Suryaa.co.in

Andhra Pradesh

జగన్ నీ మతం, కులం ఏదో చెప్పండి

* టీటీడీని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
* కేంద్రం జోక్యం చేసుకొని హిందూ దేవాలయాలను రక్షించాలి
* టీటీడీ లడ్డు కల్తీనీ సీఎం చంద్రబాబు సాక్ష్యాలతో బయటపెట్టడం అభినందనీయం
– మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎంతో విశిష్టత, ప్రత్యేక ఉందని, వాటిని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, వై ఎస్ జగన్ పాలనలోనే అపవిత్రం, విధ్వంసం చేస్తూ హిందూ సమాజానికి ద్రోహం చేశారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని టీటీడీ ఆలయ పవిత్రతను కాపాడి, ఆస్తులకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం కర్నూలు పాత కంట్రోల్ రూమ్ సమీపంలోని బైరెడ్డి కాంప్లెక్స్ లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఏ మతమో, కులమో చెప్పాలని డిమాండ్ చేశారు. మతం మార్చుకున్న, నాస్తికులు భూమన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్భారెడ్దిలను టీటీడీ బోర్డు చైర్మన్లుగా చేయడమే పరోక్షంగా హిందూ సమాజంపై దాడిగా బైరెడ్డి అన్నారు.

గత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏడు కొండల వేంకటేశ్వరస్వామి కి చెందిన ఏడు కొండలను ధ్వంసం చేసేందుకు ఏడు కాదు ఐదు కొండలే అని ఏకంగా ప్రభుత్వం జీవో తెస్తే ఆనాడు హిందూ సమాజం తీవ్ర ఆందోళన చెందిందని, ఆ జీవో రద్దు కోసం తన నాయకత్వం లో తిరుపతిలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేయగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ నిరసనకు మద్దతు ఇవ్వడం, ఆ జీవో రద్దు అయ్యేలా హిందూ సమాజం ఆందోళన చేసిన విషయం గుర్తు చేశారు.

హిందువుల ఇంటి దేవుడు తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి అని, టీటీడీ లడ్డును ఎంతో పవిత్రంగా భావించి స్వామి దర్శనం అనంతరం ఇంట్లో పూజ చేసి నలుగురికి పంచడం హిందువుల ఆచారం అన్నారు.

ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డును కల్తీ చేసి, గొడ్డు, చేపల కొవ్వు కల్పి అపవిత్రం చేసి ప్రపంచంలోని హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు ఎంతో ముందు చూపుతో టీటీడీ లడ్డు లో కల్తీని సాక్ష్యంతో నిరూపించి ప్రజల ముందు ఉంచారని, మరో మారు ఇలాంటి తప్పు జరగకూడదు అన్న చంద్రబాబు నిర్ణయం అభినందనీయం అన్నారు.

గత జగన్ వైసీపీ పాలనలో కూడా అదే వరవడి కొనసాగిస్తూ ఏ ఇతర మతస్థుల ప్రార్ధనాలయాల జోలికి పోకుండా కేవలం హిందూ దేవాలయాల ధ్వంసం, అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని, హిందూ దేవాలయ ఆస్తులపై దాడులు పెరిగాయని, అన్యమతస్థులు హిందూ ఆలయాలను అపవిత్రం చేస్తున్నా వైసీపీ పాలనలో అడ్డుకోలేదని బైరెడ్డి ఆరోపించారు.

జగన్ పాలనతో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం లడ్డు ప్రసాదంలో చికెన్ ఎముకలు గుర్తించిన భక్తులు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేవని బైరెడ్డి గుర్తు చేశారు.

బళ్లారి లోని బ్రిటిష్ సైన్యంకు వై ఎస్ రాజారెడ్డి గొడ్డు మాంసం సరఫరా చేశారని చరిత్ర చెబుతోందని, ఇలాంటి జగన్ కుటుంబంకు హిందూ దేవతల మహిమలు, పవిత్రత ఏమి తెలుసని, ప్రత్యక్షంగా, పరోక్షంగా హిందూ సమాజం చెడు కోరుకునే జగన్ కు బుద్ధిచెప్పాల్చిన అవసరం ఉందన్నారు.

రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం తమ ఆలయాల పవిత్రత, ఆస్తుల రక్షణకు ముందుకు రావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE