– వైసీపీ మూడేళ్ల పాలనంతా నెల్లూరు జిల్లా రైతులకు కాళరాత్రులే
– రౌడీలను కంట్రోల్ చేసి బాధితులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ
– నెల్లూరు జిల్లా ఎస్పీ వైఖరి కారణంగా పలు ఘటనల్లో బాధితులకు తీవ్ర అన్యాయం
– పొదలకూరు మండలం సూరాయపాళెంలో గౌరవ సభ, బాదుడే బాదుడు కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఈ సందర్భంగా సోమిరెడ్డి ఏమన్నారంటే..
ఏ ఊరికి వెళ్లినా, ఏ వీధిలో తిరిగినా, ఏ ఇంటి గడపతొక్కినా ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.పెట్రో ధరల పెంపులో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పెట్రోలు, డీజిల్ పై దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నారు.
అన్నపూర్ణ లాంటి నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించిన రైతులకు వైసీపీ మూడేళ్ల పాలనలో 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కనీస మద్దతు ధర, రైతులు నిస్సహాయంగా అమ్ముకున్న ధరల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎవరూ పూడ్చలేని పరిస్థితి. నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ మూడేళ్ల కాలం రైతులకు జివితాంతం గుర్తుండిపోయేలా దారుణమైన దోపిడీ జరిగింది.
ఈ జిల్లా నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించినందుకు జగన్ రెడ్డి ఇచ్చిన బహుమానం రైతులను గుండెల్లో పొడవడం. రైతుల వద్ద ధాన్యం అంతా అయిపోయాక ఇప్పుడు ధరలు పెంచారు. పుట్టి రూ.11 వేలు, రూ.12 వేలకు రైతుల వద్ద కొనుగోలు చేసిన రైసుమిల్లర్లు, దళారులు ఇఫ్పుడు పుట్టి రూ.16 వేలు, 17 వేలకు అమ్ముకుంటున్నారు. వైసీపీ నాయకులు, దళారులు, రైసుమిల్లర్లు కలిసి రైతులను బలిచేసేశారు
పొరుగునే ఉన్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, రైతుల వద్ద ప్రతి గింజా ధాన్యం కొనుగోలు చేసి మూడో రోజే నగదు చెల్లిస్తోంది. మనకు మాత్రం కనీస మద్దతు ధర దక్కాలంటే పుట్టికి 200 కిలోలకు పైగా సమర్పించుకోవాలి..ఆర్నెళ్లకు కూడా డబ్బులు రాని దుస్థితి. అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు వైసీపీ పాలనలో అగ్రభాగాన కొనసాగుతున్నాయి.
జిల్లాలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖ ప్రతిష్టకే మాయనిమచ్చ తెస్తోంది. పోలీసుల నిర్లక్ష్యానికి నెల్లూరులో నిన్న ఒక యువకుడు బలైపోవడం బాధాకరం.తెలుగుదేశం పార్టీ అభిమానుల పొలాల్లోని ఫలసాయం ఎత్తుకెళ్లడం. చెట్లు నరికేయడం, వారి జీవనోపాధిపై దెబ్బగొట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం.న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే బాధితులే ముద్దాయిలుగా మారిపోతున్న అరాచక పరిస్థితి.
సాక్షాత్తు పోలీసు స్టేషన్ లోనే పోలీసుల సమక్షంలోనే బాధితులపై వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు చేస్తుండటం దురదృష్టకరం.ఈ అన్యాయాలు, అరాచకాలను అడ్డుకునే దమ్ము, ధైర్యం నెల్లూరు జిల్లా ఎస్పీకి లేకుండా పోయాయి.రౌడీలను కంట్రోల్ చేసి బాధితులను రక్షణ లేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకో?ఎస్పీ వైఖరి కారణంగా నిజాయతీపరులైన అధికారులు కూడా నిస్సహాయులుగా మిగిలిపోయారు.
టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, దామినేని రామానాయుడు, దామినేని నారాయణ, చేతల రవి యాదవ్, అడపాల సుధాకర్ రెడ్డి,సురేష్ రెడ్డి, మల్లికార్జున నాయుడు, జమీర్ బాషా, అజయ్ కుమార్ రెడ్డి,హనుమా రెడ్డి, కృష్ణ యాదవ్, ఆదాల సుగుణమ్మ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.