Suryaa.co.in

Andhra Pradesh

జగన్ స్పృహలో ఉండి మాట్లాడాలి

-2019 లో కూడా ఇవే ఈవీఎంలు కదా?
-రాజకీయ పరిపక్వత లేని మాటలు
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ

వైసీపీ నాయకుల దిక్కుమాలిన ఆరోపణలు చూస్తుంటే నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అనే తెలుగు సామెత గుర్తు వస్తోంది. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయాక, వైసీపీ పార్టీ రాజకీయ భవిష్యత్తు అంధకారం అవటంతో రాజకీయ పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారు.

ఒక పక్క వైసీపీ ఎమ్మెల్యే వైస్ జగన్ ఈవీఎం గురించి మాట్లాడుతున్నాడు. 2019 లో ఆయన పార్టీకి 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. అప్పుడు కూడా ఇవే ఈవీఎంలు కదా. అంటే అప్పుడు అతని పార్టీ గెలుపు నిజం కాదా? జగన్ పార్టీ గెలిస్తే అది నవరత్నాల, అతని బటన్ మహిమ. అదే ఓడిపోతే మాత్రం ఈవీఎం చెడు.

దేశంలో ఓడిపోయిన తల్లి కాంగ్రెస్ మాటలే ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోయిన పిల్ల కాంగ్రెస్ మాట్లాడుతోంది. నేడు ప్రపంచ దేశాలన్నీ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత పారదర్శక ఎన్నికల విధానాన్ని కొనియాడుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేక ఇపుడు ఇలాంటి బూటకపు నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరు.

మొన్నటి వరకు జలవనరుల మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు నేడు తన అసమర్ధతను తనే ఒప్పుకున్నాడు. ఇలాంటి చేతకాని, రబ్బరు స్టాంప్ మంత్రి వల్లనే పోలవరం ఈ 5 సంవత్సరాలలో కేవలం 4% పూర్తయింది. ఇలాంటి సమర్ధత లేని మంత్రుల వలన చిన్న పిల్ల కాలువ కూడా పూర్తికాదు. వీరికి తెలిసింది దోచుకోవడం దాచుకోవడం అంతేకాని అభివృద్ధి కాదు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు స్పృహలో ఉండి మాట్లాడాలి.

LEAVE A RESPONSE