– బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ
జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద గల ఎమ్మెస్సార్ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన గౌరవ సభ కార్యక్రమం మరియు ఇంటి ఇంటికి ప్రజా సమస్యలపై 16 అంశాల తో కుడి కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేగేశన మాట్లాడుతూ… ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అన్నారు. మహిళ కి అన్యాయం జరిగితే ఒక్క నిమిషంలో ఉంటాం అన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల మీద ఎన్నో దాడులు జరుగుతుంటే ఏమి చేస్తోంది అని అన్నారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడంలో, ప్రపంచ దేశాల్లో తెలుగువారి ఖ్యాతిని పెంచింది తెలుగుదేశం ఒకటే ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రకమిటీ నాయకులు పార్లమెంట్ కమిటి నాయకులు నియోజకవర్గ నాయకులు బాపట్ల పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.