-యాత్ర-2 సినిమా వైకాపా నాయకులకు అంతిమయాత్ర
-జగన్ రెడ్డి అంటే జైలు. చంద్రబాబు విజనరీ
-అవినీతి ఆరోపణలపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా?
-శ్రీకాకుళం ప్రజల స్పీడే వేరు, మీ పట్టే వేరు
-సొంత అమ్మ, చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదు
-ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తాడా?
-షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా రెడ్డి శాంతి అమ్ముకుంటున్నారు
-మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం
-వారి అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లాయి
-పాతపట్నం శఖారావం సభలో యువనేత లోకేష్
గత నాలుగేళ్ల 10 నెలలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన జెండా దించకుండా, మడమతిప్పకుండా కాపుకాసిన పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడేతత్వం.దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వాసులే ఉంటారు. శ్రీకాకుళం ప్రజల స్పీడే వేరు, మీ పట్టే వేరు. ఎవరైనా మంచిపని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా హాని చేస్తే తాటతీస్తారు.
గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఇక్కడ నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ రెడ్డికి ఒక శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల పగిలిపోతుంది. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి. పాదయాత్రలో దొరికిన ప్రతి మహిళకు ముద్దులు పెట్టారు. తర్వాత గుద్దులు గుద్దుతున్నారు.
జాబ్ కేలండర్ కాస్తా సాక్షి కేలండర్ లా మారింది. డీఎస్సీ మోసం, బీసీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య, 6500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారు. ఎన్నికలకు ముందు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. సమయం లేకపోవడమే కాదు. పోస్టులు కూడా తక్కువ. 800 గ్రూప్ -2 పోస్టులకు 5 లక్షల మంది రాశారు. ఇది ప్రజలకు జగన్ రెడ్డి చేసిన మోసం కాదా?
రెండు నెలలు ఓపికపట్టండి, టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది. ఏటా జాబ్ కేలండర్ ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగులు అధైర్యపడవద్దు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలలు ఓపిక పడితే అందరినీ ఆదుకుంటాం.
జగన్ బిల్డప్ బాబాయి. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది కాస్తా వైకాపా నాయకులకు అంతిమయాత్ర అయింది. ఆ సినిమా చూడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. క్వార్టర్ ఇచ్చినా చూసే ప్రసక్తే లేదు. జగన్ రెడ్డి సైకో, హిట్లర్. మనం చేసిన మంచి పనులకు రంగులు వేసి తామే కట్టామని బిల్డప్ ఇస్తారు.
మనం కొన్న భూమి పత్రాలపైనా జగన్ రెడ్డి ఫోటోలే. సర్వే రాళ్లపైనా జగన్ రెడ్డి బొమ్మ. మీ బిడ్డ,మీ బిడ్డ అని భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు లా మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నారు. జగన్ రెడ్డి అంటే జైలు. చంద్రబాబును చూస్తే విజనరీ గుర్తుకువస్తాడు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపారు. లక్ష కోట్లు లూటీ చేసిన జగన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తాడు. జగన్ కు సవాల్ విసురుతున్నా… అవినీతి ఆరోపణలపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా?
బాంబులకే భయపడని కుటుంబం మాది… కేసులకు భయపడతామా? నేను రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. తప్పు చేస్తే వచ్చి అరెస్ట్ చేసుకోండి. సొంత అమ్మ, చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఇంటి నుంచి గెంటేశారు.
షర్మిలపై వైకాపా పేటీఎం కుక్కలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఎవరికి పుట్టావు, పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. వైఎస్ పరువు కూడా తీసేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తాడా? జగన్ ను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకు వస్తాడు. బల్లపైన బ్లూ బటన్ నొక్కి రూ.10వేసి, కింద ఉన్న రెడ్ బటన్ నొక్కి వంద కట్ చేస్తాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుదు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, త్వరలో పీల్చే గాలిపైనా పన్ను వేసే వ్యక్తి జగన్.
దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకువచ్చి వాటిపైనా బాదుడే బాదుడు. టీడీపీ తీసుకువచ్చిన 100 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. మనం ప్రజల్లోకి వెళ్లి సంక్షేమం గురించి చర్చించాలి. ఏపీకి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. కిలో రూ.2కే బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ అందించారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టారు. దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అప్పటివరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ఐదేళ్లలో రూ.90వేలు ఇస్తాం. ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తాం.
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే రూ.45వేలు వస్తాయి. రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ ఇస్తాం. డేట్, టైం రాసుకోండి. జగన్ లా పరదాలు కట్టుకునే వెళ్లే బ్యాచ్ కాదు నేను.. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తిని.
ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ రెడ్డి. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రూ.500 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ రూ.500 కోట్లతో పేదలకు వేల ఇళ్లు కట్టవచ్చు. రోడ్లు వేయవచ్చు. నియోజకవర్గాల రూపురేఖలు మార్చవచ్చు. రైల్వే జోన్ కు భూములు కేటాయించని వ్యక్తి జగన్.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. అవసరమైతే ఉక్కు ఫ్యాక్టరీని మన రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. శ్రీకాకుళం జిల్లాకు 60 హామీలు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి మాట తప్పారు. వంశధార, నాగావళి, తోటపల్లి ప్రాజెక్టులకు ఒక్క తట్ట మట్టి వేయలేదు.
వంశధార-నాగావళిని అనుసంధానం చేసేందుకు చంద్రబాబుకృషి చేశారు. 70శాతం పనులు పూర్తిచేశాం. రోడ్లు, పాఠశాలలు, ఎన్టీఆర్ సుజల వంటి, కిడ్నీ రోగులకు డయాలసిస్ సెంటర్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పాతపట్నంకు రూ.1400 కోట్లతో మేం అభివృద్ధి చేశాం, 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు పూర్తిచేశాం. మరో 5 ప్రారంభిస్తే ఇప్పుడు నిలిపివేశారు. 10వేల ఇళ్లు కట్టాం. రూ.420 కోట్లు వంశధార నిర్వాసితులకు ఇచ్చాం.
ఏకలవ్య పాఠశాలలు, చేనేత భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. సోలార్ ప్లాంట్ లు తీసుకువచ్చి తాగునీరు అందించాం. అయినా 2019లో ఓడిపోయాం. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం. వారి అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ రెండు నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనపై ఉంది. మినీ స్టేడియం, మోడల్ డిగ్రీ కాలేజ్, మహిళలకు హాస్టల్స్, ఏకలవ్య పాఠశాలలు, జూనియర్ కళాశాలకు అవసరమైన భవనాలు, చేనేత భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం.
నేను మంత్రిగా ఉన్నప్పుడు తండాల్లో దాహార్తిని తీర్చేందుకు సోలార్ ప్లాంట్ లు తీసుకువచ్చి తాగునీరు అందించాం. అయినా 2019లో ఓడిపోయాం. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం. వారి అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ రెండు నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనపై ఉంది.
2019లో వైసీపీ తరపున గెలిచిన రెడ్డి శాంతి చాలా అనుభవమున్న వ్యక్తి అనుకున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా, ఒక్క రోడ్డు వేశారా, ఒక్క ప్రాజెక్టు కట్టారా, నియోజకవర్గానికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధం. ఇసుకను దోచేస్తున్నారు. పాఠశాల స్థలాన్ని కొట్టేయాని చూస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే కంపెనీనే చేయాలి. ఏ పనిలోనైనా కమీషనే.
అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా రెడ్డి శాంతి అమ్ముకుంటున్నారు. వెంకటరమణ నన్ను కొన్ని పనులు చేపట్టాలని కోరారు. తన్నే దున్నపోతు జోలికి వెళ్లరు, పాలిచ్చే ఆవుకు దగ్గరికే వెళ్లి ఎన్ని పాలిస్తారని అడుగుతారు. తన్నే దున్నపోతు వైసీపీ అయితే పాలిచ్చే ఆవు టీడీపీ. పాతపట్నం కు పాలిటెక్నిక్ కళాశాల నేను తీసుకువస్తా. జిల్లాకు ఐటీడీఏ తీసుకువస్తా. మొదటి రెండేళ్లలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తా.
అనంతకు కియా మాదిరిగా శ్రీకాకుళంకు పరిశ్రమలు తీసుకువస్తాం. పాతపట్నంకు పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఉత్తరాంధ్రకు సెజ్ తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ. నేతలు పార్టీలు మారవచ్చు. కార్యకర్తలు మాత్రం పసుపు జెండా కోసం ఏనాడూ పార్టీ మారలేదు.
2014లో ఎవరూ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటుచేశాం. రూ.2 లక్షల ప్రమాదబీమా కల్పించాం. వంద కోట్లు ఖర్చు చేశాం. వారి పిల్లలను కూడా మా తల్లి భువనేశ్వరమ్మ చదివిస్తున్నారు. నాకు అక్క చెల్లెమ్మలు లేరు. నాకు అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు.
మనపై అనేక కేసులు పెట్టారు. రౌడీషీట్లు కూడా ఓపెన్ చేశారు. నాపై 22 కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలను అడుగుతున్నా.. నా కంటే ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయి? నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే ఎన్నికలయ్యాక వారికి అంతపెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తా.
ఈ కేసులు రేపు ఉండవు. చట్టాన్ని అతిక్రమించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నా. వారికి చక్రవడ్డీతో సహా చెలిస్తాం. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైకాపాకు లోకేష్ మూర్ఖుడు. వైసిపి దొంగలు ఇతర రాష్ట్రాలకు పారిపోయినా పట్టుకువచ్చి జైలుకు పంపిస్తా. సూపర్ -6 హామీలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి. ఈ కేలండర్లు ప్రతి ఇంటికి అందించాలి. ఎవరు కనిపించినా సూపర్ -6 హామీల కార్డు ఇవ్వాలి.
బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ వంటి పార్టీ కార్యక్రమాల్లో ఎవరు బాగా చేస్తే వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రానికి వస్తుంటే విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. కారులో వస్తుంటే బోర్డర్ లో ఆపేశారు. టీడీపీ-జనసేన మధ్యలో చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇరుపార్టీల పెద్దలు అభ్యర్థులను నిర్ణయిస్తారు. నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది.
టీడీపీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తాం. పెండింగ్ లో ఉన్న ఆసుపత్రిని పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం. రెండు నెలలు ఓపికపట్టండి. టిడిపి-జనసేన ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది.