Suryaa.co.in

Andhra Pradesh

జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన మీ అయ్య పోలవరం మొదలెట్టాడా జగన్?

– పోలవరం నిర్మాణంలో ఏ తప్పూ జరగలేదని కేంద్రానికి లేఖ రాసిన జగన్, ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలో ప్రాజెక్ట్ పై కట్టుకథలు, అబద్ధాలు చెప్పాడు?
• ఎన్నికల్లో లబ్ధికోసమే జగన్ పోలవరం జపం మొదలెట్టాడు
• పోలవరంప్రాజెక్ట్ ను డ్యామ్ గా మార్చే హక్కు జగన్ కు ఎవరిచ్చారు?
• చంద్రబాబు పసిపిడ్డలా సాకి పోలవరాన్ని 72శాతంపూర్తిచేస్తే, జగన్ నిర్మాణాన్నిగాలికి వదిలేసి నిర్వాసితులసొమ్ము కాజేశాడు
• కేంద్రం నిర్వాసితులకోసం ఇచ్చిన రూ.6వేలకోట్లను లిక్కర్ కంపెనీలకు ధారాధత్తం చేశాడు
• పోలవరం గురించి జగన్ కు, మంత్రులకు ఓనమాలు కూడా తెలియవు
• పెంటపాటి పుల్లారావుపిటిషన్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏతప్పూ జరగలేదని కేంద్రానికి లేఖరాసినజగన్, సిగ్గులేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పాడు
• పోలవరం నిర్మాణానికి శంఖుస్థాపన అంజయ్య హయాంలో జరిగితే, ఎన్టీఆర్ వచ్చాక ప్రాజెక్ట్ పనులకు అంకురార్పణ జరిగింది
• చంద్రబాబు హాయాంలో జరిగిన 72శాతం పనులతో, పోలవరం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లోనమోదైంది
• కేంద్రమంత్రి గడ్కరీయే స్వయంగా చంద్రబాబు, టీడీపీప్రభుత్వం పోలవరంలో నిర్మాణంలో సాధించినప్రగతిని చెప్పారు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

శాసనసభలో, పార్లమెంట్లో నేడు పోలవరంపై చర్చజరిగిందని, ప్రాజెక్ట్ ఎత్తు45.72 మీటర్లు అయితే, ప్రస్తుతానికి41.15 మీటర్లకే పరిమితంచేశామని, నిర్వాసితులకు పరిహారం ఎంత ఇచ్చింది..ఇంకా ఎంతమందికి ఎంతఇవ్వాలనే వివరాలను కేంద్రజలవనరులశాఖ సహాయ మంత్రి లోక్ సభలో చెప్పారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిట్టనిలువునా నిర్వాసితుల్ని గోదావరినీళ్లలోముంచేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

“జగన్ జమానాలో పోలవరం నిర్వాసితులు కొండలు, గుట్టల్లో బిక్కుబిక్కుమంటూ బతకా ల్సిన దుస్థితి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్ విభాగం ఇచ్చిన నివేదికలో రూ.100కోట్ల నిర్వా సితుల సొమ్ముని వైసీపీప్రజాప్రతినిధులు, కిందిస్థాయినేతలు కొట్టేశారని పేర్కొన్నారు. ఆ వ్యవహారంలో కొందరు తహసీల్దార్లు, వీఆర్వోలు జైలుకెళ్లారు. కానీ అధికారపార్టీనేతలు మా త్రం ఇప్పటికీ దర్జాగా బయటతిరుగుతున్నారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ, తనతండ్రి ప్రాజెక్ట్ కు శంఖుస్థాపనచేశాడని నిస్సిగ్గుగా అబద్ధం చెప్పాడు.

