-ఐపీఎస్ అధికారి పీ.వీ.సునీల్ కుమార్ వ్యవహారం, అవినీతి బాగోతంపై జగన్ తక్షణమే హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
– ఎవరి అనుమతితో సునీల్ కుమార్ పదేపదే అమెరికా వెళ్తున్నాడు. అక్కడేం చేస్తున్నాడు?
• సీఐడీ చీఫ్ గా అతను రిజిస్టర్ చేసి, దర్యాప్త జరిపిన కేసులన్నింటినీ కూడా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి సమీక్షించాలి.
• సీఐడీ చీఫ్ గా అవినీతి మార్గాన అతను సంపాదించిన డబ్బు, భూములు ఇతర స్థిరచరాస్తులు వెంటనే ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
నిన్నటివరకు సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన డీఐజీ సునీల్ కుమార్.. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా, సొంతతాబేదారుగా, ఆయనేంచెబితే అదిచేసే మనిషిగా, ఆయన కళ్లల్లో అనందం చూడాలని అభిలషించే వ్యక్తిగా పనిచేశారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కూరలో కరివేపాకులా తీసిపారేయడానికి గలకారణాలపై పోలీస్ శాఖ కోడై కూస్తోందని, సునీ ల్ కుమార్ అవినీతి తారాస్థాయికి చేరిందని సదరు శాఖలోని వారే చెప్పుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే..
అవినీతిసొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చే ముఖ్యమంత్రి సునీల్ కుమార్ ని సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించారని పోలీస్ శాఖ కోడైకూస్తోంది
“ముఖ్యమంత్రికి, సునీల్ కుమార్ కు మధ్యజరిగిన వాటాలు, లావాదేవీల పంపిణీలో తేడా లొచ్చే అతన్ని జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ లెగ్ తో జీఐడీలోకి సాగనంపారని పోలీస్ శాఖే చెబుతోం ది. సీఐడీ చీఫ్ గా ఉండి తానే కాబోయే డీజీపీనని బీరాలుపలికిన సునీల్ కుమార్ నేడు విదే శాల్లో ఉన్నాడు. ఐపీఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి వందకోట్ల అవినీతికిపాల్పడి, వందలఎకరా ల కొనుగోళ్లు చేయడమేంటి? సునీల్ కుమార్ ఎంతనొక్కాడో ముఖ్యమంత్రికి బాగాతెలుసు. ఐపీఎస్ సునీల్ కుమార్ అవినీతి బాగోతంపై జగన్మోహన్ రెడ్డి తక్షణమే హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు ఎందరు ముద్దాయిలతో మాట్లాడారు.. వారి బినామీలు ఎందరితో మాట్లాడారు. ఎన్ని ఆస్తు లు సమీకరించాడు..ఎక్కడెక్కడ భూములు, భవనాలు కొన్నాడో తెలియాలంటే హైకోర్ట్ సిట్టిం గ్ జడ్జి విచారణతోనే సాధ్యమవుతుంది. సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు విదేశాల్లో ఉండేవారిపైన కూడా నిఘాపెట్టి, వారి పై ఎస్సీఎస్టీ అట్రాసిటీకేసులు పెట్టాడంటున్నారు. ఎవరి ఆదేశాలతో ఆయన విదేశాల్లోని వారి పై చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకున్నాడు? అమరావతి భూముల కుంభకోణంలో నీ పేరు వి నిపిస్తోంది..మరో స్కామ్ లో మీపేరు బయటకువచ్చిందని విదేశాల్లోని వారిని భయపెట్టి, వా రినుంచి వసూళ్లకు పాల్పడ్డారని చెప్పుకుంటున్నారు. సునీల్ కుమార్ సీఐడీలో ఉన్నప్పు డు వ్యవహరించిన తీరు, అతనిప్రవర్తనపై కూడా విచారణ జరపాల్సిందే. అతను అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని ప్రజలఆస్తులుగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే అతని ఆస్తుల్ని స్వాధీనపరుచుకోవాలని కోరుతున్నాం. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ కి వ్యతిరేకంగా మాటిమాటికీ సునీల్ కుమార్ అమెరికా ఎందుకువెళ్తున్నాడో తేల్చాలి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉంటే, తక్షణమే సునీల్ కుమార్ బాగోతంపై ఆయన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సునీల్ కుమార్ వ్యవహా రాన్ని ఇంతటితో వదిలిపెట్టం.
ఎవరి అనుమతితో సునీల్ కుమార్ పదేపదే అమెరికా వెళ్తున్నాడు… అక్కడేం చేస్తున్నాడు?
ఎవరి అనుమతితో సునీల్ కుమార్ నెలకు, 2నెలలకు అమెరికా వెళ్తున్నారు? ప్రభుత్వ అనుమతి తీసుకొనే సునీల్ కుమార్ డీఐజీ హోదాలో అమెరికా వెళ్లారా.. వెళ్లే ఖర్చులు.. అక్కడ ఆయనకు అయ్యే ఖర్చుని ప్రభుత్వలెక్కలో చూపుతున్నారా? అమెరికా వెళ్లి సునీల్ కుమార్ అక్కడ ఎక్కడుంటున్నారు? ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ ఎందుకు అమెరికా వెళ్తున్నాడని ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఆలోచించారా? సొంతభార్య సునీల్ కుమార్ పై గృహహింసకేసు పెడితే, అతన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతల్ని సాధిస్తాడా? వైసీపీఎంపీ రఘురామకృష్ణరాజుని హింసిస్తున్నప్పడు, సునీల్ కుమార్ వీడియో కాల్ లో జగన్మోహన్ రెడ్డికి చూపించాడట! సునీల్ కుమార్ ఎంపీని కొట్టిన దెబ్బలు మిలటరీ ఆసు పత్రికి వెళ్లేగానీ బయటకు రాలేదు. 70ఏళ్ల రంగనాయకమ్మను పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లి న చరిత్ర సునీల్ కుమార్ ది. అర్థరాత్రి అరెస్ట్ లు అనేకొత్త నిబంధనను తీసుకొచ్చిన ఘనుడు అతను. సునీల్ కుమార్, టీడీపీనేతలు అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్రను, పట్టాభిని, ఇతరు ల్ని ఎంత దారుణంగా హింసించాడు? అదంతాచేసింది ముఖ్యమంత్రి కళ్లల్లో ఆనందం చూడటానికేకదా! సునీల్ కుమార్ పోలీస్ శాఖలో కొనసాగటానికి అర్హుడేనా డీజీపీగారు? అతని భార్య, అతని అత్తమామలు సునీల్ కుమార్ పై పెట్టిన కేసుల్ని ఈప్రభుత్వ ఏంచేసింది ? సునీల్ కుమార్ వేధింపులు తట్టుకోలేక అతని అత్తమామలు అతన్నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ హైకోర్ట్ ని ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే సునీల్ కుమార్ కు రాజ్యాంగం.. చట్టం. ఐపీఎస్ స్థానంలో ఉండి చట్టాలు, రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా సునీల్ కుమార్ విర్రవీగాడు. ఆఖరికి వాటాల్లో తేడాలు వచ్చి, జగన్మోహన్ రెడ్డి జీఏడీకి పంపితే, లాంగ్ లీవ్ పెట్టి అమెరికా వెళ్లిపోయాడు.
కొడాలినాని గ్రామసింహం..అతని అరుపులకు సమాధానం చెప్పి, మాస్థాయిని కించపరుచు కోలేం…
బూతులమంత్రిగా పనిచేసిన కొడాలినాని గ్రామసింహం లాంటివాడు..నేను ఏనుగు లాంటివా ణ్ణి. అతని మాటలకుసమాధానంచెప్పాల్సిన స్థాయి నాకులేదు. అతను పశుప్రాయుడు.. అతని పిచ్చికూతలకు, వెర్రిఅరుపులకు తాము సమాధానంచెబితే, మాస్థాయి, వ్యక్తిత్వం పడిపోతుంది. కొడాలి నాని వ్యాఖ్యల్ని అతని భార్యాబిడ్డలు హర్షిస్తారా? సభ్యత-సంస్కారం, చదువుసంధ్యలు లేకుండా, గాలికి తిరిగే వ్యక్తి మాటలకు తాము స్పందించాలా?” అని రామయ్య అభిప్రాయపడ్డారు.