Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌ కు నోటీసులు

అమరావతి: అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టునుమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాలని వెల్లడించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE