– బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడే నివాసం ఉంటున్నాడు
– అచ్చెన్నాయుడు
విభజన చట్టంలో పొందుపరచినవాటిని సాధించుకోవడం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. మూడున్నర సంవత్సరాల్లో అనేక సార్లు ఢిల్లీ వెళ్లారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడే నివాసం ఉంటున్నాడు. కడపకు స్టీల్ ప్లాంట్ కావాలని విభజన చట్టంలో మీరే పెట్టారు. కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ కు స్టీల్ ప్లాంట్ ఇవ్వండని ఒక్కరోజైనా ఒక్క రిప్రజెంటేషన్ అయినా ఇచ్చారా? కేంద్రానికి స్టీల్ ప్లాంట్ ఇవ్వమని అడగకుండా ఎదురు దాడి చేస్తున్నారు. ఈ విషయాలను అసెంబ్లీలో చెప్పాం. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఒక్క పరిశ్రమ తీసుకురాలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. సిగ్గు లేకుండా అసెంబ్లీలో పారిశ్రామిక విధానంపై చర్చ పెట్టారు. సమయం వృధాయే తప్ప దానివల్ల ఏమీ ఉపయోగంలేదు. ఈ మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు… విశాఖ స్టీల్ ప్లాంట్ అటకెక్కే పరిస్థితికి వచ్చింది. దీనికి జగన్, ఈ ప్రభుత్వమే కారణం. ఈ విషయాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పిట్టకథల మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఆవు తెల్లగా ఉండును. నాలుగు కాళ్లుండును, పాలిచ్చును అని ఆవు కథ చెబుతున్నారు.
ఈ కథే ఈ మూడున్నర సంవత్సరాల నుంచి చెబుతున్నారు తప్ప ఈ మంచి కార్యక్రమం ఈ రాష్ట్రానికి చేశాం అని చెప్పే పరిస్థితి లేదు. ఆడలేనమ్మ మద్దెలో ఓడు అన్నట్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక కరోనా పైకి నెపం నెడుతున్నారు. అసమర్థులే ఇలాంటి నెపాలు పెడతారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ ప్రభుత్వం. చంద్రబాబనాయుడు రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగణ్యులు.
చెత్తపై కూడా ఈ చెత్తముఖ్యమంత్రి పన్ను విధిస్తున్నారు: నిమ్మల రామానాయుడు
రాష్ట్రంలో ఏ వీధి, గ్రామ, మండలానికి వెళ్ళినా బాదుడే బాదుడు అనే మాట వినిపిస్తోంది. మహిళలు, పేదలు, మధ్యతరగతి వర్గాల పక్షాన టీడీపీ అసెంబ్లీలో మాట్లాడదలిస్తే సహకరించలేదు. ప్రజలపై అప్పులు, పన్నులు తడిసి మోపెడౌతున్నాయి. శాసనసభ సజావుగా జరగడానికి తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎంతో సహకరించాం. కొశ్చన్ అవర్ జరగాలని అనేక విధాలుగా స్పీకర్ కు సహకరించాం. మేమిచ్చిన వాయిదా తీర్మానాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. మద్యపాన నిషేదంపై చర్చించదలిస్తే ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పేదలపై ఒక్క రూపాయి కూడ భారం మోపనని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పారు. ఇసుకపై, సిమెంటు, ఐరన్, లిక్కర్, నిత్యవసర సరుకులైన కంది పప్పు, ఉప్పు, మచినూనె పాకెట్, ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరుగుదొడ్లపై, వీధిలైట్లపై అన్నింటిపైనా బాదుడే బాదుడు. 7 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఆక్వారైతులకు అందే విద్యుత్ సబ్సిడీని ఎత్తేశారు. ఈ తుగ్లక్ పాలనలో బతకడం భారమైంది. గాలి, జుట్టుపై తప్పించి చెత్తపై కూడా ఈ చెత్తముఖ్యమంత్రి పన్ను విధిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకి కార్యక్రమానికి వెళ్తుంటే చీపురు కట్ట తీసుకొని తిరగబడుతున్నారు.
రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయాయి. ఈ మూడు సంవత్సరాల్లో వైసీపీ సాధించిందేమీ లేదు. జే ట్యాక్సులు వేసి ఇబ్బంది పెట్టారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతానికి గురిచేసి తరలివెళ్లేలా చేశారు. టీడీపీ ఐదు సంవత్సరాలపాటు కష్టపడి పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసింది. 15 లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వచ్చేలా ఎంఐఏలు కుదుర్చుకుంది. వారికి కేటాయింపులు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వచ్చిన పరిశ్రమలు తరలిపోయాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం 2014-19 మధ్య 53 శాతం వృద్ధిరేటు పెరిగింది. 2020-21 వరకు -3.26. దీన్ని బట్టి పారిశ్రామిక విధానం పూర్తిగా దిగజారిపోయింది.
39,213 . మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఎల్ ఎంలు 217. మొత్తం 39,450 పరిశ్రమల ద్వారా 5,13,351 మంది కి ఉద్యోగాలు ఇచ్చామని మోసపూరిత ప్రకటనలిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఇలాంటి నాయకుడు అవసరమా అని మాట్లాడారు. మరి ఇదే ప్రాంతంలో చంద్రబాబునాయుడు కేపీఆర్ పరిశ్రమ తెస్తే దానికి ప్రస్తుతం లైసెన్సు ఎలా ఇచ్చారు? ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలు చేశారు.
నేడు ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజ బ్యాటరీస్, జువారీ సిమెంటును మూసివేసే ప్రయత్నాలు చేశారు. దీంతో పారిశ్రామివేత్తలు భయపడి తమ పరిశ్రమలను తరలించేస్తున్నారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏం సాధించారో చెప్పాలి. తెలుగుదేశం హయాంలో 65,307 కోట్లు ఎఫ్ డీ ఐ లు వస్తే వైసీపీ ఈ మూడున్నరేళ్లలో 2,114 కో ట్లు తెచ్చారు. ఉపాధి అవకాశాలు లేవు. పారిశ్రామికులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోవడంతో పరిశ్రమలు తరలిపోయాయి.
అమర్ రాజ లీథియం బ్యాటరీస్, 17 కియా అనుబంధ సంస్థలు, ప్రకాశం జిల్లాలోని ఆసియా బల్బ్ ఫ్యాక్టరీ, విశాఖపట్నంలోని అదానీ పరిశ్రమ, రిలయన్స్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ, లూలూ గ్రూప్, బీఆర్, హెచ్ సీఎల్, ఐబీఎం, హెచ్ ఎస్, బీసీ, ఏసియన్ బ్యాంక్ లు తరలిపోయాయి. విశాఖ రుషికొండలో ఐటీ టవర్స్ నిర్మాణం చేస్తుంటే దాన్ని ఆపేశారు. దీంతో 14 కంపెనీలు తరలిపోయాయి. గన్నవరం మేథా టవర్స్ పక్కకు వెళ్లిపోయింది.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కుదేలు చేశారు. మూడు రాజధానుల ముచ్చట తెచ్చారు. కాకినాడ సెజ్ లో ఫార్మాకంపెనీలు రాకూడదని అడ్డు తగిలారు. నేడు అక్కడ హెటిరోకి ఏవిధంగా పర్మిషన్ ఇస్తున్నారు?
కార్మికులందరూ వీధిన పడేలా చేస్తున్నారు. వచ్చే పెట్టుబడులు ఎందుకు తరలిపోయాయి? గ్రీన్ కో కు తెలుగుదేశం హయాంలో అనుమతి ఇస్తే దాన్ని రద్దు చేసి లంచాలు పుచ్చుకొని మళ్లీ ఇచ్చారు. నీ జే ట్యాక్సు వల్ల పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి. రిలయన్స్ కంపెనీల పెట్టుబడులు తరలిపోయాయి. వెనుకబడిన రాయలసీమకు వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పోతున్నాయి. జగన్ కు రాష్ట్రంపై చిత్తశుద్ధి లేదు. మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. పర్యావసానంగా ఇండస్ట్రీస్ కుదేలైంది. ఇసుక మాఫియాతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. రాష్ట్రం దివాళాతీసే పరిస్థితికొచ్చింది. అప్పులు తెచ్చి మన నెత్తిన భారం వేస్తున్నారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రాన్ని పారిశ్రామిక అంధాకంరలోకి నెట్టి నిరుద్యోగ భృతి లేకుండా చేశారు. నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస కట్టారు.
జగన్ తన సాక్షి పత్రికకు వేల కోట్లు దోచిపెడుతున్నాడు : చినరాజప్ప
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని గొప్పలు చెప్పి రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నాడు. చంద్రాబాబునాయుడు సంక్షేమాన్ని అందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించారు. జగన్ ఆసరా అని చెప్పి టోకరా వేశాడు. నాడు చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు ఎంతగానో సహాయం చేశారు. జగన్ తన సాక్షి పత్రికకు వేల కోట్లు దోచిపెడుతున్నాడు. ప్రచార ఆర్బాటాలకే డబ్బంతా తగలేస్తున్నాడు. ప్రజలలో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతన్నందున ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది.