– ప్రచార యావతో తప్పుడు లెక్కలువేసుకుంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలను ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు
– సాయం గోరంత అయితే ప్రచారం కొండంత
• నాలుగేళ్లలో రైతులకు అందించిన సాయం ఒక లక్ష 45 వేల 751 కోట్ల అని అంకెలగారడీ
కాంట్రాక్టర్లు, వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలే రూ. 1.70 లక్షల కోట్లు
– రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం, ఆత్మహత్యల పెరుగుదలలో మొదటిస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం
ధాన్యం సేకరణ సగానికి సగం తగ్గించేశారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ (రైతు భరోసా) రూ.13 వేల కోట్లు, పంటల కొనుగోలు రూ.63 వేల కోట్లు, ఉచిత విద్యుత్ రూ.32 వేల కోట్లు, గత ప్రభుత్వ బకాయిలుగా చెబుతున్న రూ.10 వేల కోట్లు మొత్తం కలిపి ఒక లక్ష 10 వేల కోట్లు పోను నువ్వు నాలుగేళ్లలో రైతుల కోసంఖర్చు పెట్టింది రూ.35,751 కోట్లు మాత్రమే జగన్‌రెడ్డీ.. ఆ రూ.35,751 కోట్లలోనూ మైక్రో ఇరిగేషన్, యాంత్రీకరణ తదితర పథకాలకు కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది.రైతు భరోసా కింద 27 వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు… రైతు భరోసాగా రైతులకు అందిస్తున్న రూ.13,500లో కేంద్రం రూ.6 వేలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.7,500మాత్రమే!
రాష్ట్ర ప్రభుత్వ వాటా 53 శాతంలో భాగంగా ఇప్పటివరకు రైతులకు అందించిది రూ.15,390 కోట్లు మాత్రమే…కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా అకౌంట్లలో వేసిన రూ.11,610 కోట్లను కూడా జగన్‌రెడ్డి తన ఖాతాలోనే వేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ.2 వేలుకు సంబంధించిన రూ.1000 కోట్లను నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన రైతులకు రూ.90 కోట్లు ఈ రోజు వేస్తూ మొత్తం రూ.1090 కోట్లు తానే బటన్ నొక్కి వేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడు విడతల్లో రూ. 15 వేల కోట్లు రుణ మాఫీచేశాం..నాలుగో విడతగా రూ.3500 కోట్లు విడుదల చేస్తే ఇదే జగన్‌రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేసి, సీఎస్ ను మార్చివేయించి రైతులకు తీరని ద్రోహం చేశారు.ధాన్యం ఇతర పంటల కొనుగోలు కోసం నాలుగేళ్లలో 62557 కోట్లు ఖర్చు పెట్టినట్టు గొప్పలకు పోతున్నారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటకు ఊరికే డబ్బులు ఇస్తున్నారా..ఆ ధాన్యాన్నిఎఫ్‌సీఐకి విక్రయించి నగదు తీసుకోవడం లేదా…ఆ డబ్బుల లెక్క ఇక్కడ చెప్పరా? ఉచిత విద్యుత్, ఆక్వా విద్యుత్ సబ్సిడీ, పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా పేరుతో మరో రూ.32147 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ పేరుతో వేలాది కోట్లు లెక్క చూపుతూ నీ గొప్పగా చెప్పుకుంటున్నావు… ఎన్టీఆర్ హయాం నుంచే ఉచిత విద్యుత్ అమలులో ఉన్న విషయం నీకు తెలియకపోయినా రైతులందరికీ తెలుసు.సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధికి రూ.1264 కోట్లు ఖర్చుచేశామని చూపారు.
టీడీపీ ప్రభుత్వహయాంలో ఐదేళ్లలో మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5 వేలు కోట్లుఖర్చు పెట్టాం.యాంత్రీకరణ పథకానికి వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో 690 కోట్లు ఖర్చు పెడితే టీడీపీ ప్రభుత్వం రూ.2 వేలకోట్లు ఖర్చు పెట్టింది. చివరి రెండేళ్లలో రైతు రథం పథకం కింద రైతులకు 23 వేల ట్రాక్టర్లను సబ్సిడీపై అందజేశాం.ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు రూ.1911 కోట్లు సాయం చేశామని తాటికాయంత అక్షరాలతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకున్నారు.సాయం గోరంత అయితే ప్రచారం కొండంతగా మారింది.టీడీపీ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీగా రూ.3400 కోట్లు అందజేశాం.
ఎన్.డీ.ఆర్.ఎఫ్ ప్రమాణాలకు మించి సాయం అందజేసి రైతులకు కష్టకాలంలో అండగా నిలిచాం.గత ప్రభుత్వ హయాంలో ధాన్యం బకాయిగా రూ.960 కోట్లు చెల్లించామని మూడు నెలలకు ఒకసారి పత్రికల్లో ప్రకటనలు వేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. కాంట్రాక్టర్లు, వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలే రూ. 1.70 లక్షల కోట్లు ఉన్నాయి.
త్వరలో అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ బకాయిలన్నింటినీ చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.
జగన్ రెడ్డి ప్రభుత్వం నాలుగేళ్లలో వ్యవసాయశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏకంగా శాఖనే మూసేసింది.బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు కేటాయించిన నిధుల్లో కనీసం 35 శాతం కూడా ఖర్చుపెట్టలేదు…ఇంత దారుణంగా విఫలమైన ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు.
రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది రైతులు, రైతు కూలీలు ఉంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ధాన్యం సేకరణ సగానికి సగం తగ్గించేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సీఏసీపీ నివేదిక ఇచ్చిన విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తున్నా. జాతీయ స్థాయిలో రైతు కుటుంబంపై సగటు అప్పు రూ.74,500గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,45,000గా ఉంది.
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ దేశంలో రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం, ఆత్మహత్యల పెరుగుదలలో మొదటిస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటం బాధాకరం.వైసీపీ నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ శాఖకు బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చు చేసిన నిధుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసి జగన్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.