– వైసీపీలో మాదిగ నాయకులు పల్లకి మోస్తున్నారే తప్ప పల్లకి ఎక్కటానికి ప్రయత్నం చేయడంలేదు
– దేశ చరిత్రలో చర్మకారులకు , డప్పుకళాకారులకు పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీదే.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
నాలుగేళ్లలో ఏ సమావేశంలో కూడా జగన్ రెడ్డి మాదిగలు గురించి ప్రస్థావించలేదు. తాను మాదిగ ద్రోహి కాదంటే, ముఖ్యమంత్రే స్వయంగా మాదిగ జాతికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు హయాంలో అమరావతిలో డా.బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనం మరియు డా.బాబు. జగ్జీవన్ రామ్ స్మృతి వనాలకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభిస్తే మీరెందుకు ఒక్క అంబేడ్కర్ స్మృతి వనాన్ని పరిగణలోకి తీసుకున్నారు.
విజయవాడ డా. బి. ఆర్ అంబేడ్కర్ స్మృతి వనంతో పాటు, జగ్జీవన్ రామ్ స్మృతి వనంను మీరు ఎందుకు ప్రారంభించలేదు. వైకాపా ప్రభుత్వ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు ఇప్పటికి తిరగుతున్న ఇనోవా కార్ చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందే. కార్ నెం. AP27UB3237 ప్రకాశం జిల్లా వైస్ చైర్మన్ గర్నెపూడి సుగుణమ్మ తిరిగే ఇనోవా కార్ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇచ్చిందే.
వైకాపా ఎంపీ సురేష్ కు అత్యంత సన్నిహితుడైన రాంబాబు తిరిగే ఇనోవా కార్ కూడా చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందే. మంత్రి మేరుగ నాగార్జున సన్నిహితుడు చంటి తిరిగే ఇనోవా కార్ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇచ్చిందే. స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ విశ్వనాధం తిరిగే ఇనోవా కార్ కూడా చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందే.
టెక్కలి వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నారాయణ రావు తిరిగే ఇనోవా కారు కూడా చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందే. వైకాపా పాలనలో పధవులు అనుభవిస్తున్న మాదిగ నాయకులు అందరు జగన్ రెడ్డి పల్లకి మోస్తున్నారు తప్పితే ఎక్కటానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. విదేశీ విద్యకు మాదిగ బిడ్డలను వైసీపీ ప్రభుత్వం ఎంత మందిని పంపిచారో. టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య ద్వారా ఎంత మందిని పంపించారో చెప్పగలరా?
లిడ్ క్యాప్ ను పూర్తిగ నీర్వర్యం చేసింది జగన్ రెడ్డి కాదా? మాదిగ నాయకులు దీనిపై నోరు ఎత్తగలరా? డప్పు కళాకారులకు ఆనాడు చంద్రబాబు, పింఛన్లు ఇస్తే, జగన్ రెడ్డి ఆ పింఛన్లు నీర్వర్యం చేసి మాదిగలను ఆన్యాయం చేసిన మాట నిజం కాదా? పేద చర్మకారులకు చంద్రబాబు పింఛన్లు ఇస్తే జగన్ రెడ్డి వాటిని నిలిపేచింది నిజం కాదా? చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు ఆందించిన సాయం, నేడు జగన్ ప్రభుత్వం మాదిగలకు ఆందించిన సాయం పై సజ్జల రామకృష్ణా రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అనీ వర్ల రామయ్య సవాల్ విసిరారు.