• ఎన్.ఎస్.జీ కమాండోలు మాజీముఖ్యమంత్రి రక్షణకోసం కాల్పులు జరిపితే, దళితులే చనిపోతారు..
• తరువాత చంద్రబాబు దళితుల్ని చంపించాడని దుష్ప్రచారంచేసి, మరలా అధికారంలోకి రావచ్చన్న కుట్రలో భాగంగానే, జగన్ దళితుల్ని వైసీపీ కిరాయిమూకలకు రక్షణగా అడ్డుపెట్టి, కుతంత్రపు ఆలోచన చేశాడు
• యర్రగొండపాలెంలో నిన్న దళితుల్ని అడ్డుకున్న సురేశ్ అనుచరుల్లో దళితులు కేవలం 10 నుంచి 15మంది మాత్రమే.
• చంద్రబాబు పర్యటనకు వస్తున్నాడని తెలిసి, మంత్రి సురేశ్ తన అనుచరులతో అక్కడికి వచ్చింది టీడీపీవారిపై కవ్వింపుచర్యలకు పాల్పడి, వారిని రెచ్చగొట్టడానికి కాదా?
• చంద్రబాబుపై వైసీపీ కిరాయిమూకలు రాళ్లువేస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
• జగన్ పన్నిన దుర్మార్గపు కుట్ర వ్యూహంలో మంత్రి సురేశ్ చిక్కుకున్నాడు. మంత్రిగా ఉండి చొక్కాలు చించుకోవాల్సిన గతి అతనికి ఎందుకొచ్చింది?
• తనపై రాళ్లదాడిచేస్తుంటే, పక్కవారిని గాయపరుస్తుంటే చంద్రబాబు మీ అంతు చూస్తా అనకూడదా?
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
యర్రగొండపాలెంలో నిన్న టీడీపీఅధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడికి వ్యూహరచన చేసింది జగన్, సజ్జల, ఐప్యాక్ సంస్థేనని, వారికుట్రలో మంత్రిసురేశ్ పావుగా మారి తనగొ య్యి తానే తీసుకున్నాడని, వివేకాహత్యకేసు విచారణపై సురేశ్ నిజాలు మాట్లాడబట్టే, నిన్న టికుట్రలో ముఖ్యమంత్రి అతన్ని బలిపశువుని చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టంచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
• “ వైసీపీ కంచుకోటలైన మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో చంద్రబాబుకు లభించినప్రజాదరణ చూసి పాలకులకు మతిభ్రమించింది. దాంతోనే జగన్, సజ్జల నీచమైన కుట్రపూరిత ఆలోచనకు తెరలేపి యర్రగొండపాలెంలో టీడీపీ అధినేతపై దాడిచేయించారు. చంద్రబాబుపై జరిగినరాళ్లదాడి ప్రభుత్వ, ఐప్యాక్ టీమ్ సంయుక్త వ్యూహరచనలో భాగంగా జరిగిందే.
• యర్రగొండపాలెంలో టీడీపీఅధినేతను అడ్డుకున్న కుట్రలో ప్రభుత్వం కుట్రలో భాగంగానేదళితుల్ని తెరపైకి తెచ్చింది. మంత్రి ఆదిమూలపు సురేశ్ నిన్న తన సహజత్వానికి భిన్నంగా ప్రవర్తించాడు. అధికారంలో ఉన్నవారు గుడ్డలు ఊడదీసు కొని తిరగడం ఎప్పుడైనా చూశామా? మంత్రికి ఆగతి దేనికి పట్టింది..ఎవరు చెబితే ఆయన ఆ పనిచేశాడు? జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఐప్యాక్ కలిసి చేసిన కుట్రలో నిన్న సురేశ్ పావుగా మారి తానే బలిపశువు అయ్యాడు. నిన్న సురేశ్ వెంట ఉన్నగుంపులో దళితులు కేవలం 10, 15 మంది మాత్రమే ఉన్నారు. మిగిలనవారంతా వివిధ కులాలవారు. ఏదైనా జరగరాని ఘోరం జరిగితే దళితులే ఛస్తారనే జగన్ వారిని ముందుపెట్టి, చంద్రబాబుని తనపార్టీ కిరాయిమూకలతో అడ్డుకొని, కావాలనే రాళ్లు వేయించాడు.
• జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, రాష్ట్రానికి పట్టిన ఖర్మను ప్రజలకు చెప్పడానికి టీడీపీ ఎప్పటినుంచో ‘ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి’ కార్యక్రమం కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, ప్రతిపక్షనేత సాగిస్తున్న కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారన్న అక్కసుతోనే కందుకూరులో జరిగిన దుర్ఘటనను బూచి గా చూపి ప్రభుత్వం జీవోనెం-1 తీసుకొచ్చింది.
• మాజీముఖ్యమంత్రిపై కళ్లముందే దాడి జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తిన ట్టుగా వ్యవహరించింది. చంద్రబాబు పర్యటన ఉందని, తగుజాగ్రత్తలు తీసుకో వాలని టీడీపీనేతలు, స్థానిక ఎస్పీని కోరినా ఆయన ఎందుకు ముందుజాగ్రత్తచర్యలు తీసుకోలేదు? మాజీముఖ్యమంత్రి, ఎన్.ఎస్.జీ భద్రతలో ఉన్నవ్యక్తి ప్రాణాలకే ముప్పు వాటిల్లేలా వ్యవహరించారంటే, దానికి కారణం ప్రభుత్వ, పోలీస్ విభాగాల వైఫల్యం కాదా?
• దళితులఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్, నాలుగేళ్లలో దళితజాతిని నామరూ పాలు లేకుండాచేశాడు. దళితుల సబ్ ప్లాన్ తీసేశాడు. చంద్రబాబు దళితులకోసం ప్రత్యేకంగా అమలుచేసిన 28పథకాల్ని రద్దుచేశాడు. ఆఖరికి అంబేద్కర్ పేరుతో ఉన్న పథకానికి జగనన్న విదేశీవిద్య అని, తనపేరు పెట్టాడు. డాక్టర్ సుధాకర్ మొదలు ఇటీవల జగన్ సొంతజిల్లాలో చనిపోయిన డాక్టర్ అచ్చెన్న వరకు ఎందరు దళితుల్ని ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి బలితీసుకున్నారు? ఎందరు దళిత మహిళ ల్ని, యువతుల్ని అత్యాచారాలతో బలితీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి దళితుల్ని బలితీసుకుంటున్నా, వారిమానప్రాణాలు హరిస్తున్నా ఏనాడూ నోరెత్తని దళితమం త్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీదళితనేతలు నేడు సిగ్గులేకుండా జగన్ విసిరే బిస్కట్లకు ఆశపడి చంద్రబాబుని అంటున్నారు.
• టీడీపీ ప్రభుత్వంలో దళితులకు బ్రహ్మండమైన పథకాలు అమలుచేసింది. ప్రత్యేకంగా వారి సంక్షేమానికి వేలకోట్లు కేటాయించిన ఘనుడు చంద్రబాబునాయుడే. సిగ్గు లేకుండా అలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడతారా? బాధితులైనవారి కుటుంబాలను పరామర్శించడానికి, చంద్రబాబునాయుడు, టీడీపీనేతలు బయటకువస్తే అడ్డుకుంటా రా? రౌడీలు, గూండాలు, కిరాయిమూకలతో టీడీపీ అధినేతపై రాళ్లు రువ్విస్తారా?
చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిలో ఎన్.ఎస్.జీ కమాండెంట్ కు తలకు తీవ్ర గాయమైం ది. అంతబరితెగించి ఘాతుకానికి పాల్పడ్డారంటే కేవలం ఎన్.ఎస్.జీకమాండోలు కాల్పులుజరిపేలా వారిని రెచ్చగొట్టడానికే.
• బాబుగారిని రక్షించడానికి ఎన్.ఎస్.జీ కమాండోలు ఫైరింగ్ చేసుంటే, సురేశ్ సిద్ధంగా ఉంచిన కిరాయిమూకలకు అడ్డుగాఉన్న దళితులు బలయ్యేవారు. అదేజరిగితే వెంటనే దళితుల్ని చంద్రబాబు చంపించాడని రాష్ట్రమంతా నానాయాగీచేసి, ఆయన్ని రాజకీయంగా అడ్డుకొని, మరలా ముఖ్యమంత్రి కాకుండా, తాను ముఖ్యమంత్రి కావాలన్న కుతంత్రపు ఆలోచన జగన్ చేశారు. జగన్ ను అతని మంత్రులు, ఎమ్మె ల్యేలను దళితులు ఇప్పటికే ఛీకొడుతున్నారు. పల్లెల్లో తమకు, తమప్రభుత్వానికి ఎదురువుతున్న అవమానాలకు దిక్కుతోచకనే నిన్న యర్రగొండపాలెంలో చంద్రబా బుని అడ్డుకొనేందుకు పథకరచనచేశారు. ప్రభుత్వం పన్నిన కుట్రలో మంత్రి సురేశ్ బలయ్యాడు. తన సహజత్వానికి, తనధోరణికి భిన్నంగా బట్టలు చింపుకొని అతిగా వ్యవహరించి, తనగొయ్యి తానే తీసుకున్నాడు.
• బాబాయ్ ని చంపినవాడు. ..కోడికత్తి డ్రామా ఆడినవాడు, తల్లినిచెల్లిని రోడ్లపాలు చేసినవాడు.. చంద్రబాబుపై రాళ్లు వేయించడానికి సంకోచిస్తాడా? చంద్రబాబుపై దాడికి సిద్ధమైన వైసీపీ కిరాయి మూక లకు పోలీసులే సహకరించారు. (పోలీసులతో మంత్రి సురేశ్ మాట్లాడిన దృశ్యాలను ఆనంద్ బాబు విలేకరులకు చూపించారు) ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడిన పోలీసు లు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం.
• కావాలనే చంద్రబాబుపై రాళ్లదాడిచేయించి, సిగ్గులేకుండా చంద్రబాబు, లోకేవ్ దళితుల్ని అవమానించారని విషప్రచారం చేస్తారా? దళితుల్ని తాను అవమానిం చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పించుకుంటానన్న లోకేశ్ సవాల్ కు ఎందు కు స్పందించలేదు?
• తనపై రాళ్లదాడిచేస్తుంటే, పక్కవారిని గాయపరుస్తుంటే చంద్రబాబు మీ అంతుచూస్తా అనకూడదా? కచ్చితంగా సురేశ్ లాంటి వాళ్ల అంతుచూస్తాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాంతంలో టీడీపీవాళ్లు ఉంటే ఊరుకుంటారా? నల్లబెలూన్లు, నల్లచొక్కాలతో సురేశ్ ఎందుకొచ్చాడు. అతన్ని, అతని కిరాయిమూకల్ని అదుపులోకి తీసుకోకుండా పోలీసులేం చేశారు?
• ఎన్.ఎస్.జీ కమాండోలు చంద్రబాబు రక్షణకోసం కాల్పులుజరిపితే, దళితులు చనిపోతారని, దాంతో దళితుల్ని చంపిన చంద్రబాబు అని దుష్ప్రచారంచేసి, దళితుల కు ఈనాలుగేళ్లలో చేసిన దారుణాల్ని మర్చిపోయేలా చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్రపన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం జగన్ ప్రభుత్వంలో ప్రతిరోజు అవహేళనకు గురవుతోంది. జగన్ కు, అతని ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రజలు కూడా రోజులు లెక్కబెడుతున్నారు.
• వివేకాహత్యకేసు విచారణపై సీబీఐ గురించి మాట్లాడుతూ, మంత్రి సురేశ్ చట్టం తనపని తాను చేస్తుంది అని మాట్లాడిన మాటల్ని గుర్తుంచుకొనే, నిన్నటి యర్రగొండ పాలెం కుట్రలో అతన్నిపావుగా వాడారు అనిపిస్తోంది. సురేశ్ సంగతి.. అతను ఎవర్ని అడ్డుకుంటాడో, ఎన్నిసార్లు అడ్డుకుంటాడో కూడా చూస్తాం. ప్రభుత్వంలోని కొందరు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ తమవారికి చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తున్నారనే వారికి చంద్రబాబుపై దాడి లాంటి టాస్క్ లు ఇస్తున్నారనే అనుమానం కలుగుతోంది .” అని ఆనంద్ బాబు సందేహం వ్యక్తంచేశారు.