– జగన్ రెడ్డి అసమర్థత, అవినీతితో రాష్ట్ర వ్యవసాయ రంగం నిర్వీర్యమైంది
• అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగచేస్తానన్న జగన్, నాలుగేళ్లలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి కల్పించాడు
• పనిచేయని రైతుభరోసాకేంద్రాలు, అరకొరగా ఇచ్చేరైతురుణమాఫీ రైతుల్ని రక్షించి, వ్యవసాయాన్ని బతికించవు జగన్ రెడ్డి
• నాలుగేళ్లలో తాను, తనప్రభుత్వం రైతుల్ని ఏవిధంగా దోచుకుందో చెప్పడానికి జగన్ తెనాలి వస్తున్నాడా?
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
తనపాలనలో రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయరంగం బలోపేతానికి ఏంచేశాడో ప్రజలకు సమా ధానం చెప్పాకే, జగన్ రెడ్డి రేపు తెనాలిలో జరిగే రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొనాలని, అధి కారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండుగచేస్తానన్న జగన్, నాలుగేళ్లపాలనలో దండగగా మా ర్చేశాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు .
జూమ్ ద్వారా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
“ముఖ్యమంత్రి అయితే ప్రతిరైతుకి ఏటా రూ.13,500లు ఇస్తానన్న జగన్.. మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రంలోని కొద్దిమంది రైతులకు అరకొరగా ఏటా కేవలం రూ.7,500లు మాత్రమే ఇస్తున్నాడు. కేంద్రమిచ్చే సొమ్ముతో సంబంధంలేకుండా మొత్తం రూ.13,500లు ఇస్తానన్న వ్యక్తి, ఇచ్చినమాటతప్పి, రైతుద్రోహిగా మిగిలిపోయాడు. చంద్రబాబు అన్నదాతాసుఖీభవ కింద రైతులకు ఆర్థికసాయంచేయడానికి సొమ్ముని బ్యాంకుల్లో వేస్తే, ఎన్నికలకోడ్ పేరుతో జగన్ దాన్ని అన్నదాతలకు అందకుండా అడ్డుకున్నాడు. అలానే రైతురుణమాఫీ 4వ, 5వ విడతల సొమ్ము కూడా రైతులకు అందకుండా జగన్ మోకాలడ్డాడు. రైతులకష్టాన్ని, వారి భూముల్ని కొల్లగొట్టే జగన్ రెడ్డికి రైతులపేరెత్తే అర్హతకూడా లేదు.
రైతుభరోసా కేంద్రాలు రైతులకు ఏం మేలు చేస్తున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, స్ప్రేయర్ల లాంటివేవీ వారికి అందించలేని అనామకకేంద్రాలుగా రైతుభరోసా కేంద్రాలు మారాయి. యూరియా, డీఏపీ వం టి వాటికోసం రైతులు బహిరంగమార్కెట్లపై ఆధారపడాల్సిన దుస్థితిని జగన్ కల్పించాడు. అధికధరకు కొందామన్నా రాష్ట్రంలో రైతులకు సకాలంలో యూరియా దొరకని పరిస్థితి. రైతు లకు సకాలంలో పంటలబీమా అందిస్తాను.. ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటుధరల కల్పనతో రైతుల్ని ఆదుకుంటానన్న జగన్ రెడ్డి హామీలు నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి. తెనాలి నియోజకవర్గంలో పసుపు రైతులు గిట్టుబాటుధరలేక అల్లాడుతున్న వైనాన్ని ముఖ్యమంత్రి రేపు చూడాలి. వారికి ఏంన్యాయం చేస్తాడో తెనాలిసభలో సమాధానం చెప్పాలి. పనిచేయని రైతుభరోసాకేంద్రాలు, అరకొరగా ఇచ్చేరైతురుణమాఫీ రైతుల్ని రక్షించి, వ్యవసాయాన్ని బతికించవని జగన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది.
చంద్రబాబు హయాంలో రైతులకు అమలుచేసిన పథకాల్ని అటకెక్కించిన జగన్.. రైతు ద్రోహి కాక రైతుబాంధవుడా?
చంద్రబాబు హాయాంలో రైతులకు అందించిన యాంత్రీకరణ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, సూక్ష్మపోషకాల పంపిణీ, ఎన్టీఆర్ జలసిరి వంటిపథకాలను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అటకెక్కించాడు. రైతులకు పనికొచ్చే పథకాలన్నీ ఆపేసి, వారిని బిచ్చగాళ్లలా చూస్తున్న జగన్ రెడ్డి రైతుద్రోహికాక, రైతుబాంధవుడు అవుతాడా? వర్షాలు, వరదలకు, తెగుళ్లు, పురుగులతో పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ఈనాలుగేళ్లలో ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలేమిటి? పంటనష్టపోయిన రైతులు తిరిగి మరోపంట వేసుకోవడానికి ముందుకొస్తే, టీడీ పీప్రభుత్వం వారికి ఉచితంగా విత్తనాలు అందించింది. సబ్సిడీపై సూక్ష్మపోషకాలు, ఎరువు లు అందించి, ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించింది. జగన్ రెడ్డి రైతువ్యతిరేక విధా నాలతో ఆఖరికి రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించే దుస్థితికివచ్చారు. కేంద్రప్రభుత్వం అపరా లకు కల్పించిన గిట్టుబాటుధరను, వక్రీకరించి పశువులుతినే జొన్నకు ఒక రేటు, మను షులు తినే జొన్నలకు మరో రేటని జగన్ రైతుల్ని వేధిస్తున్నాడు.
తాను, తనప్రభుత్వం రైతులకష్టాన్ని దోచుకుంటోందని చెప్పడానికి ముఖ్యమంత్రి తెనాలి వస్తున్నాడా?
పండించిన పంటఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి ఆఖరికి రైతులకు టార్పాలిన్లు కూడా ఇవ్వ ని దిక్కుమాలిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచిపోయాడు. కాడి భుజానవేసుకొని కష్టాన్ని నమ్ముకొని బతికే రైతులకు కులాలు, మతాలు అంటగట్టిన చరిత్ర జగన్ ది. రాష్ట్రంలోని కౌలు రైతుల్ని గుర్తించి, వారికి ఆర్థికసాయం చేయలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? రాష్ట్రంలో ఎంతమందిరైతులకు జగన్ రెడ్డి వడ్డీలేనిరుణాలు ఇస్తున్నాడు? ఎందరు కౌలురైతులకు రైతుభరోసా సాయం చేస్తున్నాడు? చంద్రబాబు మేథస్సు నుంచి ఉద్భవించిన పట్టిసీమ ఎందుకూ పనికిరాదని మాట్లాడిన జగన్ రెడ్డి, రేపు తెనాలిలో ఆ పట్టిసీమ నీటితో పండిన పంటలు చూసి తరించవచ్చు.
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.64వేలకోట్లతో రాష్ట్రంలో సాగునీటిప్రాజెక్ట్లుల నిర్మాణం చేపట్టి, పోలవరాన్ని 72శాతంవరకు పూర్తిచేసింది. జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా ఒకప్రాజెక్ట్ ను పూర్తిచేసి, 4ఎకరాలకు నీరిచ్చింది లేదు. తనప్రభుత్వం రైతులశ్రమనుకూడా దోచుకుంటోందని చెప్పడానికి ముఖ్యమంత్రి తెనా లి వస్తున్నాడా? ఎన్నికలువచ్చే వేళలో మరలా రైతుల్ని వంచించి, పబ్బంగడుపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రిని అన్నదాతలు నమ్మేపరిస్థితిలేదు. రైతుకుకష్టం కలిగించి, వారిని నష్టాలపాలుచేసిన ఏప్రభుత్వం చరిత్రలో నిలిచింది లేదనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గుర్తించాలి” అని ఆలపాటి హితవుపలికారు.