-జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు ప్రసంగం
సభ కోసం పొలాలు ఇచ్చిన రైతులకు నమస్కారాలు.సభాస్థలి ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెట్టింది.రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తును దోచుకుంటారు.రాజకీయ దొంగలను కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారు.మూడేళ్లు రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్ దే.రాజధాని కోసం రైతులు అకుంఠిత దీక్ష చేశారు.రాష్ట్ర రాజధాని కోసం జనసేన పోరాటం చేసింది.రాజధానిపై కోర్టు తీర్పులను సీఎం జగన్ శిరసావహించాలి.జగన్ మళ్లీ అధికగారంలోకి వస్తే కాందిశీకులుగా పక్క రాష్ట్రలకు వెళ్లే పరిస్థితి.జగన్ పాలనలో కొద్ది మంత్రులు తప్ప ఎవరైనా బాగున్నారా?అధికారంలేని పదవులు ఇస్తే నాయకులు అల్లాడిపోతున్నారు.ఏపీకి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలుస్తోంది.రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై రూ.లక్షకు పైగా అప్పులు ఉన్నాయి.మళ్లీ పన్నుల రూపంలో మనమే కట్టాల్సిన పరిస్థితి.దొంగలు రెండు రకాలు.. రాజకీయ దొంగలను మనమే ఎన్నుకుంటాం.నేను మంచి సీఎంను చూశా.. చెడ్డ సీఎంను చూశాను.కానీ దుర్మార్గ సీఎంగా జగన్ ను చూస్తున్నాను.