Suryaa.co.in

Andhra Pradesh

చెత్తపన్నుని ఆస్తిపన్నులో కలిపి వసూలుచేయాలన్న నిర్ణయాన్ని జగన్ తక్షణమే ఉపసంహరించుకోవాలి

– వైసీపీ ప్రభుత్వంలో జగన్, అధికారపార్టీ నేతల ఆదాయం 10రెట్లు పెరిగితే, ప్రజలఆదాయం పాతాళంలోకి పడిపోయింది.
• చెత్తపన్నుని ఆస్తిపన్నులో కలిపి వసూలుచేయాలన్న నిర్ణయంతో జగన్ చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కుతాడు.
• ప్రజలంటే జగన్ దృష్టిలో పన్నులుకట్టే యంత్రాలా?
– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

జగన్మోహన్ రెడ్డి బాదుడేబాదుడులోభాగంగా, పట్టణప్రజలపై వైసీపీప్రభుత్వం కొత్తతరహా బాదుడికి సిద్ధమైందని, ప్రజలనుంచి ముక్కుపిండి డబ్బు వసూలుచేయడం, అవినీతి సొమ్ముతో ఓట్లుకొనడంలో జగన్ సిద్ధహస్తుడని, ఏప్రియల్ నుంచి చెత్తపన్నుని ఆస్తిపన్నుతో కలిపివసూలు చే యాలన్న చెత్తనిర్ణయంతో చెత్తముఖ్యమంత్రిగా జగన్ చరిత్రకెక్కబోతున్నా డని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఎద్దేవాచేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“గతంలో తనప్రభుత్వం వేసిన చెత్తపన్నుని ప్రజలువిడిగా కట్టడంలేదన్న అక్కసుతోనే జగన్ ఆ పన్నుని ఇంటిపన్నుతో కలిపివసూలు చేయాలన్ననిర్ణయానికి వచ్చాడు. తాను అధికా రంలోకి వచ్చినప్పటినుంచీ జగన్ 7సార్లు విద్యుత్ ఛార్జీలు, 3సార్లు ఆర్టీసీఛార్జీలు పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో వసూలుచేస్తున్నాడు. ఓ.టీ.ఎస్ పేరుతో, పాతఇళ్లకు రూ.10వేలు, రూ.15వేలు, రూ.20వేల భారంవేసి ప్రజల్ని దోచుకుం టున్నాడు. ఇంటివిస్తీర్ణాన్నిబట్టి ఇంటిపన్ను వసూలుచేయడమనే కొత్త దోపిడీకి జగన్ శ్రీకారం చుట్టాడు. ఇంటిపన్ను ఏటా15శాతం పెంచుకుంటూ పోతానని ఇప్పటికే చెప్పేశాడు. గతంలో రాచరికవ్యవస్థలో జుట్టుపై పన్నువేశారని చెబితే, వినినవ్వుకున్నాం.. ఇప్పుడు జగన్ రెడ్డి రాష్ట్రప్రజలపై వేస్తున్న రకరకాల పన్నులు అంతకంటే విచిత్రంగా ఉంటున్నాయి.

జగన్ దృష్టిలో ప్రజలంటే పన్నులు కట్టే యంత్రాలు…

ఆదాయంలేక, ఉపాధికోల్పోయి ప్రజలు నానాఅవస్థలుపడుతుంటే, జగన్ మాత్రం తనపన్ను లతో వారిని వేధిస్తున్నాడు. తాగునీటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజ్ పన్ను మరుగుదొడ్ల పన్ను లు ఇప్పటికే ప్రజలుకడుతున్నారు. అవికాకుండా, ఏప్రియల్ నుంచి చెత్తపన్నుని, ఆస్తిపన్నుతో కలిపి వసూలుచేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆస్తివిలువని బేరీజువేసి, అదనంగా 15శాతం పన్నుభారం పెంచబోతున్నాడు. ఇది ప్రజలకు పెనుభారంగా మారనుం ది. చెత్తపన్నువసూలును ప్రజలు నిలదీస్తున్నారన్న భయంతో, ఆస్తిపన్నులో కలిపి వసూలుచేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చాడు. ఎన్నికలముందు ఎలాంటి పన్నులు పెంచనన్నజగన్, ముఖ్యమంత్రి అయ్యాక రకరకాల పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తు న్నాడు. చెత్తపన్ను కట్టలేదని గతంలో ప్రభుత్వాధికారులు చెత్తను ఇళ్లముందు, దుకాణాల ముందు పోయడం, ఇళ్లకు తాళాలేయడం చేశారు.

రాష్ట్ర రెవెన్యూమంత్రి ధర్మానప్రసాదరావే ఒక సందర్భంలో చెత్తపన్నుకట్టకపోతే చెత్త ఇళ్లముందుపోయండి అన్నారు. చెత్తపన్ను కట్టలేదని కర్నూల్లో మున్సిపల్ అధికారులు దుకాణాలముందు చెత్తవేశారు. తూర్పు గోదావరిజిల్లా పిఠాపురంలో ఇంట్లో మనుషులు ఉండగానే ఇంటికి సీల్ వేశారు. చెత్తపన్ను కట్టలేదని నీటికొళాయిలకు తాళాలువేశారు. ఇలాంటి ఘటనలన్నీ జగన్ దారుణపాలన కు ఉదాహరణలు. పన్నులవసూలుతో నగరపాలకసంస్థల్ని, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తామంటున్న జగన్ సర్కార్, ప్రజల్ని మాత్రం దారుణంగా దోచుకుంటోంది. జగన్ దృష్టిలో ప్రజలంటే పన్నులుకట్టే యంత్రాలుగా మారారు.

రోడ్లపై చెత్తకనిపించినా ప్రజలదే తప్పంటూ వారిని వేధిస్తున్నారు. చెత్తతొలగించి, వీధులుశుభ్రంచేయాల్సిన బాధ్యత ప్రజలదా.. లేక మున్సిపల్ సిబ్బందిదా? ఏప్రియల్ నుంచి ఆస్తిపన్నుతో కలిపి వసూలు చేయాల నుకుం టున్న చెత్తపన్ను విధానాన్ని జగన్ ప్రభుత్వమే తక్షణమే ఉపసంహరించుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014-19మధ్య ఎటు వంటి పన్నులు పెంచకుండా, ప్రజలపై భారంవేయకుండా ప్రభుత్వాన్ని నడిపారు.

జగన్ , వైసీపీనేతల ఆదాయం 10రెట్లు పెరిగితే, ప్రజల ఆదాయం పాతాళంలోకి పడిపోయిం ది.
టీడీపీప్రభుత్వం అధికారంలోకివస్తే ఇలాంటిపన్నులభారం ప్రజలకు ఉండదని స్పష్టంచేస్తు న్నాం. ఓటీఎస్ పన్నుని రద్దుచేస్తామని ఇప్పటికే టీడీపీఅధినేత చంద్రబాబు చెప్పారు. ప్లెక్సీ లను రద్దుచేయాలని జగన్ ఆలోచిస్తున్నాడు. సాక్షి పత్రికకు ప్రకటనలు పెంచుకోవడానికే ఆ నిర్ణయం అమలుచేయాలని చేస్తున్నాడు. అధికారం దక్కినప్పటినుంచీ జగన్, వైసీపీనేతల ఆదాయం 10 రెట్లు పెరిగింది.

ప్రజలఆదాయంమాత్రం అథ:పాతాళానికి పడిపోయింది. రాష్ట్రం లో వైసీపీ నేతలు, కార్యకర్తలవద్దతప్ప, సాధారణ ప్రజలవద్ద డబ్బులేదు. బతకడానికే నానా అగచాట్లుపడుతున్న ప్రజల్ని పన్నులపేరుతో జగన్ అతనిప్రభుత్వం మరింత పీడించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చెత్తపన్నుని ఆస్తిపన్నుతోకలిపి వసూలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ కచ్చితంగా ఎండగట్టి తీరుతుంది.” అని రఫీ స్పష్టం చేశారు.

 

LEAVE A RESPONSE