-సమస్యల్ని చెప్పినందుకు ఆస్తుల ద్వంసం సిగ్గుచేటు
– కొల్లు రవీంద్ర
పిచ్చి తుగ్లక్ గురించి కథల్లో, పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ జగన్ రెడ్డి పాలన చూస్తే ఆ పిచ్చ తుగ్లక్ కూడా సిగ్గుతో తల వంచుకునేలా ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లిందన్న అక్కసుతో బీసీ (రజక) మహిళ మునిరాజమ్మపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడి, ఆస్తి ధ్వంసం చేయడమే కాకుండా తిరిగి అట్రాసిటీ కేసు పెట్టడం సిగ్గుచేటు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపురం పంచాయతీకి చెందిన రజక మహిళపై దాడి జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోంది. తప్పుల్ని ఎత్తి చూపిన వారిపై దాడులు చేయడం, తిరిగి బాధితులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం జగన్ రెడ్డి పాలనలో నిత్యకృత్యమైపోయింది.
సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. ఏదో ఒక సాకు చూపి దాడి చేయడం, తిరిగి కేసులు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయించి, తిరిగి బాధ్యులపైనే అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మతి స్థిమితం లేని కుమారుడు, అగవైకల్యంతో బాధపడుతున్న కుమారుడిని పోషించుకునేందుకు ఏకైక ఆధారంగా ఉన్న హోటల్ పై దాడి చేసి ధ్వంసం చేశారు. గతంలో ఇచ్చిన ఇంటి స్థలం రద్దు చేశారు. శ్రీశైలం దేవస్థానంలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మునిరాజమ్మ భర్తను ఉద్యోగం నుండి తొలగించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే ఇంతలా వేధించే జగన్ రెడ్డిని సైకో కాక ఇంకేమనాలి? జగన్ రెడ్డీ.. ఇలాంటి సైకో చర్యలు మానుకో. నేటి ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి బీసీ సోదరుడు ఏకమై నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో పడేయడం తధ్యమని గుర్తుంచుకో. నీ పిచ్చి పాలనకు, కక్ష సాధింపు చర్యలకు వచ్చే ఎన్నికల్లో సమాధి కడతాం.