మహానుభావుడు స్వర్గీయ అంజయ్యగారు 1981లో ప్రాజెక్ట్ నిర్మాణానికి శంఖుస్థాపనచేశారు. ఆయనచేసిన పనిని తన తండ్రి చేశాడని చెప్పుకోవడానికి నిజంగా జగన్ సిగ్గుపడాలి. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగులుపడ్డాయి. సుజలగోదావరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణా నికి సంబంధించి కార్యాలయాలు ఏర్పాటుచేసి, సర్వేలు చేయించి, ప్రాజెక్ట్ లెఫ్ట్ ,రైట్ కెనాల్ ల నిర్మాణ అంచనాలు తయారుచేయించారు. మహానుభావుడు కే.ఎల్.రావు, రామ్మూర్తి వంటి వారు స్వాతంత్ర్యం రాకముందే ప్రాజెక్ట్ నిర్మాణంపై అంచనాలు సిద్ధంచేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని బ్రిటీష్ వారి హయాంలోనే గుర్తించారు. ఇన్నిజరిగితే, జగన్ సిగ్గు, శరంలేకుండా మాఅయ్య మొదలెట్టాడు…నేను పూర్తిచేస్తాను అంటున్నాడు.

4 ఏళ్లలో పోలవరం నిర్మాణం ఎంత చేశాడో, నిర్వాసితులకు ఎంత సొమ్ము ఇచ్చాడో, పూర్తి వివరాలతో, వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్ కు ఉందా?
రూ.2,600కోట్ల కేంద్రనిధులు రాబట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి, 10నెలల్లో ప్రాజెక్ట్ పూర్తిచేస్తాడా?
తన నాలుగేళ్ల పాలనలో పోలవరం నిర్మాణానికి ఎన్ని నిధులు ఖర్చుపెట్టి, ఎంత పని చేయించాడో జగన్ చెప్పాలి. నిర్వాసితులకు ఎంతసొమ్ముఇచ్చి, ఎన్నికుటుంబాలను ఆదుకున్నాడో, రూ.6వేలకోట్ల కేంద్రనిధుల్ని ఎక్కడ, దేనికోసం ఖర్చుపెట్టాడో, రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏం సాధించాడో చెప్పాలి. సెంట్రల్ విజిలెన్స్ గైడ్ లైన్స్ ను పక్కనపెట్టిమరీ, బేసిక్ పారామీ టర్స్ మార్చి జగన్ రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడాడు. తనజుట్టు కేంద్రంచేతిలో ఉండటంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడుగుకూడా ముందుకుతీసుకెళ్లలేకపోయాడు? పోలవరంప్రాజెక్ట్ ను పో లవరం డ్యామ్ గా మార్చే హక్కు జగన్ కు ఎవరిచ్చారు? చంద్రబాబు పోలవరాన్ని పసిబిడ్డ లా సాకి, 72శాతం నిర్మాణాన్నిపూర్తిచేస్తే, ముఖ్యమంత్రికి, మంత్రులకు సిగ్గుకూడా లేదు. 4ఏళ్లలో పోలవరంనిర్మాణాన్ని ఎంతపూర్తిచేశాడో, నిర్వాసితులకు ఎంతసొమ్ము ఇచ్చాడో, పూర్తి వివరాలతో, వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము జగన్ కు ఉందా? పాదయాత్రసమయంలో నిర్వాసితులకు రూ.19లక్షలు ఇస్తానన్న జగన్, అధికారంలోకి రా గానే 10లక్షలని మాటమార్చాడు. తరువాత ఆసొమ్ముకూడా ఇవ్వకుండా నిర్వాసితుల నోట్లో మట్టికొట్టాడు. రూ.500కోట్లకు ఇచ్చిన జీవోఏమైంది?

ఒక్కోనిర్వాసిత కుటుంబానికి దక్కాల్సిన రూ.10లక్షలు ఎవరిఖాతాల్లో పడ్డాయి? ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియ కుండానే నిర్వాసితులసొమ్ముని వైసీపీపందికొక్కులు బొక్కేశాయా? 46నెలల్లో ఏడవలేని ముఖ్యమంత్రి , 10నెలల్లోఏడుస్తాడంటా! ఎవరికి చెబుతావు కట్టుకథలు? సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ కు అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూప్యానెల్, పోలవరంప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రజలవనరులశాఖ చంద్రబాబుగారి హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 72శాతం పూర్తిచేసింది. చేసిన పనుల్ని చూపించడానికి 5లక్షలమంది ప్రజల్ని డ్యామ్ సైట్ కు తీసుకెళ్లడం జరిగింది.32వేల530క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ ని 24గంటల్లో పూర్తిచేయడం జరిగిం ది. ఆ ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. లిమ్కాబుక్ ఆఫ్ అవార్డ్ ను ప్రాజెక్ట్ దక్కించుకుంది. బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవార్డ్ పోలవరానికి దక్కింది. కేంద్రవిద్యుత్, జలవనరులశాఖల మంత్రులే స్వయంగా అవార్డు ఇచ్చారు. టీడీపీప్రభుత్వం, చంద్రబాబు చేసినపని ఇలా కళ్లముందు కనిపిస్తుంటే, మా అయ్యమొదలెట్టాడు..నేను పూర్తి చేస్తాను.. అంటూ డబ్బాలు కొడతావా? రూ,.2,600కోట్లు కేంద్రంనుంచి రాబట్టుకోవడం చేత గాని ముఖ్యమంత్రి, 10నెలల్లో ప్రాజెక్ట్ పూర్తిచేస్తాడా? 31మంది వైసీపీఎంపీలు ఢిల్లీలో గడ్డిపీ కుతున్నారా జగన్? నువ్వు కోటలో ఉన్నా..పేటలో ఉన్నా ఒకటేనని గుర్తుంచుకో.

46 నెలలుగా డీపీఆర్-2 అంచనావ్యయం రూ.55,548కోట్లను కేంద్రప్రభుత్వంతో ఆమోదింప చేయించుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, 10నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడా?
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ పోలవరం పనులుచేయడానికి జగన్ ఒక్కఅడుగు కూడా ముందుకువేయలేదు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ప్రాజెక్ట్ ని పడుకోబెట్టాడు. పెంటపాటి పుల్లారావు అనేవ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖరాస్తే, చాలాస్పష్టంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వమిచ్చిన సమాచారంతో ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేసింది. దానిలో టీడీపీప్రభు త్వంలో ఎంతపనిజరిగిందో, చంద్రబాబుగారు ఏంచేశారో వివరంగా చెప్పారు. కేంద్రమంత్రి నితి న్ గడ్కరీనే స్వయంగా చంద్రబాబు ఎంతశాతం పనిచేయించారో చెప్పకనే చెప్పారు. వరదలు వచ్చినప్పుడు, 15నెలలు కాంట్రాక్టర్లు ఎవరైనా డ్యామ్ సైట్లో ఉన్నారా.. ఉన్నారని ముఖ్య మంత్రి చెప్పగలడా? వరదలు వచ్చేసమయంలో కాంట్రాక్టర్ ని మార్చవద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ చెప్పినా వినకుండా, పీటర్ కమిటీపేరుతో పిచ్చిపనులు చేశాడు. పోలవరం రైట్ కెనాల్ పై లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.912కోట్లపనులు ఎందుకు మొదలుపెడు తున్నాడో ముఖ్యమంత్రిచెప్పాలి. ఎత్తుని 41.15మీటర్లకు ఎందుకుపరిమితం చేస్తున్నాడు?

చంద్రబాబుహయాంలో ఆమోదం పొందిన డీపీఆర్-2కి సంబంధించి రూ.55,548కోట్లని కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు ఆమోదింపచేసుకోలేకపోయాడు? 46నెలలు అయినా డీపీఆర్ ని ఆమోదింపచేసుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి 10నెలల్లో ప్రాజెక్ట్ కడతాడా? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ కు విరుద్ధంగానే జగన్ ఏకపక్ష నిర్ణయాలతో పోలవరాన్ని సర్వ నాశనం చేశాడు. బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటానికే జగన్, పోలవరం, అమరావతిని తాకట్టు పెట్టాడు. బాబాయ్ హత్యకేసు నుంచి తానుబయటపడటానికి, తనతమ్ముడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండాచూడటానికి, లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అరెస్ట్ కా కుండా చూడటానికే జగన్ కేంద్రప్రభుత్వంవద్ద నోరుమెదపడంలేదు. పోలవరాన్ని, అమరావ తిని ఇప్పటికే తాకట్టుపెట్టేశాడు. జగన్ అయ్య జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాడు. ప్రాజె క్ట్ వదిలేసి కాలువలతవ్వకంపేరుతో మట్టిఅమ్ముకున్నాడు. అదీ మీ అయ్యసాధించింది. మీ అయ్యగాలికి వదిలేసిన పోలవరం రైట్ కెనాల్ పరిధిలోని నిర్వాసితుల్ని ఆదుకొని, వారికి పరిహారమిచ్చి, చంద్రబాబు 400టీఎంసీల సామర్థ్యంతో పట్టిసీమను కట్టిచూపించాడు. కృష్ణా ఆయకట్టుని స్థిరీకరించి, రూ.44వేలకోట్ల సంపదసృష్టికి కారకుడైన అపరభగీరథుడు చంద్రబాబు.

టీడీపీ ప్రభుత్వ హాయాంలో పోలవరానికి రూ.11,537కోట్లుఖర్చుపెడితే, దానిలో రూ.6 వేల కోట్లు జగన్ వచ్చాక కేంద్రంనుంచి తెచ్చుకున్నాడు. టీడీపీప్రభుత్వంలో చేసిన పోలవరం పనులు సక్రమంగా ఉండబట్టే, కేంద్రం డబ్బిచ్చింది. ఆ సొమ్ముని నిర్వాసితులకు ఇవ్వకుం డా లిక్కర్ కంపెనీలకు చెల్లించేశాడు. ఇంతచేసిన జగన్ కు పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హతలేదు. దద్దమ్మలాగా, చేతగానివాడిలాగా, అయోగ్యుడిలాడా పోలవరంపై తానేదో చేస్తు న్నట్టు డబ్బాలుకొట్టుకొని, చంద్రబాబుని, టీడీపీని తిట్టాడు. పోలవరం, రంపచోడవరం ని యోకవర్గాలు నాకురాకపోయినా పర్లేదని నిర్వాసితులకు డబ్బులుఎగ్గొట్టిన నీతిమాలినవ్యక్తి జగన్. గోదావరికి వచ్చే వరదను అంచనావేయలేని జగన్ ప్రభుత్వ అసమర్థతే, కాపర్ డ్యామ్ ను దెబ్బతీసింది. జగన్ , మంత్రి అంబటి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. స్పిల్ వే నిర్మాణం ఎలాచేశారో , ఎంత ఎత్తునుంచి చేశారో, జగన్ కు, అతనిమంత్రులకు తెలు సా? పోలవరంప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూప్యానెల్ లోయర్ కాపర్ డ్యామ్ నిర్మా ణంజరగలేదని, జూన్ జూలైలో వరదలువచ్చేనాటికి 22లక్షలక్యూబిక్ మీటర్ల మట్టిపనులు చేయాలని మొత్తుకుంటే జగన్ ప్రభుత్వం మొద్దునిద్రపోయింది. దానివల్ల గోదావరికి వచ్చిన వరద లోయర్ క్యాపర్ డ్యామ్ ను ముంచి, అప్పర్ కాపర్ డ్యామ్ ను దెబ్బతీసింది. దాంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని గాలికివదిలేసిన జగన్ ప్రభు త్వం ఇప్పుడు ఇసుకతో గుంతలపూడ్చటానికి రూ.2వేలకోట్లు అవుతాయంటూ డబ్బులు కొట్టేసేపనిలో జగన్ ఉన్నాడు.

టీడీపీప్రభుత్వంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి జరిగిన పనులన్నీ కేంద్రజలవనరులశాఖ ఆధ్వర్యంలో, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ కు అనుగుణంగా జరిగినవేనని బల్లగుద్దిచెప్పగలం. జగన్మోహన్ రెడ్డి నేడు అసెంబ్లీలో చెప్పిన వన్నీ అసత్యాలు.. అబద్ధాలే. చరిత్రలో పోలవరం ద్రోహిగా జగన్ నిలిచిపోతాడు. తానుపుట్టిన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కూడా తీరనిద్రోహంచేశాడు. పట్టిసీమ లిఫ్ట్ ను కూడా నిరుప యోగంగా మార్చాడు. టీడీపీసభ్యల్నిసభలోలేకుండాచేసిన జగన్, మంత్రిఅంబటి నేడు అసెం బ్లీలో మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగాఉన్నాయి” అని దేవినేని ఆగ్ర హం వ్యక్తంచేశారు.

LEAVE A RESPONSE