Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం కట్టలేనని చేతులెత్తేయడమే జగన్ క్రెడిబులిటీ

– బఫూన్లు సిగ్గులేకుండా ఒళ్లంతా పొగరెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
– ప్రాజెక్టుల పై ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అవగాహనలేదు
– ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్ట్ ల విధ్వంసంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

“ సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా రాయలసీమలో ప్రారంభించి, కృష్ణా..గోదావరి..వంశధార..నాగావళినదుల పరిశీలించి, వాటిని అనుంధానించాల్సిన కీలకప్రాజెక్టుల్ని పరిశీలించాను. చాలా ప్రాజెక్టుల్ని నాశనం చేశారు.. కొన్నింటిని ఎందుకూ పనికిరాకుండా నిస్తేజంగా వదిలేశారు.

నాగావళి, వంశధార నదులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా కీలకమైన నదులు. ఈ రెండు నదులతో పాటు, ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, పెన్నా అను సంధానంతో రాష్ట్రానికి నీటి సమస్యే లేకుండా చేయవచ్చు. గోదావరిపై నిర్మించే పోలవరం ఎడమప్రధాన కాలువను ఉత్తరాంధ్రసుజల స్రవంతిద్వారా వంశధార, నాగావళికి కలపవచ్చు.

మధ్యలో అనేక రిజర్వాయర్లు నింపవ చ్చు. ఇప్పటికీ 100,120 టీఎంసీల వంశధార నీళ్లు సముద్రంలోకి పోతున్నా యి. వాటిని వినియోగించుకోవడంతో పాటు, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటే, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలకు నీటి ఎద్దడే ఉండదు.

టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68,923కోట్లు ఖర్చు పెడితే (మొత్తం బడ్జెట్లో 9.63శాతం నిధులు), వైసీపీప్రభుత్వం కేవలం రూ.22,165 కోట్లు మాత్రమే పెట్టింది. (బడ్జెట్లో 2.35శాతం నిధులే). ఉత్తరాం ధ్రలోని సాగునీటిప్రాజెక్టులకు టీడీపీహాయాంలో రూ.1650కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ ప్రభుత్వంలో రూ.330కోట్లు మాత్రమే పెట్టారు. కనీసం 20శాతం కూడా ఖర్చుచేయలేదు. ఉత్తరాంధ్రపై లేనిపోని ప్రేమచూపుతూ, మొసలికన్నీరు కార్చడం తప్ప వాస్తవంలో చేసింది శూన్యమని అర్థమవుతోంది.

ఉత్తరాంధ్రలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ప్రారంభించి, వాటిని పూర్తిచేసిన ఘనత టీడీపీదే. ఈ ముఖ్యమంత్రి నాలుగేళ్లలో ఒక్కప్రాజెక్ట్ పూర్తిచేసిందిలేదు. టీడీపీ నిర్మించిన వాటిని సమర్థవంతంగా నిర్వహించలేక గాలికి వదిలేశాడు.

విజయనగరం జిల్లాలో నాగావళి, చంపావతి, గోస్తనీ, కందివలసగెడ్డ, నదులు ఉంటే, మొత్తంభూమి 15.56లక్షల ఎకరాలైతే, దానిలో సాగుభూమి 8.32 లక్షల ఎకరాలు. నీటిసదుపాయం ఉన్నది కేవలం 3.77లక్షల ఎకరాలకే. జిల్లాలో సగటు వర్షపాతం 920 మిల్లీమీటర్లు.

శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి, మహేంద్రత నయ, గోముఖి, చంపావతి, బహుదా, కుంబికోటగెడ్డ నదులున్నాయి. మొత్తం భూమి 14.4లక్షల ఎకరాలైతే, సాగుభూమి 9లక్షల ఎకరాలు. నీటి సదుపాయం ఉన్నది 6.4లక్షల ఎకరాలకు. జిల్లాలో సగటు వర్షపాతం 1162 మిల్లీ మీటర్లు.
రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది ఈ జిల్లాలోనే.

అనుకున్నవిధంగా ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తే, రెండుజిల్లాల్లో కలిపి 30లక్షల ఎకరాలకు నీళ్లు అందివచ్చు. దాంతో ఇక్కడిప్రజల ఆదాయం రెండింతలు పెరుగుతుంది. అలానే పరిశ్రమలు కూడా ఎక్కువగా ఏర్పాటవుతాయి. వంశధార నిర్వాసితులకు తప్పకుండా న్యాయంచేస్తాం. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం.

విజయనగరం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర సమాచారం

తారకరామతీర్థ సాగర్ రిజర్వాయర్ :
మొత్తం ఆయకట్టు 16,538 ఎకరాలు. 8,172 ఎకరాల స్థిరీకరణ. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.471కోట్లు. టీడీపీ ప్రభు త్వం రూ.104కోట్లు ఖర్చుపెట్టి, 41శాతం పనులు పూర్తిచేసింది. ఈ ప్రభుత్వం కేవలం రూ.57కోట్లు పెట్టింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణపనులు ఎక్కడివక్కడే ఆగిపో యాయి. ప్రాజెక్ట్ నిర్మాణం యొక్క ప్రధానఉద్దేశం.. చంపావతి నదికి అడ్డంగా బ్యారేజ్ నిర్మాణం..డైవర్షన్ కెనాల్…రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలతో డెంకాడ ఆయకట్టుకు నీరు అందించడం.

మద్దువలస రిజర్వాయర్ స్టేజ్ -2 :
సువర్ణముఖి నదిపై మద్దువలస స్టేజ్ -2 ప్రాజెక్ట్ తో కుడిప్రధాన కాలువ పొడిగిం పుతో 4 మండలాలకు సాగునీరు. బీ.సిగడాం, పొందరూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో 12,500 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.99.77కోట్లు. టీడీపీప్రభుత్వంలో రూ.3.26 కోట్లుఖర్చుపెట్టాం. వైసీపీ వచ్చా క .1.30 కోట్లు ఖర్చుపెట్టి, కాంట్రాక్టర్లకు మేలుచేసి, పనుల్ని ప్రీక్లోజ్ చేసింది. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్ట్ పూర్తిచేశాను. మేం ఖర్చు పెట్టిన 3.26 కోట్లు చిన్నచిన్న పనులకు.

తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ :
రెండుజిల్లాల ఉమ్మడి ప్రాజెక్ట్. మొత్తం ఆయకట్టు 1.95 లక్షల ఎకరాలు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1396కోట్లు. టీడీపీప్రభుత్వంలో రూ.237 కోట్లతో పనులు వేగంగా జరిగేలా చూశాం. ఈ ప్రభుత్వం రాగానే మొక్కుబడిగా రూ.12కోట్లుపెట్టి, పనులు ఆపేసింది. భూ సేకరణ సమస్యలు తొలగించలేదు.. పెండింగ్ బిల్లులు చెల్లించలేదు… దాంతోపనులు ఆగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ లో 16 టీంసీలు నిల్వ చేయవచ్చు. 200లకు పైగా గ్రామాలకు తాగునీరు అందించవచ్చు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో అతిముఖ్యమైన ప్రాజెక్ట్. వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

గజపతినగరం బ్రాంచ్ కెనాల్ :
మొత్తం ఆయకట్టు 18వేల ఎకరాలు. 6 మండలాలకు ఉపయోగం. ఈ కెనాల్ ద్వారా తోటపల్లి రిజర్వాయర్ కుడికాలువ ప్రధాన కాలువను 97.70కిలోమీటర్లు పొడిగించవచ్చు. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.92.52కోట్లు. టీడీపీహాయాంలో రూ. 49 కోట్లు ఖర్చుపెట్టాం. ఈప్రభుత్వం నాలుగేళ్లలో రూ.4.71కోట్లు పెట్టి, జరుగుతున్న పనులు ప్రీక్లోజ్ చేసింది.

నాగావళి – వంశధార నదుల అనుసంధానం :
మొత్తం ఆయకట్టు 10వేల ఎకరాలు. హీరమండలం జలాశయం నుంచి ఆముదాలవలస సమీపంలోని నారాయణపురం బ్యారేజ్ వరకు నీటిని తరలించ వచ్చు. వంశధార బేసిన్ నుంచి 10టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చు. 6 లిఫ్టులతో అదనంగా 10వేల ఎకరాలకు నీళ్లు అందింవచ్చు. ఆముదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పొందూరు మండలాలకు సాగు, తాగునీరు అందించ వచ్చు. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించాం.వైసీపీప్రభుత్వం రూపాయి ఖర్చుపెట్టలేదు

వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ -2 (కుడిప్రధాన కాలువ ఫేస్-2) :
ప్రాజెక్ట్ కింద మొత్తం ఆయకట్టు 40వేలఎకరాలు. స్థిరీకరణ ఆయకట్టు 2,10,510 ఎకరాలు. అంచనావ్యయం : రూ.3,046.30కోట్లు. టీడీపీ హయాంలో రూ.871 కోట్లు ఖర్చుపెట్టాం. 2017లో నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీ అందించాం.
ఈ ప్రభుత్వం వచ్చాక రూ.352.72కోట్లు ఖర్చుపెట్టింది. నాలుగేళ్లలో మిగిలిన పనులు పూర్తిచేయలేకపోయింది. భూములిచ్చినవారికి పరిహారం ఇవ్వలేదు.

వంశధార-బహుదా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ :
మొత్తం ఆయకట్టు 1,30,000ఎకరాలు. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.6,500కోట్లు . టీడీపీప్రభుత్వం అంచనాలు ఆమోదించి పనులు ప్రారంభించింది. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో రూపాయి కేటాయించలేదు. ఈ ప్రాజెక్ట్ తో ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లోని 7మండలాలకు లబ్ధి కలుగుతుంది.

మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ :
మొత్తం ఆయకట్టు 24,600ఎకరాలు. పలాస, కాశీబుగ్గ, ఉద్ధానం, ప్రాంతాలకు తాగునీరు అందించవచ్చు. రెండు నియోజకవర్గాలతోపాటు 9 మండలాలకు ఉప యోగం. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.852కోట్లు. టీడీపీప్రభుత్వం రూ.246కోట్లతో పనులు ముమ్మరంగా జరిపించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.26.98 కోట్లుపెట్టి, పనులు ఆపేసింది.

చినసాన ఎత్తిపోతల పథకం :
మొత్తం ఆయకట్టు 2,200ఎకరాలు. టీడీపీప్రభుత్వం 15.09.2018న ప్రారంభిం చింది. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.23.70 కోట్లు. పదినెలల్లో మొత్తం పూర్తిచేశాం. దీనిద్వారా వంశధార నదినుంచి 33.75క్యూసెక్కుల నీరుఎత్తిపోయవచ్చు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ ను ఉపయోగించుకోకుండా వదిలేసింది.

నారాయణపురం ఆనకట్ట :
మొత్తం ఆయకట్టు రూ.37,053ఎకరాలు. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.141కోట్లు . టీడీపీ హాయాంలో జే.ఐ.సీ.ఏ. (జైకా) ఫండ్స్ ప్రతిపాదించి, పనులు మొద లెట్టాం. వైసీపీ వచ్చాక నిధులు నిలిపేసింది.

ఫ్లడ్ బ్యాంకులు (వంశధార, నాగావళి) :
ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1055.06కోట్లు. టీడీపీహాయాంలో రూ. 36.78కోట్లు ఖర్చుపెడితే, వీళ్లు వచ్చాక రూ.14కోట్లు ఖర్చుపెట్టి, పనులన్నీ ఆపేశారు. శ్రీకా కుళం పట్టణం సుందరీకరణకోసం నాగావళి నది పరిసరాల్లో రూ.150 కోట్లు ఖర్చుపెట్టాం.

బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ :
63.2 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ఎడమకాలువ ద్వారా తరలించి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నీళ్లు అందించడం.
మొత్తం ఆయకట్టు 8లక్షల ఎకరాలు. 1035 గ్రామాలకు తాగునీరు. ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.17,050 కోట్లు. టీడీపీహాయాంలో ఫేజ్-1 కింద రూ.2022 కోట్లతో పనులకు అనుమతులు ఇచ్చాం. ఫేజ్-1 లో ప్యాకేజీ 1 కింద రూ.12.67 కోట్లతో పనులు పూర్తిచేశాం. ఈప్రభుత్వం వచ్చాక రూ.5.79 కోట్లు ఖర్చుపెట్టి, పనులు ఆపేసింది.

పోలవరం ఎడమప్రధాన కాలువ :
మొత్తం ఆయకట్టు 4లక్షల ఎకరాలు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.4,202.69 కోట్లు. దీనిద్వారా 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం ప్రజలు తాగడానికి విని యోగించవచ్చు. టీడీపీహాయాంలో 71శాతం పనులు పూర్తిచేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనిని గాలికి వదిలేసింది. ఒక్క అంగుళం పనిచేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు ఎంతో కీలకం. ఇదీ మొత్తంగా ఉత్తరాంధ్రప్రాంత సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర సమాచారం. అధికారంలోకి రాగానే వంశధార-నాగావళి నదు లపై ఉన్న అన్ని ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తాం. రెండునదుల నీటిని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్ర జిల్లాల రుణం తీర్చుకునేది తెలుగుదేశంపార్టీనే.

పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల్ని నాశనంచేసిన బఫూన్లు సిగ్గులేకుండా ఒళ్లంతా పొగరెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నదులు అనుసంధానానికి అత్యంత కీలకం, రాష్ట్రానికి వరం పోలవరం. పోలవరం నిర్మాణాన్ని 72శాతంపూర్తిచేశాం. ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, కాంట్రాక్ట్ సంస్థలు మార్చి ప్రాజెక్ట్ ఫ్రాంతంలో ఎవరూలేకుండా చేయడంతో 2020 లో 22లక్షల వరదనీరు వచ్చి, మాహాయాంలో చేసినపని మొత్తం నీళ్లపాలైంది. జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించడానికి రెండేళ్లు పట్టింది. అదీ ఈ ప్రభుత్వ పనితీరు. రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ ని కంపుచేశారు. టీడీపీ ప్రభుత్వం పోలవరంనిర్మాణానికి రూ.11,537 కోట్లు ఖర్చుపెట్టింది. నాణ్య తతో వేగంగా పనులు జరిపించి గిన్నిస్ రికార్డులు సాధించి కేంద్రమంత్రుల ప్రశంశలు పొందాం.

పోలవరం కట్టలేనని చేతులెత్తేయడమే జగన్ క్రెడిబులిటీ
ఈ నాలుగేళ్లలో వీళ్లు ఎక్కడా ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. 4 ఏళ్లలో వీళ్లుకట్టిన గైడ్ బండ్ కూడా కొట్టుకుపోయింది. టీడీపీ హయాంలో నిర్మించిన వాటిని తాము నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టుల పై ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అవగాహనలేదు. ప్రశ్నిస్తే అహంకారంతో, ఒళ్లంతా పొగరుతో మాట్లాడతారు. ఈ ప్రభుత్వం పోలవరానికి నాలుగేళ్లలో రూ.4,611 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రాజెక్ట్ ఎత్తుని తనస్వార్థంకోసం 41.15 మీటర్లకు తగ్గించడానికి సిద్ధమయ్యాడు.

కేంద్రాన్ని నిధుల అడగటానికి ధైర్యంలేక, నిర్వాసితులకు న్యాయం చేయక, మొత్తం ప్రాజెక్టునే గోదాట్లో ముంచేసి, సిగ్గు లేకుండా తాను చేసిందాన్ని సమర్థించుకుంటున్నాడు. 2021, 2022, 2023, అని తేదీలు మార్చి చివరకు ఇప్పుడు కట్టలేనని చేతులెత్తేశాడు…ఇదీ జగన్ అనే వ్యక్తి క్రెడిబులిటీ. బఫూన్స్ మాటలు, చేతలు ఎలా ఉంటాయో చెప్పడానికి పోలవరంనిర్మాణంపై వీళ్లు మాట్లాడిన మాటలే నిదర్శనం.” అని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE