• గత ప్రభుత్వంలో పాలనే లేదు అంతా.. ప్రచార అర్భాటాలు, దోపిడిలకు నిలయమైంది
• నిన్నవరదల్లో పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి
• కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అధికారుల పాపాలు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి
• జగన్ నమ్ముకుని గ్రాడ్యుయేషన్లు, పోస్ట గ్రాడ్యుయేషన్లు చదివిన వారు వాలంటీర్లగా ముందుకు వచ్చారు. మీరంతా నా సైన్యం అన్నావ్… కాని నీది పేక్ ప్రచారం అని తేలింది
• 2023 ఆగస్టు నుంచి వారికి ఉద్యోగాలు లేవు.. వారి జీవితం ఆగమ్యగోచరం
• వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు నీవు సంవత్సరానికి రూ. 102.6 కోట్ల లు చెల్లించావు
• సాక్షిపత్రికలో ప్రకటనల కోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి, టీడీపీ పై నిందలు వేసే ప్రచారానికి ఖర్చుపెట్టాం
• రూ. 440 కోట్లు నీ పత్రికకు ఇచ్చి, మిగతా వాటికి 400 కోట్లు ఇచ్చావంటే నీకు ఎంత పక్షపాతం ఉందో అర్థమౌతుంది జగన్ రెడ్డి
• మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి
గత ప్రభుత్వంలో ప్రజాపాలనే లేదు. జగన్ రెడ్డి వందల కోట్ల ప్రజాధనాన్ని తన సొంత పత్రిక సాక్షికి దోచిపెట్టాడని మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనంతా దోపిడిలకు, ప్రచార ఆర్భాటాలకు నిలయమైంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కరుగా వస్తున్నారు. జగన్ ను నమ్ముకుని గ్రాడ్యుయేషన్స్, పోస్టు గ్రాడ్యుయేషన్స్ చేసిన చాలా మంది యువత వాలంటీర్లగా వచ్చారు. వారికి ఉద్యోగాలు కల్పించానంటూ ఫేక్ ప్రచారం మొదలు పెట్టావు.
ఇప్పుడు వాల్లంటీర్లు 2023 ఆగస్టు నుంచి సాంకేతికంగా ఉద్యోగాల్లో లేరు. వారి ఉద్యోగాలను రెన్యూవల్ చేయలేదు నువ్వు . మేమేం చేద్దామని క్యాబినేట్లో ఫైల్ ఇస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఫేక్ ముఖ్యమంత్రిగా, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆరోపణలకు, ఫేక్ పరిపాలనకు ఇది ప్రత్యక్ష సాక్షం. 2,50,000 వేల మందిని వాలంటీర్లగా నియమించుకున్నావు. ఉద్యోగాలు లేని వారికి మోసపు మాటలతో రాజీనామా డ్రామాలు ఆడి, వారిని మభ్య పెట్టావు. నేను వస్తే మీకు ఉద్యోగాలిస్తాను.. మంచి చేస్తాను అంటూ మోసపూరిత మాటలు చెప్పి, తప్పడు ప్రచారాలు చేశావు.
వారి జీవితాలను ఆగమ్య గోచరంలో పడేశావు నువ్వు. నువ్వు చేసిన పనివల్ల… మేము ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరో విషయం చూసుకుంటే.. సలహాదారుల పదవులుగా ముగుస్తాయని రెన్యువల్ చేసిన వ్యక్తివి నువ్వు… నీకు తప్పుడు సలహాలు ఇచ్చే వారికి నీవు పక్షపాతం చూపించావు.. స్వచ్ఛంద సేవ చేసే వాలంటీర్లు అని వారికి నువ్వు వారిని గాలికి వదిలేసి వారి జీవితాలతో చెలగాటం ఆడిన నీకు సిగ్గు అనిపించడంలేదు… కానీ ప్రజలు నీకు బుద్ది చెప్పారని నీకు నవ్వు గమనించాలి జగన్ రెడ్డి. నువ్వు కన్నాలేసే సలహాదారులను నియమిస్తే.. మేము ఇరిగేషన్ గేట్ల నిర్మాణానికి సలహాలిచ్చే కన్నయ్య లాంటి వారిని నియమించాం.
జాతీయ ప్రాజెక్టు అయినా, ఉమ్మడి ప్రాజెక్టు అయినా తుంగభద్ర గేటు కొట్టుకుపోతున్న సమయంలో, వరద ఉన్న సమయంలోనే గేట్లు కాపాడి నీళ్లు నిలబెట్టుకోగలిగాం అంటే తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. మరి నీ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోతే వదిలేశావ్.. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే ఏమీ మాట్లాడలేని అసమర్థుడవు నువ్వు.. ఈ పనులన్నీ చేయడానికి నీదగ్గర డబ్బులేవు కానీ… నీ సాక్షి పత్రికకు మాత్రం డబ్బులు చెల్లించుకున్నావు. ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశావో అర్థమౌతుంది.
ఈ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు సంవత్సరానికి రూ.102.6 కోట్లు అంటే రెండు సంవత్సరాలకి రూ. 205 కోట్లును సాక్షి పత్రిక కొనుగోలు చేయడం కోసం ఖర్చు పెట్టావంటే ఎంత దారుణం. నీ పత్రికలో నీ ప్రచార ప్రకటనల కోసం, టీడీపీ పై నిందలు వేసి వాటి ప్రచార నిమిత్తం ఎంత ఖర్చుపెట్టావు. నీ పత్రికకు రూ.440 కోట్లు ఇచ్చుకుని, మిగతా వాటికి రూ.400 కోట్ల ఇచ్చావంటే నీకు ఎంత పక్షపాత ధోరణి ఉందో తెలుస్తుంది. సాక్షిపత్రికకు, మీడియాకు అంటే వాలంటీర్ల ద్వారా కాని, ప్రకటనలు కాని ఏదైనా సుమారుగా నీవు ఇచ్చింది రూ.651 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా.. ప్రజలకు కొన్ని పథకాలకు నువ్వు డబ్బులు లేవు అంటూ.. నీ సొంత పథకాలకు మాత్రం నిధులు మళ్ళించుకోవడం చాలా దుర్మార్గం జగన్ రెడ్డి.
తిరుపల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డూల తయారీలో అధికారుల ద్వారా బయటపడిన వాస్తవాలను నిన్నముఖ్యమంత్రి మాట్లాడితే.. చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్ గా వ్యవహరించాడు… ఆయన మాట్లాడితే ప్రమాణం అంటున్నాడు.. లడ్డూల నాణ్యత విషయంలో సీఐడీ, సీబిఐ ఎంక్వరీ కోరితే బాగుంటుంది కానీ.. ఇలా మాట్లాడం సబబు కాదు.. ఆ విషయానికి వస్తే సమగ్ర విచారణ చేపడతామన్నారు. తిరుపతి చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కాదు… వాటిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం. మీరు చేసిన పాపాలు చెప్పుకోదగ్గవికావు.. ఇప్పటికైనా బురద రాజకీయం మానుకోవాలన్నారు.
వాలంటీర్లపై, సాక్షిపత్రిక కోసం నువ్వు చేసిన దోపిడి కావచ్చు.. నీకు సలహాదారులుగా ఉండే వారు మాట్లాడే విధానం చూస్తుంటే మిమ్మల్ని ఈ పాపాలన్ని వెంటాడుతాయి.. మిమ్మల్ని వదిలిపెట్టవు. ఇంకా వరదలపై తప్పుడు ప్రచారం మానడంలేదు.. వరదల్లో మీరు ఒక గంట ఉంటారు. రెండు సార్లు వచ్చావు ఏదేదో మాట్లాడతావు.. వెళ్తావు. ఏమీ చేయడానికి విమర్శ చేస్తావో తేలీదు.. నీకు చేతనైతే సాయం చేయ్యి.. విమర్శలు మానేయ్.. నేను కోటి రూపాయలు ఇచ్చాను అన్నావ్.. వాటిని ఎక్కడ పెట్టావో తెలీదు.
తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దోపిడి.. నువ్వు ముఖ్యమంత్రిగా దోపిడిని వాటినన్నింటిని అధిగమించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పనిచేసే ప్రభుత్వంపై మీరు బురద చల్లవద్దు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. వాటినన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లుతున్నాం.
ఇప్పటికైనా విమర్శలు మానుకో జగన్ రెడ్డి నీకు హెచ్చరిక చేస్తున్నా.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో జరిగన అన్యాయాలను వెలికి తీస్తాం.. సమగ్ర విచారణ చేపడతామని డోలా అన్నారు. ప్రతిచోట సలహాదారు దగ్గర నుంచి అటెండర్ వరకు వారి వారినే నియమించుకున్నారు. వీటి విషయమై మేము వివరాలు సేకరిస్తూన్నం. దీనిపై కూడా చర్యలు తీసుకుంటాం.