– టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ గెలిచిందన్న సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం. రెండో ప్రాధాన్యత ఓట్లు ప్రకారం గెలిస్తే గెలుపు కాదా అంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ గెలిచింది రెండో ప్రాధాన్యత ఓట్లతోకాదా?
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏమైనా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచిందా ? మీరు గెలిచింది మూడో ప్రాధాన్యత ఓట్లతో కాదా ? జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఓటమి భయానికి నిదర్శనం.ఓ వైపు సజ్జల ఏమో పట్టభద్రులు సమాజంలో ఓ చిన్న సెక్షన్ మాత్రమే అన్నారు. ఇప్పుడు జగన్ ఏమో రెండో ప్రాధాన్యత ఓట్లు అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ఫ్యూచర్ ఏంటో జగన్ సహా ఆ పార్టీ నేతలకు అర్థమైంది. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే జగన్ రెడ్డి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసినట్టు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా మోసం చేయాలని చూస్తున్నారు.వైసీపీ పతనం ప్రారంభమైంది, జగన్ కాదు జగన్ తాత రాజారెడ్డి దొగిచ్చినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరు.