Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తానేం చేయలేనని తెలిసే జగన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్ తో తన చిరకాల వాంఛ తీర్చుకున్నాడు

• చంద్రబాబు అరెస్ట్ విషయంలో సక్రమంగా వ్యవహరించామని సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పడం హాస్యాస్పదం
• అర్థరాత్రి నంద్యాలలో అలజడి సృష్టించి, టీడీపీనేతలు, కార్యకర్తలు, మీడియావారిని దూరంగా తోసేయడం సక్రమమా?
• ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వ్యవహారంపై లోకేశ్ ను విచారిస్తామంటున్న సంజయ్ వ్యాఖ్యలు జగన్ రెడ్డి కోరికలో భాగమే
• ప్రముఖుల అరెస్ట్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ అధికారులు చంద్రబాబు విషయంలో తుంగలో తొక్కారు
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను కప్పిపుచ్చుకోవడానికి జగన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు కట్టుకథలు వండివార్చారని, చంద్రబాబుని అరెస్ట్ చేయడం జగన్ చిరకాల వాంఛ అని, ఎన్నికలు దగ్గరపడితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తానేం చేయలేనన్న బాధతోనే, ఎలాంటి రుజువులు.. ఆధారాలు లేని అంశాన్ని పట్టుకొని తెల్ల వారుజామునుంచే అలజడి సృష్టించాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో తాము సక్రమంగానే వ్యవహరించామ ని సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పడం హాస్యాస్పదం. అదే నిజమైతే అర్థరాత్రి 1.30నిమిషా లనుంచే నంద్యాలలో పోలీసులు, వైసీపీ కార్యకర్తలు ఎందుకు అలజడి సృష్టించారో సంజయ్ చెప్పాలి. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీనేతల గృ హనిర్బంధాలు, కార్యకర్తలపై లాఠీఛార్జ్ ఎందుకు జరుగుతోందో జగన్ రెడ్డి సర్కార్ , పోలీసులు చెప్పాలి.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి లేదని ఎక్కడా ఏ తప్పు జరగలేద ని, విచారణాసంస్థలు, అధికారులు కోర్టుకు సమర్పించిన ఆధారాలన్నీ కల్పితాలేనని గతంలోనే సాక్షాత్తూ రాష్ట్రహైకోర్టు స్పష్టంగా చెప్పి, విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని అక్రమకేసులు పెట్టినవారందరికీ బెయిల్ మంజూరు చేసింది. కేవలం చంద్రబా బుని ఏదోరకంగా అరెస్ట్ చేయాలన్న దురుద్దేశంతోనే ముగిసిపోయిన అంకాన్ని మరలా జగన్ రెడ్డి తెరపైకి తీసుకురావడం జరిగింది. జగన్ అడుగులకు మడుగులొత్తే సంజయ్, రఘురామిరెడ్డి లాంటి అధికారులు హద్దులుమీరి చేసే విన్యాసాలు తప్ప, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి కొత్త అంశాలు లేవు.

తనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని, ఈర్ష్యాద్వేషాలను కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి… టీడీపీ అధినేతను అరెస్ట్ చేయించాడు

రాష్ట్రంలో యువగళం పాదయాత్ర, చంద్రబాబు కార్యక్ర్రమాలు ఉధృతంగా సాగుతుండ టంతో లండన్లో ఉన్నా జగన్ రెడ్డికి నిద్ర పట్టడంలేదు. తనలోని భయాన్ని అధిగమించ డానికి, ప్రజల్లో తనపై ఉన్న ఈర్ష్యాద్వేషాలను కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి ప్రణాళికా ప్రకారం చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు సిద్ధపడ్డాడు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్ర బాబు అరెస్ట్ అనేది ఏ న్యాయస్థానంలో నిలబడదు. కేవలం తన చెప్పుచేతుల్లో ఆడే వ్యవస్థలతో జగన్ రెడ్డి తాత్కాలిక ఆనందం పొందుతున్నాడు. చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టిన తప్పుడుకేసులో ఎక్కడా రూపాయి అవినీతి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. జగన్ రెడ్డి అవినీతి, అక్రమార్జన కేసుల్లో మాత్రం ఈడీ ఎప్పుడో రూ.43 వేలకోట్లు జప్తు చేసింది. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన జగన్, కావాలనే చంద్రబాబుని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికే అక్రమంగా అరెస్ట్ చేయించాడు.

ప్రముఖుల అరెస్ట్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ అధికారులు చంద్రబాబు విషయంలో తుంగలో తొక్కారు
ప్రముఖుల్ని అరెస్ట్ చేయాలంటే న్యాయస్థానాల పనిదినాల్లో మాత్రమే అదుపులోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం నేడుచంద్రబాబుని అరెస్ట్ చేసింది. శనివారం, ఆదివారం కోర్టులు పనిచేయవని తెలిసే, ఆయన్ని రిమాండ్ లో ఉంచి ఇబ్బందిపెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే దుశ్చర్యకు ఒడిగట్టింది.

రాజధాని అమరావతిలో లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ విషయాలపై కూడా త్వరలో చాలామందిని అరెస్ట్ చేయబోతున్నట్టు, లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తామని సీఐడీ చీఫ్ చెప్పడం ముమ్మాటికీ ప్రభుత్వ నీతిమాలిన ఆలోచనలకు నిదర్శనమనే చెప్పాలి. లోకేశ్ ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన వెనకడుగు వేస్తాడనుకోవడం ఈ ప్రభుత్వ మూర్ఖత్వమే. జగన్ రెడ్డి అవినీతి..దోపిడీని ఇప్పటికే టీడీపీ ప్రజల్లోకి తీసుకె ళ్లింది. ముఖ్యమంత్రిగా ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి రూ.2.50లక్షల కోట్లు కొట్టేశాడని ప్రజలకు తెలియచేశాం. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో తప్పచేశాడు అనడానికి ఎలాంటి అధారాలున్నాయో చెప్పగల ధైర్యం మంత్రులకు ఉందా? ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్ప మంత్రులకు బుద్ధి, జ్ఞానం లేవని వారి మాటల్నే బట్టే అర్థమవుతోంది.

సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంతనిజమో..చంద్రబాబు తప్పుచేయడనేది అంతే నిజం
లండన్ నుంచి తాను తిరిగొచ్చేసరికి చంద్రబాబు జైల్లో ఉండాలన్న దుగ్ధతోనే జగన్ రెడ్డి అక్రమ అరెస్ట్ లు చేయించాడు. జగన్ కు దమ్ములేదు కాబట్టే, పోలీసులసాయం తో టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నాడు. చంద్రబాబుని తరలిస్తున్న పోలీసుల వాహా నాలకు అడ్డుపడుతున్న టీడీపీ కార్యకర్తల్ని దారుణంగా కొట్టిస్తున్నాడు. నాలుగు నెలలు ఆగితే మా కార్యకర్తలపై వాడిన లాఠీలు, వైసీపీ కార్యకర్తల వీపులపై మోగుతా యని జగన్ గుర్తుంచుకోవాలి. జగన్ ఎన్నిచేసినా, వచ్చేఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు కి పట్టంకట్టి ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని తేలిపోయింది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో..చంద్రబాబు తప్పుచేయడు అనేది అంతే నిజం.” అని రఫీ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE