– ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయాలని జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఫోన్
– పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న జగన్
ఢిల్లీ: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ఆయన జగన్‌ను కోరారు. రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం వివిధ పార్టీల మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలోనే రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జగన్‌తో మాట్లాడారు.
అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగన్ రాజ్‌నాధ్‌కు హామీ ఇచ్చారు. కాగా ఇటీవల ఓట్లపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను జగన్ విమర్శించిన నేపథ్యంలో వైసీపీ యుపిఏకు మద్దతునివ్వదని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని, ఢిల్లీకి దగ్గరయేందుకు ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతునిస్తుందా? లేక అసలు ఓటింగుకే దూరంగా ఉంటుందా చూడాలి.