్యింది. మ్యాజిక్ ఫిగర్ 270 కు చేరుకోలేదు. అంతేగాక రామ మందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది.. సీతాపూర్ లో కూడా బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఈవీఎంల మీద ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు. వైసీపీ నేతలు మాత్రమే అనుమానిస్తున్నారు.

KK సర్వే వైసీపీకి 14 సీట్లు కంటే ఎక్కువ రావని స్పష్టం చేసింది. అలాగే వచ్చాయి. జగన్ రెడ్డి ప్యాలెస్ వదిలి బయటకు రాలేదని.. జిల్లాలో ఉండకపోవడం, జిల్లా టూర్ లు చేయకపోవడం, ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం వైసీపీకి ఘోర ఓటమికి కారణమని స్పష్టమైన విశ్లేషణతో kk సర్వే అనాడే చెప్పారు. కూటమిని నేతలు తోడేళ్లని జగన్ రెడ్డి, వైసీపీ నేతలు అంటే.. శ్రీకృష్ణార్జునలను చేసి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.

చంద్రబాబు చేసిన వాగ్ధానాలనుగుణంగా అధికారం చేపట్టిన వెంటనే సంతకాలు చేస్తే… వైసీపీ నేతలు శిశుపాలుడి పాలనంటూ అపహాస్యం చేయడం సిగ్గుచేటు. ఒడిసాలో నవిన్ పట్నాయక్ లాంటి నేతలు ఒడిపోయినా కొత్త ప్రభుత్వంతో స్టేజి పంచుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించారు. ఆలాంటి సాంప్రదాయ రాజకీయాలు రాష్ట్రంలో అవసరం. శిశుపాలుడు ఎవరో ప్రజలు తేల్చారు. అందుకే వైసీపీకి ప్రతి పక్ష హోదా కూడా దక్కుండా చేశారు.

పరస్పర వైవిద్యమైన ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. ఎందుకు ఓడిపోయారో ఆత్మ విమర్శ చేసుకోకుండా… నేను అది చేశాను ఇది చేశాను. బటన్ నొక్కాను అయినా ఓడియానంటూ.. అధికార పొరలు కమ్ముకొని పోయి మాట్లాడుతున్నారు. ఐదేళ్ల పాలనలో 22 ఎంపీలు ఉంచుకొని ప్రత్యేక హోదాపై నోరు మెదపకుండా.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట్లడటం వైసీపీ నీతిమాలిన రాజకీయాలకు ఇదే నిదర్శనం.

ముస్లిం వ్యతిరేక చట్టాలకు కేంద్రంలో మద్దతు తెలిపి ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో ముస్లింలు ఊర్లు విడిచిపోయే పరిస్థితికి తీసుకు వచ్చారు. కేంద్రం నుండి మైనార్టీల సంక్షేమానికి వచ్చిన 400 కోట్లను జగన్ రెడ్డి దారిమళ్లించారు. ముస్లింల డిపార్ట్ మెంట్ లు లేకుండా చేశారు. ముస్లింల నిదులు కాజేశారు. సాధికారిత పేరుతో మైనార్టీలను, బీసీలను పేద, బడుగు బలహీన వర్గాలను దగా చేశారు.

ఇప్పుడు గొంతుకలేని గొంతుక అవుతానంటున్నాడు జగన్ రెడ్డి. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ప్రజల గొంతు విన్నారా? జై జగన్ అననందుకు తోట చంద్రయ్య గొంతు కోసి చంపారు. ఎలక్షన్ లు అయిన తీరువాత కూడా టీడీపీ కార్యాకర్తలను చంపుతున్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉంటే ఊర్లలో ఉండలేమని ప్రజలు అనే స్థితికి వచ్చేలా ధమన కాండను సాగించారు.

అక్రమ కేసులు పెట్టి ప్రజలను హింసించారు. అంగన్ వాడీలు, టీచర్లను అణిచివేశారు. వారసత్వ రాజకీయాలతో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను హింసించాడు. జగన్ రెడ్డి ఒక్క ప్యూన్ ను తప్పా ఎవరినీ కలవలేదు. వైసీపీ నేతలే ఇది చెబుతున్నారు. జగన్ రెడ్డి కార్పొరేట్ కల్చర్ నుండి బయట పడలేని స్థితిలో ఉన్నాడు. జగన్ రెడ్డిని కలవాలంటే 12 అంచెల భద్రతను దాటాలి. అపాయింట్ మెంట్ కోసం నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. కూటిమి అధికారంలోకి రావడంతో ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజాదర్భార్ మొదలైంది… అప్పుడే లోకేష్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలు వింటున్నారు.

నాకు సత్తువ ఉంది నేను మళ్లీ పాదయాత్ర చేయగలను.. కళ్లుమూసుకుంటే ఐదేళ్లు గడిచిపోతాయి అంటున్నారు. కష్టపడితే కదా.. ఐదేళ్లు ఎక్కడికి పోతాయో తెలిసేది. అధికారమే పరవాదిగా జగన్ రెడ్డి తంతు కొనసాగింది. ప్రతిపక్షం లేకుండా చేయాలనేది జగన్ రెడ్డి దుర్మార్గంపు ఆలోచన. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఈరోజు వైసీపీకి ప్రతిక్ష హోదా కూడా లేకుండా చేశారు. మళ్లీ ఈరోజు పక్కవారిపై విమర్శలు చేస్తున్నారు.

ప్రజలకు సౌకర్యాలు కల్పించడం నాయకులు బాధ్యత. బటన్ నొక్కి నేను అన్నిఇచ్చాననుకోవడం సిగ్గుచేటు. జగన్ రెడ్డిని ఏ వర్గం నమ్మలేదు. ముస్లింలు కూడా చంద్రబాబు వైపు నడిచారు. 200 కోట్లు చంద్రబాబు ముస్లింలకు ఇచ్చారు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ఇచ్చారు. ముస్లింల రిజర్వేషన్ కాపాడారు.

బటన్ లు నొక్కి నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేశాననడం జగన్ రెడ్డి అధికార బ్రాంతికి నిదర్శనం. బటన్ లు నొక్కితే సరిపోతుందా? అభివృద్ధి చేయడం జగన్ బాధ్యత కాదా? లిక్కర్ స్కాం తో పాటు ఆడుదాం ఆంద్రా లాంటి ఎన్నో స్కాంలు ఒక్కోక్కటి బయటకు వస్తున్నాయి. ఎవరూ తప్పించుకోలేరు. జగన్ రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేశాడు.

బటన్ లు నొక్కి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. బటన్ లు నొక్కినా ప్రజలు ఓట్లు వేయలేదని బేలగా మాట్లాడటం జగన్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. ప్రతి రంగాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్న బైబిల్ వ్యాఖ్యాన్ని జగన్ రెడ్డి మరిచాడు. కొడికత్తి శ్రీనును ఐదేళ్లు జైల్లో మగ్గేలా చేశాడు.

ఇంకా జగన్ రెడ్డి అదే తీరులో నడుస్తున్నాడు… దీంతో వైసీపీ ఉంటుందా… పత్తా లేకుండా పోతుందా ఆపార్టీ మనుగడపై వైసీపీ నేతలకే సందేహం పట్టుకుంది. వైసీపీని ఏ వర్గం నమ్మడంలేదు. జగన్ రెడ్డి మళ్లీ ప్రజల్లో తిరుగుతాననంటున్నాడు. ఆయన కేసుల్లో బీజీ అవుతారు. ఆ పెత్తందారులే జగన్ రెడ్డి వెంట ఉన్నారు. ఈ స్కామ్ లు, కేసుల నుండి తప్పించుకోవడం జగన్ రెడ్డికి, పెత్తందారులకు చాలా కష్టం. ఇది వైసీపీ నేతలే చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ మనుగడ కష్టం.

LEAVE A RESPONSE