– అనంతపురం “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ ఘనవిజయం
* సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి – ఇదే కూటమి ప్రభుత్వ మంత్రం
* చంద్రబాబు విజన్ తో ఏరోస్పేస్ హబ్‌గా అనంతపురం
* ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వం బలం
– రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
అనంతపురం: అనంతపురంలో జరిగిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభ అనంతపురం, రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తోందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో 90%ను అమలు చేసి, ప్రజల ముందుకు రావడం గర్వకారణం. అందుకే ఈ సభ కేవలం సూపర్ సిక్స్ కాదు, నిజంగా సూపర్ హిట్ సభ” అని ఆయన అన్నారు. జగన్ తన పాలనలో ప్రజల్లోకి రాలేదు. ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేయడం తప్ప ఆయనకు మరే అజెండా లేదు. మూడు రాజధానులంటూ అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేదు.
విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతోందని గగ్గోలు పెడుతూనే కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయారు. కానీ, కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో రూ.14 వేల కోట్లు తెచ్చి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను 80% సామర్థ్యంతో నడుస్తున్న స్థితికి తీసుకువచ్చింది. అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్రపై జగన్ ఫేక్ ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు అని విమర్శించారు. ఎన్టీఆర్ వేసిన బీజాలు, చంద్రబాబు హయాంలో ఫలితాలు ఇచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్ తో అనంతపురం హార్టికల్చర్ హబ్ అయింది. చంద్రబాబు విజన్‌తో కియా మోటార్స్ రాకతో అనంతపురం ఆటోమొబైల్ హబ్ గా మారింది. ఇప్పుడు అదే విజన్ తో దేశం గర్వించే ఏరోస్పేస్ హబ్‌గా అనంతపురాన్ని తీర్చిదిద్దుతాం” అన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్. దీని ద్వారా 3,850 క్యూసెక్కుల నీటిని అనంతపురం జిల్లాకు తేవగలిగాం. జీడిపల్లి, భైరవానితిప్ప వంటి అనేక ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇవన్నీ రాయలసీమ భవిష్యత్తు కోసం పునాదులు” అని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాయలసీమకు కేంద్ర సంస్థలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ అండ, కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం ఇవన్నీ రాయలసీమ పునరుద్ధరణకు బలమైన ఆధారాలు” అని పల్లా స్పష్టం చేశారు