– రాయలసీమలో పుట్టినవారెవరూ ఇలాంటివి చేయరు
– తాడేపల్లి పిల్లి కాబట్టే, వైసీపీకండువాలు వేసుకున్న పోలీసులసాయంతో మాచర్లను మంటల్లో కాల్చేశాడు
• మండుతున్న మాచర్లసాక్షిగా చెబుతున్నాం. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి మిగిలేది 5స్థానాలే. పులివెందుల కూడా జగన్ కు దక్కదు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మాచర్ల మంటల్లో ఆహుతికావడానికి తాడేపల్లి పిల్లి, సలహాదారుసజ్జల, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, మాచర్ల సీఐ, స్థానికఎస్సై కలిసి చేసిన విధ్వంసమే కారణమని, మాచర్ల మారణహోమంపై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందేనని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …!
“మాచర్ల మండుతుంటే పరదాలమాటున దాక్కునే జగన్ తాడేపల్లిలో పబ్జీ ఆడుకున్నాడు. మాచర్లలో బ్రహ్మారెడ్డి అడుగుపెట్టాకే, అక్కడిఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది. పరిటాల రవిలానే, నిన్న మాచర్ల టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మరెడ్డిని చంపడానికి ప్లాన్ చేశారు. పల్నాడు తగలబడుతున్నా, ఢిల్లీలో అమరావతి రైతులు వణికిపోతున్నా, ముఖ్యమంత్రిలో చలనంలేదు. మాచర్లలో నిన్న మూడుగంటలపాటు జరిగిన దారుణాలు ఒకెత్తు అయితే, ఈరోజు మధ్యాహ్నం జరిగింది ఒకెత్తు. నేడు కూడా వైసీపీగూండాలు మాచర్లలో పేట్రేగినా పోలీసులు స్పందించలేదు. జగన్ రెడ్డే రాష్ట్రరావణాసురుడు. ఎన్నికట్టెలుపెట్టినా మరలా జగన్ గెలవడు. వచ్చేఎన్నికల్లో 5స్థానాలకంటే గెలవడు. 1983నాటి ప్రభంజనం చంద్రబాబు పర్యటనల్లో కనిపిస్తోంది. 151 ఎమ్మెల్యేల్లో 38మంది గెలవరని జగన్ రెడ్డే చెప్పాడు. కానీ వాస్తవం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో 5స్థానాలకే వైసీపీ పరిమితంకానుంది. పులివెందుల లో కూడా జగన్ గెలిచే పరిస్థితిలేదు. ఎమ్మెల్యేలను అడుక్కున్నా, మంత్రులను దేబిరించినా జగన్ రెడ్డికి మిగిలేది 5 అసెంబ్లీస్థానాలే. మండుతున్న మాచర్ల సాక్షిగా చెబుతున్నాం. లాఠీఛార్జ్ లో పోలీసుల దెబ్బలు బ్రహ్మారెడ్డికి తగిలాయి. బ్రహ్మారెడ్డిని పోలీసులు మాచర్ల నుంచి పంపించాక, పదికార్లలో వైసీపీమూకలు ఆయన్ని వెంటాడాయి.
టీడీపీ నేతలు, కార్యకర్తల్నికొట్టి, వారిఇళ్లు తగలబెట్టినవారిని వదిలేసి, మమ్మల్ని హౌస్ అరెస్ట్ లు చేయడమేంటి డీజీపీ?
పరదాలచాటున నక్కే ముఖ్యమంత్రికి మాచర్ల వెళ్లడానికి తీరికలేదా? మా కార్యకర్తల్నికొట్టి, వారిఇళ్లు తగలబెట్టినవారిని వదిలేసి, మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులకు సిగ్గుందా? మాచర్ల తగలబడితే గుంటూరు, విజయవాడలో టీడీపీనేతల్ని అరెస్ట్ చేస్తారా? ఇన్ ఛార్జ్ డీజీపీ నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మాచర్ల సీఐని, పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేశాకే డీజీపీ తనపోస్టులో ఉండాలి. వైసీపీకండువాలు వేసుకున్న ఖాకీల అండతో వైసీపీ గూండాలు, ఎమ్మెల్యే తమ్ముడు, తురకా కిశోర్ మాచర్లలో పశువుల్లా ప్రవర్తించారు. ఫ్యాకనిస్ట్ ముఖ్యమంత్రి, అరాచకాలు చేయమని సలహాలిచ్చే సజ్జల నేత్రత్వంలో పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తుందా? పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన విధ్వంసకాండ, అరాచకాలు, హత్యాయత్నాలు, గృహదహనాలు, ఆస్తులలూఠీ ఘటనలు, బ్రహ్మారెడ్డి ఇంటిని తగలబెట్టడం ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే జరిగింది. మాచర్ల మారణహోమంపై ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిందే. బుద్ధిలేని అంబటి, మూడేళ్లుమంత్రిగా చేయలేని వెధవలు మాట్లాడటంకాదు.
జగన్ రెడ్డి పల్నాడులో టీడీపీకి 16మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను పొట్టనపెట్టుకున్నాడు
జగన్ రెడ్డి ఒక్క పల్నాడులోనే 16మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతల్ని పొట్టనపెట్టుకున్నాడు.. తోటచంద్రయ్య, కంచర్ల జల్లయ్య, ఆరెద్దుల కోటయ్య, టీ.పాపిరెడ్డి, దాసి సుబ్బారావు, కే.రాజానాయక్, సైదుజాన్, దోమతోటి విక్రం, పురంశెట్టి అంకులు, అలీషా, ఖాదర్ బాషా, ఇలా ఎందరో జగన్ రక్తదాహానికి బలయ్యారు. 43నెలల పాలనలో వందలమందిని చంపించాడు. జగన్ రెడ్డి గొంతుకోయించినా బీసీనేత చంద్రయ్య జై చంద్రబాబనే అన్నాడు. పరదాల మాటున నక్కే జగన్ రెడ్డిలా చంద్రయ్య పిరికిపందకాదు. ఇదేంఖర్మ – పోలీస్ యంత్రాంగానికి, ఇదేం-ఖర్మ మనరాష్ట్రానికి నినాదాలు జగన్మోహన్ రెడ్డి చెవుల్లో మార్మోగుతున్నాయి. పట్టుమని 5 నిమిషాలుకూడా వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమంలో ప్రజలముందు నిలవలేకపోతున్నారు. బుద్ధిలేని ముఖ్యమంత్రి వచ్చే ఉగాదికి విశాఖకు మకాం మారుస్తున్నాడు. ఈ పిచ్చోడు విశాఖకు పోతే, తాము, తమపిల్లల భవిష్యత్ ఏమిటని అధికారులంతా బోరుమంటున్నారు.
మాచర్ల మంటల్లో కాలుతుంటే ఎస్పీ గడ్డిపీకుతున్నాడా?
అరాచకాలతోనే వచ్చేఎన్నికల్లో 175స్థానాలు గెలుస్తావా జగన్? రాష్ట్రంలోని ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదు. చాలామందికి పెన్షన్లు అందలేదు. ఇలాంటివి ప్రజలకు తెలియకూడదనే మాచర్లలో మారణహోమం సృష్టించారు. టీడీపీనేతలపై దాడికి పాల్పడ్డారు. మాచర్లలో అంతఅరాచకం జరిగితే, ఫ్యాక్షన్ గొడవలంటూ ఎస్పీ అడ్డగోలుగా మాట్లాడు తున్నాడు. గడ్డిపీకడానికి తాను జిల్లాఎస్పీగా ఉన్నాడా? ఒక సీఐని అడ్డంపెట్టుకొని మాచర్లను మంటల్లో కాల్చేస్తారా? ఇంతజరిగితే డీజీపీ ఎందుకు స్పందించడు? టీడీపీ నేతలు డీఐజీని కలుస్తామంటే ఒప్పుకోరా? రాయలసీమలో పుట్టినవాడెవడూ ఇలా పోలీసు ల్ని అడ్డుపెట్టుకొని పనిచేయడు.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన 24గంటల్లోనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరుపెడతాం
పోలవరం ప్రాజెక్ట్ ని నాశనంచేసిన బుద్ధిలేని రాంబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. టీడీపీ హత్యారాజకీయాలు చేస్తుంటే వైసీపీప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా రాంబాబు? గుడివాడప్రజలు కొడాలినానికి బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మూడేళ్లుమంత్రిగా చేయలేని బుద్ధిలేని వెధవ మాగురించి మాట్లాడతాడా? తాను 5 ఏళ్లుమంత్రిగాచేసి, గుడివా డలో లిఫ్ట్ కట్టిస్తే, దానికి ఎన్టీఆర్ పేరు తీసేసి, వై.ఎస్ పేరురాసిన దరిద్రుడు కొడాలినాని. టీడీపీప్రభుత్వం రాగానే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కు తిరిగి ఎన్టీఆర్ పేరే పెడతాం. టీడీపీప్రభుత్వం వచ్చిన 24గంటల్లోనే విజయవాడ ఆరోగ్యవిశ్వవిద్యాలయానికి తిరిగి అన్నగారి పేరు పెడతాము. సంకల్పసిద్ధిపేరుతో గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు దోచుకున్న కోట్ల రూపాయల్ని కక్కించడానికి, వారిభరతం పట్టడానికి కొన్నిసంస్థలు సిద్ధమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్, వారికుటుంబంపై బూతులుమాట్లాడుతూ ఎన్నాళ్లు, జగన్మో హన్ రెడ్డి బూట్లు నాకుతార్రా?
జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడికి రక్షణ కల్పించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని కేంద్రమే చెప్పింది
జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుపై నందిగామపబ్లిక్ మీటింగ్ లో రాళ్లదాడి జరిగితే, ఆయన సెక్యూరిటీ అధికారికి గాయమైతే పెట్టీకేసు పెడతారా? ఏపీలో చంద్రబాబు ప్రాణాలకు హానిఉందని, కేంద్రనిఘావర్గాలు మొత్తుకుంటున్నాయి. జడ్ ప్లస్ కేటగిరి భద్రతలోఉన్న వ్యక్తికి తగిన సెక్యూరిటీ కల్పించే పరిస్థితిలేదని కేంద్రానికి చెప్పాయి. కొందరు పోలీస్ అధికా రులు వైసీపీకండువాలు వేసుకొని, ప్రతిపక్షనేతల గొంతు నొక్కుతున్నారు. అప్పులు తప్ప అభివృద్ధిలేకుండా చేశాడు…చంద్రబాబు హాయాంలో వేసిన రోడ్లపై గుంతలే పూడ్చలేక పోయాడు. జగన్ దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారని, విద్యుత్ కొనుగోళ్లపేరుతో ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతినిత్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతాం” అని దేవినేని చెప్పారు.