– ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది నిజం కాదా?
– జగతి పబ్లికేషన్స్ ద్వారానే సాక్షి పత్రిక నడుస్తోంది వాస్తవం కాదా?
– లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను కాపాడేందుకే జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన
– సీబీఐ విచారణలో అందరి పేర్లూ బయటకు వస్తాయి
– రూ. 10 వేల కోట్ల ఆదాయం నుంచి వాటిని రూ. 30 వేల కోట్లకు తీసుకురావడమేనా మద్యపాన నిషేదమంటే?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి, ఏ2 విజయసాయి రెడ్డి పాత్రను మేము బయటపెట్టామని అక్కసుతోనే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మూక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నారా భువనేశ్వరి , నారా బ్రాహ్మణి గురించి ఆరోపణలు చేస్తున్నారు. హెరిటేజ్ సంస్థ ద్వారా వారు లక్షలాది రైతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా లక్షలాదిమందికి తోడ్పాటు అందిస్తున్నారు. నిత్యం ప్రజాసేవలో ఉన్న భువనేశ్వరి, బ్రహ్మణి పై అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేతలు మాట్లాడ్డమంటే ఆకాశంపై ఉమ్మేయడమే. మాకు సంస్కారం ఉంది కాబట్టే వైఎస్ భారతి, షర్మిల గురించి దూషణలు చేయలేదు. వ్యక్తిగత దూషణలకు దిగకుండా లిక్కర్ స్కామ్ పై మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా మీకు?
• అదాన్ డిస్టలరీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనాక రోహిత్ రెడ్డి బినామీ కంపెనీగా రుజువైంది వాస్తవం కాదా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టింది నిజం కాదా?జగతి పబ్లికేషన్స్ ద్వారానే అవినీతి సాక్షి పత్రిక నడుస్తోంది వాస్తవం కాదా? బోలారం శివకుమార్, శ్రీనివాస్ కాశిచాయానుల, ముప్పిడి అవినాష్ రెడ్డి పేరుతో అదాన్ డిస్టిలరీలను విజయసాయిరెడ్డి నడుపుతున్నాడు.
• ఏపీలో రెండేళ్ల క్రితమే బినామీల పేరుతో అదాన్ డిస్టిలరీస్ ను స్థాపించిన విజయసాయిరెడ్డి వాటి ద్వారా వచ్చిన రూ.2వేల కోట్లను ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈఎండీ లుగా కట్టారు. దీనికి జగన్ రెడ్డికి, వైఎస్ భారతీ కి సంబంధాలున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కంపెనీల్లో ట్రైడెంట్ కంపెనీ ఒకటి. ట్రైడెంట్ కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, తన తమ్ముడు రోహిత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ అధినేత వైఎస్ భారతి ఢిల్లీ కుంభకోణంలో కీలకపాత్రదారులు, సూత్రదారులుగా ఉన్నారు.
• త్వరలోనే ఢిల్లీ కుంభకోణంపై సీబీఐ ఛార్జిషీట్లు వేయబోతోంది. దీనిలో జగన్ రెడ్డి కి సంబంధించిన కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు నిందితులుగా తేలడం ఖాయం. తాడేపల్లి పునాదులు కదలడం ఖాయం. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను కాపాడేందుకే జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పైకి మాత్రం ప్రత్యేకహోదా, పోలవరం, వెనకబడిన జిల్లాల ప్యాకేజ్ అంటూ అబద్ధాలు చెబుతున్నారు.
• నాడు చెరుకు రైతులను ఆదుకునేందుకు చందబాబు డిస్టలరీలు తెస్తే నేడు వాటిలో మద్యం పారిస్తున్నారు. రూ. 10 వేల కోట్ల ఆదాయం నుంచి వాటిని రూ. 30 వేల కోట్లకు తీసుకురావడమేనా మద్యపాన నిషేదమంటే?మందు బాబులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోడమేనా మద్యపాన నిషేదం? ట్యాన్జీనియాలోనే కాకుండా ప్రపంచమంతా లిక్కర్ స్కామ్ చేసి చిప్పకూడుతిన్న చరిత్ర వైఎస్ కుటుంబంది. కాదని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పగలరా?
• ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి రెడ్డి విజయసాయి రెడ్డి సహా పలువురు వైసీపీ నేతల పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.సీబీఐ విచారణలో అందరి పేర్లూ బయటకు వస్తాయి. కేంద్రం ప్రత్యక దృష్టి పెట్టి లిక్కర్ స్కామ్ లో ఎవరి పాత్ర ఏంటో నిగ్గు తేల్చాలి.