Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాకే బస్సుయాత్ర చేపట్టాలి

• రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న పరిణామాల సమగ్ర సమాచారమే ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రం
• టీడీపీ విడుదల చేసిన కరపత్రంలోని అంశాలకు సమాధానం చెప్పాకే జగన్ బస్సుయాత్ర ప్రారంభించాలి • నాలుగున్నరేళ్లలో అధికారమదంతో జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఊచకోత కోయించాడు
• ముఖ్యమంత్రిగా ఏఏ వర్గాలకు తానేం చేసింది, ఎంతగా వారిని వంచించింది చెప్పాకే జగన్ బస్సుయాత్రలు చేపట్టాలి
• సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొనే అధికారపార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు, మంత్రులం తా ఆ యాత్రలో పాల్గొనేముందు ఒక్కసారి గుండెలపై చెయ్యేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి
– టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

కరపత్రాన్ని ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడిన అనంతరం అచ్చెన్నాయుడు.. టీడీపీనేతలు పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ అన్న దానికి సంబంధించిన ఆధారాలతో కూడిన ఫోటో ప్రదర్శనను, హోర్డింగులను పరిశీలించారు.

ఒక్క అవకాశమని తెలుగుజాతిని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, తన అసమర్థ, అవినీతి పాలనతో 4 సంవత్సరాల 7 నెలల పాలనలో అన్నివర్గాల ప్రజల జీవితాలను తలకిందులు చేసి, చివరకు వారిని మభ్యపెట్టి, మరోసారి మోసగించడానికే తన పార్టీ నేతలు, మంత్రులతో సామాజిక సాధికార బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం టీడీపీనేతలతో కలిసి ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశా రు. అనంతరం ఆయన.. పార్టీనేతలు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …

అధికారమదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అతి కిరాతకంగా ఊచకోత కోయించిన జగన్ రెడ్డి, సామాజిక సాధికారత పేరుతో బస్సుయాత్ర చేయడం దుర్మార్గం : కింజరాపు అచ్చెన్నాయుడు
నాలుగున్నరేళ్ల పాలనలో అధికారమదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను దారుణం గా ఊచకోత కోయించిన జగన్ రెడ్డి, బస్సుయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లి, వారికి ఏం చెబుతాడు? రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రయోజనాలు, ఫలాలను కూడా జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కకుండా చేశాడు. కేంద్రప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన సొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆ పథకాలు రాష్ట్రంలో నిలిచి పోయాయి.

54 ఉత్తుత్తి కార్పొరేషన్లతో బీసీలను మోసగించిన జగన్ రెడ్డి.. తన హాయాంలో ఒక్క బీసీకైనా పైసా ఆర్థిక సాయం చేశాడని నిరూపించాకే బస్సుయాత్ర చే పట్టాలి. సంక్షేమ పథకాలకు పితామహుడిగా పేరు పొందిన చంద్రబాబునాయుడు 2014-2019 మధ్య అన్నివర్గాల ప్రజలకు పుట్టుక నుంచి మరణం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. చంద్రబాబు వివిధ వర్గాలకోసం అమలుచేసిన పథ కాలను ఎందుకు రద్దుచేశాడో సమాధానం చెప్పాకే జగన్ బస్సు యాత్ర చేపట్టాలి.

టీడీ పీప్రభుత్వంలో బీసీలకోసం ప్రత్యేకంగా 30 పథకాలు అమలు చేయడం జరిగింది. అలానే ఎస్సీలకు ప్రత్యేకంగా 27పథకాలు.. ఎస్టీలకు 29పథకాలు.. మైనారిటీలకు 11 పథకాలు అమలు చేశారు. వాటన్నింటినీ జగన్ నిర్దాక్షణ్యంగా రద్దు చేశాడు. స్థానిక సంస్థల్లో 20శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు 14 శాతం పెంచి 34శాతంగా మార్చాడు. ఆ రిజర్వేషన్లను అధికారంలోకి రాగానే 24శాతానికి ఎందుకు తగ్గించాడో జగన్ బీసీలకు సమాధానం చెప్పాకే సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టాలి.

దళితుల పథకాలకు అంబేద్కర్ పేరు తీసేసి, తన పేరు పెట్టుకున్నప్పుడే జగన్ రెడ్డి దళిత ద్రోహి అని తేలిపోయింది : వర్ల రామయ్య
“ డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరుతో టీడీపీప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ విద్య పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేశాడు. దళితయువత విదేశాల్లో ఉన్నత చదవులు చదవాలన్న సత్సంకల్పంతో చంద్రబాబు అమలుచేసిన పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేయడం దళిత యువతకు ద్రోహం చేయడం కాదా? టీడీపీ ఆ పథకంపై ప్రశ్నిస్తోందని చివరకు తన పేరుతో తూతూమంత్రంగా ఆపథకం అమలుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పథకాలకు పెట్టుకోవడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేకత కు నిదర్శనం కాదా?

అంబేద్కర్ మహానీయుడి కంటే జగన్ రెడ్డి గొప్పవాడా? 11 ఛార్జ్ షీట్లు తనపై వేయించుకొని, ప్రతి శుక్రవారం కోర్టుల్లో విచారణకు హాజరై, 16నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి ఎక్కడ.. ప్రపంచమేథావి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఎక్కడ? దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక తన భస్మాసుర హస్తం దళితులపైనే పెట్టి, వారిని అథ:పాతాళానికి తొక్కేశాడు. దళితుల పథకాలకు అంబేద్కర్ పేరు తీసేసి, తన పేరు పెట్టుకున్నప్పుడే జగన్ రెడ్డికి దళితుల పై ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని అర్థమైంది.

డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపేసినప్పుడు…దళిత మహిళ నాగమ్మను పులివెందులలో దారుణంగా హత్యాచా రం చేసినప్పుడు స్పందించని ముఖ్యమంత్రి దళితుల రక్షకుడా? వైసీపీ ఎమ్మెల్సీ తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ని కిరాతకంగా చంపేసి, శవాన్ని ఇంటివద్ద పడేస్తే చలించని ముఖ్యమంత్రి.. తనపార్టీ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి దళితుల రక్ష కుడా? తన పాలనలో దళితులపై దాదాపు 280కు పైగా దాడులు చేయించి, దళితుల్ని తన ఇనుపపాదాల కింద నలిపేస్తున్న జగన్మో హన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అదే దళితులు రాజకీయంగా పూడ్చిపెట్టడం ఖాయం.” అని రామయ్య హెచ్చరించా రు.

దళితుల పథకాలు రద్దుచేసి, రూ.33వేలకోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన జగన్ రెడ్డి చెప్పిందానికి దళిత మంత్రులు, వైసీప దళిత నేతలు డూడూబసవన్నల్లా తలాడించడం బాధాకరం : నక్కా ఆనంద్ బాబు
“ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొనే దళిత నేతలు, మంత్రులు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకున్నాకే యాత్రలో పాల్గొనాలి. దళిత మంత్రులు తన పక్కన కూర్చోవడాన్నే జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి దళితుల్ని ఉద్ధరించానని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. వై.వీ.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చున్న వేదికపై ఉపముఖ్యమంత్రిగా ఉన్న దళితమంత్రిని కింద కూర్చోబెట్టడమేనా జగన్ రెడ్డి చెబు తున్న సామాజిక న్యాయం?

అణగారిన, అంటరాని వర్గాలుగా ఉన్న దళితులకోసం రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక పథకాలు.. ప్రయోజనాలు జగన్ ప్రభుత్వంలో ఎందుకు అమలుకాలేదో దళితమంత్రులు, వైసీపీ దళతనేతలు తమ వర్గాలకు సమాధానం చెప్పాలి. నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. నా బీసీలు.. నా మైనారిటీ లు అని అనడం తప్ప ఆయా వర్గాలకు జగన్ రెడ్డి చేసింది శూన్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ను జగన్ నిర్వీర్యం చేశాడు. రూ.33వేలకోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని ముఖ్యమంత్రి దారి మళ్లిస్తే, దానిపై మాట్లాడని దళిత మంత్రులు..వైసీపీ దళితనేతలు డూడూ బసవన్నల్లా ఆయన చెప్పిందానికి తలాడిస్తున్నారు.

ఎస్సీ కార్పొరేషన్ ను మూడుముక్కలు చేసిన జగన్ రెడ్డి.. నాలుగున్నరేళ్లలో ముగ్గురికి కూడా రుణాలు ఇవ్వలేదు. ఎన్.ఎస్. ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ పథకాల ద్వారా టీడీపీప్రభుత్వం వేలాది దళితులకు సాయం చేసింది. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిచండం కోసం చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను తీసుకొస్తే, వాటిని జగన్ రద్దు చేశాడు. చంద్రబాబు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విదేశీవిద్య పథకం ద్వారా దాదాపు 500 మంది దళిత యువతను విదేశాలకు పంపితే, జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో పథకానికి తన పేరు పెట్టుకొని కేవలం 16 మందిని మాత్రమే విదేశాలకు పంపాడు.

చంద్రబాబు దళిత యువతకోసం అమలుచేసిన ఏపీ స్టడీ సర్కిళ్లు, అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను జగన్ తీసేశాడు. చంద్రబాబు దళితులకు ఇచ్చిన భూముల్ని ఇళ్లపట్టాల పేరుతోజగన్ రెడ్డి బల వంతంగా లాక్కున్నాడు. పీజీ చదివే దళిత యువతకు అందించే స్కాలర్ షిప్పుల్ని కూడా జగన్ జీవోనెం-77తో రద్దు చేశాడు. ఎస్సీఎస్టీ అత్యాచారా నిరోధక చట్టాన్ని, ఎస్సీఎస్టీ కమిషన్ ను జగన్ రెడ్డి పూర్తిగా నీరు గార్చాడు. స్వతంత్రంగా ఆలోచించే దళిత సంఘాలు.. దళిత మేథావులు.. ప్రజాస్వా మ్య వాదులంతా జగన్ రెడ్డి దళితుల కు చేసిన ద్రోహంపై గొంతెత్తాలి.” అని ఆనంద్ బాబు సూచించారు.

రాష్ట్రచరిత్రలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు : ఎంఏ.షరీఫ్
“ సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి మరో కొత్తనాటకం మొదలు పెట్టాడు. గతంలో ఒక్క ఛాన్స్ అనిచెప్పి రాష్ట్రప్రజల్ని మోసగించిన విధంగా నే, నేడు జగన్ రెడ్డి దళితులు, బీసీలు, మైనారిటీలను వంచించడానికి సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో కుట్ర, కుతంత్రపూరితమైన యాత్ర చేపట్టాడు. మైనారి టీల ఓట్లు దండుకొని నాలుగున్నరేళ్లుగా వారికి ఎగనామం పెట్టిన ఘనత ఈ ముఖ్య మంత్రికే దక్కింది. నవరత్నాల ముసుగులో మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్, నాలుగున్నరేళ్లలో వారికి దొడ్డచెయ్యి చూపించాడు.

చంద్రబాబు మైనారిటీల భవిష్యత్ కోసం తీసుకొచ్చిన ఏపీ మైనారిటీ కార్పొరేషన్ ను జగన్ తుంగలో తొక్కాడు. నాలుగు న్నరేళ్లలో ఒక్క మైనారిటీకి ఒక్కటంటే ఒక్కరూపాయి రుణం ఇచ్చింది లేదు. 2014-19 మధ్యన చంద్రబాబునాయుడు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 46వేల మంది మైనారిటీలకు 50శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రుణం అందించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీ మైనారిటీ కార్పొరేషన్ ను నేతిబీరకాయలో నెయ్యి తీరుగా మార్చేశాడు. చంద్రబాబు నూర్ బాషా ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానికి రూ.50 కోట్లు కేటాయిస్తే, జగన్ ఆ సొమ్ముని వెనక్కు తీసుకొని నూర్ బాషాల నోట్లో మట్టికొట్టాడు.

టీడీపీప్రభుత్వం ఉర్దూ బాషని రాష్ట్ర రెండోభాషగా ప్రకటించి, ఆ భాషాభి వృద్ధికోసం, ఉర్దూ అకాడమీకోసం సంవత్సరానికి రూ.15కోట్లు కేటాయించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఉర్దూ బాష మరుగునపడిపోతే, ఉర్దూ అకాడమీలో పనిచేసే సిబ్బందికి జీతాలు అందని దుస్థితి ఏర్పడింది. విదేశీవిద్య పథకం కింద చంద్రబాబు నాయుడు 500 మంది మైనారిటీ యువతకు రూ.10 లక్షల చొప్పున రుణం అందిస్తే, నాలుగున్నరేళ్లు జగన్ రెడ్డి విదేశాల్లో ఉన్న మైనారిటీ యువతను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు.

చంద్రబాబు మైనారిటీ పిల్లల ప్రాథమిక విద్యకోసం 9 ఉర్దూ రెసిడెన్షి యల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తే, వాటికి అవసరమైన భూమిని జగన్ రెడ్డి కేటాయించ లేకపోయాడు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక వక్ఫ్ భూములు.. ఆస్తులు వైసీపీనేతల కబంధహస్తాల్లో చిక్కాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి.. మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా పేరుకే మంత్రిగానీ…మైనారిటీల సంక్షేమం కోసం ఒక్క పనీ చేయలేని అసమర్థుడిగా మిగిలి పోయాడు.

అంజాద్ బాషా పదవి… పలుకుబడి పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా మారడం ముస్లిం సమాజానికే సిగ్గు చేటు. షాదీఖానాలు.. మసీద్ లు.. హజ్ హౌస్ ల నిర్మాణం..నిర్వహణకు టీడీపీ ప్రభుత్వం కోరిన విధంగా నిధులు కేటాయిస్తే.. జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క ఒక్క షాదీఖానా కూడా నిర్మిం చలేకపోయింది. రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గుండుసున్నా చుట్టిన ఏకైక ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం చరిత్రలో నిలిపోతుంది.” అని షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిత్యం 5 పూటలా నమాజు చేసుకునే ముస్లింలపై దాడులు చేయించడమేనా జగన్ రెడ్డి మైనారిటీలకు చేసిన మంచి? : నాగుల్ మీరా
“ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసలు సిసలు ముస్లింల ద్రోహిగా జగన్ రెడ్డి నిలిచాడు. నా మైనారిటీలు అంటున్న జగన్ రెడ్డి.. ఏ రకంగా వారు తన వారో సమాధానం చెప్పాలి. నిత్యం నమాజు చేసుకునే ముస్లింలపై దాడులు చేయించ డమేనా జగన్ రెడ్డి మైనారిటీలకు చేసిన మంచి? నంద్యాలలో అబ్దుల్ సలాం.. రాజమ హేంద్రవరంలో అబ్దుల్ సత్తార్ కుటుంబాలను బలితీసుకోవడమేనా జగన్ మైనారిటీల కు చేసిన మంచి?

బీసీలపై జగన్ రెడ్డికి నిజంగా ప్రేమాభిమానాలుంటే తన ఆస్తుల్ని తక్షణమే బడుగు, బలహీనవర్గాలకు ధారాధత్తం చేయాలి : బుద్దా వెంకన్న
“ బీసీలను ఉద్ధరిస్తానంటున్న జగన్ రెడ్డి మాటలన్నీ నీటిమీద రాతలే. బీసీ అయిన వెంకట నర్సయ్య వద్ద పనిచేసిన జగన్ తాత రాజారెడ్డి, తనకు అన్నంపెట్టిన యజమానినే చంపేసి, అతని అస్తిపంజరంపైనే తన కుటుంబ పునాదులు నిర్మించాడు . బీసీలను పొట్టనపెట్టుకున్న రాజారెడ్డి వారసుడైన జగన్ రెడ్డికి నిజంగా బీసీలపై ప్రేమే ఉంటే, తన ఆస్తులు మొత్తం బడుగు,బలహీనవర్గాలకే రాసివ్వాలి. తెలుగుదేశం పార్టీ లోని బీసీనేతలకు చంద్రబాబు, లోకేశ్ లు అపారమైన గౌరవ మర్యాదలు కల్పిస్తారు. బీసీ నేతలన్నా.. బీసీలన్నా జగన్ రెడ్డికి పడదు.

దివంగత ఎర్రన్నాయుడు తనపై కోర్టుల్లో కేసులు వేసి, జైలుకు పంపాడన్న అక్కసుతోనే జగన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాడు. కొల్లురవీంద్ర ను అన్యాయంగా హత్యకేసులో ఇరికించి 55 రోజులు జైల్లో పెట్టించినప్పుడు జగన్ రెడ్డికి బీసీలు గుర్తురాలేదా? నాలుగున్నరేళ్లు అధికారంలోఉన్నా జగన్ రెడ్డి తన పార్టీలో ఒక్క బీసీ నాయకుడినైనా తన తరువాతి స్థానంలో నిలపగలిగాడా? జగన్ రెడ్డి బీసీలపై చూపుతున్న ప్రేమాభిమానాలన్నీ ఆయన కపటనాటకంలో భాగమే. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా బీసీలు వచ్చే ఎన్నికల్లో ఆయన పక్షాన నిలవరు.

గిరిజనుల సంక్షేమం.. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని జగన్ విస్మరించాడు. గిరిజన సంక్షేమ శాఖా మంత్రి జగన్ భజనకే పరిమితమయ్యాడు : ధారు నాయక్
“ నాలుగున్నరేళ్లలో ఎస్టీలపై దాడులు.. దుర్మార్గాలే తన అజెండాగా జగన్ పాలన సాగించాడు. శ్రీనివాసరెడ్డి అనే వైసీపీ కార్యకర్త నకరికల్లులో మంత్రూభాయ్ అనే గిరిజ నమహిళను దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపితే ముఖ్యమంత్రి నామమాత్రంగా కూడా స్పందించలేదు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొత్తపాలెంలో ముగ్గురు గిరిజన మహిళలపై దొంగతనం నేరంమోపి అకారణంగా వారిని చిత్రహింసలకు గురిచేస్తే ప్రభు త్వంలో స్పందన లేదు. మూడు నెలల క్రితం ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్ నోట్లో మూత్రం పోస్తే, అంత దారుణానికి ఒడిగట్టిన వారిపై ఎలాంటి చర్యలు లేవు.

మసీదుపై తన పార్టీ రంగులు..తనబొమ్మలు వేయించడం ద్వారా జగన్ రెడ్డి, అతిపెద్ద పాపానికి ఒడిగట్టాడు : ముస్తాక్ అహ్మద్ 
“జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతోంది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదు.. సామాజిక ద్రోహ యాత్ర. జగన్మోహన్ రెడ్డిని జగన్మోసపు రెడ్డి అని ముస్లిలంతా పిలవాల్సింది ఈ యాత్రలోనే. మైనారిటీ బాలిక మిస్బా క్లాస్ లో మొదటిస్థానంలో నిలుస్తోందన్న అక్కసుతో, తన కూతురుకి పోటీ వస్తోందన్న ఈర్ష్య,అసూయతో వైసీపీనేత చిన్నారి మిస్బాను అన్యాయంగా బలి తీసుకున్నాడు. మిస్బా తల్లిదండ్రుల్నిపరామర్శించాలనే ఆలోచన కూడా జగన్ కు రాలేదు. జగన్ రెడ్డి ముస్లింలకు చేసిన..చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కౌన్సిలర్ కు ఉన్నపాటి పవర్స్ కూడా లేవు. జగన్ ముస్లిం సమాజానికి చేస్తున్న ద్రోహానికి కచ్చితంగా అల్లాహ్ కు సమాధానం చెప్పక తప్పదు. నా మైనారిటీలు అనే అర్హత జగన్ కు లేదు. చంద్రబాబు హజ్ హౌస్ నిర్మిస్తే.. జగన్ రెడ్డి మసీద్ పై తన పార్టీ రంగులు…. తన బొమ్మలు వేసు కున్నాడు. ఇంతకంటే పాపం మరోటి ఉంటుందా? గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వంద ముస్లిం కుటుంబాలను వైసీపీ నేత బహిష్కరిస్తే ముఖ్యమంత్రిలో చలనం లేదు. వైసీపీ ముస్లిం నేతలు జగన్ వద్ద బానిసలుగా పనిచేస్తూ.. ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారు.” అని ఫారూఖ్ షుబ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలంటే జగన్ కు చిన్నచూపు, 75వేలకోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ దారిమళ్లించాడు : కొనకళ్ల నారాయణరావు
“ తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు బీసీలకు రాజ్యాధికారం.. సాంఘిక ఎదుగుదల లేవు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించాకే బీసీలు సామాజికంగా.. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించారు. 1987లో ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 20శాతం రిజర్వే షన్లు కల్పిస్తే, చంద్రబాబు నాయుడు వాటిని 34 శాతానికి పెంచారు. ఆ విధంగా బీసీలు రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్, చంద్రబాబులే గొప్పబాట వేశారు. చంద్రబాబు హాయాంలో బీసీ పథకాలకు ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించారు. ఆదరణ పథకంతో బీసీల్లోని వృత్తి నైపుణ్యాలను వెలికి తీయడమే కాకుండా.. వారు సొంత కాళ్లపై నిలబడేలా చంద్రబాబునాయుడు చేయూత అందించారు.

జగన్ రెడ్డి రూ.75వే లకోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించాడు. 56 కార్పొరేషన్లు పెట్టిన జగన్ రెడ్డి.. వాటికి నిధులు, విధులు కేటాయించకుండా బీసీలను అవమానించాడు. జగన్ హయాంలో బీసీల బతుకులు దుర్భరంగా మారాయి. జగన్ రెడ్డికి అగ్రకులాలపై ఉన్న అభిమానం బీసీలపై లేదు. బీసీలు అంటే జగన్ కు చాలా చిన్నచూపు. ఎవరి హాయాం లో తమ బతుకులు బాగుపడ్డాయో బీసీలకు బాగా తెలుసు. జగన్ ఎన్ని యాత్రలు చేసినా బీసీలు ఆయన మాయలో పడటానికి సిద్ధంగా లేరు.” అని నారాయణరావు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎం.ఏ.షరీఫ్, బుద్దావెంకన్న, నాగుల్ మీరా, కొల్లురవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, తెనాలి శ్రావణ్ కుమార్, ముస్తాక్ అహ్మద్, బీ.రామాంజనేయులు, దున్నుదొర, దారు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE