* రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది
* వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాం..
* పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు
* ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు
* ధరల నియంత్రణపై దృష్టి పెట్టి రాయితీపై కూరగాయల విక్రయాలు
* గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు
* వరద బాధితులకు
* పాస్ పోర్ట్ వచ్చి ఉంటే గత ప్రభుత్వ నాయకుడు ఈపాటికి లండన్ వెళ్లిపోయేవారు
* ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై విచారణ జరుగుతోంది
* గణేష్ మండపాలకు సంబంధించి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు
– వంగలపూడి అనిత, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
విజయవాడ: వరద ముంపు ప్రాంతాల్లో ఎనిమిది రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు.అందరికీ సహాయం అందాలని సీఎం చంద్రబాబు 8 రోజులుగా కలెక్టరేట్లోనే ఉండి సమీక్షిస్తున్నారు.
ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు.
ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లో ఇంతలా పర్యటించలేదు. సీఎం ఆదేశాలతో అందరికీ మూడు పూటలా ఆహారం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం.ఈరోజు 3 లక్షలకు పైగా ఫుడ్ ప్యాకెట్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ జరుగుతోంది. ధరలు నియంత్రణపై కూడా దృష్టి సారించి సీఎం ఆదేశాలతో రాయితీపై కూరగాయల విక్రయం జరుగుతోంది.163 స్టోర్స్ లో 5 లక్షల కేజీలకు పైగా కూరగాయల విక్రయాలు జరిగాయి.
తాగునీటి సరఫరా కోసం 236 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లు ఈరోజు ఈ సమయానికి 177 ట్రిప్పులు వేశాయి. నిన్న వాటర్ ట్యాంకర్లు 2090 ట్రిప్పులు వేశాయి. ఈ మూడు రోజుల్లో 60 వేల మందికి పైగా రేషన్ పంపిణీ జరిగింది. ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతోంది.
ఇప్పటికే 20 వేల ఇళ్లకు పైగా శుభ్రం చేయడం జరిగింది. 42 డ్రోన్ల సహాయంతో క్లోరినేషన్ చేస్తున్నాం. వీటి సాయంతో లక్ష మందికి పైగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశాం. గత ముఖ్యమంత్రులు వరద ప్రాంతాల్లో ఒక్కరోజు మాత్రమే పర్యటించి వెళ్ళిపోయేవారు. సీఎం చంద్రబాబు హ్యుమానిటీ యాంగిల్ లో కూడా ఆలోచించి పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు.
కుటుంబాన్ని, పండుగలను కూడా పక్కనపెట్టి సీఎం చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారు.వరద బాధితులకు పులిహార ప్యాకెట్లు కూడా పంచని గత ప్రభుత్వ నాయకుడు పులిహోర కబుర్లు చెప్తున్నారు.
చిన్నపిల్లలు కూడా వారి కిడ్డీ బ్యాంకుల్లో డబ్బులు తీసి విరాళాలు ఇస్తున్నారు. కానీ గత ప్రభుత్వ నాయకులు బెంగళూరులో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విజయవాడలో 8 రోజులుగా వరద ప్రభావం ఉంటే గత ప్రభుత్వ నాయకుడు వచ్చి ఇక్కడ 20 నిమిషాలు మాత్రమే ఉన్నారు.
మంత్రి నిమ్మల రామానాయుడు నిద్రాహారాలు మాని 3 రోజులుగా బుడమేరు దగ్గరే ఉండి అంతా సమీక్షించారు.ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉన్నారు. రేపటి నుంచి నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై అనుమానాలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతోంది..