చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో నారా లోకేష్ కలిసి సమస్యలను ఏకరువు పెట్టిన మీసేవ మిత్రులు
• లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన మీసేవ మిత్రులు.
• ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో నాణ్యమైన, మెరుగైన సేవలందించేందుకు మావంతు కృషిచేశాం. ఫలితంగా గత ప్రభుత్వంలో మాకు ఎన్నో అవార్డులు వచ్చాయి.
• రాష్ట్రంలో మేము అందించిన సేవలను మోడల్ గా తీసుకొని తమిళనాడులో ఈ-సేవ, కర్నాటకలో బెంగుళూరు ప్లస్ పేరుతో మీసేవ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
• రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మీసేవలను పూర్తిగా చంపేసింది.
• ప్రజలను మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పుకునే విధానానికి తెరలేపుతోంది.
• దీనివల్ల ప్రజలు ఇబ్బందుల పాలుకావడమేగాక వివిధ పత్రాల కోసం లంచాలు సమర్పించుకుంటే కానీ పని జరగని పరిస్థితులు నెలకొన్నాయి.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీసేవ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషిచేయండి.
నారా లోకేష్ స్పందిస్తూ….
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఒక లంచగొండి ప్రభుత్వం.
• ఆన్ లైన్ విధానం ద్వారా తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో మీసేవలను నిర్వీర్యం చేస్తున్నారు.
• ఇసుక, మద్యం అమ్మకాల్లో నగదు చెల్లింపుల విధానం ద్వారా వేలకోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు.
• ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలను అడ్డంగా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
• టిడిపి ప్రభుత్వ హయాంలో మీసేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు వేలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీసేలను మరింత పటిష్టంచేసి పథకాల అమలు, వివిధరకాల సర్టిఫికేట్ల జారీలో జాప్యాన్ని నివారిస్తాం.