Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని కూడా తన అవినీతి వనరుగా మార్చుకున్నాడు

– దానిఫలితమే శ్లాబులవిధానంతో నెలానెలా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలకుషాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు
చంద్రబాబుహాయాంలో విద్యుత్ రంగంపై గతంలోచేసిన నిరాధార ఆరోపణలకు జగన్ రెడ్డి ఇప్పుడు బహిరంగక్షమాపణచెప్పాలి
• థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణం.
• బొగ్గుసరఫరాచేసే సంస్థలకు, సెకీకి జగన్ ప్రభుత్వం వేలకోట్లుబకాయిపడటంతో, వారు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి మోకాలడ్డారు
• బయటనుంచి అధికధరకు విద్యుత్ కొంటున్న జగన్ ప్రభుత్వం అసలు ఎంతధరకు కొంటుందో చెప్పాలి.
• గతంలో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,829కోట్లు ఆదా అయ్యాయని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజలపైఎందుకు భారాలమీద భారాలు వేస్తున్నాడు?
• రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి.. విద్యుత్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (ఈఆర్ సీ) తోకలిసి జగన్మోహన్ రెడ్డి తాజాగా పేదలపై విద్యుత్ ఛార్జీల భారంమోపాడని, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తశ్లాబులవల్ల తక్కువ విద్యుత్ వినియోగించేవారికి ఎక్కువభారం.. ఎక్కువ విద్యుత్ వినియోగించేవారిపై తక్కువభారం పడనుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలభారం ప్రజలకుభారమైందని గగ్గోలు పెట్టిన జగన్ రెడ్డి, ఇప్పుడు తెలివిగా తనమూడేళ్లపాలనలో 7సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచాడ ని టీడీపీకేంద్ర కార్యాలయకార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. ఈ ముఖ్యమంత్రి విద్యుత్ ఛార్జీలు పెంచడంకోసం ఏటామార్చాల్సిన శ్లాబులను నెలనెలా మారుస్తూవచ్చాడు. గతంలో 50యూనిట్లు వాడుకుంటే ఒక్కో యూనిట్ కు రూ.1.45పైసలు కట్టేవాళ్లమని, ఇప్పుడు అదే50యూనిట్లలో యూనిట్ ధరకు రూ.2.60 పైసలు కట్టాల్సివస్తోంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ ఆమోదించిన ప్రతిపాదనలు ఆగస్ట్ నుంచి అమల్లోకి రానున్నాయి. గతప్రభుత్వంలో మొత్తం విద్యుత్ వినియోగదారులు 13శ్లాబులుగా విభజించబడిఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరినీ 6శ్లాబులపరిధిలోకే తీసుకొచ్చింది.

దానివల్ల 300యూనిట్లవాడకం దాటితే ఆపైన ఎంతవిద్యుత్ వాడుకున్నా.. యూనిట్ కు రూ. 7.50పైసలు మాత్రమే చెల్లించాలి. 75యూనిట్లు, 100యూనిట్లు వాడుకునే విద్యుత్ వినియోగదారులందరూ గతంలో యూనిట్ విద్యుత్ కు రూ.1.45పైసలు మాత్రమేకట్టేవారు.. అదే వినియోగదారులుఇప్పుడు యూనిట్ కు రూ.4లుకట్టాల్సిన దుస్థితినిజగన్ రెడ్డి కల్పిం చారు. నెలకు300 యూనిట్లు వాడేవారంతా బాగాడబ్బున్నవారే. ఇంటిలో కనీసం ఒకఏసీ, మూడు, నాలుగుఫ్యాన్లు..6,7 లైట్లు, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్ … వాటర్ మోటార్ వంటివి ఉంటే నే నెలకు 300యూనిట్లు అంతకంటే ఎక్కువ విద్యుత్ వాడతారు. సాధారణ ప్రజలు, మధ్యత రగతి వారెవరికీ అంతవిద్యుత్ వాడకంఉండదు.

జగన్ రెడ్డిమార్చిన శ్లాబులతో ఒక్కయూనిట్ విద్యుత్ అధికంగా వినియోగించినా… 75 యూనిట్ల కేటగిరి వారికి రూ.169కట్టాల్సింది రూ.304వరకు కట్టాల్సిన పరిస్థితి. నెలనెలా కేటగిరీలు మారుస్తూ….13శ్లాబుల్ని 6 శ్లాబులుగా కుదించడంవల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. స్విచ్ వేయకముందే షాక్ కొట్టేపిరిస్థితిని జగన్ రెడ్డి ప్రజలకు కల్పించాడు. ఫ్యాన్ కు ఓటేసిన వారంతా ఫ్యాన్ వైపు చూస్తేనే భయపడే పరిస్థితికి వచ్చారు.తక్కువ విద్యుత్ వినియోగించేవారిపై ఎక్కువభారం.. ఎక్కువవిద్యుత్ వినియోగించేవారిపై తక్కువభారం వేయడం ఎలాంటిన్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.

విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం మొత్తంగా విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం చాలా చాలాపెద్ద తప్పులుచేసింది. కానీ అవేవీప్రజలకుతెలియడంలేదు. ఆగస్ట్ నుంచి విద్యుత అసలైన విద్యుత్ షాక్ ఎలాఉంటుందో ప్రజలు చూడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం థర్మల్ విద్యుత్ తయారు చేసే సంస్థలకు బొగ్గుసరఫరాచేయడంలేదు.. సెకీ (సోలార్ పవర్ కార్పొరేషన్)కి ఈ ప్రభుత్వం రూ.7,486కోట్ల వరకు బకాయిఉంది. ఆ బాకీ చెల్లించలేదని రిజర్వ్ బ్యాంక్ లో ఏపీ ప్రభుత్వ ఖాతాలో ఉన్న రూ.107కోట్ల సొమ్ముని సెకీ రికవరీచేసుకుంది. ఈ విషయం స్వయంగా కేంద్రమంత్రే రాజ్యసభలో చెప్పారు.
ఒకప్రభుత్వసకాలంలో డబ్బు కట్టలేదని సెకీ ఆప్రభుత్వతాలూకా సొమ్ముని రికవరీచేసుకోవడం దేశంలో ఇదేతొలిసారి. థర్మల్..సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తిగా మూతపడేపరిస్థితిని ముఖ్యమంత్రి కల్పించాడు. దాంతో రాష్ట్రంమొత్తం నీటిద్వారా ఉత్పత్తి అయ్యేవిద్యుత్ పైనే ఆధారపడాల్సిన దుస్థితి. కరెంట్ కష్టాలు మొదలవ్వడంతో జగన్ ప్రభుత్వం అధికధరలకు బయటనుంచి విద్యుత్ కొంటోంది. ఆవిధంగాకొంటున్న విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేక్రమంలోనే ఇప్పుడు ఛార్జీలుపెంచారు.. ఇంతటితో ఆగకుండాముందు..ముందు ఇంకా పెంచుతారు.

విద్యుత్ రంగాన్ని సంస్కరించి, సకాలంలో విద్యుత్ ఉత్పత్తిచేయలేని ప్రభుత్వఅసమర్థత అంతిమంగా ప్రజలకు శాపంగామారింది. విద్యుత్ ఉత్పత్తిసంస్థలు..సరఫరాసంస్థలను ఎవరూకూడా పునరుద్ధరించలేనంత దారుణంగా జగన్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యంచేసింది. దానిప్రభావంవల్లనే ఇప్పుడు ప్రభుత్వంపెంచిన విద్యుత్ ఛార్జీలవల్ల దాదాపు రూ.1400కోట్ల వరకు భారంప్రజలపై పడనుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యుత్ కొనుగోళ్లతో రూ.4,829కోట్లవరకు ఆదాఆయ్యాయని ప్రజలముందు బీరాలుపలికాడు.. అంతసొమ్ము ఆదాచేసిన ఆయన ఇప్పుడెందుకు ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ, ప్రజలకు షాక్ లమీద షాక్ లు ఇస్తున్నాడో సమాధానంచెప్పాలి.

టీడీపీ హయాంలోచంద్రబాబు ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలుపెంచలేదు. సకాలంలో అన్ని విధాలా విద్యుత్ ఉత్పత్తి అయ్యేలాచేశారు. విద్యుత్ సరఫరాలో జరిగేనష్టాలను చాలావరకు తగ్గించారు. ప్రజలకు 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలాచేశారు. అలానే రైతులకు కోతలులేని నాణ్యమైన విద్యుత్ ను చెప్పినసమయానికి అందించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రవిద్యుత్ రంగం సర్వనాశనమైందని చెప్పాలి. ఆఖరికి ఈ ప్రభుత్వం, కేంద్రమిచ్చే అప్పుకోసం ఏరాష్ట్రం ఒప్పుకోని నిబంధనకు ఒప్పుకొని రైతులవిద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమైంది. రైతులవిద్యుత్ బకాయిలు ఏపీ ప్రభుత్వంచెల్లించకపోతే….చచ్చినట్లు రైతులేకట్టుకోవాలి. అసలు రైతులమోటార్లకు మీటర్లు బిగించడందేనికి…. ముందు రైతులుబిల్లులుచెల్లిస్తే..తరుతాత తాముకడతామని ప్రభుత్వం చెప్పడం దేనికని ప్రశ్నిస్తున్నాం. విద్యుత్ రంగంమొత్తం నష్టాల్లోకి వెళ్లేలా జగన్ ప్రభుత్వం ఆలోచనారహితంగా వ్యవహరించింది.

రాజకీయాల్లో అహంకారం చూపితే, అదిరాజకీయాలకే పరిమితం..కానీ విద్యుత్ రంగం వంటి వాటిపై కూడా ఈముఖ్యమంత్రి రాజకీయాలుచేశాడు. దానిప్రభావమే థర్మల్ కేంద్రాలకు సింగరేణి నుంచి బొగ్గుసరఫరా నిలిచిపోయింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్య లు తీసుకోవడంలోకూడా ఈముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటికే పేదలు జగన్ రెడ్డి అమ్ముతున్న కాస్ట్ లీ లిక్కర్ దెబ్బకు కుదేలవుతున్నారు. తాజాగా రేపట్నుంచి కాస్ట్ లీ కరెంట్ దెబ్బకు అన్నివర్గాలవారు అల్లాడిపోయే పరిస్థితి.
అన్నింటిపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లే ముఖ్యమంత్రి ఈఆర్ సీ ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీలపై కూడా సమీక్షచేసి, న్యాయసమీక్షకోరతాడా అని ప్రశ్నిస్తున్నాం.

విద్యుత్ స్విచ్ వేయకముందే షాక్ కొట్టేపిరిస్థితి కల్పించాడు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ప్రజలంతా ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేసి, తానుచేసినఅప్పులకు ప్రజలను బలితీసుకుంటున్న జగన్ రెడ్డిని ప్రజల్లో దోషిగా నిలబెట్టేతీరుతాం. విద్యుత్ రంగం రోజురోజుకీ బలపడుతూ, విద్యుత్ వినియోగం అధికమవుతున్న తరుణంలో జగన్ రెడ్డి ప్రభుత్వం దాన్నికూడా అవినీతిమయంచేసింది. ఈఆర్ సీ ప్రతిపాదించిన విద్యుత్ ధరలపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లే ధైర్యం, న్యాయసమీక్షకోరే ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా? టీడీపీహాయాంలో విద్యుత్ రంగంపై, ఛార్జీలుపెరిగాయని చేసిన దుష్ప్రచారంపై జగన్ రెడ్డి సమాధానంచెప్పాల్సిందే. ప్రతిపక్షంలోఉన్నప్పుడు విద్యుత్ రంగంపై చేసిన ఆరోపణలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి…తానుచేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కుతీసుకోవాలి.

రాష్ట్రవిద్యుత్ రంగ స్థితిగతులు, తనప్రభుత్వం సాగిస్తున్న విద్యుత్ కొనుగోళ్లపై జగన్మోహన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీహాయాంలో ఏనాడూ విద్యుత్ ఛార్జీలుపెంచలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలోనే 7సార్లుఛార్జీలుపెంచాడు.

చంద్రబాబునాయుడిహయాంలో జరిగిన పవర్ మేనేజ్ మెంట్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రానికి విద్యుత్ కొరత..ప్రజలకు విద్యుత్ కోతలనేవి లేకుండాచేశారు. జగన్మోహన్ రెడ్డి తన అసమర్థతతో విద్యుత్ రంగాన్ని దెబ్బతీసి, ప్రజలకు షాక్ లు ఇస్తున్నాడు. ప్రభుత్వ అవినీతి..అసమర్థతే విద్యుత్ రంగం దెబ్బతినడాని కి ప్రజలపై షాక్ లభారం పడటానికి ప్రధానకారణం.

థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ లకు డబ్బులు కట్టకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, టీడీపీ హాయాంలో చేసుకున్నవిద్యుత్ ఒప్పందాలు రద్దుచేయడం వల్లే రాష్ట్రం చీకట్లపాలుకానుంది. రేపు వేసవిలో ఈప్రభుత్వం కరెంట్ కష్టాలనుఎలా అధిగమిస్తుందో.. ప్రజలకు కోతలులేకుండా విద్యుత్ ఎలా అందిస్తుందో చూడాలి. బొగ్గుసరఫరాచేసే సంస్థలకు, సోలార్ సంస్థలకు బాకీలు పడిన జగన్ ప్రభుత్వం ఇతరరాష్ట్రాలనుంచి ఏప్రభుత్వం కొననివిధంగా అధికధరకువిద్యుత్ కొనడం ముమ్మాటికీ అవినీతి అనేచెప్పాలి. విద్యుత్ కొనుగోళ్లలో ప్రభుత్వం అవినీతిచేస్తోందా …లేదా తెలియాలంటే ఎంతధరకు విద్యుత్ కొంటున్నారో పాలకులువాస్తవాలుచెప్పాలి.

ఇప్పుడైతే ఈప్రభుత్వం గతిలేక, విధిలేని పరిస్థితుల్లోనే బయటనుంచి విద్యుత్ కొనుగోళ్లు సాగిస్తోందనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తికేంద్రం పూర్తైఉంటే, 1000 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి లభించేది. హైడల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వంపై పెద్దగా భారంకూడా పడదు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వచ్చే హైడల్ విద్యుత్ చాలావరకు ఏపీ, తెలంగాణలకు ఉపయోగపడిందనే చెప్పాలి.

LEAVE A RESPONSE