ఈ నెల 21న విజయవాడలో దళిత నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్‌రెడ్డి పాలనలో దళితులు, అట్టడుగు వర్గాల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దళిత ద్రోహిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల మే 21వ తేదిన విజయవాడలో నిర్వహించబోయే ’’దళిత ద్రోహి జగన్ రెడ్డి – దళిత బాంధవుడు చంద్రన్న‘‘ అనే అంశంపై శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన సన్నహాక సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు. వైసీపీ పాలనలో దళితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై అన్నీ రాజకీయ పార్టీలతో (వైసీపీ మినహా) సహా దళిత కుల సంఘాలతో కూలంకుషంగా చర్చించే ముఖ్య ఉద్దేశంతోనే విజయవాడలోని హోటల్ ఐలాపురం కాన్పెరెన్స్ హాల్‌లో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు, దళిత కుల సంఘాలకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు విధిగా పాల్గొని అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు తెలియజేయాలని వర్ల రామయ్య ఒక ప్రకటనలో కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ఇనగంటి జగదీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి జయరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొమ్మాలపాటి ప్రభాకర్, రాష్ట్ర HRD సభ్యులు SP సాహెబ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.